గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 15 September 2013

పత్రిపూజ అంటే?ఎందుకు చేస్తారు?

పత్రిపూజ అంటే?ఎందుకు చేస్తారు?
~ వినాయక చవితిన వివిధ రకముల ఆకులతొ పూజించడమే పత్రి పూజ. 21 రకాల ఆకులతొ పూజించమని వ్రతకల్పంలొ ఉంది.
~ ఏవొ 21 రకాల ఆకులతొ పూజిస్తే సరిపొతుందా?
~ వ్రత కల్పంలొ చెప్పిన 21 రకాల ఔషధ మూలికలతొ మాత్రమే పూజించాలి.ఆయుర్వేదంలొ చెప్పబడినవి.రోజూవారీ జీవితంలొ మనకు ఎంతగానొ అవసరమైనవి.
 21 రకాల పత్రి ఇవే.
~ సంస్కృత నామాలు-తెలుగు పేర్లు-ఔషధం
1)మాచీపత్రం-మాచీ పత్రి-చర్మ రోగాలకు
2)బృహతి పత్రం-వాకుడాకు-ఆస్తమ,దగ్గు మొ||
3)బిల్వం పత్రం-మారేడు ఆకు-అతిసారము,నీటిని శుద్ధి చేస్తుంది.
4)ధూర్వాయుగ్మం-గరిక/గడ్డి పొచలు-చర్మ రొగాలు,ముక్కు నుండి రక్తం కారుట
5)దత్తురపత్రం-ఉమ్మెత్త-జుట్టు,కీళ్ళ నొప్పులు
6)బదరి పత్రం-రేగు ఆకు-అరుగుదల సమస్యలకు,గాయాలకు
7)అపామార్గపత్రం-ఉత్తరేణి-విషజంతువుల వల్ల కలిగిన అపయాలకు
8)తులసి పత్రం-తులసి దళములు-చర్మ,శ్వాస సంబంధిత రోగాలకు
9)చూత పత్రం-మామిడి ఆకు-మధుమేహం,నోరు గొంతు సమస్యలకు
10)కరవీరపత్రం-గన్నేరు-జుట్టు రాలుట,గాయాలకు
11)విష్ణుక్రాంతపత్రం-విష్ణుక్రాంత/హరిక్రాంత-మేధస్సుకు
12)దాడిమిపత్రం-దానిమ్మ-అతిసారం,త్రిదోషాలకు
13)దేవదారుపత్రం-దేవదారు-చర్మ రోగాలకు,గాయాలకు
14)మరువకపత్రం-మరువము-చర్మ,హృదయ రోగాలకు
15)సింధువారపత్రం-వావిలి ఆకు-వాత సంబంధిత మరియు విషం విరుగుటకు
16)జాజీపత్రం-జాజి ఆకు-చర్మ,నోరు,అరుగుదల సమస్యలకు
17)గండకీపత్రం-గండకి ఆకు/తీగ గన్నేరు ఆకు-పైల్స్,చర్మ,హృదయ రోగాలకు
18)శమీ పత్రం-జమ్మి ఆకు-శ్వాస సంబంధిత
19)అశ్వత్థ పత్రం-రావి ఆకు-రక్త కొల్పొకుండా ఉండుటకు
20)అర్జున పత్రం-మద్ది ఆకు-కీళ్ళు,త్రి దొషాలు,హృదయ సమస్యలు
21)అర్క పత్రం-జిల్లేడు ఆకు-చర్మ రోగాలకు,ట్యూమర్లకు
వీటిని ఏకవింశతి పత్రాలు అంటారు.
ఇంక అనేక ఉపయొగాలు ఉన్న కొన్ని మాత్రమే వ్రాయడం జరిగింది.జిల్లేడు 64 రకాల రోగాలకు ఔషధంగా చెప్పబడింది.మిగిత వాటికి కూడా ఎన్ని విశేషాలు ఉన్నా  మీ సౌలభ్యం కోసమని కొన్ని మాత్రమే పేర్కొనడం జరుగుతొంది.

పత్రి పూజ ఒక్క వినాయక చవితి పండుగకు మాత్రమే చేస్తారెందుకు?

      పర్యావరణ మిత్రునకు పత్రి పూజ చేద్దాం.పర్యావరణ రక్షణకు పెద్ద పీట వేద్దాం.పర్యవరణానికి హాని చేయని విగ్రహాలను మాత్రమే పూజిద్దాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML