గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 29 September 2013

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్

పూర్వపీఠిక:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||


యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం|

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||


వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||


అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|

సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|

విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||


ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

శ్రీ వైశంపాయన ఉవాచ

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః|

యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత||


యుధిష్టిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|

స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|

కిం జపన్ ముచ్యతే జంతః జన్మసంసారబంధనాత్||


శ్రీ భీష్మ ఉవాచ

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|

స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః


తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|

ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||


అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం|

లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||


బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|

లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||


ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః|

యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః|

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|

దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||


యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|

యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||


తస్య లోక ప్రధానస్య జగనథస్య భూపతే|

విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహం||


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః|

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||


విష్ణో ర్నామసహస్రస్య వేదవ్యాసో మహా నృషిః|

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||


ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః

చందో నుష్టుప్ తథా దేవోః భగవాన్ దేవకీసుతః|


అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః|

త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే||

విష్ణుజిష్ణుం మహా విష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం|

అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం||

అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛన్ధః, శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా, అమృతాంశూద్భవో భానురితి భీజం, దేవకీ నందన స్రష్టేతి శక్తిః, ఉద్భవః క్షోభణోదేవ ఇతి పరమోమన్త్రః, శంఖభృన్నందకీ చక్రీతి కీలకం, శారంగ ధన్వా గదాధర ఇత్యస్త్రం, రధాంగపాణి రక్షోభ్య ఇతినేత్రం, త్రిసామా సామగస్సామేతి కవచం, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్భందః, శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, శ్రీ మహావిష్ణు (కైంకర్యరూపే) ప్రీత్యర్ధే శ్రీ సహస్రనామ స్తోత్రజపే వినియోగః


ధ్యానమ్

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం

మాలాక్ల్‌ప్తాసనస్ధః స్ఫటికమణి నిభైః, మౌక్తికైః మణ్డితాంగః|


శుభ్రైరభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః|

ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిః ముకుందః||


భూఃపాదౌ యస్యనాభిః వియదసురనిలః చంద్రసూర్యౌచనేత్రే|

కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః|


అన్తస్థం యస్యవిశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః

చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి|


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం|


లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్||


మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకంకౌస్ధుభోద్భాసితాంగం|

పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాధమ్||


సశంఖ చక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం|

సహారవక్షస్ధల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్||


హరిః ఓమ్

విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః||

భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||


పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|

అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ||


యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః|

నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః||


సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః|

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||


స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|

అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః||


అప్రమేయా హృషీకేశః పద్మనాభో మరప్రభుః||

విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః||


అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|

ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్||


ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||


ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||


సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|

అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||


అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|

వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః||


వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|

అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||


రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|

అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||


సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః|

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||


లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|

చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||


భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|

అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||


ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|

అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||


వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|

అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||


మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|

అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్||


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||

అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||


మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః


అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః|

అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా||


గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః|

నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||


అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః|

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్||


ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః|

అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః


సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః|

సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః||


అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః||


వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|

వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||


సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః|

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః||


ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః|

ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః||


అమృతాంశూద్భవో భానుః శశిబిందుస్సురేశ్వరః|

ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః||


భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః

కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః||


యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః|

అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనన్తజిత్||


ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్ణీ నహుషో వృషః|

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః||


అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|

అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః


స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః|

వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||


అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః|

అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః||


పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్|

మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః||


అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః|

సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః||


విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః|

మహీధరో మహాభాగో వేగవానమితాసనః||


ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః|

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః||


వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః||

పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః||


రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః||

వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః|


వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః

హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః||


ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|

ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||


విస్తారః స్ధావర స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం|

అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః||


అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|

నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః||


యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః|

సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం||


సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|

మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః||


స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః||


ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|

అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః||


గభస్తినేమిస్సత్వస్ధః సింహో భూతమహేశ్వరః|

ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః||


ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః

శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||


సోమపో మృతపస్సోమః పురుజిత్పురుసత్తమః|

వినయోజయస్సత్ససన్ధో దాశార్హ స్సాత్వతాం పతిః||


జీవో వినయితా సాక్షీ ముకున్దోమిత విక్రమః|

అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో న్తకః||


అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|

ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః


మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః|

త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగకృతాన్తకృత్||


మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|

గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః||


వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః|

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః||


భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః|

ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః||


సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|

దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||


త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్|

సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్||


శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః|

గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||


అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||


శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః|

శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||


స్వక్ష స్స్వంగ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః|

విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః||


ఉదీర్ణస్సరతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః|

భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః||


అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః

అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః||


కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః||


కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|

అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః||


బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః

బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః||


మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|

మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః||


స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః||


మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః||


సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః|

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః||


భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః|

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః||


విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః||


ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|

లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః||


సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|

వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||


అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః|

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః|


చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః|

చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్||


సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా||


శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|

ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః||


ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|

అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||


సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః|

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః||


కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనో నిలః|

అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః||


సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః|

న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః||


సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః|

అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః||


అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః|

ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః||


ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః|

అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః||


సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః||

అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః||


విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః|

రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః||


అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః|

అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః||


సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః|

స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః||


అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః|

శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః||


అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః|

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః||


ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః|

వీరహా రక్షణ స్సన్తో జీవనం పర్యవస్ధితః||


అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః||


అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|

జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః||


ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|

ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః||


ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః|


యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|

యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ||


ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|

దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః||


శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||


శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|


శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||

శ్రీ వాసుదేవోభి రక్షతు ఓం నమ ఇతి


ఉత్తర పీఠిక

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః|

నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్||


య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్

నాశుభం ప్రాప్నుయాత్కించిత్ సో ముత్రేహచమానవః||


వేదాన్తగోబ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|

వైశ్యో ధనసమృద్ధస్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||


ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మం అర్థార్థీ చార్ధమాప్నుయాత్

కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్ను యాత్ప్రజాః||


భక్తిమాన్య స్సదోత్థాయ శుచిస్తద్గత మానసః|

సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్||


యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ|

అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం||


న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విన్దతి|

భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః||


రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్ధనాత్|

భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||


దుర్గాణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమం|

స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః||


వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః|

సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం||


న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్|

జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే|


ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః|

యుజ్యే తాత్మ సుఖక్షాన్తిః శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః||


నక్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతిః|

భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే||


ద్యౌ స్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః|

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః||


ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం|

జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం||


ఇన్ద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః||

వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ||


సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పితః||

ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః||


ఋషయః పితరో దేవః మహాభూతాని ధాతవః|

జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్||


యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిలాది కర్మచ|

వేదశ్శాస్త్రాణి విజ్ఞానం ఏతత్‌సర్వం జనార్దనాత్||


ఏకోవిష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః|

త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః||


ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం|

పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ||


విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయం|

భజన్తి యే పుష్కరాక్షం నతే యాన్తి పరాభవమ్||


నతే యాన్తి పరాభవమ్ ఓమ్ నమ ఇతి


అర్జున ఉవాచ:

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ|

భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనర్ధన|


శ్రీ భగవానువాచ:

యోమాం నాం సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ|

సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః||

స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి


వ్యాస ఉవాచ:

వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం|

సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తుతే|

శ్రీ వాసుదేవ నమోస్తుత ఓమ్ నమ ఇతి


పార్వత్యువాచ:

కేనోపాయేన లఘనా విష్ణోర్నామ సహస్రకం|

పఠ్యతే పండితిః నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో||


ఈశ్వర ఉవాచ:

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే|

శ్రీ రామనామ వరానన్ ఓమ్ నమ ఇతి


బ్రహ్మోవాచ:

నమో స్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః

శ్రీ సహస్ర్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి


సంజయ ఉవాచ:

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|

తత్రశ్రీః విజయోభూతిః ధ్రువా నీతిః మతిర్మమ||


శ్రీ భగవానువాచ:

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే||

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||


పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్||

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||


అర్తా విషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః|

సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త ధుఃఖాస్సు ఖినోభవన్తి||


యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్|

తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే||


ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం ఆనుశాస నికపర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోః దివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః

ఓమ్ తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


    భవదీయుడు,

YADHUCHANDRA TANNEERU
          యదుచంద్ర తన్నీరుRead More

Thursday, 26 September 2013

శ్రీమతి డొక్కా సీతమ్మగారు

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. అటువంటి అన్నదానానికి పెట్టింది పేరు శ్రీమతి డొక్కా సీతమ్మగారు. నిరతాన్న ధాత్రి అన్న బిరుదు గడించారు.సీతమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు. నిరుపేదలకి అన్నదానం చేసే అలవాటు ఆవిడకి బాల్యం నుంచే వంటబట్టింది. పెళ్ళి తర్వాత కూడా భర్త శ్రీ డొక్కా జగన్నాథం గారి నుంచి ప్రోత్సాహం లభించింది. కుల,మత,ప్రాంత బేధా భావన లేకుండా, రాత్రి పగలు అనే భావన లేకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చటమే ఆవిడ ఆశయంగా భావించేది. ఆవిడ అన్నదాన గుణాన్ని చూసి బ్రిటీషు రాజు సైతం ముగ్ధుడై తనని సన్మానించటానికి ఇంగ్లాండుకు ఆహ్వానించాడు. కాని తను సున్నితంగా తిరస్కరించారు. అందుకని తాను ఉండే గన్నవరంలోనే పెద్ద సన్మాన సభ ఏర్పాటుచేసి ఘనంగా సత్కరించాడు.
ఓర్పుతో,శ్రద్ధతో, వినయంగా అతిథులకి,అభ్యాగతులకీ కొసరి కొసరి మరీ వడ్డిచ్మ్హి ఆకలి తీర్చటంలోనూ సీతమ్మగారికి ఎవరూ సాటిరారు. ఒకసారి తాను ఉండే ఊరికి పెద్ద వరద వచ్చింది. జనాలు బయటకి రావటానికే భయపడుతున్న సమయం. ఆ సమయంలో ఎవరో ఒకతను ఏటికి అవతలవైపు చిక్కుకుని పోయాడు. ఆకలిబాధ భరించలేక కేకలు పెడుతున్నాడట. పాపం అది గమనించిన సీతమ్మగారు ఆ అర్థరాత్రివేళ అప్పటికప్పుడు వంట చేసుకొని పడవవాడిని బ్రతిమిలాడుకొని ఏటిగట్టు దాటి వెళ్ళిమరీ అతని ఆకలి తీర్చిందట. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. సీతమ్మగారి ఇటువంటి గొప్పతనాన్ని మెచ్చి అప్పటి ప్రభుత్వం అవార్డ్ ఇవ్వటానికి 1902లో ఢిల్లీకి ఆహ్వానించారట. కాని తాను ఆ అవార్డ్ తీసుకునే సమయంలో ఎక్కడ తన అన్నదానం ఆగిపోతుందో అనే భయంతో డిల్లీకి వెళ్ళలేదట.
అప్పటికీ ఇప్పటికీ డొక్కా సీతమ్మగారి పేరు ఒక్క గన్నవరంలోనే కాదు సర్వత్రా మారుమ్రోగుతూనే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో '
 
https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn2/1380137_10151748484078392_1977686067_n.jpg
Read More

*బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం*

*బొట్టు దుష్టశక్తులను, మనకు రానున్న చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం*

“సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే” అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

నుదుటి మీద కనుబొమల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్నిచక్రం/ఆజ్ఞాచక్రం ఉంటుందట.అగ్ని తేజస్సుకు, జ్ఞానానికి చిహ్నం. ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారుచేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలపుదేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది. నిలువు నామం అనేది“ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిహ్నం”

సుమంగళి యొక్క ముత్తైదువతనానికి ఒక చిహ్నంగా నిలచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది
పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు.

మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు
 https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-prn2/1380522_10200447515777866_736162719_n.jpg
Read More

సిందూర ప్రియుడు ఆంజనేయుడు **

సిందూర ప్రియుడు ఆంజనేయుడు **

ఒకమారు ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది.

అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు.

సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.
Read More

మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి

మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి

పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే  మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.
Read More

మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి

మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి

పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే  మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.
Read More

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?

మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ  ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన  సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం  పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప అన్నివేళలా  వారిపై  ఉంటుందని పురాణాలూ
తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.
Read More

తిధుల ప్రాధాన్యత ఏమిటి

తిధుల ప్రాధాన్యత ఏమిటి

తిధుల ప్రాధాన్యత ఏమిటి? ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి? తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి?
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.
పాడ్యమి : అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
Read More

నరసింహ తత్త్వం

నరసింహ తత్త్వం

ఇంతకీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అని అడిగే వారు, మంత్రానికి జ్వరం తగ్గుతుందా? అని కూడ అడుగవచ్చు. ఇక్కడ జ్వరం భౌతికపరమనదే తప్ప, ఆధ్యాత్మిక పరమైనది కాదు.
జ్వరం ఉష్టతత్త్వం. నృసింహతత్త్వం ఉష్ణతత్త్వం. ‘ఉష్ణం ఉష్ణేణ శీతలం’ అని అన్నారు. అంటే, నిప్పు నిప్పును చల్లబరుస్తుందని అర్థం. ఈ మంత్రంలోని అసలు రహస్యం ఇదే. అందుకే మన పెద్దలు జ్వరం వంటి రుగ్మతలు తగ్గడానికి నృసింహస్తోత్రాన్ని పఠించమని చెప్పేవారు.ఆయన జ్వరం నుంచి కాపాడటమే కాదు, భూతప్రేతపిశాచ పీడల నుంచి రక్షించి, శత్రుబాధలను కూడ తొలగిస్తాడు. కళ్ళు, మెడ, తల, కడుపులో ఏర్పడే రోగ విముక్తి కోసం, నారసింహ మంత్రాన్ని జపించి,
విభూదిని ధరిస్తే తగిన ఫలితం ఉంటుందనేది పెద్దల వాక్కు.
నారసింహాయ విద్మహే
వజ్రనఖాయ ధీమహి
తన్నః సింహః ప్రచోదయాత్‌
ఈ నృసింహ గాయత్రిని పఠించి, విభూదిని ధరిస్తే ఫలితం ఉంటుంది.
Read More

నిద్రలేవగానే ... ప్రార్దన

శ్లో: కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ.
కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనమ్!!

 శ్లో: సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే,
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమాస్వమే !!

 శ్లో: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ,
గురుశుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః !!

 శ్లో: బ్రహ్మ మురారి స్త్రిపురాంతకారీ భానుశ్శశీ భూమిసుతో  బుధశ్చ,
గురుశ్చ శుక్ర శ్శని భ్యశ్చ రాహుకేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్!!

 శ్లో: కృష్ణాయ వాసుదేవాయ హరయేపరమాత్మనే,
ప్రణతక్లేశానాశాయ గోవిందాయ నమోనమః  !!
Read More

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వా?

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!
Read More

ఏకశ్లోకీ భాగవతమ్

ఏకశ్లోకీ భాగవతమ్

శ్లో !! ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం
యేతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్ణ లీలమృతమ్
Read More

గణపతి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?

గణపతి  పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?

గణపతి పూజకు  అనేక పత్రాలనూ, పూలనూ తీసుకువచ్చి పూజిస్తాము. కానీ ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి మరి వినాయకుడు కు  ఎందుకు  ఇష్టం  ఉండదు  అనగా

ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు.
Read More

దీపారాధన

దీపారాధన :

ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా. శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి. దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు  వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.

* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న  ఇంటిలో, దారిద్ర్యముండదు.
* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.
* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.
* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు
Read More

రావి చెట్టు మహిమ

రావి చెట్టు మహిమ:

ఈ చరాచర ప్రకృతిలో అణువణువునా  భగవంతుని యొక్క దివ్య శక్తి వ్యాపించి వుంది. "ఇందుగలడందు లేడను సందేహంబు వలదుచక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందే కలడు" భక్తుడైన  ప్రహ్లాదుని కోరికపై నృసింహ మూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభము నుండి దర్శనమిచ్చాడు. 'చెట్టు, పుట్ట, రాతి, నదులు మొదలగు సమస్త చరాచరములయందును వ్యాపించియున్నానని గీత 10వ అధ్యాయనంలో శ్రీ కృష్ణ భగవానుడు వివరించి వున్నాడు. అశ్వత్థః సర్వవృక్షాణం 'వృక్షములన్నింటిలో కంటే రావి చెట్టుయందు తాను ఎక్కువ శక్తితో వున్నానని భగవానుడు చెప్పాడు. అట్టి రావిచెట్టు మహిమ దీని గొప్పదనం గురించి తెలుసుకుందాం.

మూలమునందు, శాఖలయందు, స్కంధమునందు,ఫలములందు   సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి వున్నాడని స్కందపురాణం చెబుతోంది. రావి చెట్టును విష్ణు రూపం గా చెబుతారు కనుకనే  రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు.ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు.రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకొని వుంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ దిగువ మంత్రమును పఠిస్తే శరీర ఆరోగ్యంతో కూడా పొందగలరు.
మూలలో బ్రహ్మ రూపాయా
మధ్యలో విష్ణు రూపిణే
అగ్రత శ్శివరూపిణే
వృక్షరాజాయతే నమః

మూలా మునందు బ్రహ్మ దేవుడుని, మధ్యభాగమున విష్ణువుని,చివర భాగమున శివుడిని కలిగియున్నఓ అశ్వత్థః వృక్షరాజమా ! నీకు నమస్కరమని ఈ మంత్రము యొక్క అర్ధం
Read More

జపమాల

భగవంతుని స్మరించడానికి భగవన్నామం జపించడానికి ముఖ్యమైన సాధనంగా జపమాల ఎంతైన అవసరం వుంది. జప సంఖ్య వేళ్ళతోను వేళ్ళ యందు కణుపుల పైనా లెక్కపెట్టడం కూడా అనాదిగా ఆచరణలో వుంది. జపమాల గూర్చి లింగపురాణంలో వివరంగా  తెలుపబడింది. వైష్ణవ మంత్రాలను జపించడానికి తులసిమాల చెప్పబడింది. గణేష్ మంత్రం జపించడానికి గజదంత మాల చెప్పబడింది. త్రిపురసుందరీ దేవి నుపాసించడానికి రక్త చందనం రుద్రాక్షమాలలు చెప్పబడ్డాయి. తంత్ర సారంలో ఈ విషయం విఫులీకరిచబడింది. కాళీపురాణాన్ననుసరించి కుశగ్రంధి (దర్భ)మాలతో చేసే జపం సమస్త పాపాలను హరిస్తుంది. పుత్రజీవ, పద్మాక్ష, భద్రాక్షుదులను కలిపి కూర్చకూడదు. ఏదో ఒక వస్తువుల మాలతోనే జపం చేయ్యాలి.
Read More

మహాలయ పక్షంలో ??

మహాలయ పక్షంలో .

మానవుడు మోక్షాన్ని పొందడానికి దేవయానం, పితృయానం అనే రెండు మార్గాలున్నాయని వేదం చెప్పింది. అలాగే జన్మించిన ప్రతి మానవునికీ దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అనే మూడు ఋణాలు ఉంటాయని, వాటి నుంచి విముక్తులైన వారికి మాత్రమే ముక్తి లభిస్తుందనీ వేదం శాసిస్తోంది. భాద్రపదంలోని శుక్లపక్షం దేవతా పూజలకు అనువైనది. అయితే, బహుళ పక్షం పితృదేవతల పూజకు విశిష్టమైనది. యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, సంతానవంతులై తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేద శాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. మహా భారతంలో ఈ మూడు ఋణాలను తీర్చుకునే కర్తవ్యాన్ని ఆయా సందర్భాలలో బోధించింది. ప్రతిసంవత్సరం భాద్రపద మాస కృష్ణ పక్ష ప్రతిపద నుంచి అమావాస్య వరకు ఉన్న రోజుల్ని మహాలయ పక్ష రోజులంటారు. వీటినే పితృపక్షాలుగా వ్యవహరిస్తారు. సృష్టిలో ప్రత్యక్షదైవాలు తల్లిదండ్రులు. వారు లేకపోతే ఈ సృష్టిలేదు. పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రులే. అందుకే పిల్లలు వారి జీవించి ఉన్నంత కాలం చూసుకోవడమే గాక, మరణానంతరం వారిని సంతృప్తి పరచడం వారి ముఖ్యవిధి. ఆ సంతృప్తి పరిచేది ఈ మహాలయ పక్షంలోనే. అదే పితృకార్యక్రమము.


అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు పితృయజ్ఞం గురించి అడిగినప్పుడు భీష్ముడు ... "ధర్మరాజు! పితృపూజతోనే దేవపూజ సంపూర్ణం అవుతుంది. దేవతలు కూడా పితృదేవతలనే భక్తితో పూజిస్తారు అని చెప్పారు.'' భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. ఆషాడ కృష్ణపక్షం నుండి లెక్కిస్తే అయిదవదైన భాద్రపద కృష్ణపక్షాన్ని వారంతా ఆశ్రయించుకుని ఉంటారు. అన్నానికి, మంచినీళ్లకు ఇబ్బంది పడుతూ వాటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనుక ఆ పదిహేనురోజులు శ్రాద్ధకర్మతో వారికి అన్నోదకాలు కల్పించాలి.

ఆషాఢీ మనధిం కృత్వా పంచమం పక్షమా శ్రితా:|
కాంక్షంతి పితర: అన్నమస్య స్సహం జలమ్‌||

ఆషాఢ మాసం రెండు పక్షాల నుండి భాద్రపద కృష్ణ పక్షం వరకు గల అయిదు పక్షాలు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట! సూర్యుడు కన్యా,తులారాసుల నుండి వృశ్చిక రాశి వచ్చేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని అందువల్ల ఆ కాలంలో మన పితృదేవతలు అన్నోదకములు కాంక్షిస్తూ భూలోకమున వారివారి గృహముల చుట్టూ ఆత్రుతగా తిరుగుతుంటారని అని భారతం పేర్కొంది. అందుకే మహాలయ పక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్క రోజయినా పితృ దేవతలకు పిండ ప్రధానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య, తిథులలోను, భరణి నక్షత్రం ఉన్ననారు తిథివార నక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రి ఖండం చెబుతోంది. అందుకే భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. సాధారణంగా తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి మహాలయ పక్షంలో తర్పణ, శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. గతించిన వారి తిథి గుర్తు లేనప్పుడు మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం, తప్పణాలు వదిలి, శ్రాద్ధం ఆచరిస్తారు.

మొత్తం వీలుకాకపోతే మొదటి అయిదురోజులు వదిలి చివరి పదిరోజులు, కుదరకపోతే మొదటి పదిరోజులు వదిలి చివరి అయిదు రోజులు చెయ్యాలి. కనీసం నువ్వులు, నీళ్లు వదిలినా అమావాస్యనాడు మాత్రం తప్పకుండా అన్నశ్రాద్ధం పెట్టితీరాలి. పదిహేను రోజుల్లో ఒక్క రోజయినా శ్రాద్ధం పెట్టాలి. తస్య సంవత్సరం యావత్ సంతృప్తాః పితరోధ్రువమ్ (మహాలయంలో ఒక్కరోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడుగునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు). మహాలయ పక్షానికి ఉత్తరకార్తె వస్తుంది. ఆ కార్తెలో పితృయజ్ఞం చేస్తే పితృదేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రవి కన్యారాశిలో ఉండే సమయం ఇది. పార్వణవిధి (అన్నంతో చేసేది)తో చేసే శ్రాద్ధం పితృదేవతల అనుగ్రహంతో ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మహాలయపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్కరోజయినా పితృదేవతలకు పిండప్రదానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథులలోను, భరణి నక్షత్రం ఉన్న నాడు తిథివారనక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రిఖండం చెబుతోంది

అయోధ్యామధురామాయా కాశీకాంచి అవంతికా |
పూరి ద్వారవ తీచైవ సప్తైతే మోక్షదాయక: ||

పై ఏడు అరణ్యతీర్థాల్లో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. అక్కడికి వెళ్లలేనివారు కనీసం ఇంటిలో ఈ పై శ్లోకం చదువుతూ కర్మను ఆచరించాలని శాస్త్రవచనం. ఈ మహాలయంలో ఒక విశేషం వారి వారి జ్ఞాతి బంధువలందరికీ అర్ఘ్యాదక, పిండోదకాలు ఉండగలవు. శ్రాద్ధం అంటేనే కృతజ్ఞత ప్రకటించడం. శ్రాద్ధ కర్మల వల్ల పితరులు సంతోషిస్తారు. శ్రాద్ధ కర్తను ఆశీర్వదిస్తారు. పితరులను ఉద్దేశించి అన్నం, పాలు, పెరుగు, నెయ్యి, మొదలైన పదార్థాలతో భోజనం వండి తమ పితరుల పేరిట అర్పించాలి. ఆ సమయంలో ధూపం, దక్షిణాభి ముఖంగా పెట్టాలి. దక్షిణ దిశ పితృదేవతల దిక్కు కావడం దీనికి అర్థం. దేవతలుకాని, పితరులు కాని భోజనం స్థూలంగా గ్రహించరు. కేవలం సారం గ్రహిస్తారు. దేశ, కాల, ప్రాంతీయతలు పరిస్థితులను అనుసరించి పితరులకు శ్రద్ధతో దర్భ, నీరు సమర్పించడమే శ్రాద్ధం. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ ఆరంభించరు. శ్రాద్ధకర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కల్గించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతి లభిస్తాయని వాయు పురాణం చెబుతోంది.

తండ్రి మరణించిన తిథి నిషిద్ధ దినమైనా ఆరోజు శ్రాద్ధం పెట్టవచ్చు. తిథినాడు కుదరకపోతే అష్టమి ఎవరికైనా పనికి వస్తుంది. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా మహాలయంలో పిండ దానం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు. "త్రస్య సంవత్సరం యావత్‌ సంతృప్తా: పితరో" (ధువమ్‌) మహాలయంలో ఒక్క రోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడువునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారట. తండ్రి జీవించి ఉండి తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో నవమినాడు 'అవిధవానవమి' పేరుతో తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ప్రతీ సంవత్సరం చేసే శ్రాద్ధంకన్నా అతిముఖ్యమైంది ఈ పక్షం. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృఋణం తీర్చుకునే అవకాశం ఉంది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ఈ పక్షంలో పితృకర్మలను ఆచరించాలి
Read More

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి

వింధ్యుని గర్వ మణచుట
మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడిచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. [1] వేరొక కథనం ప్రకారం-శివ పార్వతుల కళ్యాణానికి ఉత్తరానికి ఋషులందరు హిమాలయలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పొవు చుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్యభగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పొతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడ ప్ర్యత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. వారు మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వరాలయం ఉన్నాయి.
వివాహం
మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం లేక భాధపడుతున్నాడు. ఆయన ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు ఆయన సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా వ్యక్తిత్వ పరంగా ప్రతిభాశీలియైన తన కూతురు పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు.
వాతాపి, ఇల్వలుల కథ
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. అలా ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళుతుండగా రాక్షస సోదరులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి అందరికీలానే మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేశాడు.
అగస్త్య మహర్షివింధ్యుని గర్వ మణచుట
మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడిచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. [1] వేరొక కథనం ప్రకారం-శివ పార్వతుల కళ్యాణానికి ఉత్తరానికి ఋషులందరు హిమాలయలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పొవు చుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్యభగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పొతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడ ప్ర్యత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యులవారు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. వారు మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వరాలయం ఉన్నాయి.
వివాహం
మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం లేక భాధపడుతున్నాడు. ఆయన ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు ఆయన సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా వ్యక్తిత్వ పరంగా ప్రతిభాశీలియైన తన కూతురు పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు.
వాతాపి, ఇల్వలుల కథ
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. అలా ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళుతుండగా రాక్షస సోదరులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి అందరికీలానే మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేశాడు.
Read More

ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి భారతీయ ఋషి. వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు. ఇతని కథ మహాభారతములో అనుశాసనిక పర్వములో కలదు, కానీ తిక్కన భారతములో లేదు.
బాల్యం
వ్యాఘ్రపాద మహర్షి ఇల్లాలు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుచుండెను. ఒకనాడు బందువుల ఇంట్లో పాయసము రుచి తెలిసి, అటువంటి పాయసాన్నము వండి పెట్టమని తల్లిని కోరిరి. లేదనిక చింతింతురని పిష్టరసమును తయారుచేసి పిల్లలకిచ్చెను. అది రుచింపక పాయసమే కవలయునని మారాముచేసిరి. అప్పుడి ఆ తల్లి ఆవు లేనిదే పాలురావు. పాలు లేనిదే పాయసాన్నము రాదని చెప్పెను. ఆవునెవరిత్తురు? మా కోరిక తీర్చువారెవరు? అని వారు ప్రశ్నించిరి. అనంతరం ఆ మహాసాధ్వి ఈశ్వరుడు సర్వ కామ్యములు తీరునని తెలిపెను. శివధ్యానం చేసి ఏకంగా పాలసముద్రాన్నే పొందుతానన్నాడు ఉపమన్యుడు. అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆ తల్లికి తెలుసు!
తల్లి మాటలు విని ఉపమన్యుడు బయలుదేరి ఒక ఏకాంత ప్రదేశమున ఎడమకాలి బొటనవ్రేలిపై నిలిచి మహాతపస్సు చేయనారంభించెను. నూరేండ్లు పండ్లు మాత్రమే తిని, మరి నూరేండ్లు ఆకులు మాత్రమే తిని, ఇంకొక నూరేండ్లు నీరు మాత్రమే త్రాగి, ఇంకొక నూరేండ్లు గాలి మాత్రమే పీల్చి, ఇలా మొత్తము వెయ్యి సంవత్సరములు ఉపమన్యువు పరమశివుని ఆరాధించెను.
ఈశ్వరునికి అతనిపై దయకలిగి పరీక్షించదలచి ఇంద్రుడి వేషములో వెళ్లి భోగభాగ్యాదులు ఇస్తానని ఆశ చూపించాడు. బూడిద తప్ప ఏమి ఇవ్వలేని శివుడినేం అడుగుతావు? ఆయన ఏమిస్తాడు? అని ఎద్దేవా చేశాడు. శివనింద భరించజాలక చెవులు మూసుకుని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు.అంత ఉపమన్యుడు ఆతని నిరాకరించి పశుపతిని తప్ప ఇతరుల్ని అర్ధింపను అని పలికెను. ఇంకా తాత్సారం చేస్తున్న అతడ్ని వెళ్లగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకుని అఘోరాస్త్రం మది తలచి ప్రయోగించబోగా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తుని కన్నులపండగజేసెను. తదనంతరము ఉపమన్యుడు పరమ శివభక్తుడై చిరకాలము జీవించెను.
శ్రీకృష్ణుడు ఉపమన్యుని దర్శించుట
శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరైన జాంబవతి భర్తని తనకొక సుపుత్రుని
ఇమ్మని ప్రార్ధించెను. అందుకు కృష్ణుడు తాను పండ్రెండేండ్లు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసినగాని సుపుత్రుడు లభించుట దుర్లభమని పలికెను. అంతనామెకు పుత్రునిచ్చుటకై కృష్ణుడు తపస్సు చేయుటకు అంగీకరించెను.
https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-ash3/1234307_656373007720443_444803471_n.jpg
Read More

ఆర్యభట్టు

ఆర్యభట్టు


ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతనుఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా" గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ (Arduverius) అనీ, అరబ్బులు అర్జావస్ (Arjavas) అని వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్ ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
పుట్టు పూర్వోత్తరాలు
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహురుడికి సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తుంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేక పోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో చాలా విశేషాలతో పాటు, ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషిచేశాడు.
రచనలు
ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం , గణిత శాస్త్రం లో అనేక రచనలు చేశాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని అలభ్యం. అతని ముఖ్యమైన రచన ఆర్యభట్టీయం గణిత, ఖగోళ శాస్త్రాల సంగ్రహము. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తారంగా ప్రస్తావించడమే కాకుండా ఈ రచన కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని అష్మకతాంత్ర అని పిలిచే వాడు. ఆర్యశతాష్ట (108 శ్లోకాలు కలిగినది అని అర్థం)అని కుడా వ్యవహరించబడేది.
1. గీతికాపాద
2. గణితపాద
3. కళాక్రియపాద
4. గోళపాద

ఈ ఆర్యభట్టీయం అనే రచనకు ఆయన స్వయంగా పేరేమీ పెట్టలేదు. ఇది తరువాత భాష్యకారులు చేసిన పదప్రయోగమే. అత్యంత క్లుప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు రాసి విస్తరించాడు.
గణిత శాస్త్రం
పై (π)విలువను కనుక్కోవడానికి కృషి చేశాడు.
క్షేత్రగణితం, మరియు త్రికోణమితి
ఆరవ గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట ఈ విధంగా వివరించాడు.
త్రిభుజస్య ఫాలాశరీరం సమదలకోటి భుజార్ధ సంవర్గం
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.
బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.

and

ఖగోళ శాస్త్రం
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం(elliptical shape)లో పదుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్య భట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయం లో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.

భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరే పెట్టారు.
ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మాద, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.[1]
వారసత్వం
ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లామిక్ స్వర్ణ యుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డాయి. అల్-ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనల్లో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తావించారు.
https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn2/1240593_656354554388955_261101697_n.jpg
Read More

శివలింగం, లింగాభిషేకములో పరమార్ధం, శివ షడక్షరీ స్తుతి

శివలింగం :-
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"

లింగాభిషేకములో పరమార్ధం :-
పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

శివ షడక్షరీ స్తుతి

(Shiva Shadakshari Stuti)

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమ:

శివాయ వేద్యాయ నాథాయ గురవే నమ:

ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్

అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:

న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర

నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:

మ: మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం

మహా నటవరం వందే మకారాయ నమో నమ:

షి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్

శివమేకపదం దేవం శికారాయ నమో నమ:

వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్

వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:

య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర:

యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:

ఓం ఓంకారామంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన:

కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ:

మహాదేవ: పరో మంత్ర: మహాదేవం: పరం తప:

మహాదేవ: పరా విద్యా మహాదేవ: పరా గతి:

ఓం నమ: శివాయేతి చ షడ్లింగాయ నమో నమ:

మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:

శివాయ సోమాయ సతారాయ షడత్మనే

స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:

శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే

ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ:

నమ: శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:

గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్

ఋత్గగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్

ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమోమ్యహమ్

ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం

ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్వయమ్

గోభీ ర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ

ప్రజయా పశుభి: పుష్కరాక్షం

త న్మే మన: శివసంకల్పమస్తు

సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి: పత్నీ క్షమా పుత్ర: షడతే మమ బాంధవా:

ఇతి షడక్షరీ స్తుతి :

Read More

పతంజలి

పతంజలి
యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణినిరచించిన అష్టాధ్యాయి కి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి [1][2][3] "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటుపాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయి కి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ ప్రపంచం బారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ)రాజయోగం బహుళ ప్రచారంలో కి వచ్చింది.
చరిత్ర
క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాశ్చ చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.
యోగ సూత్రములు
పతంజలి రచించిన యోగ సూత్రములలో 8 స్థాయిలు ఉన్నాయి. వీటినే స్థితులు అని కూడా అంటారు. గ్రంథ రూపంలో 8 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. అవి 1)యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7)ధ్యాన సమాధి అనేవి.
ప్రతీ మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీమండలాలు 6 ప్రధానంగా ఉంటాయని పతంజలి సిద్ధాంతీకరించాడు. మానవుడిలో వుండే ప్రాణ శక్తి కారణంగానే అతడు సజీవంగా ఉండగలుగుతున్నాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించటం (ప్రచోదనం చెందించటం) వలన మానవ శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. ఈ వెలువడే శక్తి కుండలినీ శక్తి, కుండలినీ శక్తిని ప్రేరేపించడం వలన మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే కాక ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడని పతంజలి చెప్పాడు.
పతంజలి చెప్పిన మూడో స్థాయి ఐన "ఆసన" ను దానికి ముందు చెప్పబడిన యమ, నియమ సూత్రాలను క్రోడీకరించి ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాల యోగాభ్యాస ప్రక్రియలను యోగాసనాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు శిక్షణనిస్తున్నారు. దీనిద్వారా తీవ్ర ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధినికులు ఎంతో ప్రశాంతతను పొందుతున్నట్లు పరిశోధనల్లోనూ, స్వానుభవాలతోనూ అంగీకరించటం విశేషం.
పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)
1. యమము : అస్తవ్యస్తంగా, గజిబిజిగా ఉండే మనస్సును, శరీరాన్ని ఒక నిర్దిష్ట పద్దతిలో క్రమబద్దీకరించే ప్రక్రియనే "యమము" అందురు.
2. నియమము : శరీరాన్ని మనస్సునూ, యోగాభ్యాసానికి సిద్ధం చేయటానికి ఆహారం, అలవాట్లు మొదలైన వాటిల్లో అనవసరమైన నియమాలు ఏర్పరిచే క్రమశిక్షణ తో ఉండటం.
3. ఆసనం: ఆసనం అంటె యిప్పుడు పాశ్చాత్యులలో ఉన్న భౌతిక అవసరాలైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం యిలా అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవరసాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్యతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.
4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. శ్వాసను గమనించడం, శ్వాసతో ధ్యానం చేయడం. వంటి శ్వాసక్రియా యోగ పద్ధతులన్నీ ఈ ప్రాణాయామం విభాగంలోకి వస్తాయి.
5. ప్రత్యాహారం : శరీరం కన్నా మానవుడు వేరు అన్న సత్యాన్ని భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు. పాశ్చాత్యులు కూడా ఈ సత్యాన్ని అంగీకరించగలిగితే పతంజలి చెప్పిన "అస్టాంగయోగ" విశేషాలు అర్థమవుతాయి. లేకపోతే యిదేదో కల్పిత రచనగానే పొరబడే అవకాశం ఉంది. ఇంతకూ ప్రత్యాహారమనగా వెనుకకు తిప్పడం అని అర్థం. అంటే పరిపరి విధాల పరుగులెత్తే మనస్సును మరల్చి హృదయంలో ఉండే ప్రజ్ఞతొ అనుసంధానం చెయ్యడం ప్రత్యాహారం.
6. ధారణ: సర్వాంతర్యామి అయిన భగవాంతునిలో మనసు నిలపడమే ధారణ . సాదారణంగా మనస్సు క్షణకాలం కూడా ఒక విషయం మీద స్థిరంగా ఉండదు. అలాటి చంచలమైన మనస్సుకు ఒక క్రమబద్దమైన యోగాభ్యాస ప్రక్రియ ద్వారా స్థిరత్వం కలిగించి స్ర్వాంతర్యామి యందు లగ్నం చెయడమే ధారణ.
7. ధ్యానము : సర్వాంతర్యామి యందు లగ్నం చేయబడిన మనస్సు యితర పాపంచిక విషయాలు గుర్తు రానంతగా ఒకే విషయం నందు (భగవంతుని యందు) ప్రశాంతమైన స్థితిలో నిలిచి ఉండటాన్ని "ధ్యానస్థితి" అంటారు.
8. సమాధి : సమాధి అంటే సిద్ధించడం, ఏ లక్ష్యం కోసం సాధకుడు అష్టాంగ యోగాన్ని అవలంబించి, అనుసరించి సాధన చేశాడో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం లేదా సాధిచ్మిన స్థితిలో ఉండటాన్నే సమాధి స్థితి అన్నడు పతంజలి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినో పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.
భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంధాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.
Read More

రామానుజాచార్యుడు

రామానుజాచార్యుడు

రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు:
• మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
• రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
• ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:
• ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
• దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
• మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
• ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.
దేశకాల పరిస్థితులు[మార్చు]
రామానుజుల జన్మసమయానికి దక్షిణభారత దేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:
• చోళులు - చోళులు శైవమత అనుచరులైనప్పటికీ, వైదికమత విధివిధానాలను వ్యతిరేకించలేదు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే వైదికమతకర్మలను, వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలు యజ్ఞయాగాదులు చేయించాడు. ఒకటవ కుళోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి, దానధర్మాలు చేశాడని చరిత్రలో ఋజువులు ఉన్నాయి.[1]
• చాళుక్యులు - చాళుక్యులు మొదట శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య రాణులు అనేకమంది జైనమత ప్రభావానికి లోనై తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేటట్లుగా మార్చి ఉన్నారని శిలాశాసనాలద్వారా తెలుస్తోంది. వేంగీ ( ఏలూరు) ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను ధ్వంసం చేశారని ఋజువులు ఉన్నాయి.[2]
• హోయసళ రాజులు - నేటి ఉత్తర కర్ణాటక ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించిన హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు జైనమతానుసరణ నుంచి వైష్ణవానికి మరల్చినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి.[3]
ఇవియే కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల, రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత హర్షించవచ్చు.
• రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైత వేదాంతము కూడా కొంత కారణమై ఉండవచ్చు.
• రాజాదరణ పొంది, ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు, స్థానిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి [4]. ఈ వేర్వేరు శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక పోయాయి.[5]
• ఈ కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ, విగ్రహారాధనకూ ఉన్న సంబంధం వలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో దేవాలయాలు నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు (వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధనలను అందుకోవటం ఈ కాలం యొక్క విశిష్టమైన మతసంబంధితమైన మార్పుగా చెప్పుకోవచ్చు.[6]
జీవితకాల నిర్ణయం
సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 - 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.). వంద సంవత్సరాలకు పైచిలుకు మనిషి బ్రతికే అవకాశం తక్కువ. కనుక ఈ నూట ఇరవై సంవత్సరాల వ్యవధి కొంత అనుమానాస్పదమౌతుంది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు.[7] తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.
క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్‌ , సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన రాజును, ఒకటవ కుళోత్తుంగ చోళునిగా గుర్తించి, ఆచార్యుల మేలుకోట ప్రవాసం క్రీ.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టుగా అనుమానించారు. ప్రవాస కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కుళోత్తుంగ చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను చేసినట్టుగా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని చెప్పుకోవచ్చు.
టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి, 'రామానుజాచార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో ఉల్లేఖించిన శ్రీభాష్య రచనా సమాప్తి కాలం (క్రీ.శ. 1155-1156) ప్రకారం, రామానుజుల జీవితకాలం క్రీ.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కుళోత్తుంగ చోళుడు ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి ఋజువులుగా చెప్పుకోవచ్చు. 'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించటం కూడా గమనించదగ్గ విషయం(ఇతడే పైన చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు, రామానుజాచార్యుడు మరియు అతని శిష్యులు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముందే నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా చెప్పుకోవచ్చు.
జన్మవృత్తాంతం
జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు
మద్రాసు కు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరు లో శ్రీమాన్ ఆసూరి 'సర్వక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి 'సర్వక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో, భార్య కాంతిమతితో కలసి, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్) ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూరు ను వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యుడు.[8] 'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం, చైత్ర మాసం, తిరువాదిరై రాశి(ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ క్రీ.శ. 1017, ఏప్రిల్ 13.[9].
నామకరణం
శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషు ని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. [10] [11] శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్‌మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.[12]
బాల్యం, వివాహం, విద్యాభ్యాసం
కంచిపూర్ణుడు[మార్చు]
ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజూ కాంజీవరం(నేటి కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా 'పూణమ్మెల్లె' అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధాభక్తులు చిన్ని ఇళయ పెరుమాళ్‌ను ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెడుతున్న కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్‌ తన ఇంటికి సాదరంగా అహ్వానించి, అతడి భోజనానంతరం అతడి కాళ్ళుపట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ, నిమ్నకులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి, ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవను నిరాకరించాడు. భగవంతునిపైనున్న అతడి భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత 'కంచిపూర్ణుడు' తనకు గురుసమానుడని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు.[13] [14]
యాదవప్రకాశుడు
ఇళయ పెరుమాళ్‌కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్‌తో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, ఇళయ పెరుమాళ్ కాంచీ నగరానికి తరలివెళ్ళాడు. నాటికి కంచిలో పేరుపొందిన 'యాదవప్రకాశ' ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు. యాదవప్రకాశుడు అద్వైతం లోనూ భేదాభేద వేదాంతం లోనూ పాండిత్యాన్ని గడించి, అనేకమంది శిష్యులనాకర్షించి, వారికి విద్యనొసగుతుండినాడు. ఇళయ పెరుమాళ్‌ వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవప్రకాశుడు అనతి కాలంలోనే ఇళయ పెరుమాళ్‌ యొక్క 'భక్తి' పరమైన ఆలోచనావిధానాన్ని గమనించాడు. యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు అకర్మికము, అనాస్తికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్‌ ను బాధించేది.[15] తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు.
ఒకనాడు 'ఛాందోగ్యోపనిషత్తు' పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు 'ఎర్రనైన కోతి పిరుదులను పోలిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని అనువదించినట్లుగా యాదవప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు. అదివిన్న ఇళయ పెరుమాళ్ కన్నులలో ధారగా నీరుకారసాగింది. యాదవప్రకాశుడు కారణమడుగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇళయ పెరుమాళ్. ఆగ్రహించిన యాదవప్రకాశుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యాసం' అనే పదానికి 'కం జలం పిబతి ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు) అని నూతనార్థాన్ని చెప్పి 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాధిక్యతనూ, ఆస్తికత్వమునూ ఉటంకించే అర్థాన్ని చెప్పాడు. మరొకమారు 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మయొక్క గుణాలనీ, అవే బ్రహ్మ కాదనీ యాదవప్రకాశునితో వాదించాడు. [16]
ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్‌ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆ ర్ద్రతాభావం, మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్‌ను హతమార్చటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొన్న ఇళయ పెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం, ఈ తరుణంలో కంచిలో వెలసిన 'వరదరాజ స్వామి' దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్‌కు కంచి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది. తరువాత కొంత కాలానికి ఇళయ పెరుమాళ్‌ వాదనలను అంగీకరించలేని యాదవప్రకాశుడు, అతడిని తన శిష్యరికం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు.
ఏది ఏమైనప్పటికి, బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలను, ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవటానికి యాదవప్రకాశుడి శిష్యరికం ఎంతగానో దోహదపడిందనటంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవటానికి, ఇళయ పెరుమాళ్‌కు యాదవప్రకాశుడి శిష్యరికం సహకరించింది.
యమునాచార్యుడు
'ఆళవందార్‌' అను నామధేయముతో ప్రసిద్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన తిరుచిరాపల్లి (నేటి తిరుచ్చి) జిల్లాలో ఉన్న శ్రీరంగం లో శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ పెరుమాళ్‌ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్‌ను కలవలేక, నిరాశతో వెనుదిరిగాడు. యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్‌ను తొలగించిన విషయం తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు.
మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్‌ను కలుసుకొని శ్రీరంగం తీసుకువెళ్ళే లోపల యమునాచార్యుడు తన ఆఖరిశ్వాసను విడిచాడు. ఇళయ పెరుమాళ్ మరియు మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తాడు.
• వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
• వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
• భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.
గోష్టిపూర్ణుడు
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు
Read More

ఆది శంకరాచార్యుడు

ఆది శంకరాచార్యుడు

ఆది శంకరాచార్యుడు
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు (Adi Shankaracharya). ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.[1] శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. (కూర్మపురాణం నుండి).

హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు:
• బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
• ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి.
• శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
• గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.

జీవిత గాధ
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - [2][3] శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
• మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
• చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
• కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.
జననము
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురువు లు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామి కి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో [4] జన్మించారు.
బాల్యము
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతంఅభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది.
ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారu
గోవింద భగవత్పాదుల దర్శనం
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదుడు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరుని, గోవిందభగవత్పాపాదుడు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నాడు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు వెంటనే గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరునికి వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరునికి ప్రధమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచక
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరి కి బయలు దేరారు. బదరి లో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడేఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరుడు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవిస్తాడు.
శంకరాచార్యుని శిష్యులు
శంకరునికి అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రజ్నాపాఠవాలకు కొందరు. చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
పద్మపాదుడు
• పూర్తి వ్యాసం పద్మపాదాచార్యులు
శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్నానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరునుకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కధ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరును వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.
కుమారిల భట్టు ను కలవడం
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్నబౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుని గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరునికి వివరిస్తాడు. శంకరుడు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామిగా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
భట్టిపాదుడు
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన జ్నాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉన్నది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాలను గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం భోదించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగినది. మీరు ఇపుడు పరిక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమానంగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురివుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమి అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్క్తి ప్రసాదిస్తాడు
మండన మిశ్రునితో తర్క గోష్ఠి
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన సంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగిగడు.
కామరూపవిద్య
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.
దిగ్విజయ యాత్రలు
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్ధించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.[5]
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుని శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
శంకరుడు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది[6] ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి విదేహ ముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లోదేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. [7] కాదు కంచి లో అని కూడా అంటారు.
శంకరుని జీవిత కాలము
శంకరుని జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయ
• క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.[8]
అయితే శంకరుడు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు.[9]అంతే కాకుండా ఇంచుమించు శంకరుని సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దంవాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత పక్కాగా ఉండే అవకాశం ఉండవచ్చును.[9]
చతుర్మఠాల వ్యవస్థ
మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్టించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించాడో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరుడు మఠామ్నాయము, మహాశాసనముఅనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టాడు. మఠామ్నాయము, మహాశాసనము లు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది.నేటి ఆధునిక పద్ధతులను శంకరుడు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగినది.

వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడినది.
• ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ
• యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి
• సామవేదం నుండి తత్త్వమసి
• అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ
అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.

సాంప్రదాయాలు: సాంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరుడు నాలుగు మఠాలను నిర్దేశించాడు.
1. శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.
2. వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.
3. పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్ధిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.
4. ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ భాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.
శంకరుని రచనలు
ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుని రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరుడు ఉదాహరించాడు. స్వానుభవానికి శంకరుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అతని రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుని రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంధాలు, స్తోత్రాలు.
భాష్యాలు
వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంధాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదాహరించాడు. శంకరుడు క్రింది గ్రంధాల గురించి భాష్యాలు వ్రాశాడు.
• బ్రహ్మసూత్రాలు
• ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)
• బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)
• ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)
• తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)
• ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)
• మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము) మరియు గౌడపాదకారిక
• ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)
• ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)
• భగవద్గీత
• విష్ణు సహస్రనామ స్తోత్రము
• గాయత్రీ మంత్రము
ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరుడు వ్రాశాడా అన్న విషయం గురించి సందేహాలున్నాయి.[10]. బ్రహ్మ సూత్రాలకు శంకరుడు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరుడు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నాడు.[11]
ప్రకరణ గ్రంధాలు
ప్రకరణ గ్రంధాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.
• వివేక చూడామణి
• ఉపదేశ సహస్రి
• శతశ్లోకి
• దశశ్లోకి
• ఏక శ్లోకి
• పంచ శ్లోకి
• ఆత్మబోధ
• అపరోక్షానుభూతి
• సాధనా పంచకము
• నిర్వాణ శతకము
• మనీషా పంచకము
• యతి పంచకము
• వాక్య సుధ
• తత్వబోధ
• సిద్ధాంత తత్వవిందు
• వాక్యవృత్తి
• సిద్ధాంత తత్వవిందు
• నిర్గుణ మానస పూజ

శంకరుడు వ్రాసాడని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరుడు వ్రాసాడని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుని పేరు మీద ప్రసిద్ధమయ్యాయని)
స్తోత్రాలు
భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరుడు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:
• శివ పంచాక్షరీ స్తోత్రం
• ప్రస్థానత్రయం
• పాండురంగాష్టకం
• సాధన పంచకం
• వివేకచూడామణి
• శివానందలహరి
• మనీషాపంచకం
• సౌందర్యలహరి
• మీనాక్షీ పంచరత్న స్తోత్రం
• ఆనందలహరి
• గణేశ పంచరత్న స్తోత్రం
• లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
• భజగోవిందం
• కనకధారా స్తోత్రం
• సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
• గంగా స్తోత్రము
వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.
శంకరుని తత్వం
ప్రధాన వ్యాసం: అద్వైతం
శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది
Read More

Powered By Blogger | Template Created By Lord HTML