గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 August 2013

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

శ్రీ కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలో, బృందావనంలో గడించింది. యశోదానందుల ప్రేమానురాగల మధ్య ఆప్యాయంగా పెరిగాడు కృష్ణుడు. నందుడి ఇంట్లో 1000 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవుల నుంచి ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు వస్తుంది, ఎంత వెన్న ఇంట్లో ఉండాలి. ఇంత వెన్న ఇంట్లో ఉంటే ఇక బయటకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం కృష్ణుడికేంటి? ఒకవేళ అలా చేశాడే అనుకుందాం, నందుడు బృందావనానికి రాజు. మరి తన కుమారుడు మిగితా ప్రజల ఇళ్ళలో దొంగతనం చేస్తుంటే చూస్తూ నందుడు ఎందుకు ఊరుకుంటాడు? చిన్నప్పుడు మనం అల్లరి చేసినట్టుగానే కృష్ణుడూ చేశాడు. కాలక్రమంలో కృష్ణ భక్తుల ఆయన చేసిన ఒకటి రెండు చిలిపి పనులను భక్తితో బాగా వర్ణించడం మొదలుపెట్టారు. భక్తితో చూసినప్పుడు అది భగవానుడు ఆడిన దివ్యలీల. అంతకుమించి ఆయన దొంగా కాదు, ఆయనకు దొంగతనం చేయవలసిన అవరసం లేదు.

కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఆయన్ను చంపడానికి వచ్చి, కృష్ణుడెవరో తెలియక ఆయన వయసున్న మగపిల్లలందరిని చంపేసింది. ఇక ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి బృందావనంలో ఆయన తప్ప మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే మగపిల్లవాడు, పైగా వాళ్ళ రాజైన నందుడి కొడుకు, మహా సౌందర్యవంతుడు. అందువల్ల అందరిచే ప్రేమించబడ్డాడు. అందరు ఆయన్ను ముద్దు చేశారు, గారాభంగా చూశారు. అదే చనువుతో కృష్ణుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి పాలు, పెరుగు తిన్నాడు. బృందావనంలో తన వయసు మగపిల్లలు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడపిల్లలతోనే ఆడుకోవలసిన పరిస్థితి. అందుకే ఆయన గోపికలతో ఆడుకున్నాడు(రాసలీల కాదు). వాళ్ళతోనే కలిసి తిరిగాడు.

ఇదంతా కృష్ణుడికి 8 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే జరిగింది. ఆయన 8 ఏళ్ళ వయసు రాగానే సాందీపాని మహర్షి వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో విద్యాభ్యాసం కనీసం 12 సంవత్సరాలు. విద్యాభ్యాసం ముగియగానే మళ్ళీ బృందావనానికి రాకుండా మధురకు వెళ్ళిపోయాడు. తర్వాత రుక్మిణీ దేవితో వివాహం జరిగింది. ఏలా చూసిన కృష్ణుడు గోపికలతో కలిసి ఆడుకున్నది ఆయనకు 8 ఏళ్ళు రాకముందు, పసిపిల్లవాడిగా. 8 ఏళ్ళ పిల్లవాడు ఆడిన ఆటను రాసలీల అని భక్తులు పవిత్రభావనతో అంటే, కొందరు ఇదే విషయాన్ని పెట్టుకుని ఆయనకు గోపికలతో శారీరిక సంబంధం ఉన్నదని, ఆయనకు 16,000 గోపికలు ఉన్నారని, ఒక్కో గోపికకు కృష్ణుడి వలన 10 మగపిల్లలు, 1 అడపిల్ల ఉన్నదని పుస్తకాలు ముద్రించారు. పరమపురుషుడైన శ్రీ కృష్ణుడి శీలాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి విషయాలు. ఆఖరికి హిందువులు కూడా ఎవరైనా రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకును నాశనం చేస్తే, ఈయన కలియుగ కృష్ణుడంటారు.కృష్ణుడు పరమధర్మాత్ముడు, కృష్ణుడిని విమర్శించే స్థాయి మనకు లేదు. కృష్ణుడుని విమర్శించే ముందు ఇవి కాస్త గుర్తుంచుకోండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ 
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML