గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 August 2013

కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది

కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు.

కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.

మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.

అర్ధరాత్రి సమయంలో పుట్టడం వల్ల మానవులలోని అజ్ఞానాన్ని, అష్టమి నవమి తిధులు మంచివి కావు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికి అష్టమి తిథిన కృష్ణునిగా, నవమి తిధిన శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. ఎంతోమంది మహర్షులు, గొప్ప భక్తులు బాలకృష్ణుని లీలలు చూసి ఆనందించారు. అటువంటి బాలకృష్ణుని పై మనకు కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ కర్ణామృతం వంటి స్తోత్రములు ఉన్నాయి. తమిళంలో కూడా పాపనాశం శివన్, సుబ్రహ్మణ్య భారతి ఉడుమలై నారాయణ కవి మొదలైన వారు చాలా గీతాలను రచిచి పిన్నలనుండి పెద్దల వరకు మంత్ర ముగ్ధులను చేశారు.అటువంటి కృష్ణుని ఈరోజు అందరూ ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.
 
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML