గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 August 2013

వినాయక చవితి వచ్చేస్తోంది. పండుగ పూర్తయ్యాక... ????

వినాయక చవితి వచ్చేస్తోంది. పండుగ పూర్తయ్యాక... నిమజ్జనాల్లో జరిగే ప్రకృతి హాని చూసి గుండెలు బాదుకుంటున్నాం. అదేదో ఇప్పణ్నుంచే తెలియజేస్తే... జనాలు కాస్త తెలుసుకుంటారు. ఈ ప్రమాదం కాస్తంత తగ్గే అవకాశం కూడా ఉంది.

మట్టితో చేసిన వినాయక ప్రతిమలను వాడటం ద్వారా పర్యావరణానికి ఎంతో మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీటిలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు, మట్టిలో కలవదు, ఏండకు ఆవిరి కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్. మొదట్లో దీన్ని ప్యారిస్ సమీపంలోను గనులనుండి తవ్వి తీయడంతో దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా వ్యవహరిస్తున్నారు. దీనికి ముడి పదార్థమే జిప్సం. ఇలా తయారైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే మట్టి ప్రతిమలతో సహజసిద్ధమైన రంగులతో వినాయక ప్రతిమలను తయారుచేస్తే పర్యావరణాన్ని పరిరక్షించినవారం అవుతాం. గణపతి ప్రకృతి ప్రేమికుడు, సహజసిద్ధమైన, ప్రకృతి ప్రసాదించిన వనరులతోటే ఏటా వినాయక చవితి జరుపుకుందాం.

మనం నిత్యం తింటున్న పండ్లు , మొక్కలు, ఆహారంతో పాటు ప్రతి మొ క్కలోనూ ఆయుర్వేదం ఉంది. అయితే నేడు వినాయక చవితికి చేసే గణనాథుల ప్రతిమలను అన్ని రసాయనాలతో తయారుచేస్తున్నారు. ఇవి వినాయక నవరాత్రులలో దవళకాంతులమధ్య ఎంతో శోభాయమా నంగా ఉండవచ్చు. కానీ నిమజ్జనం చేసిన తరువాత వీటిలో వాడిన రసాయన పదార్థాలు భూమిపైన, నీటిపైనా ప్రభావం చూపి వాటిని కలు షితం చేస్తున్నాయి. మట్టి, వనమూలికలు, జాజికాయ, కరక్కాయ, మిరి యాలు, శొంటి, కొబ్బరి పీచు, వస కొమ్ములు , వట్టి వేళ్లు ఇంకా ఎన్నో వనమూలికలు తక్కువ ధరలో నేడు లభ్యమవుతున్నాయి.

వాటితో వినాయకుడిని తయారుచేసి సహజసిద్ధమయిన రంగులను అద్దితే వినాయ క నిమజ్జనం తరువాత ఈ వనమూలికలు నీటిలో కలసి వీటి సారం భూమిలో ఇంకి ఆ ప్రదేశం శుద్ధి చేయబడుతోంది. నీరు ఎప్పుడైతే స్వ చ్ఛంగా తయారవుతుందో రోగాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ప్రతిఒక్కరు చిన్న మట్టి వినాయకుడిని అయినా మూలికలతో తయారు చేసి వినాయక నవరాత్రుల అనంతరం వారి ఇండ్లలో ఉన్న బావిలో నిమజ్జనం చేసినట్లయితే అందిరికి మంచి ఆరోగ్యకరమయిన తాగునీరు లభ్యమవుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML