గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 August 2013

తిరుమల నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు. ఎందువలన?

తిరుమల నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు. ఎందువలన?

తిరుమల నడకదారిలో యాత్రికులు మార్గానికి ఇరువైపులా రాళ్ళను ఒక దానిపై మరొకటి పేర్చి పెట్టడం మనందరం చూసే వుంటాము. దీని వెనుక, మనందరికీ తెలియనిది, చాలా యేళ్ళుగా మన పెద్ద వారందరూ ఆచరించి సత్ఫలితాలను పొందిన, ఒక విచిత్రమైన మరియు అత్యంత బలీయమైన నమ్మకం వున్నది. చూడడానికి ఇది ఒక తమాషాఐన విషయంగా కనపడినా ఇందులో పూర్తి నిజం వున్నది. (నేను కూడా స్వయంగా ఆచరించి ఫలితం పొందాను).
నడకదారిలో రాళ్ళను ఒకదానిపై మరొకటి పేర్చి ఇల్లులాగ కడితే వారికి శ్రీవారి అనుగ్రహం వలన అతి త్వరలో ఒక ఇంటి వాడు (భక్తుడు ఒక ఇల్లు కట్టడం జరుగుతుంది) అయ్యే అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకసారి తిరుమలకు నడిచి వెళ్ళేటప్పుడు నేనుకూడా సరదాగా రాళ్ళతో ఒక ఇల్లు కట్టడం జరిగినది. ఆ విషయం నేను మరిచి పోయాను. నేను మరిచిపోయినా అతి పవిత్రమైన సాలగ్రామ పర్వతమైన 'వేంకటాచల పర్వత ' మహిమ వలన మరియూ శ్రీవారి అనుగ్రహంతో, సరిగ్గా 9 నెలలో నేను నా ఇంటి లో ఒక భాగాన్ని ఆధునీకరించడం జరిగినది. ఇంకా అనేకమంది భక్తుల అనుభవంలో కూడా ఇలాగే జరిగింది.
ఇలా మనకు తెలియని ఎన్నో ఎన్నెన్నో వింతలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడి క్షేత్రంలో కోకొల్లలుగా వున్నాయి. వీటన్నింటినీ తేలుసుకోవాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదేమో!
ఓం నమో వేంకటేశాయ!
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML