గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 August 2013

కంసుడు, ఆక్రూరుడు

కంసుడు ఆక్రూరుడుని పిలిచి, దూతగా ధనుర్యాగానికని నందుని పిలువవలసిందని చెప్పగానే, భగవత్సంకల్పము యెరింగిన వాడై, రామకృష్ణులనెలాగైనా చూడగలిగే ఆవకాశానికి యెంతైనా సంతోషిస్తూ, "నీ ఆలోచన చాలా బాగుంది. నేనలాగే నీ దూతగా వెళ్తా" అని ఆక్రూరుడు కంసుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

రామకృష్ణులు అక్రూరుడికియెదురు వెళ్లి, సంతోషంగా కౌగిలింతలతో అతనికి స్వాగతమిచ్చి, ఆదరణతో అతనిని తమ యింటికి తీసుకుని వెళ్లారు. సావకాశంగా భోజనాలయ్యాకా కృష్ణుడు, "ఏమిటి విశేషం, యిలా దయ చేసావు? మా మేనమామ కంసుడు కుశలమేనా?" అని అన్నీ తెలిసినవాడైనా, లీలామానుషంగా అక్రూరుడిని అడిగాడు. సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పి, కంసుడిమాటే కాకుండా నారదుడు కంసుడికి చెప్పినది కూడా అక్రూరుడు దాపరికం లేకుండా తెలియజేసినప్పుడు రామకృష్ణులు నవ్వుకున్నారు.

రాజయిన కంసుని ఆజ్ఞ వినగానే నందుడు తనవారందరినీ వారి దగ్గర ఉన్న పాలు, పెరుగులని రాజుగారికి కానుకలుగా తీసుకుని మధురకి బయలు దేరవలసినదని చెప్పి, గోపకులతో రాజధానికి బయలుదేరాడు.

గోపికలకి మాత్రం అలా రామకృష్ణులని క్రూరాత్ముడైన కంసుని దగ్గరకు తీసుకుని వెళ్లడం యెంతమాత్రం యిష్టం లేదు. అంతా ఒక చోట చేరి, అలా చేసిన దేవుడిని దయాహీనుడని, తమను వదిలేసి కృష్ణుడు యెలా సంతోషంగా రథం యెక్కి వెళ్లిపోయాడో అని కృష్ణుడిని అనుకోని, ఆ వెంటనే వారి అవస్థకి వారిని వారే నిందించుకున్నారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML