గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 August 2013

జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద, రామ గోవిందా జోజో జోజో...

నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో...

పాలవారాశిలో పవళించినావు,
బాలుగా మునులుకు అభయమిచ్చినావు,
మేలుగా వసుదేవుకుదయించినావు,
బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో…

గోవర్థనంబెల్ల గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న కంసు పడకొట్టి
నీవుమధురాపురము నేల చేబట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి జోజో జోజో…

అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో....

అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో....
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML