గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 31 August 2013

జగతికి వెలుగు సూర్యుడు

జగతికి వెలుగు సూర్యుడు

అదితి, కశ్యపుల కుమారుడు సూర్యుడు. సూర్యుని భార్య సంజ్ఞ. వీరిరువురి సంతానం యముడు, యమున. సూర్యుని వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్ళిపోతుంది సంజ్ఞ.

అశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమెకు జన్మించిన వారే అశ్వనీదేవతలు. సూర్యుని వద్ద మారురూపంలో ఉన్న స్త్రీ ఛాయ. వీరి సంతానం శని, సావర్ణి, తపతి. మోహినీ అవతారంలో విష్ణుమూర్తి రాక్షసులకు అమృతము పంచుతూ, దేవతల రూపంలో ఉన్న రాహుకేతువులకూ అమృత మిచ్చినప్పుడు దానిని సూర్యుడు, చంద్రుడు గుర్తిస్తారు. ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పగా, అతడు సుదర్శనంతో రాహుకేతువుల శిరస్సులు ఖండిస్తాడు.

సూర్య చంద్రులపై పగబూనిన రాహుకేతువులు అప్పుడప్పుడూ సూర్యుడినీ, చంద్రుడినీ మింగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు వస్తాయని పురాణాల కథనం. మహాభారతంలో కుంతికి సూర్యునికి జన్మించిన వాడే కర్ణుడు. ఇంకా సూర్యుని గురించి పురాణాలలో అనేక సందర్భాలలో కనిపిస్తుంది.
Read More

హిందూ ధర్మాన్ని విమర్శించే వారు హిందువులు కారు

హిందూ ధర్మాన్ని విమర్శించే వారు హిందువులు కారు . ఏ అన్ని హిందూ దేవాలయాలలో క్షవర వ్రుత్తి దారులు నాయి బ్రాహ్మణులే( మంగలి వారే ) వేరొకరు ఉండరు. పల్లకి మోసే వారిలో ఒక కులానికి సంబందిచిన వారు తప్ప ఇంకొకరు మోయారు . గుడిలో వాదే అన్ని దుస్తులు శుభ్రం చేసేది రజకులు తప్ప ఇంకొకరు ఉండరు. గుడి తలుపులు, దర్వాజాలు, మందిరాలు, మండపాలు, అలంకరణ చేసేది వడ్రంగులు, తప్ప ఇంకొకరు ఉండరు . తిరుమలలో పొద్దున్నే స్వామివారి ముఖ ద్వారం నుండి 7 - తలుపులు తీసేది, మొదట స్వామిని దర్శించేది గొల్లలు( యాదవులు ) తప్ప వేరొకరు ఉండరు.ఇలా ఎన్నో ఉన్నవి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్రుత్తి చేపట్టుకుని, వారి జీవన వృత్తిగా మార్చుకున్నారుౕ. అలాగే బ్రాహ్మణులు వారు పూజలు తప్ప వేరొకరి వ్రుత్తి కి భంగం కలిగేలా, వారి వృత్తులు చేపట్టలేదు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఇవేమి మీకు కనపడవు ఎందుకంటే మీరు అమ్ముడు పోయి, హిందువులమని చెప్పుకుంటూ, హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ, అన్యమతస్తుల నుండి లబ్ది పొందే మనుషులు మీరు, మీరు హిందువులు కారు. హిందువుల ముసుగులో ఉండి, హిందూ ధర్మానికి ద్రోహం చేసే మనుషులు .
Read More

విహిత కర్మ - నిషిద్ధ కర్మ

విహిత కర్మ - నిషిద్ధ కర్మ

మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు హైదరాబాదు లో "రామాయణము - ఆర్షవాక్కులు" అనే ప్రవచనంలో - విహిత కర్మ - నిషిద్ధ కర్మ - ఎప్పుడు చేయ వలసిన పని అప్పుడు చేయడం ఎంత అవసరమో వివరించిన తీరు అత్యద్భుతం. ఇది ఈనాటి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా అవసరం. అందుకే, 19 నిమిషాల వీడియో పొందు పరుస్తున్నా. తప్పక వినండి, వినిపించండి, ఈ లంకె మీ వారందరికీ పంపి వినేలా ప్రోత్సహించండి. (శ్రీ సాయిపథం )
 

 http://www.youtube.com/watch?v=olUmnJt7y38

 
Read More

ఆదిత్యహృదయం - తాత్పర్యము :

ఆదిత్యహృదయం - తాత్పర్యము :


తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ౧
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ౨
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ౩
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం ౪
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ౫
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ౬
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ౭
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ౮
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ౯
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ౧౦
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాంఽశుమాన్ ౧౧
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేన్ద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ౧౨
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ౧౩
సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధ్భవః ౧౪
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే ౧౫
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ౧౬
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ౧౭
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ౧౮
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ౧౯
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ౨౦
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ౨౧
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ౨౨
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం ౨౩
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ౨౪
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శ్రుతిః :

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ౨౫
రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ౨౬
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.

అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం ౨౭
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ౨౮
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ౨౯
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ౩౦
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ౩౧

అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.
 
Read More

వినాయకుడి నిమజ్జనం ఎందుకు ? మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు ? అన్న శౌనకాదుల ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.

ఓం గం గణపతయే నమః

వినాయకుడి నిమజ్జనం ఎందుకు?

మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు? అన్న శౌనకాదుల ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.

వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్రజలమందుగానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవు ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే" అని వివరించాడి సూతమహర్షి.

సేకరణ : మహాగణపతి పురాణం - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహారావు

మట్టి గణపతులనే పూజించండి. కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః
Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.

వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.

అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.

ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.

అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

 

Read More

హిందూ ధర్మం విడిచి వెళ్ళిన వారికి, పెద్దవారికి ,గోప్పవారికి, మామూలు ప్రజానీకానికి ఒక మాట .

ఎంత హిందూ మత వ్యతిరేకంగా మారదామన్న ఎవ్వరికి కుదరదు, ఎందుకంటే చరిత్ర చెపుతోంది ప్రపంచ మతాలన్నీ హిందూ మతం నుండి వచ్చినవే అని . ఎవరికైనా ఇంకా సందేహం ఉన్న మన www.telugubandu.com చూడవచ్చు " హిందూ ధర్మ గొప్పదనం" భాగం లో . ఆఖరికి బుద్దుడు కుడా హిందూ మతం నుండి వచ్చిన వాడే . ఉదాహరణకు ::: = వెనకటికి ఒకరు సముద్రం మీద కోపం వచ్చి, చెరువు దగ్గరకి వెళ్ళేడంట స్నానం చేద్దాం అని, కానీ అతనికి తెలియదు ఆ చెరువు నీరు కూడా సముద్రపు ఆవిరి, వర్షం గా మారి ఏర్పడినదని, . అది అతని అమాయకత్వం కావచ్చు, సముద్రం పై కోపం కావచ్చు, ఏది ఏమైనా, మనకు తృప్తి కలగా వచ్చు కాని "సముద్రము విలువ తగ్గదు". అలాగే హిందూ మతం విలువ కూడా తగ్గదు ఎవరు ఉన్న ఎవరు లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన చరిత్ర చెప్పిన సత్యం ఇది .
Read More

అన్నమాచార్య కీర్తన : వినరో భాగ్యము (3-355)

అన్నమాచార్య కీర్తన : వినరో భాగ్యము (3-355)
రాగం: శుద్ధధన్యాసి

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ||

ఆది నుండి సంధ్యది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణుకథ||

వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ||

గొల్లెతలు చల్లలుగొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ
Read More

శ్రీ భజగోవింద స్తోత్రమ్

శ్రీ భజగోవింద స్తోత్రమ్
భజగోవిందం భజగోవిందం - గోవిందం భజ మూడమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే - నహినహి రక్షతి డుక్రు కరణే
బాలస్తావత్క్రీడా సక్త - స్తరుణ స్తావ త్తరుణీ సక్తః
వృద్ధ స్తావ చ్చింతా సక్తః - పరమే బ్రహ్మాణీ కోపిన సక్తః || భజ ||
నారీ స్తన భరనాభి దేశం - దృష్ట్యా మా గా మోహవేశం |
ఏత న్మాం సవ సొది వికారం - మనసి విచింతయ వారం వారమ్ || భజ ||
సుఖతః క్రియతే రామాభోగః - పశ్చాద్దంతా శరీరే రోగః
యద్యపిలోకే మరణం శరణం - తదపిన ముంచతి పాపాచరణమ్ || భజ ||
వయసిగతే కః కామవికారః - శుష్కే నీరేకః కాసారః
క్షీణే విత్తేకః పరివారః - జ్ఞాతే తత్త్వేక స్సంసారః || భజ ||
అంగం గళితం ఫలితం ముండం - దశన విహీనం జాతం తుండం
వృద్ధో యాతి గృహీత్వా దండం - తదసిన ముంచ త్యాశా పిండమ్ || భజ ||
మూడ జహీహిధ నాగామత్రుష్టాం - కురు సద్భుద్ధిం మనసి విత్రుష్ణాం
యల్లభ సే నిజకర్మో పత్తం - విత్తం తేన వినోదయ యు చి త్త మ్
యావ ద్విత్తో పార్జన సక్తః - తావ న్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్ఘర దేహే - వార్తాం కోపిన ప్రుచ్చతి గేహే || భజ ||
అర్ధ మనర్ధం భావయ నిత్యం - శాస్తి త త స్సుఖలేశ స్సత్యం
పుత్రాస ఫై ధన భాజాం - భీతి స్సర్వ త్రైషా విహితా రీతి:
యావ త్పవనో నివసతి దేహే - తావ త్ప్రుచ్చ తి కుశలం గేహే
గతవతి వాయౌ దేహేపాయే - భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || భజ ||
దినయామిన్యౌ సాయం ప్రాత - స్శిశిర వ సంతౌ పూనా రాయాతః
కాలః క్రీడతి గచ్చ త్యాయు - స్తదపిన ముంచ త్యాశావాయు:
పునరపి దివసః పునరపి పక్షః - పునరపి మాసః పునరపి వర్షః
ఏవం క్రీడతి గచ్చతి కాల - స్తసపిన ముంచతి జీవితు మాశాః || భజ ||
పునరపి జననం పునరపి మరణం - పునరపి జననీ జటరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే - కృపయాపారే పాహి మురారే || భజ ||
నళినీ దళగత జల మతితరళం - తద్వ జ్జేవిత మతిశ య చ ఫలం
విద్ధ వ్యాధ్య భి మాన గ్ర స్తం - లోకం శోక హతం చ సమస్తమ్ || భజ ||
అగ్రే వహ్ని: పుష్టే భాను - రాత్రౌ చుబుక సమర్పిత జాను:
కరతల భిక్ష స్తరుతలవాసః - తదపిన ముంచ త్యాశాపాశః
జటిలో ముండీ లుంచిత కేశః - కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపిచ ణ పశ్యతి మూడో - హ్యుదర నిమిత్తం బహుకృత దోషః || భజ ||
కాతే కాంతా ధనగత చింతా - వాతుల కింతవ నాస్తి నియంతా
కస్యత్వం వాకుట ఆయాతః - తత్వం చిన్తయ తది దం బ్రాతః
కస్యత్వం వాకుట ఆయాతః - తత్వం చిన్తయ తది దం బ్రాతః || భజ ||
కస్త్వం కో హం కూత ఆయాతః - కామే జననీ కో మే తాతః
యస్త్వాం హస్తే సుద్రుడ నిబద్దం - బోధయతి ప్రభవాది విరుద్ధం || భజ ||
కామం క్రోధం లోభం మోహం - త్యక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మజ్ఞాన విహీన విమూడా - స్తే పచ్యంతేనరక నిగూడాః
మాకురు ధనజన యౌవనగర్వం - హారతి నిమేషా త్కాల స్సర్వం
మాయామయ మితి సర్వం హిత్వా - బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా || భజ ||
కూతే గంగా సాగర గమనం - వ్రాత పరిపాలన మథవా దానం
జ్ఞానవిహీన స్సర్వమతేన - ముక్తి ర్న భవతి జన్మశ తేన || భజ ||
గేయం గీతానమ సహస్రం - ధ్యేయం శ్రీపతిరూప మజస్రం
నేయం సజ్జ న సంగే చిత్తం - దేయం దీన జననాయ చ విత్త మ్
భగవద్గీతా కించి దదీతా - గంగాజలలవ కాణికా పీతా
పక్రుద పియస్య మురారి పామర్చా - తస్య దాపి యమేన న చర్చా || భజ ||
సురమందిర తరుమూల నివాసః - శయ్యా భూతల మజినం వాసః
సర్వ మందిర తరుమూలనివాసః - సస్య సుఖం న కరోతి విరాగః || భజ ||
సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం - నిశ్చలతత్వే జీవన్ముక్తి: || భజ ||
ప్రాణాయామం ప్రాత్యాహారం - నిత్యానిత్య వివేక విచారం
జాప్య సమేత సమాధి విధానం - కుర్వవ ధానం మహద వదానమ్ || భజ ||
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ - మాకురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నఫై పశ్యాత్మానం - సర్వత్రో త్స్రుజ భే దాజ్ఞానమ్ || భజ ||
ర థ్యా చ ర్పట విరచిత కంధః - పుణ్యా పుణ్య వివర్జిత పంధాః
యోగీ యోగ నియోజిత చిత్తో - రమతే బాలో న్మత్తవదేవ || భజ ||
యోగరతో వాభో గరతోవా - సంగరతో వా సంగ విహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం - నందతి నందతి నందత్యేవ || భజ ||
త్వయి మయి చాన్య త్రైకో విష్ణు: - వ్యర్ధం కుప్యసి మయ్య సహిష్ణు:
భవ సమచిత్త స్సర్వత్ర త్వం - వాంఛ స్యచిరా ద్యది విష్ణుత్వ మ్ || భజ ||
గురుచరణాంబుజ నిర్భర భక్త - స్సంసారా ద చిరా ద్భవ ముక్తః
సేంద్రియమాన సనియమా - దేవంద్రక్ష్య సి నిజహృదయ స్థం దేవమ్ || భజ ||

|| ఇతి భజగోవింద స్తోత్రమ్ ||
 
Read More

శ్రీ కృష్ణుని చిన్ని పాట

Read More

శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు

"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే
అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను"


అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.

కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..!
Read More

లక్ష్మి , పార్వతి ,సరస్వతి

Read More

గోమాత గురించి ఒక చిత్రం

Read More

రుద్రుని యొక్క అభిషేకమునకు పూజ ద్రవ్యాలు మరియు వాటి ఫలితములు
Read More

యత్భావం తత్భవతి

Read More

శ్రీనివాసుని నామాలు, పాటతో వింటే చాల బాగా ఉంటుంది మనసుకి . ఆహ్లాదంగా ఉంటుంది .

క్రింద ఉన్న  వీడియో క్లిప్  పాట  ప్లే చేసి, పాటవింటూ ఈ నామాలు చదవండి. కష్టాలు  మరిచి దేవుని స్మరణలో హాయిగా ఉంటుంది  


 శ్రీ శ్రీనివాసా గోవిందా ,శ్రీ వేంకటేశా గోవిందా
 భక్తవత్సలా గోవిందా , భాగవతప్రియ గోవిందా
 నిత్యనిర్మలా గోవిందా , నీలమేఘశ్యామ గోవిందా
 పురాణపురుష గోవిందా,  పుండరీకాక్ష గోవిందా
 నందనందనా గోవిందా, నవనీతచోర గోవిందా
  పశుపాలకశ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా
 దుష్టసంహార గోవిందా, దురితనివారణ గోవిందా
 శిష్టపరిపాలక గోవిందా, కష్టనివారణ గోవిందా
 వజ్రమకుటధర గోవిందా, వరామమూర్తివి గోవిందా
 గోపీజనలోల గోవిందా, గోవర్ధనోద్దార గోవిందా
 దశరథనందన గోవిందా, దశముఖమర్దన గోవిందా
 పక్షివాహన గోవిందా, పాండవప్రియ గోవిందా 
 మత్స్యకూర్మా గోవిందా, మధుసూదనహరి గోవిందా
 వరాహ నరసింహ గోవిందా , వామన భృగురామ గోవిందా 
 బలరామానుజ గోవిందా, బౌద్ధకల్కిధర గోవిందా 
వేణుగానప్రియ గోవిందా, వేంకటరమణా గోవిందా 
 సీతానాయక గోవిందా, శ్రీతపరిపాలక గోవిందా 
దరిద్రజనపోషక గోవిందా, దర్మసంస్ధాపక గోవిందా
 అనాథరక్షక గోవిందా, ఆపద్భాంధక గోవిందా
 శరణాగతవత్సల గోవిందా, కరుణాసాగర గోవిందా 
 కమలదళాక్ష గోవిందా, కామితఫలతాదా గోవిందా
 పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా
 శ్రీముద్రాంకిత గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా
 ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా
 పద్మావతీప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా 
 అభయహస్తప్రదర్శన గోవిందా, మర్త్యావతారా గోవిందా
 శంఖచక్రధర గోవిందా, శార్జగదాదర గోవిందా 
విరజాతీరస్ధ గోవిందా, విరోధిమర్ధన గోవిందా 
సాలగ్రామధర గోవిందా , సహస్రనామా గోవిందా 
 లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా 
కస్తూరితిలక గోవిందా, కాంచనాంబరధర గోవిందా
 గరుడవాహన గోవిందా, వానరసేవిత గోవిందా
 వారధిబంధన గోవిందా ,ఏడుకొండలవాడ గోవిందా
 ఏకస్వరూపా గోవిందా , శ్రీరామకృష్ణ గోవిందా
 రఘకులనందన గోవిందా, ప్రత్యక్షదేవా గోవిందా 
 పరమదయాకర గోవిందా, వజ్రకవచధర గోవిందా
 వ్తెజయంతిమాల గోవిందా, వడ్డికాసులవాడ గోవిందా
 వసుదేవతనయా గోవిందా, బిల్వపత్రార్చిత గోవిందా 
 భిక్షుక సంస్తుత గోవిందా, స్త్రీ పుంరూపా గోవిందా
 శివేకవకమూర్తి గోవిందా, బ్రహ్మాండరూపా గోవిందా
 భక్తరక్షక గోవిందా, నిత్యకల్యాణ గోవిందా
 నీరజనాభ గోవిందా, హాతీరామప్రియ గోవిందా 
 హరిసర్వోత్తమ గోవిందా, జనార్దనమూర్తి గోవిందా
 జగత్సాక్షిరూప గోవిందా, అభిషేకప్రియ గోవిందా
 అపన్నివారణా గోవిందా, రత్నకిరిటా గోవిందా
 రామానుజనుత గోవిందా, స్వయంప్రకాశ గోవిందా
 ఆశ్రీతపక్ష గోవిందా, నిత్యసుభప్రధ గోవిందా
 నిఖిలలోేకశా గోవిందా, ఆనందరూపా గోవిందా
 ఆద్యంతరహితా గోవిందా, ఇహపరదాయక గోవిందా
 ఇభరాజరక్షఖ గోవిందా, పరమదయాళో గోవిందా 
 పద్మనాభహరి గోవిందా, తిరుమలవాసా గోవిందా
 తులసీవనమాల గోవిందా, శేషాద్రినిలయ గోవిందా
  శ్రీనివాస గోవిందా , శ్రీ వేంకటేశా గోవిందా, గోవిందా హరి గోవిందా , గోకులనందన గోవిందా...


 
Read More

Friday, 30 August 2013

ఎంత దుర్మార్గపు ప్రచారం : (నాకెదురైన అనుభవము )

ఎంత దుర్మార్గపు ప్రచారం : (నాకెదురైన అనుభవము )

నానయన లారా మనషుల రక్తము తాగి, మనుషుల మాంసము తినే వాళ్ళని మనుషులు అనరు, పిశాచాలు అంటారు, ఇంకా చెప్పాలంటే భూతాలు, దెయ్యాలు, దుర్మార్గులు, దుష్టులు , నీచులు, నిక్రుస్టులు అని కూడా అంటారు.

నిన్న వస్తుంటే, దారిలో ఒక మీటింగ్ చూసేను అక్కడ , ఒక పాస్టర్ చెపుతున్నారు. మైకు లో అరిచేస్తున్నాడు, ఊగిపొతున్నడు స్టేజి మీద . ఆయాస పడిపోతున్నాడు, చమటలు తుడుచుకుంటున్నాడు . ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు

ఈ క్రింది మాటలు పాస్టర్ మీటింగ్ లో చెపుతున్నాడు.

1) చూడండి బైబెల్ లో యోహాను 6:54 ".
" నీను దేవుని బిడ్డను , నా రక్తము తాగండి, నా శరీరం తినండి, నీను మీ గురించి ప్రార్ధించి, మిమ్ములను స్వస్థపరిచెదను , నా తండ్రి కుడా , నాకు ఇదే చెప్పియున్నాడు.

2)చూడండి బైబెల్ లో ( బైబెల్ నిర్గమ కాండము 15:2) " నిన్ను నువ్వు నమ్ముకుంటే ఓడిపోతావు, నన్ను నమ్ము , నా బలము మీద ఆధార పడు. నువ్వు విద్యార్ధివి , చదువు కుంటున్నావు . నీమీద నీకు నమ్మకముంటే నీకు ర్యాంకు రాదు , ఎందుకంటే నువ్వు పాపివి . దేముడిని నమ్ము, నువ్వు ఎన్ని పాపలు చేసిన , చేస్తున్న, భయపడకు , నీ పాపాలను పోగొట్టి, నీకు రాంకులు ఇస్తాడు .

3)చూడండి బైబెల్ లో బైబెల్ 20:3 : నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
మీరు యెహోవనే నమ్మాలి, చెప్పండి దేవుని స్తోత్రం హల్లేలుయా. వేరొక దేముడిని నువ్వు పూజించ కూడదు, ఒక వేల ఉంటె వదిలిపెట్టు , తన్ను, తగలపెట్టు, నీకు పాపం ఉండదు దేవుడు నిన్ను పాపాలనుడి కాపాడతాడు. మనకు ఒక్కడే దేముడు ఇంకొకడు లేడు . ఇంకొకడు ఉంటే , ఏమి చేస్తారు ?? ఊరినుండి తరిమేయండి .
Read More

Thursday, 29 August 2013

కేశవ నామాలబదులు లేక వాటితో పాటు..

మనలో చాలా మందికి కేశవ నామాలు తెలుసు సంధ్యావందనంతో పాటు అనేక పూజలలో వ్రతాలలో వస్తాయి కదా... ఇగ్గోండి ఇవి శివ నామాలు అంటారు... కొన్ని ప్రాంతాల వారు, కొంత మంది ఇళ్ళళ్ళో ఇవి చదువుతారు కేశవ నామాలబదులు లేక వాటితో పాటు..

శంభవే స్వాహా
శంకరాయ స్వాహా
శాంతాయ స్వాహా
శివాయ నమః
స్థాణవే నమః
భవానీపతయే నమః
భూతేశాయ నమః
త్రిపురాంతకాయ నమః
త్రిణయనాయ నమః
శ్రీకంఠాయ నమః
కాలాంతకాయ నమః
శర్వాయ నమః
ఉగాయ నమః
అభవాయ నమః
భర్గాయ నమః
భీమాయ నమః
జగతాం నాధాయ నమః
అక్షయాయ నమః
శ్రీనిధయే నమః
రుద్రాయ నమః
ఈశానాయ నమః
మహేశాయ నమః
మహాదేవాయ నమః
Read More

అరుదైన అపురూప నాణెము

Read More

చనిపోయిన వ్యక్తులకు ప్రార్ధనలు ::కొంత మంది క్రైస్తవులలో పెరిగిపోతున్న హిస్టీరియా రోగము

చనిపోయిన వ్యక్తికి ప్రార్ధనలు : 5 రోజులుగా చైపోయిన వ్యక్తి ని ఇంట్లో ఉంచుకుని, శవమ్ వద్ద బైబెల్ పట్టుకుని ప్రార్ధనలు. ఏసుప్రభు బతికిస్తాడని చుట్టుపక్కల వాళ్ళతో గొడవ, వాదన. " శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన సంఘటన " , చుట్టుపక్కల నివాసమున్న ప్రజలకు దుర్వాస పుట్టి, తలుపులు పగల కొట్టగా బయట పడిన సంఘటన. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆధీనం లోకి తీసుకుని, ప్రార్ధన చేసిన వాళ్ళని పరీక్షించగా అప్పటికే వారి కళ్ళకు శవానికున్న వైరుస్, ఎటాక్ అయ్యినట్టు నిర్ధారణ . రోజు అరుపులు, ప్రార్ధనలు, ఏడుపులు రాత్రిళ్ళు వినపడతాయని , చుట్టుపక్కల వారు పోలీసులకి చెప్పేరు. 30.08.2013 తేది నాడు, విజయవాడ , సూర్య రావు పేట లో జరిగిన సంఘటన . చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బంది కలుగు తోందని, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని సార్లు చెప్పిన వినలేదని పోల్లీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు .రాష్ట్రం లో ఈ సంవచ్చారం ఇది 4 వ సంఘటన


Read More

తిరుమల నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు. ఎందువలన?

తిరుమల నడక దారిలోనూ,కొండపైన గల అనేక తీర్థాల వద్దనూ చిన్న చిన్న రాళ్ళు నిలువుగా చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉంటాయి. యాత్రికులే వీటిని పేర్చి పెడతారు. ఎందువలన?

తిరుమల నడకదారిలో యాత్రికులు మార్గానికి ఇరువైపులా రాళ్ళను ఒక దానిపై మరొకటి పేర్చి పెట్టడం మనందరం చూసే వుంటాము. దీని వెనుక, మనందరికీ తెలియనిది, చాలా యేళ్ళుగా మన పెద్ద వారందరూ ఆచరించి సత్ఫలితాలను పొందిన, ఒక విచిత్రమైన మరియు అత్యంత బలీయమైన నమ్మకం వున్నది. చూడడానికి ఇది ఒక తమాషాఐన విషయంగా కనపడినా ఇందులో పూర్తి నిజం వున్నది. (నేను కూడా స్వయంగా ఆచరించి ఫలితం పొందాను).
నడకదారిలో రాళ్ళను ఒకదానిపై మరొకటి పేర్చి ఇల్లులాగ కడితే వారికి శ్రీవారి అనుగ్రహం వలన అతి త్వరలో ఒక ఇంటి వాడు (భక్తుడు ఒక ఇల్లు కట్టడం జరుగుతుంది) అయ్యే అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకసారి తిరుమలకు నడిచి వెళ్ళేటప్పుడు నేనుకూడా సరదాగా రాళ్ళతో ఒక ఇల్లు కట్టడం జరిగినది. ఆ విషయం నేను మరిచి పోయాను. నేను మరిచిపోయినా అతి పవిత్రమైన సాలగ్రామ పర్వతమైన 'వేంకటాచల పర్వత ' మహిమ వలన మరియూ శ్రీవారి అనుగ్రహంతో, సరిగ్గా 9 నెలలో నేను నా ఇంటి లో ఒక భాగాన్ని ఆధునీకరించడం జరిగినది. ఇంకా అనేకమంది భక్తుల అనుభవంలో కూడా ఇలాగే జరిగింది.
ఇలా మనకు తెలియని ఎన్నో ఎన్నెన్నో వింతలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడి క్షేత్రంలో కోకొల్లలుగా వున్నాయి. వీటన్నింటినీ తేలుసుకోవాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదేమో!
ఓం నమో వేంకటేశాయ!
 
Read More

కిడ్నీ వ్యాధులు--ఆహార వైద్యం...

కిడ్నీ వ్యాధులు--ఆహార వైద్యం...

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే హృదయం ప్రశాంతంగా ఉంటుంది. మూత్రపిండాల్లో సమస్య మొదలయితే అది అక్కడితో ఆగదు. మూత్రపిండ వ్యాధుల కారణంగా గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్న రోగాల్లో కిడ్నీ వ్యాధులు మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2-4 లక్షల మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. పదిమందిలో ప్రతి ఆరుగురు క్రానిక్ కిడ్నీ డిసీస్(సికెడి) వ్యాధిగ్రస్తులున్నారు. మూత్ర పిండాల వ్యాధులకు లేదా సమస్యలకు ఎక్కువగా ఉప్పు, చక్కెర, నిశ్చల జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం కారణమవుతున్నట్టు నిపుణులు తేల్చి చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నవారంతా యువకులేనని ఐటీ క్యాపిటల్ బెంగళూర్‌లో ఇటీవల వెల్లడైన కొన్ని సర్వేల సారాంశం. వారు చెప్పిన వివరాల ప్రకారం, దేశంలో కిడ్నీ రోగాల బారినపడుతున్న వారి వయసు 20-30 లోపే ఉంటోందట. వారిలో అత్యధిక శాతం సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు ఉండటం గమనించాల్సిన విషయం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటేనే కుర్చీలో కొన్ని గంటలపాటు కూర్చుని, శరీరాన్ని కదపకుండా చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఐటీ ఉద్యోగుల ఆహారపు అలవాట్లలో ఫాస్ట్‌ఫుడ్/జంక్‌ఫుడ్‌కు ప్రాధాన్యం ఎక్కువ. దాంతోపాటు స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం మూత్రపిండాలు చెడిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు// బహుజన బంధు.

ఆరోగ్యవంతమైన కీడ్నీలకు ఆహార వైద్యం...

***కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలనుకునే వారూ కింది డైట్‌ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

*రెడ్‌కాప్సికమ్...
నిజానికి కాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రెడ్ క్యాప్సికమ్ మాత్రం కిడ్నీ ఫెయిల్ అయినవారికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాప్సికమ్ రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కిడ్నీ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఉడికించుకుని, రోస్ట్ చేసుకుని ఎలా తిన్నా ఫరవాలేదు.

*ఎగ్‌వైట్...
అంటే గుడ్డులోని పసుపు రంగు కాకుండా మిగిలిన తెల్లని పదార్థం. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఫాస్పరస్ తక్కువగా ఉన్న ప్రొటీన్స్ చాలా అవసరం. అలాంటి ప్రొటీన్స్ లభించే ఆహార పదార్థాల్లో గుడ్డుదే మొదటి స్థానం. అందుకే ఎగ్‌వైట్‌ను ఎక్కువగా తింటే కిడ్నీ రోగాల బారి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.

*కాలీఫ్లవర్...
కాలీఫ్లవర్‌ను బాగా ఉడికించి తక్కువ మోతాదులో ఉప్పు, కారం చల్లుకుని తినవచ్చు. కాలీఫ్లవర్‌లో ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉండటం వలన అది శరీరంలోని శరీరంలోని టాక్సిక్ వ్యర్థాన్ని పూర్తిగా తగ్గించగలుగుతుంది.

*క్యాబేజీ..
ఇందులో ఫిటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని దెబ్బతీసే 'రాడికల్స్'ను అంతం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.

*చేపలు...
చేపలు ఇన్‌ఫ్లమేటరీ కొవ్వు, ఒమేగా-3ని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. అది కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రొటీన్స్‌కు కూడా చేపలు ముడిసరుకులాంటివి కనుక వాటిని ఆహారంగా తీసుకోవడం అన్ని రకాలుగానూ మంచిదే.

*జ్యూస్...
పండ్ల రసాలు, కూరగాయల రసాలు కిడ్నీలు చెడిపోకుండా కాపాడగలుగుతాయి. అయితే రోడ్ల మీద దొరికే రసాలు కాకుండా, ఐస్ వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నవైతేనే ఫలితం ఉంటుంది. కూరగాయలు, పండ్ల రసాలలో ఉండే ఫిటోకెమికల్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కిడ్నీలనూ రక్షించడంలోనూ సహాయపడతాయి.

*ఉలవచారు..
శీతాకాలంలో ఉలవచారు ఎక్కువగా తీసుకోవడం, మంచినీటిని వేడి చేసుకుని తాగటం కూడా మూత్రపిండాల భద్రతకు ఉపయోగపడుతుంది.
Read More

కలియుగ ఉపద్రవాలని ఎదుర్కొనగలిగే సాధనమే భగవద్గీత

కలియుగ ఉపద్రవాలని ఎదుర్కొనగలిగే సాధనమే భగవద్గీత

కురుక్షేత్ర యుద్ధం ఆరంభమైన పదకొండవనాడు భీష్మపితామహుడి తీవ్రమైన ప్రతాపానికి తట్టుకోలేని స్థితి అర్జునుడిలో ఏర్పడ్డప్పుడు భగవంతుడు మధ్యలోకి చేరాల్సి వచ్చింది. చక్రం పట్టాల్సి వచ్చింది. భీష్ముణ్ణి అణచాల్సి వచ్చింది, అందుకు అర్జునుడిని తయరుచేసుకోవాల్సి వచ్చింది. భీష్ముణ్ణి పడగొట్టడం పాండవులకూ ఇష్టం లేదు అటు కౌరవులకూ ఇష్టం లేదు. మరి ఇరువువురికీ తాతగారిపై ప్రేమ ఉంటుంటే వీరంతా ఏం చేస్తున్నట్లు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి. ఇంతవరకు అడగలేదు కనుక సంజయుడు చెప్పలేదు, పెద్దలు అడగనిదే చెప్పకూడదు అని తెలిసిన యోగ్యుడు కనుక ఇంత వరకు జరిగినదేమీ చెప్పలేదు. అడిగాక చెప్పాల్సిన అవసరం వచ్చింది కనుక చెప్పాడు.

యుద్ధ ఆరంభానికి అందరూ శంఖం పూరించి సిద్ధపడ్డాక అర్జునుడికి జాలి కలిగి యుద్ధం చేయను అని ధనుర్భాణాలని క్రింద పాడేసి చతికిల పడ్డాడు. ఎందుకు అలా చతికిల పడ్డాడో అది భగవద్గీత మొదటి అధ్యాయం అయ్యింది. అర్జునుడు యుద్ధం చేయను అన్నడు కానీ ప్రక్కన ఉన్న కృష్ణుడు కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి తిరిగి యుద్ధ సుముఖుడిగా తీర్చి దిద్దాడు. అప్పుడు "కరిష్యే వచనం తవా", నీవు చెప్పినట్లు చేస్తా అంటూ అర్జునుడు క్రింద పాడవేసిన ధనుర్భాణాలని తీసుకొని యుద్ధానికి ఉఙ్ముఖుడయ్యాడు. అట్లా సంజయుని ఉపదేశం సాగింది.

అట్లా అర్జునుడిని శక్తివంతుడిగా జ్ఞాన వంతుడిగా తీర్చి దిద్దడానికి భగవంతుడు చేసిన ఉపదేశమే భగవద్గీత. అయితే అర్జునుడు యుద్ధం చేయను అని కొన్ని కారణాలు చెప్పాడు. అది చేస్తే కలిగే అనర్థాలు చెప్పాడు, అరిష్టాలు చెప్పాడు. జనం అంతా పోతారు, మిగిలిన వ్యక్తులు అంతా పాడై పోతారు. నియమాలు నశించిపోతాయి. అవసరమైన శక్తి కలిగిన మానవజాతి నశిస్తుంది. మిగిలిన వారికి అవసరాలు పెరుగుతాయి, తీర్చుకోవడానికి రకరకాల క్షుద్రమైన పనులు చేస్తారు, లోకం అంతా అస్తవ్యస్థం అయిపోతుంది అని చెప్పాడు, ఇక్కడున్న వాళ్ళే కాదు పైకి వెళ్ళిన వారి వ్యవస్థ కూడా చెడిపోతుంది అన్నాడు అర్జునుడు. కృష్ణుడు లోకపు వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుందని తెలిసే యుద్ధం చేయించాడు.
ఎందుకని? కలియుగం ఎంతెంత పెరుగుతుంటే మనుషుల్లో శక్తి క్షీణిస్తుంది. నియమాలు నిష్ఠలు అదే స్థాయిలో దిగజారుతాయి. ఇది తప్పదు, కాల ప్రభావం చేత గడిచేదే. చెట్ల ఆకులు వసంత ఋతువులో వస్తాయి, అవే శీతాకాలంలో రాలి పోతుంటాయి, ఇది ప్రకృతి నియమం. ఇది మార్చతగినది కాదు. దాని కోసం దిగులు చెందాల్సిన అవసరం లేదు అట్లానే కృత యుగంలోంచి కలియుగానికి వచ్చేసరికి వ్యక్తుల్లో ఆపగలిగేది ఏదీ ఉండదు. కానీ అలాంటి సమయంలో కూడా సవ్యంగా ఉండాలి అని కోరే వారు ఉండక పోరు, అలాంటి వారికి ఒక రక్షణ కవచం కలిగించాలి అని భగవంతుడు భావించాడు. పడే వానను మనం ఆపలేం కానీ అది మనకు ఆటంకం కాకుండా ఉండటానికి సాధనాలని మనం సిద్ధం చేసుకోవడం బుద్ధిమంతుడి లక్షణం. అట్లానే కలియుగంలో రకరకాల ప్రలోభాలు బలహీనతలు చోటుచేసుకుంటాయి. వాటిని ఆపకుండా మనం ఏమీ చేయలేము. అందుకు యుద్ధం మానినా ఏమీ లాభం లేదు. అలాంటి పరిణామాలు ఏర్పడ్డప్పుడు అందులో పడి కొట్టుకుపోకుండా ఉండాలని కోరుకునే ఏకొందరికైనా ఒక రక్షణ కవచాన్ని నేనిస్తా అని భగవంతుడు భగవద్గీతోపదేశాన్ని ఇచ్చాడు. అది కేవలం అర్జునుడి కోసమే కాదు. అర్జునుడికి కర్తవ్య ఉపదేశం చేయడం ద్వారా ఈ కలియుగంలో ఏర్పడే ఉపద్రవాలను ఎదుర్కొనడానికి సాధనంగా అందించిన మహోపదేశం భగవద్గీత. ఈ నాడు అన్యాయాలు చేసేవారు లేకపోలేరు, అయినా భగవద్గీతని ఆసరాగా తీసుకోగలిగితే మనం ముందుకుపోగలుగుతాం.
Read More

వినాయక చవితి వచ్చేస్తోంది. పండుగ పూర్తయ్యాక... ????

వినాయక చవితి వచ్చేస్తోంది. పండుగ పూర్తయ్యాక... నిమజ్జనాల్లో జరిగే ప్రకృతి హాని చూసి గుండెలు బాదుకుంటున్నాం. అదేదో ఇప్పణ్నుంచే తెలియజేస్తే... జనాలు కాస్త తెలుసుకుంటారు. ఈ ప్రమాదం కాస్తంత తగ్గే అవకాశం కూడా ఉంది.

మట్టితో చేసిన వినాయక ప్రతిమలను వాడటం ద్వారా పర్యావరణానికి ఎంతో మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీటిలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు, మట్టిలో కలవదు, ఏండకు ఆవిరి కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్. మొదట్లో దీన్ని ప్యారిస్ సమీపంలోను గనులనుండి తవ్వి తీయడంతో దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా వ్యవహరిస్తున్నారు. దీనికి ముడి పదార్థమే జిప్సం. ఇలా తయారైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే మట్టి ప్రతిమలతో సహజసిద్ధమైన రంగులతో వినాయక ప్రతిమలను తయారుచేస్తే పర్యావరణాన్ని పరిరక్షించినవారం అవుతాం. గణపతి ప్రకృతి ప్రేమికుడు, సహజసిద్ధమైన, ప్రకృతి ప్రసాదించిన వనరులతోటే ఏటా వినాయక చవితి జరుపుకుందాం.

మనం నిత్యం తింటున్న పండ్లు , మొక్కలు, ఆహారంతో పాటు ప్రతి మొ క్కలోనూ ఆయుర్వేదం ఉంది. అయితే నేడు వినాయక చవితికి చేసే గణనాథుల ప్రతిమలను అన్ని రసాయనాలతో తయారుచేస్తున్నారు. ఇవి వినాయక నవరాత్రులలో దవళకాంతులమధ్య ఎంతో శోభాయమా నంగా ఉండవచ్చు. కానీ నిమజ్జనం చేసిన తరువాత వీటిలో వాడిన రసాయన పదార్థాలు భూమిపైన, నీటిపైనా ప్రభావం చూపి వాటిని కలు షితం చేస్తున్నాయి. మట్టి, వనమూలికలు, జాజికాయ, కరక్కాయ, మిరి యాలు, శొంటి, కొబ్బరి పీచు, వస కొమ్ములు , వట్టి వేళ్లు ఇంకా ఎన్నో వనమూలికలు తక్కువ ధరలో నేడు లభ్యమవుతున్నాయి.

వాటితో వినాయకుడిని తయారుచేసి సహజసిద్ధమయిన రంగులను అద్దితే వినాయ క నిమజ్జనం తరువాత ఈ వనమూలికలు నీటిలో కలసి వీటి సారం భూమిలో ఇంకి ఆ ప్రదేశం శుద్ధి చేయబడుతోంది. నీరు ఎప్పుడైతే స్వ చ్ఛంగా తయారవుతుందో రోగాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ప్రతిఒక్కరు చిన్న మట్టి వినాయకుడిని అయినా మూలికలతో తయారు చేసి వినాయక నవరాత్రుల అనంతరం వారి ఇండ్లలో ఉన్న బావిలో నిమజ్జనం చేసినట్లయితే అందిరికి మంచి ఆరోగ్యకరమయిన తాగునీరు లభ్యమవుతుంది.
Read More

Wednesday, 28 August 2013

ఆదిత్యహృదయం - తాత్పర్యము :

ఆదిత్యహృదయం - తాత్పర్యము :

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ౧
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ౨
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ౩
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం ౪
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ౫
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ౬
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.


సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ౭
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ౮
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు


పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ౯
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ౧౦
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.


హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాంఽశుమాన్ ౧౧
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేన్ద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడుహిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ౧౨
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ౧౩
సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.


ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధ్భవః ౧౪
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.


నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే ౧౫
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ౧౬
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ౧౭
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ౧౮
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు


బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ౧౯
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.


తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ౨౦
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు


తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ౨౧
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ౨౨
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం ౨౩
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ౨౪
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.


ఫల శ్రుతిః :

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ౨౫
రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.


పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ౨౬
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం ౨౭
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ౨౮
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ౨౯
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ౩౦
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ౩౧

అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.
Read More

షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం

షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు. అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909లో జరిగింది.

ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం"గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివునిలా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబాకు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ"ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు. ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు.
Read More

శివుని పేర్లు...! వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలోశివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు.వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

శివుని పేర్లు...!
వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలోశివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు.వాటిలో కొన్ని పేర్లు మీకోసం...
హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి,అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్,అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి,అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,
ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు,ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,
కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,
తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,
పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,
మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్,మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,
శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి
Read More

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి అని యాజ్ఞవల్క్య మహామునిని అడిగాడు.
యాజ్ఞవల్క్య మహాముని : ఓ దీపిక నుండి అనేక దీవులు ఉద్భవించినట్టు సత్వరజస్తామోగుణ పరిణామాల వల్ల ప్రకృతి నుండి విచిత్ర రూపాలు ఉద్భవిస్తున్నాయి. సంతోషం, ఆనందం, ఆరోగ్యం, క్రోధరాహిత్యం, ఋజత్వం, పరిశుద్ధి, ప్రకషత, సుస్తిరత్వము, అహింస, నిర్మలశ్రద్ద, వినీతి, లజ్జ, శౌచము, సమత, సదాచారము, కార్పణ్య రాహిత్యము, ఆదిగాగలవి సత్వ గుణాలని ఆర్యులు ఉపదేసిస్తున్నారు. దర్పము, క్రోధము, అభిమానము, మాత్సర్యము, కారుణ్య విహీనత, నిరంతర భోగభిలాష, అహంకారము ఆదిగాగలవి రాజసమని, మోహము, మౌర్ఖ్యము ఆదిగాగలవి తామసాలని విజ్ఞులు ఏకగ్రీవంగా వినుతిస్తున్నారు.
తన గుణాల ప్రభావం వల్లనే ప్రకృతి అంతరాత్మలో వేర్వేరు వికృతులు ఉద్భవింపజేస్తున్నది. ఇది దాని సహజ స్వభావము. పురుషుడు చైతన్యాత్మకుడు, ప్రక్రుతి జడ స్వభావం. ప్రకృతి పురుషుని సదా తన గుణాలవైపు ఆకర్షిస్తున్నది. పరతత్వం ప్రక్రుతి గుణాలచే సమాకర్షితమైన యెడల సంసారబద్దమై వేర్వేరు సుకృత, దుష్కృత కర్మలు ఆచరిస్తున్నది..

నాకు ఒక చిన్న సందేహం ఇది మీకు అర్ధమౌతుందా? అర్ధమైతే చెప్పగలను. ఇది వేదాల సర్వం.... మీకు అర్ధంఅవుతుంది అంటేనే ఈ పోస్ట్ తరువాతి బాగం పోస్ట్ చేస్తాను.. లేదంటే ఇంత చెప్పి వ్యర్ధం అవుతుంది.. గోడకి కొట్టిన సున్నం లాగా ఐపోతుంది..
Read More

శ్రీ లలితా అష్టోత్తర శత నామావళి


శ్రీ లలితా అష్టోత్తర శత  నామావళి
Read More

శ్రావణ మాసం మంగళ గౌరి వ్రతము

శ్రవణ మాసం మంగళ గౌరి వ్రతము

Read More

Powered By Blogger | Template Created By Lord HTML