గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 31 July 2013

గుడిలొ షడగొప్యం (శఠగొపం) తలమీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది???

గుడిలొ షడగొప్యం (శఠగొపం) తలమీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది???
దేవాలయంలొ దర్శనం అయ్యాక తీర్థం , షడగొప్యం తప్పక తీసుకొవాలి . చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపొయిందని అని చక చకా వెళ్ళి ఏదొ ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే ఆగి షడగొప్యం పెట్టించుకుంటారు
షడగొప్యం అంటే అత్యంత రహస్యం , అది పెట్టే పూజారికి కూడ వినిపించనంతగా కూరికను తలచుకూవాలి
అంటే మీ కొరికే షడగొప్యం , మానవునికి శత్రువులైన కామము , క్రోదము , లోభము , మోహము , మదము , మాత్సర్యము వంటి వాటిని ఇకనుండి దూరంగా ఉంటామని తలుస్తు తలవంచి తీసుకొవడం మరొక అర్దం

సహజంగా చిల్లర లేకపొవడం వల్ల ,షడగొప్యంమును ఒక్కొసారి వదిలేస్తుంటాం ప్రక్కగ వచ్చేస్తాం అల చెయ్యొదు .

పూజారి చేత షడగొప్యము పెట్టించుకొండీ , మనసులొని కోరికను స్మరించుకోండీ ,

షడగొప్యమును రాగి ,కంచు ,వెండిలతొ తయారు చెస్తారు షడగొప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలొ ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లొహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బైటకి వెలుతుంది .
తద్వార శరీరంలొ ఆందొలన , ఆవేశము తగ్గుతాయి .
షడగొప్యం ను శడగొపనం, శఠారి, అని కూడ అంటారు
Read More

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"


చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని భక్త జనులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

దక్షిణ కాశీగా పిలవబడుతూ, భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పూర్వం... ఋషులు తపస్సు చేసి, ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగరూపంలో వెలశాడని పూర్వీకుల కథనం.

పుణ్యగిరి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే... మహా భారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో, పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాచుకున్నారట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.

కాబట్టి... ఇంతటి పవిత్ర స్థలంలో స్నానమాచరించి ఆ పరమశివుడిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగారం చేసి, ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నేరుగా కైలాసం ప్రాప్తిస్తుందని భక్త జనులు గట్టిగా నమ్ముతుంటారు.

ఉమా కోటిలింగేశ్వర ఆలయం వెలసిన ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా... ఆలయం చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చగా పరచుకున్న ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిందూ సంప్రదాయ పండుగలతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి తొమ్మిదిరోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి మూడు రోజుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

వసతి, రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారు బస్టాండు నుంచి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.
Read More

శ్రీ శిరిడీ సాయి తత్వం

శ్రీ శిరిడీ సాయి తత్వం


ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణాగతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా ! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు. ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికొ పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దోషణలను చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లి ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచుకొని ఆ ప్రకారంగా జీవించి, సాయి అనుగ్రహ, కటాక్షములకు పాత్రులమవుదాము.


సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు
Read More

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం


పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.
 
 

Read More

శబరిమల అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప ఆలయం
కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం: దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఆ సమయంలో ఈ ఆలయానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ ఆలయంలో తయారు చేసె ప్రసాదం అమ్మకం ద్వార ఏటా ముప్పై కోట్ల రూపాయలు వస్తుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఒక వంద కోట్ల రూపాయలు. ఈ ఆలయ అస్తులను 30 కోట్ల రూపాయలకు భీమా చేశారు. ఈ భీమా లో ఆలయ పైకప్పుకు వేసిన బంగారపు పూతకు, ప్రాంగణంలో భవనాలకు, స్వామి వారి నగలకు, పనిచేసె ఉద్యోగులకు, భక్తులకు వర్తిస్తుంది, ఇందు కొరకు దేవస్థానం 14.75 లక్షల రూపాయలను ప్రీమియం గా చెల్లిస్తున్నది. అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి - సోమవారము నాడు జన్మింఛినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు -- మఖర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాది తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
• దీక్ష, మాల, నియమాలు
భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూది పై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది. దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి(From Wiki)Read More

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం

ఇక - ఆపైన ఉన్నది శుద్ధాకాశం. సూర్యుడు ఈ బ్రహ్మాండానికి నట్టనడిమిన ఉన్నాడు కదా! ఈతడు హిరణ్య (బంగారం) అండం నుంచి జన్మించాడు కనుక - ఇతడిని హిరణ్యగర్భుడన్నారు. (కొందరు సూర్యుని గర్భంలో బంగారం ఉందని చెబుతారు.) మృతాండం నుండి జన్మించాడు కనుక, మార్తాండుడనీ అంటారు. ఈ సూర్యగోళానికీ - భూగోళానికీ మధ్య దూరం - పాతిక కోట్ల యోజనాలు. ఈ మహావిశాల విశ్వంలో భూమి, దిక్కులు వగైరా విభజనలకు ఆధారం సూర్యభగవానుడే!

శ్లో|| విషు వత్సంజ్ఞ మాసాద్య గతి సామ్యం వి తన్వతే |
సమస్థాన మాసాద్య దిన సామ్యం కరోతి చ||

ఆరోహణ స్థానంలో మందగతిన ఉంటాడు సూర్యుడు. అది దక్షిణాయణం. కనుక పగళ్లు దీర్ఘం, అవరోహణ స్థానంలో సీఘ్ర గతిన ఉంటాడు. అది ఉత్తరాయణం. కనుక రాత్రులు దీర్ఘం. విఘవత్‌లలో సమగతిలో ఉంటాడు. కనుక పగలూ - రేయీ సమానంగా ఉంటాయి.

రాశుల్లోకి సంక్రమించే సూర్యగతిని బట్టి చెప్పాలంటే - వృషభం నుంచి కన్యారాశి వరకు సూర్యుడు చరిస్తుండగా (దాదాపు 5 నెలల కాలం) పగళ్లు దీర్ఘంగా ఉంటాయి. వృశ్చికం నుంచి మీనరాశి వరకు సూర్యుడు చరిస్తున్నప్పుడు రాత్రులు దీర్ఘం. మేష - తులా రాశుల్లో (విషువత్‌) మాత్రం రాత్రీ పగలూ సమానం. ఈ ప్రకారం సూర్యగతిలో 1. శీఘ్ర 2. మంద 3. సమగతి అనే 3 భేదాలున్నాయి.

ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే - మేరు పర్వతానికి నాలుగువైపులా నాలుగు దిక్పతుల పురాలున్నాయి. అవి. 1. ఐంద్రి (ఇంద్రుని పురి) 2. సంయమని (యమపురి) 3. నిమ్లోచని (వరుణ పురి) 4. విభావరి (కుబేర పురి). ఈ నాలుగు పట్టణాలూ సూర్యగమనానికి నిమిత్తాలు. సూర్యుడు ఇంద్రిలో ఉదయించి, సంయమానికి మధ్యాహ్నం చేరి, నిమ్లోచనిలో అస్తమించి, విభావరిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. అయితే - మేరువు మీద ఉన్నవారికి మాత్రం సూర్యుడు నిరంతరం ఆకాశానికి మధ్యలో ఉన్నట్లే కనిపిస్తాడు. సూర్యోదయం - సూర్యాస్తమయం ఏమిటి? ఆయన నిత్యుడు - శాశ్వతుడు కదా! నిజమే! దర్శన - దర్శనరహిత భేదాల వల్ల ఇవి మనం ఏర్పరుచుకున్నవే! దీనికిదే శ్లోక ప్రామాణ్యం....

శ్లో|| నై వాస్తమన మర్కస్య నో దయః సర్వదా సతః |
ఉదయాస్త మనాఖ్యం హి దర్శనా దర్శనం రవేః ||

ఇప్పుడు చంద్రగ్రహనానికి సంబధించి గమనం. ఇది చిత్రమయినరీతి. సూర్యుడు కాలచక్ర గతుడై 12 రాశులలోనూ సంచరిస్తూ 12 నెలలను కల్పిస్తుండగా చంద్రుడు పక్షద్వయంతో ఈ మాసకాలాన్ని విభజిస్తున్నాడు.

శ్లో|| భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభిః కాల విత్తమైః |
ఏవం భానోర్గతిః ప్రోక్తా చంద్రాదీనాం నిబోధత ||

సూర్యుడికన్నా చంద్రునిది శీఘ్రగతి. ఏయే నక్షత్రాలతో కూడి ఉంటే, ఆయా నక్షత్రాల వల్ల మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. (ఉదా: చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కూడినపుడు మార్గశిర మాసం) పెరుగుతున్న చంద్ర కళలతో దేవతలకు - తరుగుతున్న చద్రకళలతో పితృదేవతలకు ఇతడు ఇష్టడవుతున్నాడు. సూర్యునికి సంవత్సరం పాటు పట్టే కాలచక్రాన్ని ఈతడు నెలరోజుల్లో అధిగమిస్తున్నాడు. అమృత కిరణుడు. మనస్సుపై ప్రభావం చూపేవాడు. రాత్రి కారకుడు. సర్వజీవకోటికీ ప్రాణం - జీవం చంద్రుడే!

చంద్రునికి 3 లక్షల యోజనాల దూరంలో మేరువుకు ప్రదక్షిణంగా భచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భచక్రంలోనే సంచరిస్తుంటాయి అభిజిత్‌తో కలిసి 28 నక్షత్రాలు.

ఈ భచక్రానికి రెండు లక్షల యోజనాల దూరాన శుక్రగ్రహం. సూర్యునికి ముందు - వెనుకలుగా చరించే ఇతడికీ శీఘ్ర - మంద - సమగతులున్నాయి. లోకోపకారి. ఇతడికి రెండు లక్షల యోజనాల దూరాన బుధుడు సౌమ్యుడు. ఈతడికి రెండు లక్షల యోజనాల పైన అంగారకుడున్నాడు. వక్రించనంతవరకు ఇతడూ శుభుడే! ఆపైన రేండు లక్షల యోజనాల దూరంలో శనైశ్చరుడున్నాడు. చాలా మందగతి గలవాడు. ముప్పై నెలలకు గాని ఒక్కోరాశి నుంచీ కదలడు. అంటే ఒక్కోరాశిలోను 21/2 సం||రాలుంటాడు. సహజంగానే అశుభుడు. సూర్యపుత్రుడైన ఇతడికి కటాక్ష వీక్షణం కూడా ఉంది. కాని అది పొందడానికి శ్రమించాల్సి ఉంటుంది.

ఇక్కడకు నవగ్రహాల ఉనికిని స్థిరపరచిన తరువాత, జగదంబిక, ఈశనైశ్చరునికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలాన్ని ఏర్పరచింది. ఈ సప్త ఋషులు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశాన దక్షిణంగా తిరుగుతుంటారు. ఈ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో దిక్పాలకులతో సమానంగా దక్షిణం వైపున నిశ్చలంగా కనిపించే సర్వదేవపూజితుడైన ధృవుడున్నాడు. పరమ భాగవతోత్తముడు. లోక వందితుడు. తన తేజస్సుతో ఇతర గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు. గ్రహ రాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూంటాయి.

శ్లో|| ఆ కల్పాంతం చ క్రమంతి ఖే శ్యేనాద్యాః ఖగా ఇవ |
కర్మ సారథ్యయో వాయు వశగాః సర్వ యేవ తే ||

కాల చక్రాన్ని తిప్పే నిమిత్తం గ్రహాలన్నీ ధ్రువుడు కేంద్రబిందువుగా, వాయుప్రేరితాలై కదలాడటం - అదీ ఆ కల్పాంతం వరకు ఆకాశంలో గరుడ పక్షుల్లా చలించటం గొప్ప నిర్మాణ వైచిత్రి. ఈ గ్రహాలే ప్రాణికోటి కర్మల సారధులు. ఈ జ్యోతిర్గణాలు అలా చలిస్తూనే ఉంటాయి తప్ప, ఎన్నడూ రాలిపోవు.

సూర్య మండలానికి క్రిందుగా ఉన్నలోకాలలో సిద్ధ, చారణ, విద్యాధరలోకాలు కూడా ఉన్నాయి. వీటికి క్రిందుగా యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత విహారానికి సంబంధించిన లోకాలూ ఉన్నాయి. వాయుసంచారం ఉన్నంతవరకు అంతరిక్షం అనీ - దీనికి నూరుయోజనాల క్రిందుగా భూగోళం ఉన్నదనీ చెప్పబడింది.
 
 
Read More

శ్యామలా దండకం

శ్యామలా దండకం

ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||

దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||


Read More

ఆషాడంతో మొదలుపెట్టి అట్లతద్ది, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి...

ఆషాడంతో మొదలుపెట్టి అట్లతద్ది, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి... అంటూ ప్రతి పండుగకూ అరచేతి గోరింటను పండించేవారు పల్లెపడుచులు ఒకప్పుడు. కాలగతిలో కనుమరుగయ్యే అనేకానేక పద్ధతులకు భిన్నంగా ఆనాటి గోరింట నేడు హెన్నాగా మారి ఆధునిక యుగంలో అత్యాధునిక ఫ్యాషన్‌గా ఎదిగింది.
పండుగ పబ్బాలతో నిమిత్తం లేకుండా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పల్లె పడుచునీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నీ, కాలేజీ, యూనివర్సిటీ అమ్మాయిల్ని, ఫ్యాషన్ డిజైనర్లనీ, క్రీడాకారుల్ని, కళాకారుల్నీ ఏకరీతిన ఆకట్టుకోగలగడంతో పాటు పాశ్చాత్యుల్ని సైతం అతివలందరి మనసుల్ని దోచుకుని సుమనోహర సౌందర్యమై వెలుగొందుతోంది. ప్రధానంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైంది. ప్రతి తెలుగింట శుభకార్యాల్లో ఇంకా చెప్పాలంటే ప్రతి వేడుకలోనూ మమేకమై ఆడపడుచుల ఒంటినిండా గోరింటాకు పూస్తుంది.
‘‘మందారంలా పూస్తే... మంచి మొగుడొస్తాడనీ, గనే్నరులా పూస్తే... కలవాడొస్తాడనీ, సింధూరంలా పూస్తే.. అందాల చందమామే దిగివస్తాడ’’నే అల్లిబిల్లి ఊహల్నీ, ఆశల్నీ, నమ్మకాల్నీ పండిస్తోంది. ఉత్తర భారతీయులు పెళ్ళి వేడుకల్లో పెట్టే మెహందీ బాగా పండాలని దైవాన్ని వేడుకుంటారు. అలా పండితే భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధం పటిష్ఠంగా ఉంటుందని వారి విశ్వాసం.
ఇలాగే తెలుగింట అమ్మాయిలు గోరింటాకు బాగా పండాలని వారి వారి ఇష్టదైవాలను కోరుకుంటారు. అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మల ఆశీర్వచనాలను తీసుకుంటారు.
ఎలా పండుతుంది?
ఆకులోని ఎర్రరంగుకు కారణమయ్యే లాసోన్ పదార్థం చర్మంలోని స్ట్రామ్ కార్నియమ్ పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. సాధారణంగా మగవారి అరిచేతుల్లో ఈపొర మందంగా ఉండి ఇంకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మగవారికి త్వరగా పండదు. అయితే మందపాటి చేతులవల్ల మరో లాభం కూడా ఉంది. పండటం ఆలస్యమైనట్లే రంగు త్వరగా పోకుండానూ ఉంటుంది.
లాసోన్‌తోపాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్తాక్వినోన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండటంవల్ల అనాదినుంచీ ఇది మంచి కలర్ డైగా వాడుకలోనూ ఉంది. మిగిలిన ప్రయోజనాల సంగతెలా ఉన్నా మన దేశంలో మాత్రం సంప్రదాయ పెళ్లిళ్ళతో మెహందీ విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకుందనే చెప్పాలి. గోరింటాకు పెట్టుకోవడానికి పెళ్ళి ఒకటే సందర్భం కాకపోవచ్చు. కానీ మెహందీ లేని పెళ్ళి సందడి ఉండదంటే అతిశయోక్తికాదేమో!
తెలుగింట జరిగే వివాహ శుభకార్యాల్లో పెళ్ళికూతురుకు మెహందీని పెట్టడాన్ని పెద్ద వేడుకగా చేసే ఆచారం నేటికీ కొనసాగుతోంది. మెల్లగా ఇది అన్ని ప్రాంతాలకూ పాకింది. డిజైన్లు వేసేందుకు బ్యూటీపార్లర్లూ వెలశాయి. కొత్తగా మెహందీ డిజైనర్లు పుట్టుకొచ్చారు. కాలక్షేపంగానో, ఆసక్తికొద్దీనో నేర్చుకున్న ఈ కళ, కొంతమంది మహిళలకు పార్ట్‌టైమ్ జాబ్‌గానూ ఉపయోగపడుతోంది. కాలేజీ అమ్మాయిలు మెహందీపట్ల మరింత ఉత్సాహం కనబరుస్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లోని పార్కులు, ఎగ్జిబిషన్లు, షాపింగ్ మాల్స్‌లో దీక్షగా మెహందీ డిజైన్లను తీర్చిదిద్దే అమ్మాయిలు కనబడుతున్నారు. వీళ్లు పెట్టే డిజైన్లలో కూడా విభిన్న ప్యాక్‌లున్నాయి. ఇండియన్ ప్యాక్‌లో చేతుల నిండా డిజైన్స్ వేస్తే, అరబిక్ ప్యాక్‌లో ఓపక్క మాత్రమే డిజైన్ ఉంటుంది. ధర కూడా డిజైన్ బట్టి ఉంటుంది.
కేవలం వేడుకలకే కాకుండా, ఉగాది, హోలీ, దీపావళి, రక్షాబంధన్, నాగపంచమి, సంక్రాంతి... వంటి సందర్భాల్లో ఆయా పండుగలకు సంబంధించిన డిజైన్లను వేసుకోవడం ఈ తరంవారికీ ఫ్యాషన్‌గా మారింది. తెలుగు నాట తొలకరి వర్షాలు పడే ఆషాఢంలోనూ, అట్లతద్దికీ గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని అమ్మమ్మలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ తరం
యువతులు మోజుపడుతున్నారు. దీంతో గోరింటాకు పట్ల మరింత క్రేజ్ పెరిగింది.
ప్రాచీన కాలంనాటి ఈ అలంకారం, మరిన్ని సింగారాలు తీర్చిదిద్దుకుని అటు ఆధునిక ఫ్యాషన్‌గానూ, ఇటు సంప్రదాయ వేడుకగానూ నేటికీ వాడుకలో ఉండటమే గోరింటాకులోని గొప్పతనం! అదే దాని స్పెషల్... అట్రాక్షన్!!

ఎలా పెట్టుకోవాలి?
చిన్న పాత్రలో గోరింటాకు పొడిని వేయాలి. బాగా మరిగించి చల్లార్చిన టీ డికాక్షన్‌ని పొడిలో కలిపి పేస్టులా చేయాలి. కొద్దిగా యూకలిప్టస్ నూనె, టేబుల్ స్పూన్ పంచదార, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. రాత్రి సమయంలో పెట్టుకోవాలంటే ఉదయానే్న ఇవన్నీ చేసి సాయంత్రం వరకు బాగా నానబెట్టాలి. మందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో పేస్టుని వేసి కోన్ ఆకృతిలో చుట్టాలి. కోన్ కొనభాగంలో సన్నని రంధ్రం చేసి కావలసిన డిజైన్లు వేసుకోవచ్చు. మార్కెట్‌లో రెడీమేడ్ కోన్స్ కూడా ఇపుడు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించనూ వచ్చు.
మెహందీని కనీసం 4 నుంచి 6 గంటలు ఉంచుకోవాలి. ఎండిన తరువాత పెచ్చులు పెచ్చులుగా దానంతట అదే ఊడిపోతుంది. లేదంటే చేత్తో మృదువుగా గీరి తీయాలేగానీ నీళ్ళలో తడవకూడదు. తీసిన తరువాత మరో ఆరు గంటల వరకూ నీళ్ల జోలికి వెళ్ళకూడదు.
ఇలా చేస్తే డిజైన్ ముదురు రంగులోకి మారుతుంది. కనీసం పక్షం రోజులు పోకుండా ఉంటుంది. అయితే పండే రంగు మాత్రం చర్మంమీద ఆధారపడి వుంటుంది సుమా!

పుట్టుక... వేడుక!
భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న గోరింటాకును మొట్టమొదటగా వాడింది మనమేనా?... అంటే... కాదనే చెప్పాలి. సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన ఈజిప్షియన్లు వాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
రుబ్బిన గోరింటాకును వారు ఆడామగా తేడా లేకుండా గోళ్ళకీ, చేతులకీ, పాదాలకీ, జుట్టుకీ, చివరికి గడ్డానికి కూడా పెట్టుకునేవారట. అంతేకాదు, తాము పెంచుకునే జంతు జాతులకీ గోరింటను దట్టంగా పట్టించేవారట. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారివాసులు ఈ ఆకులో ఉన్న చల్లని గుణం గురించి తెలుసుకుని వేసవి తాపాన్ని తగ్గించే చలువ వస్తువుగా దీన్ని ఉపయోగించేవారు.
ఆపై మొఘల్ చక్రవర్తుల ద్వారా 12వ శతాబ్దంలో ఇది మన దేశంలో అడుగుపెట్టి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తెలుగు నాట సంప్రదాయకమై ప్రతి ఇంటా గోరింటాకు పూస్తుంది.
గోరింటను ప్రధానంగా మనం కాళ్ళకూ, చేతులకూ చేసుకునే అలంకారంగానే పరిగణించినా అమెరికన్లు మాత్రం కేవలం జుట్టుకు వేసుకునే రంగుగానే దీన్ని వాడేవారట. దీంతో ప్రపంచ వ్యాప్తంగా హెన్నా అంటే జుట్టుకు వేసుకునే రంగుగానే ప్రాచుర్యం చెందింది. ప్రస్తుతం పచ్చబొట్టు ఫ్యాషన్ మోజులో ఉన్న అమెరికన్లూ, యూరోపియన్లూ కూడా తాత్కాలికమైన పచ్చబొట్టుగా మెహందీ డిజైన్లని ఒళ్ళంతా వేసుకుంటున్నారు. హెన్నా టాటూవల్ల ఎలాంటి నొప్పీ లేకపోవడంతో ఇది పచ్చబొట్టును మించిన క్రేజ్‌గా సంపాదించుకుంది.
గుజరాత్‌లోని ఆదివాసీ తెగలో పెళ్ళిళ్ళప్పుడు వధూవరుల మొహాల్ని కూడా గోరింటాకుతో అలంకరిస్తారు. మధ్య తూర్పు దేశాల్లో గర్భిణీలు, పుట్టబోయే తమ చిన్నారులకు స్వాగతం చెబుతూ గోరింటాకును బొడ్డుచుట్టూ పెట్టించుకుంటారు.
మొరాకోలో గర్భిణీలు ఏడోనెల వచ్చాక చీల మండ దగ్గర పట్టీలు పెట్టుకున్నట్లుగా డిజైన్స్ వేసుకుంటారు. అలా చేయడంవల్ల ప్రసవం సుఖంగా జరిగి తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటారనేది వాళ్ళ నమ్మకం. సైన్స్ పరంగా గోరింటాకు ఇలా ఉపయోగపడి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శిశువు జన్మించాక బొడ్డు తాడు కోసిన తరువాత గోరింటాకు ముద్దను బొడ్డుమీద పెడితే బిడ్డకు అందం, ఐశ్వర్యం లభిస్తుందని చాలామందికి తెలుగునాట విశ్వాసం వుంది. మన తెలుగింటి ఆడపడుచులు గోరింటాకు రుబ్బి చేతులకు, కాళ్ళకు పెట్టుకునే సంప్రదాయం అనాదిగా వస్తున్నా, మెహందీగా రూపుదాల్చడంతో రెడీమేడ్ కల్చర్‌గా మారిపోయింది
Read More

హిందూమతం – ఓ పరిశీలన :- ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.

హిందూమతం – ఓ పరిశీలన :- ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.
శో|| ఓం గణేశ గ్రహనక్షత్రాణి యోగినీ రాశిరూపిణీం |
దేవీం మంత్ర మయీం నౌమి మాతృకాం పరమేశ్వరీం ||
ప్రణవనాదము ఓం కార రూపమై గణ,ఈశ,గ్రహ,నక్షత్ర,రాశి, యోగినీ రూపమున మరియు మంత్ర , తంత్ర రూపమున ఏ మహత్తర శక్తి జగత్తునందంతటా మాతృకా రూపమై ఏకమనేక అగుచు పూర్ణమైనిండి యున్నదో ఆ పరమేశ్వరికి నమస్కరించుచున్నాను.
ఉ|| ఏమహనీయ శక్తి పరమేశ్వర బ్రహ్మముకుందులందు తా
సాముగ వర్తిలింగ పృధుశక్తి చరాచర విశ్వ వృత్తి సం
గ్రామ లయంబు సృష్టి పరి రక్షణ లొప్పగ వారు జేతురో . . . ?
నీమము తోడ నామె భువనేశ్వరి నే శరణంబు వేడెదన్ || ( స్వకీయము )
దైవీయ భావ చరిత్ర :- మానవావిర్భావముతో సమాంతరంగానే దైవీయభావము ఆవిర్భవించింది. చరిత్ర పుటల్లో మానవేతిహాసపు జాడలు తెలియవచ్చే నాటికే దైవీయభావ చరిత్ర ప్రాధమిక ప్రకరణాలు పూర్తిచేసుకుంది. పచ్చని చెట్లు… పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు,ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలు అలనాటి ఆదిమానవుని- ఆహ్లాద పరచాయి-ఆశ్చర్య పరిచాయి. పరిశీలింప ఆలోచింపజేసాయి. ఊహ తెలిసిన మానవుడు ఉత్సాహవంతంగా నాటినుండి నేటి వరకు… ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఇలా క్రమ బద్ధంగా ఎలా ఉంది.
మండే ఎండలు,వడగాడ్పులు,పెను తుఫానులు,వానలు-వరదలు,భూకంపాలుఇలాంటి ప్రకృతి భీభత్సాలు మానవజాతిని భయకంపిత విహ్వలుని చేస్తూనే ఉన్నాయి. మొదట ప్రకృతి అందాలకు పులకించాడు ఆనందించాడు, ప్రకృతి ప్రసాదిత వస్తుసంచయ సమృద్ధికి గర్వించాడు.ప్రకృతి ప్రళయ కరాళా విలయాలకు నశించాడు కృశించాడు.ఎన్నో ఉత్పాతాలనుండి తాను రక్షణ పొందాలనే తలంపుతో ఏ కొద్ది సాధన చేసినా తన ఆలోచనామృతానికి పరవసిస్తూ సుఖించాడు. తన ఆలోచనలే పరిశీలనలకుపునాదిరాళ్ళుగా ప్రకృతినించి తెలుసుకుని వికృతిని కల్పించుకుని మురిసిపోయాడు. అదిగో ఆ ఆలోచనా భావ స్రవంతిలో భౌతిక సుఖవాదము-దైవీయభావము కవల పిల్లల్లా జన్మించాయి.
ప్రకృతి ప్రసాదిత వస్తులోహ సంచయముతో శీతోష్ణాదులనుండి రక్షించుకుని పర్ణశాలనుండి పదంతస్థుల భవనం వరకు నిర్మించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదిత వస్తు సంచయానికి— స్థల-కాల-రూపోపయుక్తత కల్పించుకోవడామే మానవ విఙ్ఞానం భౌతికశాస్త్రంగా పరిఢవిల్లింది. శాస్త్రాన్వేషణా ధ్యేయం ప్రకృతి నుండి తనను తాను కాపాడుకోవడం,రక్షణ పొందడం,సుఖానుభూతి పొందడమే.ఐతే గొప్ప తిరకాసంతా ఇక్కడే ఉంది.ఆకలిబాధకి తట్టుకోలేక తిన్నాడు,దాహపు బాధకి తట్టుకోలేక తాగాడు, శారీరక సౌఖ్యాలకై తహతహపడి స్త్రీ పురుషులు సంగమించారు.బాధానివారణమే సౌఖ్యమని భ్రమించారు.భౌతిక వాదము ఇచ్చే సుఖము ఆధ్యాత్మిక వాదుల అంతరంగము వేరువేరై పేరుకున్న అభిప్రాయాల బేధాన్ని కల్పించాయి.మరి ఆధ్యాత్మికవాదుల భావనచూస్తే……..
ఈ ప్రకృతి ఇలా లయబద్ధంగా ఎందుకు నడుస్తోంది? దీనిని ఇలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏది? భౌతిక శాస్త్రాలు ఎంత అభివృద్ధి పరుచుకున్న కాల పరిధిలో అవిఅరిగి విరిగి పోతున్నాయి.భౌతికశాస్త్ర వస్తు సంచయంతో పొందలేని రక్షణ ఆ అదృశ్యశక్తి నుండిపొందగలగాలని పరిశీలింప కృషిచేసారు.అదే దైవీయ భావనకు అంకురార్పణ అయ్యింది.
మానవ చరిత్రలో పలుమార్లు భౌతిక-ఆధ్యాత్మిక వాదాలు తమదే పైచేయంటూ పరుగు పందాలు తీసాయి.ఈ దైవీయ భావమే పలు దేశాల్లో అనేక మతాలుగా వెల్లివిరిసింది.కాబట్టే మానవ చరిత్రలో మతం కూడా అనేక కల్లోలాలుసృష్టించింది.రాజ్యాల స్థాపనలో మత యుద్ధాలు,కులాల కుమ్ములాటాలు కోకొల్లలు.చరిత్ర ఇలా ఎంత కాలమైనా అనంతంగా సాగుతునే ఉంటుంది.
శ్లో || స్త్రీ రూపం చింతయేత్ దేవీం – పుం రూపంవా విచింతయేత్ |
అధవా నిష్కళం ధ్యాయేత్ – సచ్చిదానంద లక్షణమ్||
ఆకార,వికార,విచార,విదూరము-లింగ,పురుష,వచన,విభక్తిఅభేధ్యము అగునది భగవత్ స్వరూపము. అట్టి సచ్చిదానందమూర్తి (భూమ) శబ్దోక్తము. నిరాకార సచ్చిదానంద స్వరూపముగా విరాట్ నర్చించుటయే మేలు అదే తపస్సు. దీనికి ఎంతో మనో ధృఢత్వము నిగ్రహము కావాలి కావున అందరూ తపస్సులు కాలేరు కదా.
మనో నిగ్రహం సాధించడానికే విగ్రహారాధన పరికల్పితమైనది. ఏ రూపూ చేని దేవునకు అనేక రూపములు, ఏ పేరూ లేని దేవునికి శతకోటి నామములు. మరలా మధ్యలో మన సంకల్పములు,మన కాల్పనికతకు తగ్గట్టు ముక్కోటి దేవతా మూర్తులు. విఘ్నములు కలుగకుండా విఘ్నేశ్వరుని పూజలు,ధనము కావాలంటూ లక్ష్మీ కుబేరులను,ఇలా మన కోర్కెలకు అనువైన దేవతలకు అనువుగా సృజింపబడిన ఆగమోక్తములు. ఐనా ప్రకృతిలో గల అణువణువునూమన హైందవ సంప్రదాయము దైవముగనే తలచినది.నమక చమక రుద్ర సూక్తములుసైతము పై భావనను ప్రకటించుచున్నవి.ఒక్క మాటలో చెప్పాలంటే హైందవ జీవన శైలిలో మిళితమై ఆధ్యాత్మికాభావము సర్వ పల్లవ పులకితము. మన్మతః సమ్మతః తత్ మతః అను భావముతో అనేక బోద్ధలు అనుయాయులు హైందవ ధర్మమున గలరు.హిందూ మతము అనుట తప్పు. హైందవ దేశమున ఎన్నియో మతములవారు తమ భావజాల సంచయమును యుగధర్మానుసారము మనుగడింప జేసిరి.

మ|| ధన తంత్రమ్మున గణ్యతన్ బడయగా తంత్రఙ్ఞుడన్ గాను, క
మ్మని మంత్రమ్ముల భక్తితో గొలువగా మంత్రఙ్ఞుడన్ గాను, నూ
తన యంత్రమ్ముల నిన్ను జేర జన శాస్త్రఙ్ఞుండనే గాను, నీ
యను రాగాంబుధి ముంచి తేల్చగదవో? అఙ్ఞుండ నన్ బ్రోవవో? (స్వకీయము)
శ్లో// నిర్గుణా సగుణా శ్చేతి – ద్వివిధా ప్రోక్తమనీషిభిః /
సగుణారాగి భిస్సేవ్యా – నిర్గుణాతు విరాగిభిః //
కామ్యులగు మానవులు సగుణ రూపమున, నిష్కాములు నిర్గుణ రూపమున భగవంతుని సేవించుచున్నారు. కామ్యాకామ్య సంకల్పమే కర్మ ముక్తి మార్గ ప్రేరకమై యున్నది.
వివిధారాధలు:- ౧. మనస్సున స్థిర సంకల్పముతో విశ్వసించుట మానసిక ఆరాధము.ఇందు భౌతికవస్తుచయము అనగా ధూప, దీప, నైవేద్యాదికములు నామమాత్రములు.
౨, వాక్కు:- భగవన్నామమును నోటితో పలుకుట భజించుట వాక్కు.ఈ ప్రక్రియనందు భజన,కీర్తన,మంత్రజపాదులు ప్రాధాన్యత వహించును.
౩. కాయము:- శరీరావయవములు కదల్చి, యోని ముద్రాదుల దాల్చి, ధూపదీప నైవేద్యములర్పించి జపతప హోమాదులు చేయుట ప్రాధాన్యత వహించును.
౪.కర్మలు:- పూజ,జపము,హోమము,తర్పణము,మార్జనము,బ్రాహ్మణ భోజనాదులనే షడంగములు నిర్వర్తించుట ప్రధానమై యుండును. మనోవాక్కాయ కర్మంబుల ప్రబల విశ్వాసముతో తాను నమ్మిన దైవమును కొల్చుటయే ఆరాధన
Read More

నాటకం పండితపామర జనరంజకం. అసలీ ప్రపంచమే జగన్నాటకం. పరమేశ్వరుడు సూత్రధారి.

నాటకం పండితపామర జనరంజకం. అసలీ ప్రపంచమే జగన్నాటకం. పరమేశ్వరుడు సూత్రధారి.
ప్రపంచవ్యాప్తంగా నాటకానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. మంచినాటకమంటే ఎవరైనా ఆదరిస్తారు. ప్రపంచానికి ప్రతిబింబమే నాటకం.
నాటకం ఆడుతున్నాడంటారు. అంటే చెప్పదలచుకున్నది కళాత్మకంగా చెప్పుతున్నాడని అర్థం.
ప్రపంచనాటకాలలో కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలానిది' అగ్రస్థానం. అసలాయన దానిని భారతకథనుంచి కళా త్మకంగా సృష్టించాడు.
భారతదేశంలో సంస్కృత 'అభిజ్ఞాన శాకుంతలం' ప్రదర్శించే నాటక సంస్థ ఉండాలి. అగ్రనటులతో ఆ నాటకాన్ని చక్కగా తయారుచేయాలి. అపుడు ప్రపంచస్థాయిలో ఆ నాటకానికి అగ్రతాంబూలం అందుతుంది. అట్లాగే సంస్కృతంలో ఉన్న మహానాటకాలను అవసరమైతే రంగస్థల ప్రదర్శనకన ుకూలంగా మలచి తయారుచేయాలి. ఏ సంస్కృత నాటకాన్ని ప్రదర్శించినా భారతీయులకు అంతర్జాతీయ గౌరవం లభిస్తుంది. దీనికి కేంద్ర నాటక అకాడమీ, ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం.
అలాగే మన తెలుగు నాటకాలలో కూడా చిరకాలంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ పేరెన్నికగన్న నాటకాలు చాలా ఉన్నవి. సంప్రదాయనాటకాలుగా ప్రసిద్ధిచెందినవి.
హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, పాదుకాపట్టాభిషేకం, పాండవోద్యోగం, పాండవవిజయం, ప్రతాపరుద్రుడు, వర విక్రయం, కల్యాశుల్కం, రాధాకృష్ణ కంఠాభరనం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీరామాంజనేయయుద్ధం, రామదాసు, తుకారం, పోతన మొదలైన నాటకాలు అనాదిగా ఈ తెలుగునాట ఆదరణ పొందుతూ వచ్చినవి.
అయితే ప్రజాదరణ ఎంత ఉన్నా ఆర్థిక వనరుల లోపం వల్ల సర్వాంగసుందరంగా, సర్వజనామోదకరంగా, సంప్ర దాయానికి ప్రతీకగా ప్రదర్శించే అవకాశాలు అంతగా లేవు.
నాటకాలకు నంది బహుమతుల పేరుతో, అవార్డుల పేరుతో లక్షలరూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. గొప్ప విషయం, రంగస్థల సంబంధం ఉన్న అందరూ హర్షించదగ్గ విషయమే.
కాని రంగస్థలం నూతనోత్తేజాన్ని పొందాలి. యువతకు అది స్ఫూర్తికావాలి. ప్రదర్శన వారికి అందుబాటులో ఉంటే చూసిన వారిలో నూటికొకరయినా రాగలుగుతారు ఈ రంగానికి.
మన వరకు వస్తే తెలుగునాటక స్వరూప స్వభావాలు, అందులో పండినవారు, రాటుదేలిన నటీనటులు, ప్రయో క్తలు, భాషా పండితులు కలసి తెలుగునాటకాన్ని రూపొం దించాలి ఈనాటి ప్రదర్శన కోసం.
ప్రతి మండలంలోను ఆరుబయట రంగస్థలాలు ఏర్పడాలి. అన్ని ప్రాంతాలవారు వచ్చి అక్కడ ప్రదర్శనలివ్వాలి. ఆ ఇచ్చే ప్రదర్శనలు ప్రభుత్వ పక్షాన నిపుణులైన వారిచే తర్ఫీదు చేయించి ఒక స్థాయిన, ఆమోదస్థాయికి చేరుకున్న ప్పుడు ప్రదర్శనలివ్వాలి. అప్పుడు మండలస్థాయిలో, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలి. అవి నంది నాటకోత్సవ స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరు తనకున్న వ్యవధిలో అభిమానమున్నవారు ఎక్కువకాలం వెచ్చిస్తే తప్ప నాట కానికి న్యాయం చేయలేరు. ఏరకంగా నైతేనేం నాటక కళ కళ కళలాడాలి. ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, నాటక అకాడమీని కలుపుకున్న తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు లో కనీసం ప్రసిద్ధమైన నాటకాలనైనా సేకరించాలి.
నిపుణు లైన ఒక నటుడికి, ఒక తెలుగు పండితుని ఇచ్చి ఆనాటకాన్ని రంగస్థల ప్రదర్శనయోగ్యంగా తీర్చిదిద్ది ప్రదర్శన యోగ్యమైన విభావాన్ని అచ్చు వేయించి నాటక సమాజాలను అందుబాటులో ఉంచాలి. కొన్ని నాటకాలలో తప్పులు కోకొల్లలు అవి సరిచేయాలి. మండల స్థాయి అధికారులకు గ్రామాలలో అందుబాటులో ఉన్న నాటక ప్రతులను సేకరించమని చెప్పాలి. పాతకాలంనాటి ఫొటోలు, కరపత్రాలు, గ్రామఫోన్‌ రికార్డులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం భద్రపరచాలి.
తెలుగువారు తెలుగునాటకాన్ని సమగ్రంగా అన్ని హంగులతో సిద్ధపరిచినాడు ఆ నాటకం కనీసం తెలుగునాట అంతా ప్రదర్శించవచ్చు.
నాటకాలు ఎంతో మంది వ్రాస్తున్నారు, వ్రాశారు అవి ఆనాటివి ఈనాటివి అన్నీ ప్రదర్శనకు నోచుకోలేదు. కారణాలు అనేకం.
నూరేళ్ల పైబడి కొన్ని నాటకాలే నిలచినాయి. వాటికి ఈనాడు ఆదరణ ఉంది. నాటకాలు, పద్యనాటకాలు, వచన నాటకాలు అని విడదీసి చెప్పనక్కరలేదు. సంప్రదాయ నాటకం అంటే చాలు. నటులు పద్యాన్ని పాడనక్కరలేదు. బళ్లారి రాఘవ, యడవల్లి సంగీత ప్రధానమైన రామదాసు, సారంగధర పోటీపడి నటించారు. ఇద్దరూ దుర్యోధనులు వేశారు. రాఘవ యముడు వేస్తే యడవల్లి సత్యవంతుడు వేశారు.
హావభావాలతోపాటు పద్యాలు పాటగా చక్కగా అన్నారు.
అట్లాగే గోవిందరాజుల సుబ్బారావు, నెల్లూరు నగరాజారావు మొదలైనవారు పాడకపోయినా మహానటులైనవారు. స్థానం నరసింహారావు అలవోకగా పద్యాన్ని పాడి మహానటులై తనకుతానే సాటి అనిపించుకున్నారు.
స్త్రీ పాత్రలో 'మీరజాల గలడా' అనే పాట శ్రీకృష్ణతులా భారంలో వ్రాసి తాను సత్యభామగా పాడి నేటికీ అందరినోట పలికించారు.
బందా, సి.యస్‌.ఆర్‌.వైవిధ్యంగల నటనతో పాటు పద్యా లలో తెలుగునాటకాన్ని సుసంపన్నం చేశారు.
దైతా గోపాలం, జొన్నవిత్తుల శేషగిరిరావు, తుంగల చలపతి రావు, ఉప్పులూరి సంజీవరావు, కపిలవాయి రామనాథ శాస్త్రి, రఘురామయ్య అత్యుద్భుతంగా పాడి ప్రేక్షకులను రసాంబుధిలో ముంచెత్తారు.
దొమ్మేటి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, గురజ నాయుడు, మద్దాలి శేషగిరిరావు, మాధవపెద్ది వేంకట్రా మయ్య తమ నటనతో మాటతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధు లను చేశారు.
బలిజేపల్లి లక్ష్మీకాంతం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కాళ్లకూరి నారాయణరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం కొప్ప రపు సుబ్బారావు, ఆత్రేయ, కొర్రపాటి మొదలగు మహా రచయితలు నాటకాలు ఉత్తమస్థాయిలో రచించారు.
మైలవరం కంపెనీ, మోతేవారి కంపెనీ, ఇమ్మానేని వారి కంపెనీ, ఆంధ్ర ఆర్టిస్టు అసోసియేషన్‌, అరుణోదయా నాట్య మండలి కంపెనీవారు, ఆంధ్రనాటక కళా పరిషత్‌ నందినాట కోత్సవాలు, ఎన్నో గొప్ప నాటకాలు ప్రదర్శించటానికి కారణ భూతులయ్యాయి.
ఎన్ని ఉన్నా 'శ్రీకృష్ణ రాయబారం' పేరుతో తిరుపతి వెంకటకవులు పాండ వోద్యోగం, కాళ్లకూరి నారాయణరావు చింతా మణి, బలిజేపల్లి లక్ష్మీకాంతం 'హరిశ్చంద్ర' నేటికీ అఖండమైన ప్రాచుర్యాన్ని పొందు తున్నాయి.
జాతి, భాష కళవల్ల జీవిస్తుంది.
కళదేశ సౌభాగ్యం
Read More

om namah shivaya

Read More

ఇటువంటి వ్యక్తి ప్రధాన మంత్రి అయితే మన భారత దేశం తప్పకుండా అగ్రరాజ్యం అవుతుంది.

ఇటువంటి వ్యక్తి ప్రధాన మంత్రి అయితే మన భారత దేశం తప్పకుండా అగ్రరాజ్యం అవుతుంది. 


Read More

Tuesday, 30 July 2013

హిందువులలో ఉన్న అతిపెద్ద తప్పిదం ఏంటంటే?

హిందువులలో ఉన్న అతిపెద్ద తప్పిదం ఏంటంటే? నాకు నేనే గొప్ప అనుకోవడం, ఐకమత్యం లేకపోవడం, ఎవరికీ తోచింది వాళ్ళు చెప్పడం, సాటివారిని పట్టించుకోకపోవం! కష్టంలో ఉన్నప్పుడు తప్ప గుడి మెట్టు ఎక్కితే ఒట్టు! దేవుడు సుఖంలో గుర్తురాడు! అంత సాదించాను, ఇంత సాధించాను అని పార్టిలు చేసుకుంటారు కానీ గుడికివెళ్ళి కొబ్బరికాయ కొట్టిన పాపాన పోరు! ఏదైనా మంచి మాట చెప్తే వితండవాదం మొదలుపెడతారు కానీ అందులో ఉన్న మంచిని గాలికి వదిలేస్తున్నారు! వాడు మతం మార్చాడు, వీడు మతం మార్చాడు అని వాళ్ళ మీద పడుతున్నాం కానీ అసలు మనం ఎంతవరకు మన ధర్మాన్ని రక్షించగలుగుతున్నాం! ఆలోచిస్తున్నారా? ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి భారదేశాన్ని కించపరచడం, ఏదో దేశం వెళ్లి అక్కడ గొప్పలు, అక్కడి అలవాట్లు చెప్పుకొని వాటిని ఇక్కడి వారికీ అలవాటు చేస్తున్నారు.. మళ్ళి అక్కడి వారికీ మాత్రం మన భారతదేశం గురించి చెప్పమంటే నిందించడం ఎక్కువగా చేస్తున్నారు! మార్పు రావాలి, రావాలి అని కలవరించడం కాదు మీ నుంచి మార్పు తీసుకురండి!మిమ్మల్ని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు మారతారు! అంటే కానీ కలవరిస్తే మర్పురాదు!


Read More

Monday, 29 July 2013

వార్త :: ఎందుకని ప్రపంచంలో ఉన్న అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖ దేశాల ప్రముఖులు, దేశ అద్యక్షులు ఒక్క సారిగా ఉన్నట్టు ఉంది సమావేశం అయ్యారు ???. ఎప్పుడు అయ్యారు, ఎందుకు అయ్యారు, హిందూ మతానికి, ఈ సమావేశానికి ఉన్న సంబంధం ఏమిటి ???. భారత దేసానికి తెలియకుండా ఎందుకు ఈ సమావేశం కేవలం క్రైస్తవ (బ్రిటీష్) దేశాలు మాత్రమే ఎందుకు సమావేసము అయ్యాయి. ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం భారత దేశములో వేదాలలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఉంది అనటం పిచ్చితనమే.

 వార్త :: ఎందుకని  ప్రపంచంలో ఉన్న అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖ దేశాల ప్రముఖులు, దేశ అద్యక్షులు, వివిధ దేశముల అమ్బాసెడర్,ఒక్క సారిగా ఉన్నట్టు ఉంది సమావేశం అయ్యారు ???.  ఎప్పుడు అయ్యారు, ఎందుకు అయ్యారు, హిందూ మతానికి, ఈ సమావేశానికి ఉన్న సంబంధం ఏమిటి ???. భారత దేసానికి తెలియకుండా ఎందుకు ఈ సమావేశం కేవలం  క్రైస్తవ (బ్రిటీష్) దేశాలు మాత్రమే ఎందుకు సమావేసము అయ్యాయి. ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం భారత దేశములో వేదాలలో  ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు..
 
అతి ప్రమాదకరమైన లేసర్, బాంబులతో కలిగి ఉన్న విమానం, 5000  సంవచ్చారాల క్రితం వాడినది, ఒక గృహలో కనిపెట్టినారు .  ఆ విమానం పై  ప్రళయకారుడు   పరమశివుని ప్రతిమ. ఈ విమానంతో మొత్తం భూమిని కంట్రోల్ చేయవచ్చు. 8 మంది తో  కూడిన   "యు ఎస్ మిలిటరీ" విభాగం  కనిబెట్టింది, అమెరికాలో ఈవిమానం దొరికింది. దీనితో పాటు వేలకు, వేలు పేజీలున్న " వైమానిక శాస్త్ర " అనే పుస్తకం, అతి ప్రమాద కరమైన విమానాలు తయారు చేసే విధానాలు అన్ని వివరించి ఉన్నవి, ఆ పుస్తకములో.  ఇందనము అవసరము లేని విమానాలు, సూర్య శక్తీ కన్నా వేల రెట్లు శక్తీ కలిగిఉన్న  బాంబులు, ఆ విమానంలో ఉన్నవి. అయితే ఆ పుస్తకం అంత సంస్కృతములో ఉన్నది. అతి ప్రమాదకరమైన "  The most powerful Anti Gravity  " కి సంబంధించిన సూత్రాలు, ఇంతకూ ముందు ఎన్నడు కానీ విని ఎరుగని వైజ్ఞానిక శాస్తం. ఆ  వైజ్ఞానిక  శాస్త్రాన్ని  చూసి నోరు వేల్లబెట్టిన  యు ఎస్ మిలిటరీ  అధికారులు.  అక్కడ దొరికిన విమానం  ధ్వని వేగముకన్న 100,000.009 రెట్లు వేగముగా ఎగురకలదని అంచనాకి వచ్చిన అధికారులు.
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఉన్న  వీడియో లింక్ చూడండి. జాతీయ మీడియా కి చెందినా జర్నలిస్ట్  మరియు ఆ మీడియా ప్రతినిది మద్య సంభాషణ వినవచ్చు.   స్వార్ధ పరుల నుండి  మానను మనం కాపాడు కోవాలని   నిర్ణయం తీసుకున్న "వివిధ దేశముల అమ్బాసెడర్"  లు, అందుకే జాతీయ మీడియా కి తెలియకుండా, జాగర్త పడ్డారు, నిజాన్ని, నిప్పుని ఎక్కువకాలం దాచలేరు అందుకే ఒక జాతీయ మీడియా దీనిని కనిపెట్టింది.వారికి వచ్చిన "యు ఎస్ మిలటరీ అధికారి" నుండి వచ్చిన మెయిల్ ఆధారంగా ఆరాతీయటం మొదలు పెట్టిన జాతీయ మీడియా సంస్థ. భారత దేశ ప్రభుత్వానికి కనీసం ఇంత వరకూ తెలియకపోవటానికి కారణం, మన దేశములో ప్రజా పతినిదులుగా ఉన్న విదేశి నిఘా సంస్థల ప్రతినిధులు. పూర్తి  భారత దేశం విదేశాల గుప్పిటలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
see below link. 


 https://www.youtube.com/watch?v=ft_bcN8sfFA

Read More

ఈ మద్య కాలంలో స్వామి పరిపూర్ణానంద స్వామి వారితో TV 9 వారు ఎన్ కౌంటర్ కార్యక్రమం చేసారు దానిలో చర్చ

ఈ మద్య కాలంలో స్వామి పరిపూర్ణానంద స్వామి వారితో TV 9 వారు ఎన్ కౌంటర్ కార్యక్రమం చేసారు దానిలో చర్చ రథయాత్ర , అమ్మ ఒడి కార్యక్రమాల గురుంచి . ఆ సమయంలో ఒక క్రైస్తవ పాస్టర్ స్వామి వారితో పోన్ లో ఇలా ప్రశ్నించాడు. క్రైస్తవ మిషనరీలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయు మీ హైందవ సంస్థలు ఇలాంటివి చేయరు . మంచి పనులు చేస్తున్న మాపై బురద ఎందుకు చల్లుతున్నారు అని ఇంకా చాలా అన్నారు దానికి స్వామి వారు ఇలా సమాదానం చెప్పారు , "అసలు భారతదేశంలో ఇతర మతస్తులు అడుగు పెట్టనంత వరకు ఈ దేశంలో పిల్లలకు "తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా! విశ్వదాభిరామ వినురవేమ!" లేదా "తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన శ్రావణకుమారుని కథలు" ఇలాంటివి నేర్పేవారము ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అచార వ్యవహారాలు ,అతిది మర్యాదలు, అన్ని జంతువులను భగవత్ భావనతో చూడటం చేసేవారము. ఎప్పుడైతే ఈ దేశంలోకి విదేశి పైశాచిక మతాల ప్రవేశం జరిగిందో వారు అప్పటి నుంచి హైందవ ధర్మాన్ని నాశనం చేస్తూ వచ్చారు . మాలో మాకు గొడవలు పెట్టారు మతాల వారీగా మమ్మల్ని విడగొట్టారు. కుటుంబ వ్యవస్థను విలువలను పాడు చేసారు. అలా జరగడం వల్ల పిల్లలు తల్లి తండ్రులను గెంటేయడం , సమాజంలో ఎవరి స్వార్దం వారు చూసుకోవడం లాంటివి ప్రవేశించి మీరు సేవ చేయడానికి మనుషులు దొరుకుతున్నారు, కాని ప్రాచీన హైందవ దేశంలో నువ్వు సేవా చెద్దామన్నా నీకు మనిషి కనపడదు నీకే అందరు అతిది సత్కారం చేస్తారు అలాంటి వ్యవస్థను నాశనం చేసి ఏదో సేవ చేస్తున్నాము అని మీరు చెప్పడం ఒక మనిషిని చావబాదుతూ మళ్ళి మందు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. విలువలు లేని జీవితాలు జీవిస్తూ రోగం వచ్చాక మందు రాసుకునే వారు మీరు, రోగాలు లేకుండా జీవించే వాళ్లం మేము అని చాలా అద్బుతంగా అతనికి సమాదానం చెప్పారు మన స్వామి వారు.


Read More

ఆహారశుద్ధి నియమం:---

ఆహారశుద్ధి నియమం:---

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట.
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.
"జంతూనాం నరజన్మ దుర్లభం"--అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా-- చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా...

Read More

మధ్యచెవి సమస్యలు వినిపించుకోండి...!*

మధ్యచెవి సమస్యలు వినిపించుకోండి...!*
~~~~~~~~~~~~~~~~~~
పంచేంద్రియాల్లో కంటి తర్వాత అత్యంత ఉపయోగకరమైన అవయవం చెవే. కీలకమైన మన చెవులకు వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. జలుబు తర్వాత అత్యంత ఎక్కువగా కనిపించే సాధారణ సమస్యలు చెవితోనే ముడిపడి ఉంటాయి. అలాంటి చెవి గురించి, ముఖ్యంగా దానిలోనూ అత్యంత కీలకమైన మధ్య చెవి గురించి, దానికి వచ్చే అనేక సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.
చెవిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. అవి...
1. బయటిచెవి, 2. మధ్య చెవి, 3. లోపలి చెవి. బయటి చెవి అంటే చూడటానికి మనకు బయటకు కనిపించే భాగంతో పాటు చెవి రంధ్రం. బయటకు కనిపించే భాగాన్ని ఇంగ్లిష్‌లో పిన్నా అంటారు. ఇక మధ్య చెవిలో వినికిడి ప్రక్రియకు కీలకమైన కర్ణభేరి, ఎముకల గొలుసు, యూస్టేషియన్ ట్యూబ్ భాగాలుంటాయి. లోపలిచెవిలో కాక్లియా అనే వినికిడికి సంబంధించిన భాగంతో పాటు మనం నిటారుగా నిలబడటానికి వీలుకల్పించే నియంత్రణ భాగమైన వెస్టిబ్యులార్ వ్యవస్థ ఉంటాయి. ఇక్కడి నుంచి వినికిడితో పాటు మనం నిటారు(బ్యాలెన్స్‌డ్)గా ఉండటానికి వీలుకల్పించే నరాలు మెదడులోని సంబంధిత భాగాలకు అనుసంధానమై ఉంటాయి.

మధ్యచెవికి వచ్చే సమస్యలు
చెవి విషయంలో మిగతా వాటితో పోలిస్తే మధ్యచెవికి వచ్చే సమస్యలు కాస్తంత ఎక్కువ సాధారణంగా కనిపిస్తాయి. అందుకే వాటి గురించి అవగాహన పెంచుకుంటే మనకు నిత్యం కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే ఈ జ్ఞానేంద్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మధ్య చెవికి వచ్చే సమస్యలు ఈ కిందివిధంగా ఉంటాయి.
చెవిలోంచి చీము కారడం / చెవి ఇన్ఫెక్షన్.
చెవికి ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బ తగలడం (ట్రామా)
యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్
కొల స్టియోటోమా
ఓటోస్ల్కీరోసిస్

చెవిలో చీము కారడం/ చెవి ఇన్ఫెక్షన్
చాలామందిలో కనిపించే సాధారణసమస్య ఇది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో తరచూ చూసే సమస్య. అందుకే జలుబు తర్వాత అత్యంత సాధారణ సమస్యగా దీన్ని చెబుతుంటారు. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు అనేక కారణాలు ఉన్నాయి. జలుబు చేయడం, ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో జలుబు చేశాక చెవినొప్పి కూడా కనిపిస్తూ ఉండటం పరిపాటి. జలుబువల్ల వ్యాపించే వైరస్ లేదా బ్యాక్టీరియా ముక్కురంధ్రాల ద్వారా యూస్టేషియన్ ట్యూబ్ నుంచి ముక్కులోని మధ్యభాగానికి చేరుతుంది. గొంతుభాగంలో అటు ముక్కు రంధ్రాలు, చెవిరంధ్రాలు, చెవి నుంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ ట్యూబ్స్... అవన్నీ అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్లు చెవిలోకీ పాకుతాయి. అలాగే ముక్కుకు వచ్చే అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవినొప్పిని తెచ్చిపెడతాయి. ఇలా ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు అక్కడ చీము చేరుతుంది. ఒక్కోసారి చీము పెరిగి అది కర్ణభేరికి రంధ్రం చేసుకుని చీము బయటకు స్రవిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అది ఉన్న వ్యవధిని, కారణాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది.

చెవి ఇన్ఫెక్షన్లు ఇవి రెండు రకాలు...
అప్పటికి కనిపించే ఇన్ఫెక్షన్ (అక్యూట్ ఒటైటిస్ మీడియా)

దీర్ఘకాలికంగా కనిపించే ఇన్ఫెక్షన్ (క్రానిక్ ఒటైటిస్ మీడియా)

కొన్ని రకాల చెవి ఇన్ఫెక్షన్లలో చీము కారుతుంటుంది. మరికొన్ని రకాల్లో చీము స్రవించదు. క్రానిక్ ఇన్ఫెక్షన్‌లో చెవి రంధ్రం పెద్దదిగా అయి, కొన్నాళ్ల తర్వాత చీము కారడం తగ్గిపోతుంది. అయితే వీరిలో చెవినొప్పి వచ్చి, వినికిడి లోపం క్రమంగా పెరుగుతూ పోతుంది.

కారణాలు: అపరిశుభ్రమైన నీళ్లలో ఈదులాడటం, చెవిలో పుల్లలు పెట్టడం వంటివి కూడా చెవి ఇన్ఫెక్షన్‌కు కారణాలు.

చెవికి ప్రమాదవశాత్తూ తగిలే దెబ్బలు / చెవిలో బయటి వస్తువులు (ఫారిన్ బాడీస్)
చెవిలో పుల్లలు లేదా ఇతర వస్తువులను పెట్టి గువిలి తీయడం చాలామందికి అలవాటు. దీనితో కర్ణభేరికి / చెవి రంధ్రానికి గాయం అవుతుంది. అలాగే స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా పిన్నులు, పదునుగా ఉండే వస్తువులను చెవిలో ఇరికించుకుంటుంటారు.

పైన పేర్కొన్న ప్రమాదాలతో పాటు ఒక్కోసారి అకస్మాత్తుగా వినిపించే అత్యంత భారీ శబ్దాల వల్ల చెవి గాయపడుతుంది. దాంతోపాటు చెవిపై బలంగా దెబ్బ తగలడంవల్ల కూడా చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

కొలస్టియోటోమా: చెవిలో చీము కారుతూ, వినికిడి లోపాలతో బాధపడేవారిలో కొలస్టియోటోమా అనే కండిషన్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో చీము ఎక్కువగా కారడం, అది దుర్వాసనను వెలువరించడం, కర్ణభేరిపైన, వెనకభాగంలో లోపాలు ఏర్పడటం జరుగుతుంది. కొంతమందిలో నిటారుగా ఉండే బ్యాలెన్సింగ్ వ్యవస్థ కూడా దెబ్బతినవచ్చు. మరికొందరిలో ముఖంలో బలహీతన ఏర్పడవచ్చు. ఈ కొలస్టియోటోమా అన్న కండిషన్‌ను సరైన సమయంలో నిలువరించకపోతే అది చెవిలోని ఎముకలను పూర్తిగా దెబ్బతీస్తుంది.

యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్: మధ్య చెవి నుంచి ముక్కు రంధ్రాలను కలుపుతూ ఒక ట్యూబ్ ఉంటుంది. దీన్నే యూస్టేషియన్ ట్యూబ్ అంటారు. ఇది వాతావరణంలోని పీడనంతో మధ్య చెవిలోని గాలి పీడనం సమానంగా ఉండేలా సమన్వయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముక్కు రంధ్రాల నుంచి మధ్యచెవి భాగాలకు గాలి ప్రసరణ జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే ముక్కు దిబ్బడతో ముక్కు రంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయో అప్పుడు ఇన్ఫెక్షన్లు వెనక్కు పాకి మధ్య చెవికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు చెవి దిబ్బడ ఏర్పడటం, వినికిడి శక్తి తగ్గడం కూడా జరుగుతుంది. కొండలు ఎక్కినప్పుడు, గాలి ఒత్తిడి తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, విమాన ప్రయాణాలు చేసినప్పుడు చెవి దిబ్బడ ఏర్పడుతుంటుంది. అందుకే విమానాల్లో ప్రయాణం చేసే సమయంలో చ్యూయింగ్ గమ్ నమలడం ద్వారా యూస్టేషియన్ ట్యూబ్‌ను తెరచి ఉంచేలా చేసి మధ్య చెవిలోకి గాలి ప్రసరణ సరిగా ఉండేలా చేస్తుంటారు. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలికంగా ఉండటానికి, చీము కారడానికి యూస్టేషియన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్ దీర్ఘకాలికంగా ఉండటం కూడా ఒక కారణం.

ఓటోస్ల్క్లిరోసిస్: మధ్య చెవిలోని ఎముకల గొలుసును, కర్ణభేరిని... లోపలి చెవిలో ఉండే కాక్లియా అన్న భాగం కలుపుతుంది. ఇది శబ్దాన్ని మధ్యచెవి ద్వారా లోపలికి పంపుతుంది. కొన్నిసార్లు మధ్య చెవిలోని ఎముకల గొలుసులో చివరిదైన స్టేపిస్ అనే ఎముక చుట్టూ స్పాంజీ వంటి ఎముక భాగం పెరగడం వల్ల శబ్దమంతా మధ్యచెవిలోంచి, లోపలి చెవిలోకి వెళ్లదు. దాంతో వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి కండిషన్‌ను ఓటోిస్ల్క్లిరోసిస్ అంటారు. ఇలాంటి వారిలో సమస్య తీవ్రతను బట్టి వినికిడి లోపంతో పాటు, చెవిలో శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కళ్లు తిరగడం వంటి లక్షణాలూ ఉంటాయి.

మధ్య చెవి సమస్యలను గుర్తించడం ఎలా?
చెవినొప్పి
చెవిలోంచి చీము కారడం
చెవి దిబ్బడ
చెవిలో శబ్దం రావడం
వినికిడి తగ్గినట్లు ఉండటం (నిజంగానే తగ్గడం)
కొన్నిసార్లు జ్వరం... ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చెవి, ముక్కు, గొంతు నిపుణులను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోవాలి.

పరీక్షలు: చెవి సమస్యలను గుర్తించడానికి ఈఎన్‌టీ వైద్యులు, ఆడియాలజిస్టులు ఓటోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిద్వారా చెవి రంధ్రం ఎలా ఉంది, కర్ణభేరికి ఏదైనా రంధ్రం పడిందా, చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉందా, వ్యాక్స్ ఉందా వంటి అనేక అంశాలను తెలుసుకుంటారు. దీనితో పాటు వినికిడి పరీక్షల ద్వారా కూడా చెవి మధ్య భాగంలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోవచ్చు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి కొన్ని రక్తపరీక్షలు, సీటీస్కాన్ వంటి ఇతర పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

నివారణ / చికిత్స: చెవి సమస్యలను నివారించడానికి చెవిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనికోసం గువిలి తీయాల్సిన అవసరం లేదు. అయితే స్నానం చేసిన వెంటనే చెవి పరిసరాలను పొడి వస్త్రంతో తుడుచుకుంటే చాలు. ఇక కలుషితమైన నీటిలో ఈదులాడటం సరికాదు. చెవిలో నూనెపోయడం వంటివి ఇన్ఫెక్షన్‌ను మరింత పెంచుతాయని గుర్తుంచుకోవాలి. చెవికి సంబంధించిన సమస్య ఏదైనా అది తొలిదశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే యాంటీబయాటిక్స్ లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల ద్వారా వాటిని తగ్గించవచ్చు. దీర్ఘకాలంగా సమస్య ఉంటే తీవ్రతను బట్టి చిన్న శస్త్రచికిత్సతో దీనికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఒటైటిస్ మీడియా క్లిష్ట దశలో ఉంటే టింపనోప్లాస్టీ, మాస్టాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ద్వారా లోపలి ఇన్ఫెక్షన్‌ను శుభ్రం చేసి కర్ణభేరికి ఉన్న రంధ్రాన్ని పూడ్చటం వీలవుతుంది. అలాగే కాలెస్టియోస్టోమా అనే శస్త్రచికిత్స కూడా వీలవుతుంది. ఇక ఓటోస్క్లిరోసిస్‌లో పెరిగిన స్పాంజ్ ఎముకను తొలగించడానికి స్టేపిడెక్టమీ అనే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇలా సమస్యకు గల కారణాన్ని బట్టి, తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా జలుబు రాకుండా, సైనస్ సమస్య లేకుండా, ముక్కు సమస్యలు కూడా లేకుండా చూసుకుంటే చెవికి సంబంధించిన సమస్యలు చాలావరకు నివారించవచ్చు.
Read More

ఏడు కొండల వాడా వేంకటరమన గొవింద గోవింద

ఏడు కొండల వాడా వేంకటరమన గొవింద గోవింద
పూర్వ జన్మలొ ఏ పుణ్యం చెసుకున్నాడొ ఏమొ ఈ జన్మలొ ఈ వయసులొ తిరుపతి మెట్లు ఎక్కుతున్నడు

శ్రీనివాస కృపాకటా సిద్ధిరస్థు


Read More

వేదభూమి

"వేదభూమి ఐన భారతదేశములో ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రభోధించే మత(ధర్మ)పరమైన సిద్ధాంతాలే కాదు శాస్త్ర విజ్ఞానము నిరూపించిన అంశాలు కూడా ఉన్నాయి.విద్యుత్తు,radium,electronics,గాలిపడవల నిర్మాణము వేద ఋషులకు తెలుసు----ఎల్లా వీలర్ విల్కాక్స్(1850-1919)".
భారతీయుల విజ్ఞానము గురించి అక్కడి పరిశోధకుల(అనువాదకుల)కే కాకుండా మిగిలిన చాలామందికి తెలుసనేదానికి ఇది ఒక ఉదాహరణ.విద్యుత్తూ రంగములో గొప్ప శాస్త్రవేత్తలుగా పేరుగాంచిన tesla(1856-1943),edison(1847-1931) వారు కూడా అదే కాలానికి చెందిన వారవ్వడమూ,ఈవిడ అదే కాలములో ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడము,ఈ పరిశోధకులకు(అనువాదకులకు) భారతీయ గ్రందాలతో పరిచేయము ఉండడము లాంటివి నేటి ఈ సాంకేతికత అంతా మన గ్రంధాలనుండి కనుగొన్నదే అనేదానికి సాక్ష్యాలు.
20 శతాబ్దము మొదటి నుండి విస్తృతముగా వాడుకోలుకి వచ్చి అభివృద్ధి చెందిన,నేటి computer,television...లాంటి ఎన్నో వస్తువాలకు ఆధారమైన electronics గురించి ఆవిడ అంతకు ముందే చెప్పడము గమనిస్తే వీటి పుట్టుక,నిర్మాణము కూడా మన గ్రంధాల నుండే జరిగింది అని అనుకోవచ్చేమో.
Read More

గ్రామానికి ఆలయాలు ఏ దిశలో నిర్మించాలి?

గ్రామానికి ఆలయాలు ఏ దిశలో నిర్మించాలి?

సాధారణంగా గ్రామంలో ఆలయాలను ఎక్కడ పడితే అక్కడ నిర్మించకూడదు. ఒక ఆలయాన్ని నిర్మించలదలిస్తే.. ఖచ్చితంగా ముందుగా నిపుణులైన వాస్తు పండితుల అభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలాగే, ఆలయానికి స్థల నిర్ధారణ కూడా చాలా ముఖ్యం.

ఊరి మధ్యన కూడా ఆలయాలను నిర్మించిన ప్రాంతాలెన్నో ఉన్నప్పటికీ.. నదీ ప్రవాహాలకు దగ్గర, పర్వతాలపైన, యోగులు నివసించే ప్రాంతాలలో, జన సమర్థ గల ప్రదేశాలలో, జలపాతాల దగ్గర, చెరువుల దగ్గర ఇలా అనువైన ప్రదేశాలలో ఆలయాలను నిర్మిస్తే మంచిది. ప్రత్యేకంగా ఊరిని తీసుకున్నప్పుడు స్థలం ఏర్పాటు చేశాక దానిచుట్టూ నలువైపుల రోడ్లు ఏర్పాటు చేయాలి. వాటినే తిరు మాడ వీధులు అంటారు. అప్పుడు ఆ వీధులకు పై భాగంలో ఇండ్లు కట్టుకుంటే దోషం ఉండదు.

అలాగే, ఆలయాల ఎత్తు కూడా ఎంతో ప్రశస్తమైంది. కాబట్టి, శిఖరాలు లేకుండా, ధ్వజ స్తంభాలు లేకుండా ఆలయాల ప్రాధాన్నాన్ని కోల్పోకుండా వాటి పవిత్రతను కాపాడేలా ప్రాకారాలతో పాటుగా చుట్టూ వీధులు అవసరం. మాడా వీధులు లేకుండా నిర్మించే ఆలయాలకు దక్షిణంలో, పడమరలో గృహాలు ప్రాకారానికి దూరంగా కట్టుకోవలసి వస్తుంది. అది వారి స్వంత స్థలమైనా కొంత వదులు కుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Read More

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి...ఫలితం ఏంటి?

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి...ఫలితం ఏంటి?

నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క దేవునికి మొక్కుకుంటూ ఉంటారు. ఇలా ఏడు రోజులపాటు పూజలు చేస్తే శివుని కరుణాకటాక్షాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. ఆ పూజా విధానాన్ని అనుసరించి.....

ఆదివారం : సూర్య భగవానుని పూజించాలి. ఆదివారం నాడు సూర్యుని ఆరాధించడం వల్ల తలనొప్పులు, కంటిజబ్బులు నయమవుతాయి. కుష్ఠురోగం తగ్గుముఖం పడుతుంది.

సోమవారం : లక్ష్మీదేవిని పూజిస్తే సంపదవృద్ధి జరుగుతుంది.

మంగళవారం : కాళికామాతను పూజిస్తే రోగాల నుండి బయటపడవచ్చు.

బుధవారం : విష్ణుపూజ చేయాలి. ఈ రోజున విష్ణుపూజ చేయడం వలన బంధుమిత్రులకు మంచి జరుగుతుంది.

గురువారం : ఇష్టదేవతను పూజించాలి. ఈ రోజున తమ ఇష్టదేవతలను పూజించుకున్న వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది.

శుక్రవారం : ఈ రోజున ఇష్టదేవతాపూజ చేయడంవలన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యసిద్ధి.

శనివారం : ఈ రోజున రుద్రాదిదేవతలను పూజించుకున్నవారికి ప్రమాదాలనుంచి రక్షణతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఈ విధంగా ఆయా వారాలలో ఆయా దేవతల పూజలను చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.Read More

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలి....?

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలి....?

1. తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము.

2. తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము.

3. తూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది.

4. ఇదే విధముగా దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది.

5. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ నిర్మాణం చేసుకొంటె మంచిది.

6. తులసికోట గృహమునకుగాని ప్రహారీగోడలకుగాని అంటకుండునట్లు నిర్మించుకోవాలి.


Read More

ఆలయప్రవేశం ముందు ఏం చేయాలి....?

ఆలయప్రవేశం ముందు ఏం చేయాలి....?

దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, నీళ్ళను మూడుసార్లు పుక్కిళించి వదలాలి. అనంతరం, తలపై నీళ్ళు చల్లుకోవాలి. అలా నీటిని తలపై చల్లుకుంటున్నప్పుడు,

అపవిత్రః పవిత్రోవా, సర్వావస్థాం గత్నోపివా
యః స్మరేత్పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతర శుచిః

అనే మంత్రాన్ని విధిగా పఠించాలి. ప్రాతర్విష్ణంసాయేశివమ్ అని మన పెద్దలు చెప్పారు. అంటే, ఉదయం స్థితికారకుడైన విష్ణు ఆలయాలను, సాయంత్రం లయకారకుడైన శివ ఆలయాలను దర్శించుకోవాలి. విష్ణ్వాలయదర్శనం వల్ల ధన ప్రాప్తి. శివాలయ దర్శనం వల్ల ఆరోగ్య ప్రాప్తి.Read More

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.
Read More

సంఘ్‌కు కుల వివక్ష లేదు

సంఘ్‌కు కుల వివక్ష లేదు

కులాల ప్రాతిపదికన వివక్ష చూపే విధానం సంఘ్ పరివార్‌కు లేదని, అదే దళిత ఓటర్ల మనసు గెలుచుకునేందుకు తమ పార్టీకి దోహదపడిందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ వ్యాఖ్యానించారు.
''.. కులాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అంగీకరించలేదు. సమాజంలోని అన్ని వర్గాలూ సమానమని భావించింది. వార్థాలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి మహాత్మ గాంధీ వచ్చినప్పుడు వివిధ కులాల ప్రజలు ఏకపంక్తి భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయారు... కులాల మధ్య వేధింపులు, అత్యాచారాల కారణంగానే మత మార్పిళ్లు చోటు చేసుకున్నాయి..'' అని అద్వాని వ్యాఖ్యానించారు.
Read More

Sunday, 28 July 2013

కాంగ్రెస్స్, కి భారతీయ జనతా పార్టీ కి, ఉన్న తేడా ఏమిటి ??

కాంగ్రెస్స్, కి భారతీయ జనతా పార్టీ కి, ఉన్న  తేడా ఏమిటి  ??


https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn2/971232_541360579255968_239796293_n.jpg
Read More

దక్షిణ ఆఫ్రిక ఖండంలో ఉండే ఐవరీ కోస్ట్ దేశం కరెన్సీ నాణేం పై వినాయకుడి బొమ్మ ముద్రించి "వినాయకచవితి" రోజు విడుదల చేయబోతుంది.

దక్షిణ ఆఫ్రిక ఖండంలో ఉండే ఐవరీ కోస్ట్ దేశం కరెన్సీ నాణేం పై వినాయకుడి బొమ్మ ముద్రించి "వినాయకచవితి" రోజు విడుదల చేయబోతుంది. నాణేలపై "వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా" అనే శ్లోకాన్ని కూడా ముద్రించారు. ఐవరీ కోస్ట్ దేశంలో అధిక శాతం ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. అయినా ఆ దేశం నాణేం పై వినాయకుడి బొమ్మ ముద్రించడం విశేషం !


Read More

మహాబలేశ్వర్ దేవాలయం, గోకర్ణం తప్పక చూడండి

మహాబలేశ్వర్ దేవాలయం, గోకర్ణం
తప్పక చూడండి

ఉత్తర కన్నడ జిల్లాలో మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఒక శివుడి ఆత్మలింగం ఉండటంచే అది భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. మహాబలేశ్వర్ దర్శించుకునే భక్తులు, అరేబియా సముద్రంలో తప్పక స్నానం చేస్తారు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఉంది. దేవాలయం తెల్లటి గ్రానైట్ రాళ్ళతో నిర్మాణం చేశారు.దేవాలయాన్ని చేరిన వెంటనే భక్తులు శివలింగం సాలిగ్రామ పీఠంపై మధ్యలో ఉండటాన్ని గుర్తిస్తారు. అక్కడ కల ఒక రంధ్రం శివలింగం పై భాగం చూసేందుకు సౌకర్యం కలిగిస్తుంది. ఈ శివలింగమే కాక దేవాలయంలో సుమారు 1500 సంవత్సరాల క్రిందటి శివుడి రూపం కూడా ఉంది. హిందువులు తమ పూర్వీకుల కర్మలు చేసేందుకు కూడా ఈ దేవాలయానికి వస్తారు. లింగాన్ని దర్శించుకుంటే చాలు ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తారు. మహాబలేశ్వర దేవాలయం శివరాత్రి సందర్భంగా వందలాది భక్తులతో నిండి ఉంటుంది.
మహాబలేశ్వర్ దేవాలయం, గోకర్ణం
తప్పక చూడండి

ఉత్తర కన్నడ జిల్లాలో మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఒక శివుడి ఆత్మలింగం ఉండటంచే అది భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. మహాబలేశ్వర్ దర్శించుకునే భక్తులు, అరేబియా సముద్రంలో తప్పక స్నానం చేస్తారు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఉంది. దేవాలయం తెల్లటి గ్రానైట్ రాళ్ళతో నిర్మాణం చేశారు.దేవాలయాన్ని చేరిన వెంటనే భక్తులు శివలింగం సాలిగ్రామ పీఠంపై మధ్యలో ఉండటాన్ని గుర్తిస్తారు. అక్కడ కల ఒక రంధ్రం శివలింగం పై భాగం చూసేందుకు సౌకర్యం కలిగిస్తుంది. ఈ శివలింగమే కాక దేవాలయంలో సుమారు 1500 సంవత్సరాల క్రిందటి శివుడి రూపం కూడా ఉంది. హిందువులు తమ పూర్వీకుల కర్మలు చేసేందుకు కూడా ఈ దేవాలయానికి వస్తారు. లింగాన్ని దర్శించుకుంటే చాలు ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తారు. మహాబలేశ్వర దేవాలయం శివరాత్రి సందర్భంగా వందలాది భక్తులతో నిండి ఉంటుంది.
Read More

వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?

వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?

వినాయకచవితినాడు అనేక పత్రాలనూ, పూలనూ తీసుకువచ్చి పూజిస్తాము. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణము…..
ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు.
Read More

మీ నక్షత్రం ఏం చెపుతోంది...?

మీ నక్షత్రం ఏం చెపుతోంది...?

నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయి :-

నక్షత్రాల సంఖ్య 27. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి. ఈ నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయంటున్నారు జ్యోతిష్యులు.

1** అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

2** భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతుంటారు, కాబట్టి ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు.

3** కృత్తిక : కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు.

4** రోహిణి : రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతవదనంతో, కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు.

5** మృగశిర : ఈ జాతకులు భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నాకూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు.

6** ఆరుద్ర : ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా, కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని, ఎవ్వరినికూడా విరు నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు.

7** పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం.

8** ఆశ్లేష : ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు.

9** మఖ : ఈ జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు.

10** పూర్వాభాద్ర : వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. రతిక్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులుకు.

11** ఉత్తరాభాద్ర : ఇతరులతో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు.

12** హస్త : హస్త నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు శుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు.

13** చిత్త : చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త ఫ్యాషన్‌లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు.

14** స్వాతి : ఈ జాతకులు అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.

15** విశాఖ : వీరు స్వార్థపరులుగాను, జగమొండిగా వ్యవహరిస్తారు. తాము అనుకునింది చేయాలని ఈ జాతకులు భావిస్తుంటారు. ఏదో ఒక విధంగా తమదే పై చేయిలా అనిపించుకుంటుంటారు.

16** అనూరాధ : ఈ జాతకులకు తమ కుటుంబమంటే అమితమైన ప్రేమ. వీరికి శృంగారంమంటే చాలా ఇష్టం. మృదుస్వభావి, అలంకార ప్రియులుగాకూడా ఉంటారంటున్నారు జ్యోతిష్యులు.

17** జ్యేష్ఠ : జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగానూ, ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. కాని వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి దిగుతుంటారు.

18** మూల : ఈ జాతకుల ప్రారంభపు జీవితం కష్టతరంగాను, కుటుంబంనుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు.

19** పూర్వాషాఢ : పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంతస్వభావులుగా ఉంటారు.

20** ఉత్తరాషాఢ : ఈ జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిదని జ్యోతిష్యులు చెపుతున్నారు.

21** శ్రవణం : వీరు సన్మార్గులై, పరోపకారిగాను ఉంటారు.

22** ధనిష్ట : ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా వుంటుంది. కోపం వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారని జ్యోతిష్యులు అంటున్నారు.

23** శతభిష : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతిక్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు వ్యసనపరులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. వీరి సమయానుసారం వ్యవహరించరు. ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తుంటారు.

24** పుష్యమి : పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. వీరు బుద్ధిమంతులుగాను, ఇతరులకు దానం చేసే స్వభావులై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

25** పూర్వాభాద్ర : ఈ జాతకులు బుద్ధిమంతులై, పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగినవారిగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు.

26** ఉత్తరాభాద్ర : ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగినవారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది.

27** రేవతి : రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తుంటారు. వివేకవంతులుగాను ఉంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు.
Read More

శివుని పేర్లు...!

శివుని పేర్లు...!

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి.
Read More

నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?

నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?

దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు ఐన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా బొట్టు పెట్టుకొంటారు. ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర, తరువాత, లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక బొట్టు పెట్టుకుంటారు. చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్లా వేళలా నుదుట కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది. వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు. మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా బొట్టు / తిలకం ధారణ జరుపుతాము. తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది.

నుదిటి పైన బొట్టు ఎందుకు?

నుదుటి పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది. దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. మునుపటి కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు. క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు. వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు. శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు. విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు. భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము. యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది. నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది. మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది. అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది. మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు. భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది. మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
Read More

గోరుపై తెల్లచుక్క ఎందుకు?

గోరుపై తెల్లచుక్క ఎందుకు?

మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలియజేప్పే సంకేతాల్లో గోళ్లు ఒకటి. గులాబి రంగులో మెరిసిపోయే గోళ్లు మనం ఆరోగ్యంగా ఉన్నామని చెబుతాయి. శరీరంలో రక్తం, రక్తసరఫరా సమృద్ధిగా ఉందని ఈ గోళ్లు సూచిస్తాయి. ఇలాంటి గోరుపై ప్రత్యక్షమయ్యే తెల్లని గీతలు, చుక్కలు దేనికి సూచనో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటాం. శరీరంలో పోషకాలు తక్కువైతే ముఖ్యంగా కాల్షియం, జింక్ లాంటి సూక్ష్మపోషకాలు తగిన మోతాదులో లేకుంటే ఇలాంటి చుక్కలు కనిపిస్తాయని అనుకుంటాం. చాలామంది ఒకసారి డాక్టర్‌ని కలవాల్సి వస్తుందేమోనని కూడా సలహా ఇస్తుంటారు. నిజానికి ఈ విషయంలో డాక్టర్‌ను కలవాల్సినంత భయపడే అంశం ఏమీ లేదు. వైద్య పరిభాషలో ఇలా ఏర్పడే చుక్కల్ని పంక్చేట్ ల్యుకోనికియాగా వ్యవహరిస్తారు. పేరు సంక్లిష్టంగా ఉంది గానీ దీనికి కారణం మాత్రం చాలా చిన్నదే. చర్మంపై ఏదైనా గాయం అంటే కోసుకుపోవడమో, గీరుకుపోవడమో జరిగితే కొద్ది రోజుల తరువాత అంతమేరా గీత లాగా ఏర్పడడం గమనిస్తాం.

అదేవిధంగా గోళ్ల విషయంలో కూడా జరుగుతుంది. ఏ గోడకు కొట్టుకునో, మరేదన్నా గీరుకునో.. ఏదో ఒకరకంగా గోరుకు గాయం అయిన సందర్భంలో కొద్దిరోజుల తరువాత ఇలాంటి గీతలు, చుక్కలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అలర్జీలు, చిన్న చిన్న ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటివి రావచ్చు. ముఖ్యంగా గోళ్లరంగు, నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటివి వాడినప్పుడు గోరు ఉత్పత్తి చేసే పదార్థాలు ఈ చుక్కలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. కొన్ని రకాల మందులు పడకపోయినా తెల్లచుక్కలు కనిపిస్తాయి. ఈ తెల్లచుక్కలు సాధారణంగా 8 వారాల్లో కనుమరుగవుతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులుంటే మాత్రం సమస్యే. ఇవి ఒకవూటెండు గోళ్లపై కనిపిస్తే సమస్య లేదు. కానీ అన్ని గోళ్లపై కనిపిస్తే మాత్రం డాక్టర్‌ను కలవాల్సిందే. డయాబెటిస్, రక్తహీనత, సిర్రోసిస్, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలున్నప్పుడు ఇలాంటివి అన్ని గోళ్లపై కనిపించే అవకాశం ఉంటుంది. కాల్షియం తక్కువ కావడం వల్ల ఇవి ఏర్పడతాయన్నది మాత్రం అపోహే. హోర్మోన్‌లలో తేడాల వల్ల జింక్ లోపం మాత్రం ఇందుకు కారణం కావచ్చు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, డీహైవూడేషన్ వల్ల కూడా తెల్లచుక్కలు ఏర్పడతాయి. తెల్లచుక్కలేర్పడకుండా ఉండాలంటే టాలిన్, ఫార్మాల్డిహైడ్ ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్ వాడకూడదు. కృత్రిమ గోళ్లను పెట్టుకోవద్దు. ఒకవేళ మందుల వల్ల ఇవి వస్తున్నాయన్న అనుమానం కలిగితే డాక్టర్ సూచన తీసుకోవాలి. జింక్ ఎక్కువగా ఉండే బఠాని, గుమ్మడి, ఆకుకూరల్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆహారంలో విటమిన్లు, ఇతర పోషకాలు తక్కువ కాకుండా చూసుకోవాలి.
Read More

ఆర్యులు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు.

ఆర్యులు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు.
అన్నమధికమైన అరయ మృత్యువు నిజము

అన్నమంటకున్న ఆత్మనొచ్చు

చంప బెంప బువ్వ చాలదా వేయేల

విశ్వధాభిరామ వినుర వేమా!

అన్నాడు యోగి వేమన. అన్నానికున్న ప్రాధాన్యతని వేదాలు కూడా వక్కాణించారుు. అన్న సూక్తాన్ని పఠించడం కూడా అన్నం మీద మన భక్తి భావాన్ని నిలుపుకోవడమే. అందుేక ఆర్యులు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నమే జీవిని బతికిస్తుంది. అన్నమే పోషిస్తుంది. అన్నమే ఆరోగ్యా న్నిచ్చి కాపాడుతుంటుంది. అన్నమే మనుగడకి ఆలంబనగా ఉంటుంది. అలాగని మితిమీరి భుజిస్తే ప్రాణం తీస్తుంది. అన్నం తిననిరోజు నీరసించి, ఆత్మ అసంతృప్తికి లోనవుతుంది. చంపినా, పోషించినా సర్వులకూ అన్నమే ప్రదానం. ‘సహనా వవతు-సహనౌ భునక్తు-సహ వీర్యం కరవావహైః- తేజస్వినామదీతమస్తు మా విద్విషావహైః ఓం శాంతిః శాంతిః శాంతిః’ ఇదే అన్న సూక్తం.

తేజస్సుని, వీర్యాన్ని కూడా కలగజేస్తుంది. సకలజీవరాసులకూ అన్న ప్రదాత ఆ సూర్యభగవానుడు. గ్రహా ధిపతి అయిన సూర్యుని కరుణ వలన బుతువులు సక్రమంగా ఉండి, వర్షాలు పడి పంటలు పండి అంద రూ సుఖజీవనం సాగిస్తున్నారంటే అందుకు కర్త ఆ ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడే. సూర్యరస్మి లేనిదే ఏ మొక్కా మొలకెత్తదు. అలాగే వరి ధాన్యాలు కూడా అంకు రించవు. ప్రత్యక్షంగా సూర్యుని ప్రభావంతో మనకి జీవనాధారం అయిన అన్నాన్ని భక్తి శ్రద్ధలతో భుజిస్తేనే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మనం చేస్తున్నదేమిటీ..? తిన్నంత తిని, మిగిలింది పెంటకు ప్పలపాలు చేస్తున్నాం. అసలు అన్ని దానాల్లోకీ అన్నదానం గొప్పదని పెద్దల వాక్కు. అది కూడా ఈ రోజుల్లో మనం చేయలేకపోతున్నాం. పూర్వం అన్ని లోగిళ్ళలోను నిత్యం ఇంటిల్లిపాదికీ వండే టప్పుడు ఒక గుపెడు బియ్యం ఎక్కువ పొయ్యిమనేవారు.

ఎందుకంటే, అతిధి, అభ్యాగతుల కోసం, అన్నార్తులెవరైనా వస్తే పెట్టాలనే ఉద్దేశ్యంతోను అలా చేసేవారు. మనకి అన్నదానాలు చేసే గొప్ప మనసూ లేదు, అన్నాన్ని బ్రహ్మ స్వరూపంగా భావించే గుణమూ లేదు. అందుకే ఒకనాటి కాలంలో లేని అనేక రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అన్నం తినకుండా ఇతర పదార్థాలతో కడుపు నింపుకున్నా జవసత్వాలు క్రమేపీ క్షీణించడం మనలోనే చూస్తూవుంటాం.అలాగే అన్నం ముట్టని వారికి మనస్సు కూడా స్వాధీనం తప్పి విపరీత ఆలోచనలతో ఎప్పుడు అస్తిమితంగా ఉంటారు. అన్నం తినడం అనేది కూడా ఒక యోగమే. ఎంతో డబ్బువ్యామోహంతో అనేక రకాల పనులుచేసి అక్రమం గా కోట్లు కూడబెట్టినవాడికి అన్నం తినే యోగం లేకుండా అజీర్తివ్యాధో, అంతకన్నా భయంకరమైన దీర్ఘవ్యాధో పట్టుకుని జీవితాంతం అవస్తపడుతూంటాడు.

చక్కెర వ్యాధిగ్రస్తులకి వైద్యులు కూడా అన్నం మాని రొట్టెలు తినమంటారు. ఇది ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి!. ఇటువంటివి కర్మానుగుణంగా సంక్రమిస్తాయి. అందుకే మనకి అన్నీ బాగున్నప్పుడే, అతిధి, అభ్యాగతుల్ని, బంధువర్గాన్నీ, అన్నార్తుల్ని, గృహస్తుని, పెద్దవారిని, గురువుల్ని, భాగవతోత్తముల్ని, పండితుల్ని ఆదరిస్తూ వారికి తృప్తిగా అన్నం వడ్డించి భోజన సదుపాయం చేస్తూవుంటే, పెట్టింది ఎక్కడికీ పోదు. రెండింతలై తిరిగి వస్తుంది. అలా పెట్టిన వారికి అన్న యోగ్యం కలుగుతుంది. అందుకే ‘పెట్టినమ్మకి పెట్టినంత’ అనే సామెత పుట్టుకొచ్చింది. నలుగురికి పంచింది నాలుగింతలవుతుందన్నది కూడా దీనికి పర్యాయమే.

భోజన విధానం

అన్నాన్ని భుజించేటప్పుడు కూడా పద్దతి పాటించాలి. శుభ్రంగా అలికిన నేల మీద కంచంలోగానీ, అంత కన్నా శ్రేష్టమైన అరటి ఆకులో గానీ అన్నం, శాకాలు వడ్డించుకుని పీటలు వేసుకుని ఇంటిల్లిపాదీ కింద కూర్చుని భుజించడం చాలా ఉత్తమం. అందువల్ల వండిన పదార్ధాలు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అయ్యాయేమో అనే శంక లేకుండా ఉన్నదానినే అందరూ సర్దుకునే అలవాటు అవుతుంది. భుజించే ముందు అందరూ అన్నానికి నమస్కరిస్తూ దానిని మనకి ప్రసాదించిన దేవుని దివ్యప్రసాదంగా భావించి, కళ్ళ కద్దుకుని తినడం ప్రారంభించాలి. సోఫాల్లోను, కుర్చీలోను కూర్చుని భుజించడం నిషిద్ధం.వీలైతే అన్న సూక్తం పటించడం మరీ మంచిది. అన్నం భుజించేటప్పుడు మనం అన్నం మీదే దృష్టి నిలిపి తింటే అది వంటపడుతుంది. అన్నానికి ఉన్న మరో శక్తి ఏమిటంటే, అన్నం తినే సమయంలో మన భావాలు ఏవి ఉంటాయో, శారీరకంగా అందుకు తగిన ఫలితాలే తిన్న అన్నం వలన కలుగుతాయి.

అందుకే టీవీలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు మాట్లాడుకుంటూ తింటే నెగెటివ్‌ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. అలాకాకుండా భగద్భక్తితో, మనసులోకి ఎటువంటి ఆలోచనల్నీ రానీయకుండా, పద్దతిని పాటిస్తూ భుజిస్తే పాజిటివ్‌ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి చేసే అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఎవరైనా భోజనం చేసి వెళ్ళమని ఒకటికి రెండు సార్లు అడిగితే తిరస్కరించకూడదు. వండి వడ్డించిన వారిని లోపాలు ఎంచకూడదు. మనకు దంత సిరి ఉంటే వండిన పదార్ధాలు రుచికరంగానే ఉంటాయి. అది లేకపోతే ఆరోజుకి కనీసం అన్నం తినే ప్రాప్తం కలిగిందని సంతో షించాలి తప్ప అదిబాగాలేరు, ఇదిబాగాలేదు అంటూ తినేటప్పుడు విమర్శించకూడదు. ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉంటే, ముందుగా వారికి భోజనం పెట్టాలి.

అందువల్ల ఆకలితో వేచివున్న వారి ఆత్మ శాంతిస్తుంది. అందుకే చాలామంది ఇప్పటికీ కడుపునిండా భోజనంచేసి, ‘హమ్మయ్య! ఆత్మారాముడు శాంతించాడు’ అంటూవుంటారు. భర్త భుజించిన తరువాతే, భార్య భుజించడం ఉత్తమ సంప్రదాయం. అది వీలుపడనివారు ఇద్దరూ కలిసి భుజించడం మధ్యమం. ముందు ఇల్లాలు తినడం అథమం. ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి, ఇంటిల్లిపాదికీ ఆయురా రోగ్యాలకి ఎటువంటిలోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా, సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురి పిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తికోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం..నలుగురిని ఆదరిద్దాం...తృప్తిగా జీవిద్దాం.
Read More

Saturday, 27 July 2013

అల్ప సంఖ్యాక హిందువులకు ఏదీ రక్షణ

అల్ప సంఖ్యాక హిందువులకు ఏదీ రక్షణ

భారతదేశంలో అల్పసంఖ్యాకులు పలువిధాలు. మనదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు కావచ్చు. కానీ కొన్ని రాష్ట్రాలలో వారు అల్ప సంఖ్యాకులన్న సంగతి పాలకులకు గుర్తురావడంలేదు. అయితే మిగిలిన చోట్ల అల్పసంఖ్యాక వర్గాలకు మైనారిటీ కమిషన్లు ఉన్నట్టు, హిందువులు అల్ప సంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాలలో మైనారిటీ కమిషన్లు ఉన్నాయా? మైనారిటీలుగా హిందువులు ఉన్న రాష్ట్రాలలో వారు తమ సాధకబాధకాలను ఎవరికి చెప్పుకోవాలి? కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వంటి చోట్ల హిందువుల గోడువినే మైనారిటీ కమిషన్లు ఏర్పాటు చేయడం అవసరం. ముఖ్యంగా కాశ్మీర్‌లో దీనిని అత్యవసరంగా ఏర్పాటు చేయాలి. అక్కడ అమర్‌నాథ్ యాత్రికులు పడుతున్న ఇక్కట్లను గమనించాలి. మైనారిటీలు ఎవరైనా ఆయా ప్రదేశాలను బట్టి ప్రభుత్వం వారి పురోభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

సాయిరామానంద స్వామి
పొదలకొండపల్లి, ప్రకాశం జిల్లా.
Read More

మంట కలుస్తున్న సంస్కృతి

మంట కలుస్తున్న సంస్కృతిRead More

జై జవాన్

Photo
Read More

మంత్రాలకు చింతకాయలు రాలవు సరే , ప్రార్థన ద్వారానే సకల రోగాలు తగ్గిపోతాయ ????'మంత్రాలకు చింతకాయలు రాలవు' అనే సామెతను మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము. నిజమే.. చింతకాయలు రాలడానికి మంత్రమేమీ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ప్రయోగించే వాడికి ఎంతో ఆత్మశక్తి ఉండాలంటారు. కానీ విచిత్రమైన విషయమేమిటంటే, అన్యమతస్తులు మాత్రం ప్రార్థన ద్వారానే సకల రోగాలు తగ్గిస్తామని చెబుతారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు 'సాక్షి' పేపర్లో ఒకనాటి సినీ కథానాయిక దివ్యవాణితో ఇంటర్వ్యూ. బాధలు, కష్టాలు, వ్యాధులు అనేవి ప్రతీ మనిషి జీవితంలో సహజం. భగవంతుడిని నమ్మడం ఎందుకంటే, ఎంత గొప్పవాడయినప్పటికీ, కష్ట సమయంలో మనో ధైర్యాన్ని కోల్పోతాడు. అది సహజం. ధైర్యం లేనపుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా పెద్దవి కనిపించి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తాయి. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చేది అత్యంత శక్తివంతుడైన భగవంతుడి గురించే. కొన్నిసార్లు సాటి మనిషి ఓదార్పు మాటలు కూడా ఆయుధంలా, మంత్రంలా పనిచేస్తాయి.

సరిగ్గా ఈ పాయింట్నే క్రైస్తవులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్న మనిషి, లేదా వ్యాధులతో బాధపడుతున్న వారు మన దగ్గరకు రాగానే ఏవో కొన్ని ఓదార్పు మాటలు చెబుతాము. లేదా దైవాన్ని ప్రార్థించమని చెబుతాము. ఎదుటి మనిషి మరో మతానికి చెందినవారయితే వారు నమ్మిన దేవుడిని ప్రార్థించమని చెబుతాము. కాని, ఎవరైనా క్రైస్తవుల దగ్గరకు వెళ్ళినట్లయితే, వెంటనే కాసిని మంచి మాటలు చెప్పి, ప్రార్థన మొదలుపెడతారు. అది తప్పుకాదు. ఒకవేళ ఆ వ్యక్తికున్న బాధలు లేదా వ్యాధులు నయమయితే, ఇక వెంటనే బ్రెయిన్ వాష్ మొదలుపెడతారు. దేవుడిని నమ్మడం వల్లనే ఇది నయమయింది కాబట్టి నీవు వెంటనే మతం మారు అని చెబుతారు. ఒకవేళ వినకపోతే, మా దేవుడిని ప్రార్థించడం వల్లనే నీకు నయమయింది కాబట్టి నీవు మతం మారాల్సిందే. మారకపోతే మరలా నీకు కష్టం / వ్యాధి తిరిగి వస్తుంది అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక చేసేదేముంది? ఇష్టం ఉన్నా లేకున్నా మతం మారాల్సిందే. ఈ సకల సృష్టిలో ప్రతీ జీవిలోను, రాయి, రప్పలోను, ఆకాశంలోను, అగ్నిలోను, భూమిలోను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు.... ఇలా ప్రతీ జీవిలోను దైవత్వాన్ని దర్శించే విశాలతత్వం నుండి, దేవుడంటే ఒకడే అనే భావనకు మార్చేస్తారు. అక్కడి నుండి తనకు తానుతో సహా ప్రపంచంలో అందరూ అలా మారిన వారికి శత్రువులే. ఇలా మత మౌఢ్యాన్ని వ్యాప్తి చేసే హక్కు వారికెవరిచ్చారు? ప్రపంచంలో గత 25 వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఘనమైన నాగరికతకు వారసులుగా మెలగవలసిన వారిని వారి సంప్రదాయాల నుండి వేరు చేసి, వారి కుటుంబాల నుండి, సమాజం నుండి, ఆచార వ్యవహారాల నుండి వేరు చేసే దుర్మార్గం ఇంకెన్నాళ్ళు సాగుతుంది?

నాకు తెలిసిన ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి స్నేహితుని ప్రోద్బలంతో మతం మారాడు. ఇక అప్పటి నుండి ఆ ఇంటిలో వారందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగితే దూరంగా ఉంటాడు. ఇంటిలో ఏదైనా పండుగకి పిండివంటలు వండితే, అది దేవుని ప్రసాదం నాకు వద్దు అంటాడు. చివరికి భార్య పూజ చేసి, గంట మోగిస్తే, అది నాకు వినబడకూడదు అంటూ ఆ అమ్మాయిని హింస పెట్టాడు. చివరికి అతనితో భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోతే, నాకు దేవుడు ముఖ్యం.... భార్య పోయినా పర్వాలేదు అంటూ మంకు పట్టు పట్టాడు. ఆదివారం వచ్చిందంటే మా వూర్లో అది సంత రోజు. వ్యాపారాలన్నీ చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ టర్నోవర్ నమోదు అయ్యేది ఆ ఒక్క రోజే. ఈ మతం తీసుకున్న తరువాత ఆదివారం వచ్చిందంటే అంత వ్యాపారాన్ని వదులుకుని, చర్చికి పోవడం మొదలుపెట్టాడు. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు. కుటుంబ సభ్యులందరూ కుమిలిపోతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా, దేవుడే కావాలంటాడు. ఇక అతని జీవితం నాశనయినట్లే. ఎన్ని సార్లు ఎంతో మంది నచ్చచెప్పినా, తన వైఖరి మార్చుకోవట్లేదు.

దేవుడి పట్ల భక్తి ఉండొచ్చు, కాని మూర్ఖత్వం ఉండకూడదు. క్రైస్తవ దేశాల్లోనే ఎంతో మంది వాస్తవం తెలుసుకుని, చర్చి పట్ల విముఖత ప్రదర్శించడమో, లేదా హిందూ మతమో, బౌద్ధమతమో తీసుకోవడం చేస్తున్నారు. అటువంటిది ఇంతటి మౌఢ్యాన్ని నూరిపోయడం ఈ మతంలో వారికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు.

దివ్యవాణి విషయమే తీసుకుంటే ఆవిడ ఎన్నో కష్టాల్లో ఉండి ఉండవచ్చు. కొడుక్కి మందులతో నయం కాని జబ్బు వస్తే సిస్టర్ కొన్ని స్వాంతన మాటలు చెప్పిఉండవచ్చు. అంతమాత్రం చేత ప్రార్థన వల్లనే నా కొడుక్కి తగ్గిందని పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుంది? సెలబ్రిటీలు స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా చూసుకోవాలి. కేవలం ప్రార్థన వల్లనే జబ్బులు నయమయ్యే వీలుంటే, ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్లు, వైద్య వ్యవస్థ, కొన్ని వేల కోట్ల రూపాయిల ఖర్చు.... ఇవన్నీ ఎందుకు? పైగా మిషనరీలే హాస్పిటల్స్ నడుపుతాయి. నర్సుల్ని తయారు చేస్తాయి. వైద్యం చేస్తూ, మందులు వాడుతూ, డాక్టర్లు చికిత్స చేస్తూ, వ్యాధి దేవుడి వల్లనే నయమయింది అనే వాళ్ళని ఏమనాలి?

హిందూ స్వాములు, బాబాలు ఏదైనా మహిమ చేసారని చెప్పగానే అదంతా 'మ్యాజిక్' అంటూ గొంతు చించుకునే 'సమాజ సేవకులు', క్రైస్తవంలో పబ్లిక్గా ఇటువంటి పనులు చేస్తుంటే, నోరు మెదపరెందుకు? టి.వి.లో డజనుకు పైగా క్రైస్తవ చానళ్ళలో కళ్ళెదురుగా గుడ్డి వాళ్ళకు చూపు తెప్పిస్తున్నారు. కుంటివాళ్ళను పరిగెట్టిస్తున్నారు. ఇదంతా నిజమేనా? నిజమైతే ఇక హాస్పిటల్స్ మూసేద్దాం. డాక్టర్స్ని ఇళ్ళకి పంపేద్దాం. ఇంత జరుగుతున్నా, మీడియాగాని, ప్రభుత్వం గాని సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది మన ప్రారబ్ధం.

ఇదంతా నేను అన్యమతస్తుల  పట్ల ద్వేషంతోనో, మరో దానితోనో రాయడం లేదు. ఎవరి మతాన్ని వారు అనుసరించే హక్కు ప్రతీ వారికి ఉంది. ఎవరి ఆరాధనా పద్దతులు వారివి. కాని ఆ పేరు చెప్పి ఎదుటి వారి విశ్వాసాల్ని, నమ్మకాల్ని అగౌర పర్చే హక్కు వారికి లేదు. బ్లాక్మెయిల్ చేసి, అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలోని ప్రజల్ని వారి సంప్రదాయాల నుండి శాశ్వతంగా దూరం చేసే సాంస్కృతిక దురాక్రమణ నుండి తమను తాము రక్షించుకునే ఆలోచనను ప్రతి ఒక్కరి హృదయంలోను రగిలించాలనేదే నా ప్రయత్నం.


Read More

భారతీయ సంస్కృతి :: వాణిజ్య ప్రకటనలు

భారతీయ సంస్కృతి  ::  వాణిజ్య ప్రకటనలు


Read More

జై శివాజీ మహారాజ్


జై శివాజీ మహారాజ్Read More

మమ్మీ కి, అమ్మకి ఎంత తేడా ఉందొ మీకు తెలుసా ??? తెలియక పోతే తెలుసుకోండి

మమ్మీ కి, అమ్మకి ఎంత తేడా ఉందొ మీకు తెలుసా  ???   తెలియక పోతే తెలుసుకోండి


Read More

ఆంజనేయుడు Medical Representative !!!!!!!

ఆంజనేయుడు  Medical Representative !!!!!!!
Read More

గోమాత విలువ నీకు తెలుసా


గోమాత విలువ నీకు తెలుసా


Read More

Powered By Blogger | Template Created By Lord HTML