గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 27 June 2013

అందరిలోనూ దేవుడున్నాడు

అందరిలోనూ దేవుడున్నాడు

ఒక ఆశ్రమంలో ఒక సాధువు ఉన్నాడు. ఆయనకు చాలామంది శిష్యులు అన్ని ప్రాణుల్లోనూ దేవుడున్నాడు. కనుక మీరు అందరికీ నమస్కరించండి అని ఉపదేశించాడు. ఒక రోజు ఒక శిష్యుడు హోమానాకి అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్లాడు. అప్పుడు హఠాత్తుగా పారిపోండి, పారి పోండి ! మదవుటేనుగు వస్తోంది! అని పెద్దగా ఒక కేక వినిపించింది. ఆ కేక వినడంతోనే అక్కడున్న వారందరూ పారిపోయారు. అయితే శిష్యడు మాత్రం అక్కడి నుంచి కనీసం జరగనైనా జరగలేదు. నేనేందుకు పరుగెత్తాలి ? నేనూ దేవుణ్ణి. ఆ ఏనుగూ దేవుడే. అని అనుకుంటూ ఒక్క అడుగైనా అటూ ఇటూ వేయకుండా అక్కడే నిలబడ్డాడు. ఏనుగుకి నమైస్కరించి భగవంతుడిని కీర్తించసాగాడు. అతడిని చూసి ఏనుగు పై నున్న మావటివాడు పారిపో పారిపో అని అడిచాడు. అప్పటికీ ఆ శిష్యడు పారిపోలేదు. ఆ శిష్యడిపని ఏనుగు సమీపించి తన తొండంతో అతడిని చుట్టి పక్కగా విసిరేసింది. అతడికి బలమైన గాయాలు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆశ్రమవాసులు జరిగినదంతా తెలసుకొని, అతడిని ఆశ్రమానికి తీసుకువచ్చారు. శిష్యడు క్రమంగా స్పృహలోకి వచ్చాడు. తక్కిన శిష్యులలో ఒకడు అతడిని చూసి ఏనుగు వస్తున్న సంగతి నీకు తెలుసు కదా? నువ్వెందుకు అక్కడి నుంచి పారిపోలేదు.? అని అడిగాడు. అందుకు ఆ శిష్యడు ఇలా జవాబిచ్చాడు. ప్రపంచంలోని జీవరాశులన్నీ భగవంతుని రూపాలే. మానవుడు, జంతువు. తదితర జీవరాశులన్నీంటిలోనూ ఆయనే ఉన్నాడని మన గురువుగారు చెప్పారు కదా. కనుకనే ఏనుగును చూసినపుడు నేను ఏనుగు రూపంలో భగవుంతుడు వస్తున్నాడు అని భావించాను. అందుకే అక్కడి నుంచి పారిపోలేదు అన్నాడు. శిష్యుడి జవాబు విన్న గురువుగారు నాయనా అదంతా సరే నువ్వూ దేవుడివే, ఆ ఏనుగూ దేవుడే. అయితే ఆ ఏనుగు పైనున్న మావటి వాడు నిన్ను హెచ్చరించినప్పడు అతని మాటపై నీకెందుకు నమ్మకం కుదరలేదు. నువ్వు ఆ మావటివాడిలో ఉన్న భగవంతుడి మాటలను గౌరవించాల్సింది. ఆ హెచ్చరికలు పట్టించు కోవాల్సింది. ఆ హెచ్చరికలు పట్టించుకోవాల్సింది. కదా ! అన్నారు. ఈ కథలోని నీతి ఒకటే , పాపాత్ముల్లోనూ పుణ్యాత్ముల్లోనూ అలాగే మంచివారిలోనూ, చెడ్డవారిలోనూ, అందరిలోనూ దేవుడున్నాడు. అయితే భక్తి మంచితనం లేనివారితోనూ దుర్మార్గులతోనూ మెలగకూడదు. వారికి దూరంగా ఉండాలి. మంచి వారితోనే స్నేహం చేయాలి.
 
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML