గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

వెంకటేశ్వరస్వామికి నామాలు (ఊర్ధ్వపుండ్రం)ఎందుకు పెడతారు ?

వెంకటేశ్వరస్వామికి నామాలు (ఊర్ధ్వపుండ్రం)ఎందుకు పెడతారు ?

శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. "పూడి - ఖండనే " అనే సంస్కృత దాతువునుఅనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు . అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీ దేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీ చూర్ణం ధరిస్తారు.

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షాత్తూ ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వ వుండ్రములు అలంకరించారు. ఇప్పటికీ శ్రీనివాసుని నొసట ప్రతీ శుక్రవారం అభిషేకం తరువాత 16 తులాల పచ్చకర్పూరం, 1 1/2 తులాల కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించాబడతాయి. బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీనివాసుని ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు. 10 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారంనాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారాలలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది. ఈ శుక్రవారములను ఆలయ సంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహరిస్తారు.

ఈ శుక్రవారాలలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించిన వారికి మరో జన్మ ఉండదు. మానవుడు సహజముగా తమోగుణప్రధానుడు. తమోగుణము ముఖ వర్ణముతో సూచించబడినది. తమోగుణమును నశింప చేసుకుని సత్వగుణప్రధానులు కావాలి. ఈ సత్వగుణమును సూచించబడేవే తెల్లటి తిరునామాలు. సత్వగుణసంపన్నుడు మాత్రమేకాక రజోగుణసంపన్నుడు కూడా కావాలనే భావము అరుణ వర్ణము కలిగిన శ్రీ చూర్ణము వెల్లడిస్తుంది. ధీమహిధియోయోనః ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రానికి అర్థము ఊర్ధ్వపుండ్ర ధారణము సూచిస్తుంది. ఇందులో అర్థము, నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు, నన్ను వ్యసనముల మాయలో పడనీయకు సంమార్గాములో నడిపించు అని అర్థము.
 
 
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML