గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 29 June 2013

మహాభారతం శాంతిపర్వం నుంచి, శత్రువుని ఎలా జయించాలి?

మహాభారతం శాంతిపర్వం నుంచి,
శత్రువుని ఎలా జయించాలి? ( ఇది మనందరికీ ఉపయోగపడుతుంది)
శత్రువుతో పోరాడలనుకున్నపుడు శకునాలు బాగుండాలి, శకునాలు చూసుకొని వెళ్ళాలి! సాదారణంగా ధర్మం కోసమే యుద్ధానికి వెళ్ళాలి! అనవసరంగా ఎవరిమీదకి వెళ్ళకూడదు! ఒకవేళ అల వెళ్ళవా చస్తావ్!

శత్రువుని చాల తెలివిగా జయించాలి! శత్రువు నీకంటే బలవంతుడు అయితే తాత్కాలికంగా అణిగి మణిగి ఉండాలి! శత్రువుకి కూడా కాలం కలిసి వస్తుంది! కాబట్టి తప్పదు! మన కాలం కాదు అనేది కూడా మనకి తెలుస్తుంది! అవసరమైతే మొక్కి నమస్కరించి కలిసిపోయినట్టు నటించాలి! వాడి నడత పసిగట్టాలి! సమయం వచ్చేవరకు వేచి చూడాలి! సమయం వచ్చాక విజ్రుమ్బించి ఓడించాలి! అలా ఓడిపోయినా శత్రువుని పొరపాటునకూడా దగ్గరకి రానివ్వకుడదు! నేను మారిపోయాను అని చెప్పిన వినకూడదు! ఒకసారి శత్రుత్వం వచ్చినతరువాత పొరపాటున కూడా నమ్మొద్దు! ఎందుకంటే నువ్వు ఆదమరచి ఉన్నపుడు నిన్ను అదనుచూసి దెబ్బ కొడతాడు! అలాగే ఒకేసారి ఎక్కువమందితో శత్రుత్వం పెట్టుకోకుడదు! నువ్వెంత అంటే నువ్వెంత అనకూడదు! ఇంటిల్లపాది కూడా శత్రువులు అవుతారు! ఆనాడు జయించడం కష్టం! ఎందుకంటే అందరూ కలసి నిన్ను చంపేస్తారు కాబట్టి! ఒకడు శత్రువు అయితే చుట్టు పక్కల ఉన్న వారితో స్నేహం పెంచుకోవాలి! అప్పుడు నువ్వు శత్రువుని ధైర్యంగా ఎదుర్కోవచ్చు! శత్రువుతో ఎలా ఉండాలంటే? కలిసినట్టే ఉండాలి! అతిగా కరుణ చూపించకుడదు! అతి ద్వేషం కూడా చూపించకూడదు! రెండు ప్రమాదమే! శత్రువు విజ్రుమ్బించి నీ కొంప ముంచేస్తాడు! చాల తెలివిగా జాగ్రత్తగా ఎలా పడగోట్టలో అలా పడగొట్టాలి!No comments:

Powered By Blogger | Template Created By Lord HTML