గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 28 June 2013

గృహంలో పూజగది అమరిక ఎలా ఉండాలి ?

గృహంలో పూజగది అమరిక ఎలా ఉండాలి ?

గృహంలో భగవంతుని పూజించేందుకు ఎలాంటి చోటులో దేవుడి గది ఉండాలో వాస్తు శాస్త్రం చెబుతోంది. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం మూతపడకూడదు. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి.

పూజగది నిర్మాణం అనేది ఆ ఇంటి వైశాల్యంపైన ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి.

పూజ చేసే గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజచేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు వాటిని పూజ గది నుంచి తొలగించాలి.

పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారిపోయి ఆ ఇంటివారికి హాని చేస్తాయి. ఇక భగవంతునికి చేసే ప్రార్థన విషయానికి వస్తే... తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేసుకోవచ్చు
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML