గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 27 June 2013

శ్రీ అమరారామం – అమరావతి పంచారామక్షేత్రం.

శ్రీ అమరారామం – అమరావతి పంచారామక్షేత్రం.

గుంటూరు జిల్లా లో కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్ధం శ్రీ అమరారామం. దీనినే అమరావతి అని పిలుస్తున్నాం. అమరలింగేశ్వరుడు కొలువు తీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమిది. పంచారామాలలో మొదటిది గా సేవించబడుతోంది. కలిదోష నివృత్తి కొఱకు శౌనకాది మహామునులకు నారద మహర్షి భూలోకమునందు గల పవిత్ర పుణ్య స్థలాలను గూర్చి వివరిస్తూ ఈ అమరేశ్వరుని గురించి చెప్పినట్లు స్కాంద పురాణం లో కన్పిస్తోంది.

अमरेश समं तीर्थं न भूतो न भविष्यति !
अमरेशं महादेवं सर्वदेवमयं शुभम् !!”
ఈ అమరారామాన్ని గురించిన విశేషాలు, స్కాంద పురాణం లో సహ్యాద్రి ఖండం లోను ,బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను. పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెపుతోంది.


తారాకాసుర సంహారం పూర్తి చేశాడు కార్తికేయుడు. యుద్ధ సమయం లో తారకుని కంఠమందలి అమృతలింగం కుమారస్వామి శక్తి ఘాతాలకు ఐదు గా విడి పోయి ఆంధ్ర దేశం లో ఐదు ప్రదేశాల్లో పడ్డాయి.వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాము. ఆ పంచారామాల్లో ఒకటైన ఈ అమరారామం లోని అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడటం వలన ఈ స్వామిని అమరేశ్వరుడని, ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి యని పిలుస్తున్నారు. దీనిని” దక్షిణ కాశి” యని కూడ అంటారు.. దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం ఇంద్రుడు ఆశ్వయుజ శుద్ధదశమి నాడు సమస్త దేవతా గణము జయజయధ్వానము లు చేయుచూ వెంటరాగా, తారకాసురుని గళమందలి అమృత లింగము నుండి చెదిరిన ఒక శకలమును ఈ క్రౌంచగిరి పై ప్రతిష్ఠించినాడు .
శుద్ధ ధవళ కాంతులతో ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగి పోవటం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి, వివిధ దేవతాకుసుమములతోను, బిల్వ పత్రములతోను పూజించినను స్వామి పెరుగుదల ఆగక పోవటంచేత లింగాగ్రముపై సీల కొట్టి, కృష్ణవేణీ జలం తో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట. ఇప్పటికీ లింగాగ్రంలో తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కన్పిస్తాయని భక్తులు చెప్పుకుంటుంటారు. తారకాసురుని మరణానంతరం ఇంద్రుడు స్వామి ని ప్రతిష్ఠించిన తర్వాతే మహేంద్ర పదవిని మరల పొందాడు. ఆ ఇంద్రుని చే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడిగా ఆరాథించబడుతున్నాడు.
ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బృహస్పతి చెంతకు వచ్చాడు. “ కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగి పోయే ప్రమాదం ఉంది గదా! అటువంటి ప్రదేశం లో స్వామిని ఎలా ప్రతిష్ఠ చేయించారనే సందేహాన్ని” వెలిబుచ్చాడు బృహస్పతి తో శుక్రాచార్యుడు. అందుకు ” ఆత్మలింగం పడినచోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపై నున్న ఆమహాలింగం పెరగటం వల్ల, ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పు ఏమీలేదు.కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి ప్రక్కకు తిరిగింది కదా. ఉత్తర దక్షిణాలు గా నది ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా!” అన్నారట బృహస్పతి. ఆ యనంతరం దేవ గురువుల సూచనల మేరకు అమరేశ్వరుని చుట్టుఅంబిక మొదలైన శివపరివారమంతా కొలువు తీరింది .
లింగదర్శనం.::---- అమరేశ్వరుని రూపం పది అడుగుల ఎత్తు కలిగి, మూడు అడుగులకైవారం తో, శుద్ధ ధవళ వర్ణం తో మెరిసి పోతూ ఉంటుంది. పానమట్టం మీద స్వామి పదిహేను అడుగుల ఎత్తులో కన్పిస్తారు. అభిషేకం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడింది. స్వామి మాటి మాటికీ పెరుగుతూ ఉంటే ఆలయనిర్మాణం మాటి మాటికీ మార్చవలసి వస్తోందని, స్వామి వారి పెరుగుదలను సీల కొట్టడం ధ్వారా నియంత్రించారనే మాట స్వామి రూపాన్ని ఛూస్తే వెంటనే స్మరణకు వస్తుంది.
క్షేత్రమహిమ :--- ఈ స్వామి పంచలింగాకారాలతో పంచాక్షరీ మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటారని ప్రతీతి. ప్రణవేశ్వరుని గా, అగస్త్యేశ్వరుని గా, కోసలేశ్వరుని గా , సోమేశ్వరుని గా, పార్ధివేశ్వరుని గా దర్శనమిచ్చే ఈ క్షేత్రం లో అయిదు రోజులు నివసించి, కృష్ణానది లో స్నానం చేస్తూ, పంచాక్షరిని జపిస్తూ, స్వామిని ఆరాథిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతున్నారు.

“ स्नानमात्रेण तत्तोये गो सहस्रफलं लभेत् !
सुरेश्वरं सकृद्दष्ठा पुनर्जन्म नविद्यते !!”

అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ క్రౌంచ పర్వతం మీద గతం లో దేవతలు, కపిలుడు మొదలైన మహామునులు తపస్సు చేసి కృతార్థులగుట వలన దీన్ని సిద్థి క్షేత్రం గా కూడ పిలుస్తారు. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ్ర నక్షత్రము, ఆది వారము, సంక్రాంతి, సూర్య, చంద్రగ్రహణ కాలాల్లోను, సప్తమీ సోమవారం ,దక్షిణోత్తరాయణములందు ఈ అమరావతీ తీర్ధమందు స్నానం చేసి, అమరేశ్వరుని సేవించిన యెడల వారికి సహస్ర యజ్ఞఫలము లభిస్తుందని చెప్పబడుతోంది
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML