గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

ఒక గోడ ఆధారంగా రెండు ఇళ్ళు కట్టవచ్చ ????ఒక గోడను ఆధారంగా చేసుకుని రెండు గృహాలను నిర్మించినట్లైతే ఆ గృహం యమ తుల్యమని వాస్తు శాస్త్రం వెల్లడిస్తోంది. ఇటువంటి గృహాల్లో నివసించువారికి అప్పటికప్పుడేగానీ, త్వరిత కాలంలోగానీ మరణ ప్రమాదము సంభవించగలదని శాస్త్రము తెలుపుతోంది. అంతేకాకుండా ఒక గృహమునకు సంబంధించిన దోషాలు మరో గృహానికి కూడా వర్తిస్తుందని వాస్తు వెల్లడిస్తోంది.

ఇతరులతో కలిసి గృహమును నిర్మించుకున్నప్పుడు పరకీయ వేధయు, బంధువులతో కలిసి నిర్మించుకున్నప్పుడు బంధువేధయు, స్వయంగా రెండు గృహములను కలిపి నిర్మించిన స్వకీయ వేధయు కలిగి, అరిష్ట ప్రదమని వాస్తు తెలుపుతున్నది.

ఇదిలా ఉండగా, కొందరు ఒకే గోడపై రెండు భవనాలను నిర్మిస్తుంటారు. ఈ విధమైన ఆచరణ వాస్తు శాస్త్ర దూష్యమైనదని వాస్తునిపుణులు వెల్లడిస్తున్నారు. సోదరులు గానీ, సన్నిహిత బంధువులుగానీ, స్నేహితులు తదితరులు డబ్బులు ఆదా అవుతుందనే ఉద్దేశంతో మధ్య గోడను జాయింట్‌గా నిర్మిస్తుంటారు.

ఇలా చేయడం ద్వారా అశుభాలను కలిగిస్తుందని వాస్తు పేర్కొంటుంది. ఒక ఆయముతో రెండు ఇళ్లను నిర్మించకూడదని, వేరే ఆయము పోసి మొదటి గృహానికి కలుపరాదని వాస్తు నియమం. అయినప్పటికీ ఒక గోడపై మరో భవనం నిర్మించకూడదనే నియమాన్ని పాటించడం ఉత్తమమని, అలా నిర్మించుకోవాలనే పక్షంలో వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించడం సరైన మార్గం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML