గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 30 June 2013

గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన

గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన

Read More

2000 సంవచ్చారాల క్రిందటే భారత దేశంలో " నానో " టెక్నాలజీ :: ఇప్పటికి అంతుపట్టని విజ్ఞాన శాస్తం ::

2000 సంవచ్చారాల క్రిందటే  భారత దేశంలో " నానో " టెక్నాలజీ ::  ఇప్పటికి అంతుపట్టని  విజ్ఞాన శాస్తం ::
ఢిల్లీ లో కుతుబ్  కాంప్లెక్స్  లో ఉన్న  పిల్లర్, 1700 సం || క్రిందటిది, ఎండలో ఎండి , వర్షంలో తడిసిన తుప్పు పట్టని విచిత్రం. టిప్పు సుల్తాన్ కట్టి కూడా  వేదిక్ టెక్నాలజీ తో తయారు చేసారని ఆధారాలున్నాయని చెపుతున్న   సైంటిస్టులు...  .


Read More

బ్రాహ్మణునిగా పుట్టిన , ఎవరిని బ్రాహ్మణునిగా చెప్ప పడరు ???

బ్రాహ్మణునిగా పుట్టిన , ఎవరిని బ్రాహ్మణునిగా చెప్పబాడరు ???
మూడు  తరాలు లో  ఏ బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కుటుంబం,  అయితే గాయత్రి మంత్రం చదవక పోతే, వారిని బ్రాహ్మణునిగా తొలగించాలి, అంటే వారు బ్రాహ్మణులు కారు. అని మనుస్మృతి చెప్పిందిRead More

సిద్ధ పురుషుని అంత్య క్రియల్లో అద్భుతం. చితి మంటలో సాక్షాత్కరించిన దేవత :

సిద్ధ పురుషుని అంత్య  క్రియల్లో అద్భుతం. చితి మంటలో సాక్షాత్కరించిన దేవత :Read More

శ్రీశైలం - అనాదిక్షేత్రం! భూమికి నాభిస్థానం!!

శ్రీశైలం - అనాదిక్షేత్రం! భూమికి నాభిస్థానం!!

''శ్రీశైలం'' 30 ఆమడల పొడవు, 30 ఆమడల వెడల్పు లతో ''అష్టదళపద్మం'' లా విరాజిల్లుతూ వుందని ''స్కాంద పురాణం'' చెబుతోంది. ఈ ''అష్టదళపద్మం''లో కర్ణిక శ్రీశైలం అనీ,కేసరాలు అంగక్షేత్రాలని, శ్రీభ్రమరాంబా సమేతుడైన శ్రీ మల్లికార్జునస్వామి అష్టదళాలపై విహరిస్తూ... కర్ణిక అయిన శ్రీశైలంలో సేద తీరుతూ వుంటాడని స్కాందపురాణ కథనం. అంటే కర్ణిక - శ్రీశైలం కాగా, కర్ణిక చుట్టూవున్న అష్టదళములు ద్వారక్షేత్రాలు, ఉప ద్వారక్షేత్రాలుగా చెప్పబడుతూ వున్నాయి.
 
Read More

లక్ష్మి దేవి కి అర్చన చేయునపుడు, వితంతువులు కుంకుమ, పువ్వులతో అర్చన చేయవచ్చ ???

లక్ష్మి దేవి కి అర్చన చేయునపుడు, వితంతువులు కుంకుమ, పువ్వులతో అర్చన చేయవచ్చ ???
లక్ష్మి దేవికి అర్చన ఎవరైనా సరే పువ్వులతో  చేయాలి, ఒక వేళ పువ్వులు దొరకని సమయం లో కుంకుమతో,అక్షంత లతో చేయవచ్చు.  కుంకుమను మాత్రం "కుంకుమార్చన" అని చెప్పిన  సమయంలోనే వినియోగించాలి . వితంతువులు  కుంకుమ, పువ్వులతో లక్ష్మి దేవిని  అర్చన చేయవచ్చ ( ధరించుట లేదుకాబట్టి ). మనుస్మృతిలో మనకు వితంతువులు మరల వివాహం చేసుకొనవచ్చు అని చెప్పి ఉన్నది. లేదు మీకు మనసు అంగీకరించక పోతే అక్షంత లతో అర్చన చేయవచ్చు
మనుస్మృతి :
" నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతౌ  పంచః సురాపత్ సురానీనం పతి రమ్యో విధీయతే "

Read More

చనిపోయిన మా అమ్మ నాన్నల పేరు తో మీము బ్రతికున్నంత వరకు నిత్య పూజ చేయించ వచ్చా ???

చనిపోయిన మా అమ్మ నాన్నల పేరు తో మీము బ్రతికున్నంత వరకు నిత్య పూజ చేయించ  వచ్చా  ???.

తప్పక  చేయించ వచ్చు. అల్లాగే అన్నదానాలు, వంటి సేవలు కుడా చేయించ వచ్చు.

Read More

మొదటి అంతస్తులు అపార్ట్మెంట్ కొనుక్కునప్పుడు ఆవును తీసుకురాలేము అప్పుడు ఏమి చేయాలి :

మొదటి అంతస్తులు అపార్ట్మెంట్ కొనుక్కునప్పుడు ఆవును తీసుకురాలేము అప్పుడు ఏమి చేయాలి :
ఇటువంటి సమయములో ఇంటి ప్రాంగణంలో  గో పూజను చేయండి, నవగ్రహారాధన, సత్యన్నారాయణ వ్రతం చేయండి. . గృహప్రవేశం భూమిపై ఉన్నగ్రుహానికి మాత్రమె చెప్పబడింది .

Read More

ఆరోగ్య సంపద పెంచే మంచినీరు మహిమ :

ఆరోగ్య  సంపద పెంచే మంచినీరు మహిమ :
* దానం ఇంటిలో  ఉండాలంటే, ఇంటిలో ఎక్కువ నీరు నిలువ ఉండుట మంచిది .
* నీరు ఎక్కువ తాగే వారికి, డబ్బు సంపాదించాలి అనే కోరిక కలుగును.
* రోజు పడుకునే టప్పుడు, మీ మంచం కింద ఒక రాగి చెంబుతో నీటిని ఉంచుకుని దానికి రాగి ప్లేటు మూతగాఉంచి, ఉదయానే 5 గంటలకు తాగిన. మీ ఆరోగ్యం కలకాలం మంచిగా ఉందును.
* ఏదైన మంచి పనికి వెళ్ళేటప్పుడు మీ వెంట మంచి నీటి బాటిల్ ని తీసుకువెళ్ళండి.
*మీ ఇంటి దగ్గరలో ఏదైనా చేరువుకాని, నాదికాని,పంటకాలువ కాని, సముద్రం కాని ఉన్న రోజు కొంత సేపు కనీసం ఒక 5 నిముషాలు కూర్చుని రండి.
* గురువారం ఉదయానే బ్రాహ్మి ముహూర్తంలో ఇంటి బయట ముఖద్వారానికి కుడి వైపు సజ్జలు,పచ్చి  పాలు, నీరు చల్లుట మంచిది. లక్ష్మి గణపతి యొక్క కృప మీపై కలుగును. 

Read More

విశ్లేషణ : భారత దేశము పైన , అతిపెద్ద అన్యమతస్తుల కుట్ర ????

విశ్లేషణ : భారత దేశము పైన , అతిపెద్ద అన్యమతస్తుల  కుట్ర ????

అన్యమతస్తుల  కొలిచే ఏసుక్రీస్తు, వారిభాషలో జీసస్ , గురించి ఈమధ్యనే, ఒక ముక్యమైన సమాచారం బయటపడింది. అది ఏసుక్రీస్తు యొక్క కపాలం, ఎముకలు ఆయన సమాధి కనుగొన్నారు, ఇవే కాకుండా ఏసుక్రీస్తు యొక్క కుమారుడు, కుమార్తె , ఆయన భార్య యొక్క సమాధులు, వారి ఎముకలు, కపాలములు బ్రిటిష్ శాస్త్రవేక్తలు, ఒక గుహలో ఉన్న సమాధిలో, కనుగొన్నారు. బైబెల్ లో చెప్పిన విధంగా ఏసుక్రీస్తు అవివాహితుడు కాదని , ఆయనకూ మామూలు మనిషిలా కుటుంబం ఉన్నదనీ కనుగొన్నారు. వాటికి DNA పరీక్షలు నిర్వహించగా ఆ, ఆ సమాదుల బాక్సులలో భద్రపరిచిన ఎముకలు, కపాలములు ఓకే కుటుంబమునకు చెందినవని కనుగొన్నారు. వారి సమాధుల బాక్సుల పైన ఇలా రాసిఉన్నది.

* జీసుస్, జోసేపు కొడుకు ( jesus son of joseph )
* మేరీ మేగ్డొలిన్ ( mairame ) ( jesus wife )
* యొశై
* జుడా ( judah son of jesus )
* ( james son of joseph , brother of jesus ) 
www.telugubandu.com


ఏసుక్రీస్తు శరీర భాగాలను, ఎముకలను చేతితో నరికి బాక్సులలో భద్రపరిచారని, చూపించారు ఆధారాలలో
అయితే ఈ విషయాలన్నీ ఒక "వెబ్ సైటుల్లో" భద్ర పరచి ప్రపంచానికి తెలియపరిచారు, అయితే ఈ విషయాలు " భారతదేశముకు తెలియపరచ కూడదని " కాథలిక్ చర్చ్ ఫారుమ్" ఆ "వెబ్ సైట్" ని భారతదేశములొ ఓపెన్ కాకుండా నిలిపివేసినది, ఈ దుర్మార్గపు పనివల్ల భారత దేశ ప్రజలకు ఇప్పటికి తెలియకుండా పోయినది.
ఈ పైన చెప్పిన విషయాలకు ఆధారాలు కొరకు దీనికి అటాచ్ చేసిన లింకులు చూడండి.


https://www.youtube.com/watch?v=1d78xdHLR3Y
https://www.youtube.com/watch?v=oizMIscwp_M
https://www.youtube.com/watch?v=j48Asj50fAU

The lost tomb of Jesus" BANNED in India..

https://www.youtube.com/watch?v=JaMuvV2le2I
Read More

విశ్లేషణ : అన్యమతస్తుల ప్రభుత్వాల పాపమే, వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)


విశ్లేషణ : అన్యమతస్తుల  ప్రభుత్వాల పాపమే, వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)
 
* లక్షల కోట్ల రూపాయలు తిన్న, అన్యమతస్తుల  కాంగ్రెస్ ప్రభుత్వం, కేదారినాధ్, బద్రినాధ్ ల నదుల వెంట 240 కి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 260 కి పైగా గనుల వెలికితీత ప్రాజెక్టులు కి అనుమతి. ఇవన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లొనే అనుమతి పొందినవి, అదికూడా లాస్టు 3 సం || లో ఆమోదించా బడినవి.

* ఆ ప్రాజెక్టుల అనుమతి ఇచ్చే సమయములో , అబ్యంతరం వ్యక్తం చేసిన, కేంద్ర పర్యావరణ శేఖ, పట్టించుకోని అన్యమతస్తుల  ప్రభుత్వం.

* చేసేది లేక , కేదారినాథ్, బదరినాద్, ప్రాంతాన్ని 2011 లో "high security eco jone " ( జనావాసాలు గుంపులుగా నివసించా కూడని ప్రాంతం ) గా ప్రకటించిన కేంద్ర వాతావరణ శేఖ .

 
* విపత్తు సంభావించ బోతున్నాడని 36 గం || ముందరే " కేదారినాథ్ బదరినాద్ " వాతావరణం లో భారే ఎత్తున పెను మార్పులు సంభావిన్చాబోతున్నాయని, హెచ్చరించిన కేంద్ర వాతావరణ శేఖ . కనీసం "హై ఎలేర్ట్ ప్రకటించని కేంద్ర ప్రభుత్వం"

* గనుల పనులకోసం కొండల్లో భారీ పేలుళ్ళు, ఫలితం బీటలు వారిన కొండరాళ్ళు.

* గనుల, విద్యుత్ కేంద్ర పనులకు, అనుగుణంగా ఉండుటకు 500 లకు పైగా, తవ్విన కొండలమధ్య స్వరంగాలు.

 
* పాజేక్టుల నిర్మాణానికి, అనువుగా ఉండేటందుకు , నదుల దారి జనావాసాలకు దూరంగా మళ్ళించ వలసిన నది, డబ్బుకు కక్రుత్తి పడి కాంట్రాక్టర్లు, జనావాసాలకు దగ్గరిగా మళ్లింపు,

* వీటి కారణంగానే జనావాసాల పైకి, దూసుకువచ్చిన వరద నీరు.

* వీటి ని బయటపెట్టని జాతీయ క్రైస్తవ సానుభూతి మీడియాలు, రాష్ట రెండు అక్షరాల క్రైస్తవ పత్రిక
 

విశ్లేషణ : కొన్ని అన్యమతస్తుల  మూకల వికృతి చేష్టలే, మహా ప్రళయానికి కారణం , వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)
కేదారినాథ్ లో గంగా దేవి ఆలయం అతి పురాతనమైనది( కొన్ని వందల సంవచ్చారాలనాటిది) , ఆ ఆలయం పేరు "ధరీ దేవి ఆలయం" గనుల ప్రాజెక్టులకు అడ్డం గా ఉన్నదని మూల విరాట్, విగ్రహాన్ని పెకిలించి తొలగించారు. అలా తొలగించిన విగ్రహాన్ని గుడి బయట ఉంచారు. అలా తొలగించిన గంట వ్యవధి లోనీ ముంచుకొచ్చిన వరదనీరు. అలా చేయద్దని వారించి ప్రాజెక్టు అధికారులతో దెబ్బలు తిన్న పూజారి. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్నదని కాగిత పత్రాలను చూపిస్తున్న అధికారులు.
ఫలితం కొన్ని వేల మంది మరణం. 

(భగవంతుడంటే రెండు కర్రలకి వేళ్ళాడే "చచ్చిన పీనుగు" కాదు. భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే, సకల లోకాలను, సర్వ విశ్వాన్ని కాపాడే శక్తీ. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు, ఆయనకు అన్ని తెలుసు, మీరు తెలుసు, మీ ముందు తరాలన్నీ తెలుసు, మీ తరువాత తరాలు కూడా తెలుసు. భగవంతునికి మనం అందరమూ బిడ్డలమే. ప్రకృతి రూపుడైన భగవంతుడు మనను, బ్రతికించు చున్నాడు, అటువంటి ప్రకృతికి భంగం కలిగించిన, భగవంతునికి భంగం కలిగించినట్టే. అందుకే భగవంతుడు మనుషులను హెచ్చరించాడు, " బిడ్డా ! ప్రకృతిని పాడుచేసుకుంటున్నవు, దానివలన నీకు అనర్ధము " అని.)
 800 సంవచ్చారాల అతి పురాతన గుడిని ఈ విధంగా చేసేరంటే మీరు, మిమ్మల్ని ఏమి చేసినా పాపం లేదు . దారి దేవి విగ్రహాన్ని అతి క్రూరంగా కట్టర్లతో కట్ చేసి తీసుకు వెళ్ళేరు .ఆ తల్లి శాంతించి, కొంత కోపం తో ఉన్నది కాబట్టి కొంత మందైన బ్రతికేరు, లేకపోతే మొత్తం బురద చావు చచ్చే వాళ్ళు . మొదట మామూలుకా చుట్టురా తవ్వి తీసుకువేల్లతానికి ప్రయత్నించారు కాని విగ్రహం రాలేదు, అందుకని, రోడ్డు వేయటానికి వాడే కట్టర్లతో కట్ చేసి తీసుకువెళ్ళెరు. దేవుని విగ్రహం కట్ చేసిన గంటన్నర సమయం లోనే వరద మొదలైనది, ఇంతలో తప్పు తెలుసుకుని, మళ్ళి వెనక్కి తెచ్చి పెట్టె ప్రయత్నం చేసేక వరదలు శాంతించాయి. కనీసం ఆగమ శాస్త్ర ప్రకారం కూడా, భగవంతుడిని మరో ప్రాంతానికి తరలించలేదు. ఏదో ఒక రాయిని తరలించినట్టు తరలించారు. ఒరేయ్ కొంతమంది కాంగ్రెస్ నాయకులారా, మీలా దేవునితో వెధవ వేషాలు వేసి కుక్క చావు చచ్చిన వాళ్ళు నా రాష్ట్రం లో ఉన్నారు, దిక్కులేని చావు చచ్చారు, కుళ్ళిపోయిన తరువాత సేవాలు దొరికినై వాళ్ళని " ఏ కరుణామయుడు" వాళ్ళని కాపాడలేక పోయాడు. మీకు అదేగతి పడుతుంది జాగర్త ...
 


Read More


Read More

Saturday, 29 June 2013

తిరుమల బస్సు స్టాండ్

తిరుమల బస్సు స్టాండ్ నుంచి శ్రీ వారి మెట్టుకు ఉచిత బస్సు కలవు . మెట్ల మార్గం గుండా నడిచేవెళ్ళే వాళ్ళు తమ బాగ్ లను ఇక్కడ ఉంచితే .. దేవస్థానం వాళ్ళు కొండపైకి తీస్కుని వెళ్తారు .
ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 km ఉంటుంది . మీరు బస్సు దిగి మీ బాగ్ లను వీర్కి ఇచ్చేలోపే .. బస్సు వాడు మీకోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాడు .
అలిపిరిలో ఉన్నట్లు గానే ఇక్కడకూడా ఉచిత లగేజి కౌంటర్ ఉంది . మరో బస్సు కోసం వెయిట్ చేసే లోపు (30 min ) మీరు కనిపిస్తున్నాయ్ గా ఈ ఆటో లో మెట్లదగ్గరకు చేరుకోవచ్చు . ఆటో లో ఫ్రీ కాదండోయ్ షేర్ ఆటో ఐతే 15/- ( ఒక్కరికి ).. మీ ఒక్కరికే ఐతే 60 /- [ఈ ధరలు మారుతూ ఉంటాయ్ ]
Read More

మహాభారతం శాంతిపర్వం నుంచి, శత్రువుని ఎలా జయించాలి?

మహాభారతం శాంతిపర్వం నుంచి,
శత్రువుని ఎలా జయించాలి? ( ఇది మనందరికీ ఉపయోగపడుతుంది)
శత్రువుతో పోరాడలనుకున్నపుడు శకునాలు బాగుండాలి, శకునాలు చూసుకొని వెళ్ళాలి! సాదారణంగా ధర్మం కోసమే యుద్ధానికి వెళ్ళాలి! అనవసరంగా ఎవరిమీదకి వెళ్ళకూడదు! ఒకవేళ అల వెళ్ళవా చస్తావ్!

శత్రువుని చాల తెలివిగా జయించాలి! శత్రువు నీకంటే బలవంతుడు అయితే తాత్కాలికంగా అణిగి మణిగి ఉండాలి! శత్రువుకి కూడా కాలం కలిసి వస్తుంది! కాబట్టి తప్పదు! మన కాలం కాదు అనేది కూడా మనకి తెలుస్తుంది! అవసరమైతే మొక్కి నమస్కరించి కలిసిపోయినట్టు నటించాలి! వాడి నడత పసిగట్టాలి! సమయం వచ్చేవరకు వేచి చూడాలి! సమయం వచ్చాక విజ్రుమ్బించి ఓడించాలి! అలా ఓడిపోయినా శత్రువుని పొరపాటునకూడా దగ్గరకి రానివ్వకుడదు! నేను మారిపోయాను అని చెప్పిన వినకూడదు! ఒకసారి శత్రుత్వం వచ్చినతరువాత పొరపాటున కూడా నమ్మొద్దు! ఎందుకంటే నువ్వు ఆదమరచి ఉన్నపుడు నిన్ను అదనుచూసి దెబ్బ కొడతాడు! అలాగే ఒకేసారి ఎక్కువమందితో శత్రుత్వం పెట్టుకోకుడదు! నువ్వెంత అంటే నువ్వెంత అనకూడదు! ఇంటిల్లపాది కూడా శత్రువులు అవుతారు! ఆనాడు జయించడం కష్టం! ఎందుకంటే అందరూ కలసి నిన్ను చంపేస్తారు కాబట్టి! ఒకడు శత్రువు అయితే చుట్టు పక్కల ఉన్న వారితో స్నేహం పెంచుకోవాలి! అప్పుడు నువ్వు శత్రువుని ధైర్యంగా ఎదుర్కోవచ్చు! శత్రువుతో ఎలా ఉండాలంటే? కలిసినట్టే ఉండాలి! అతిగా కరుణ చూపించకుడదు! అతి ద్వేషం కూడా చూపించకూడదు! రెండు ప్రమాదమే! శత్రువు విజ్రుమ్బించి నీ కొంప ముంచేస్తాడు! చాల తెలివిగా జాగ్రత్తగా ఎలా పడగోట్టలో అలా పడగొట్టాలి!


Read More

తులసిని -పూజిస్తాము ఎందుకు?

తులసిని -పూజిస్తాము ఎందుకు?

హిందువుల గృహాలలో ముందర, వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో 'తులసి కోట నిర్మించబడి ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాల (అపార్టుమెంట్లు) లోని వారు కూడా పూల తొట్టెలలో తులసి మొక్కను పోషించుకొంటున్నారు. ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది. తులసి మొక్క ఆకులు, విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా పరిగణించ బడతాయి. భగవంతునికి నివేదింపబడే నైవేద్యములో ఎప్పుడూ తులసి ఆకులు ఉంచబడతాయి. భగవంతుడికి చేసే పూజలలో, ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార మూర్తుల పూజలలో తులసి సమర్పించ బడుతుంది.

మనము తులసిని ఎందుకు పూజిస్తాము?
సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.

వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.

ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).

ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.

ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.

తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.

తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.

తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:

యన్మూలే సర్వ తీర్ధాణి యదగ్రే సర్వ దేవతాః
యన్మధ్యే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహమ్

ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.

 
Read More

తిరుమల గురించి కొన్ని నిజాలు*******

తిరుమల గురించి కొన్ని నిజాలు*******

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.
Read More

నా విశ్లేషణ :: డబ్బుకు జన విజ్ఞాన వేదిక అమ్ముడు పోయిందా ??? జన అజ్ఞాన వేదికా ?? జన విజ్ఞాన వేదికా ??

నా విశ్లేషణ :: డబ్బుకు జన విజ్ఞాన వేదిక అమ్ముడు పోయిందా ???

ఈ ప్రస్నేకు సమాధానం " అవును అమ్ముడు పోయింది " అని అనిపిస్తోంది. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక చేపట్టే కార్యక్రమాలు అన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసినట్టు కనపడుతున్నవి , పొద్దున్న లేచిన దగ్గర్నుంచి హిందూ మతం లో అది ఇది అనేకాని, ఇతర మతాలలోని అంధ, మూఢ, విశ్వాసాలు మీకు కనపడవా ???

పొద్దున్న లేస్తే మీరు ప్రార్ధన చేయండి, కాన్సర్ తగ్గిపొద్ది. ప్రార్ధన చేయండి, ఎయిడ్స్ తగ్గిపొద్ది, ప్రార్ధన చేయండి కిడ్నీ లో రాళ్లు పోతాయి, లేదా మీకోసం మేము ప్రార్ధన చేస్తాము, మిమ్మల్ని స్వస్థత పరుస్తాము, మీ కానుకలను ఈ ఎకౌంటు నెంబర్ కి పంపండి అని ప్రకటనలు చూపిస్తుంటే, మీకు అవి మూఢనమ్మకలులా అనిపించుటలెదా ????

మీరు అలా సైలెంట్ గా ఉండుటకు ఎంత డబ్బు తీసుకున్నారు ????

మొన్న ఈ మద్యన ఒక మనిషి చచ్చిపోతే, అతనిని ఖననం చేయకుండా 5 రోజులు స్మసేనంలో ఉంచారు, గ్రామస్థులు తెలుసుకుని ఏమిటిది అని ప్రశ్నిస్తే , ప్రభువు మళ్లీ స్వస్థత పరిచి పైకి లేపుతాడు అని అంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఈ రకమైన హిస్టీరియా తో బాధపడే మనుషులు మీకు కనపడరా ????

Read More

సర్వజగత్తుకు సృష్టికర్త శ్రీజగజ్జననీ అమ్మవారు

సర్వజగత్తుకు సృష్టికర్త శ్రీజగజ్జననీ అమ్మవారు. సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి తొలిదినాల్లో అమ్మవారు భూమండలంలోనే ప్రపంచంలో, భారతదేశంలో, జమ్మూకాశ్మీర్ హిమాలయ పర్వతాల్లో సముద్రమట్టానికి 19,500 అడుగుల ఎత్తులో విరాట్ స్వరూపంతో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయానికి దగ్గరలోనే మానస సరోవరం వుండేది. ఈ సరోవరంలో ముక్కోటి దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవారని మన పురాణ గ్రంథాలు మరియు వేదాలు తెలియజేస్తున్నవి. కాపాలికావిథి, పూర్వాచారగాణా పత్యవిథి, వామకేశ్వరతంత్రం, కౌలాచార తంత్రం, శక్తిస్థల్, దేవీ భాగవత పురాణాలు, బ్రహ్మ, విష్ణు, శైవ, బ్రహ్మవైవర్త కార్తికేయ పురాణాల్లో శ్రీ జగజ్జననీ అమ్మవారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొనవచ్చును. ఈ అమ్మవారికి భర్త అనేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు. తన ఇచ్ఛానుసారము భర్తగాను, భార్యగాను రూపాంతరం చెందుతూ వుంటుంది. తన నుంచి వచ్చిన అంశామూర్తులకే భర్త అనేటువంటి శక్తి వుంటుంది. పార్వతికి శివుడు, లక్ష్మికి విష్ణువు, సరస్వతికి బ్రహ్మ యిత్యాదిగా వుంటారు. ఈ అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపంతో వెలుస్తూంటుంది. కనుక ఈ అమ్మను మహామాయ, యోగమాయ, అదిపరాశక్తి అని కూడా పిలుస్తుంటారు. కాకపోతే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనే పేరున ప్రసిద్ధమైంది. ఈ అమ్మవారు హిమాలయాల్లో విరాట్ స్వరూపంతో ఏ విధంగా ఐతే వెలిసిందో ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో కలియుగంలో అదే విధంగా వెలసింది. అమ్మవారి కడుపులో పంచముఖశివుడు, పాదపీఠశాయిగా శ్రీ మహావిష్ణువు, మహావిష్ణువు నాభి నుండి పశ్చిమ భాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

అమ్మవారి కుడవైపు ఒక చేతిలో చంద్రమండలం, 2వ చేతిలో భూమండలం, 3వ చేతిలో సూర్యమండలం, లక్ష్మి దేవి, అభయ హస్తంలో త్రినేత్రం, త్రిశూలం మరియు ఎడమ వైపు ఒక చేతిలో శంఖు, 2వ చేతిలో ఢమరుకం, 3వ చేతిలో ధనుస్సు, 4వ చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

శ్రీ మాతకు 17 తలల ఆదిశేషుడు పడిగ పట్టి వుంటాడు. సింహం వాహనంగా వుంటుంది. సృష్టికి మూలం తనేనని త్రిమూర్తులు, త్రిమాతలతో సహా ముక్కోటి దేవతలందరూ తమ కార్యకలాపాలను తన వీక్షానుమతితోనే సాగిస్తారని ప్రపంచానికి తెలిపే విరాట్ స్వరూపం జగజ్జనని.
 
Read More

బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెడితే..!?

బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెడితే..!?

శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లార్ దేవస్థానాన్ని దర్శించుకుని శనిహోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లార్ మాత్రమే గాకుండా మందపల్లి, సింగనాపూర్‌, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శనైశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభఫలితాలనిస్తుంది.

ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.

అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.

పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి

"ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:"
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు
Read More

షోడశోపచారాలు అంటే ఏమిటి ???

షోడశోపచారాలు   అంటే ఏమిటి ???
భగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు
భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు
ఈ సేవల యందు  భగవంతుని మనం అతిధి గా భావిస్తాము.  ఇవి 16
భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే  శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె  షోడశోపచారాలు.
1. ఆహ్వానించుట = ఆవాహనం  అనే ఉపచారం
2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం
3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం  = పాద్యం అనే ఉపచారం
4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం
5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం
6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం
7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం
8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం
9.  గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం
10. పుష్పం  ఇవ్వటం =ఇదొక ,ఉపచారం
11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం
12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం
13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం
14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం
15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం
16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం  
వీటితో పూజ ముగియును .
 ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా  చెసేవికావు.

.
Read More

ఆప్త వాక్యం

Read More

మన లోపల ఉన్న కొన్ని ప్రశ్నెలకు కొన్ని సమాధానాలు

Read More

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు - డాక్టర్ కందుకూరి శివానందమూర్తి

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు - డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 

................... కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యాత్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపోవడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. .................... గడచిన వారం రోజులలో హిమాలయాలలోని కేదార యాత్రీకుల ఆపదలు చాలా తెలుసుకున్నాం. ఈనాటికి ఐదువేల మంది చనిపోయారని తెలుస్తున్నది. సుమారు ఎనభైరెండువేల మంది ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో క్షే మంగా రక్షింపబడ్డారు. చాలామంది ఇళ్ళకి చేరుకున్నారు. దాదాపు అక్కడ ఇరుక్కున్న వారందరూ రక్షింపబడినట్టే. నేడో రేపో ఆ మిగతా పని కూడా పూర్తి అవుతుంది. భారతీయ వాయుసేన యంత్రాంగం ఆరు రోజులలో చాలా గొప్ప సేవ చేసింది. ఈ సంఘటనపైన ఎన్నో రకాల వ్యాఖ్యలు సహజంగా వినబడుతున్నాయ. అసలు ఈ మతం నమ్మకంతో ఇంతమంది అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కేవలం మూఢనమ్మకం వల్ల వచ్చి న ఆపద కాదా..? ఇదొకరకం విమర్శ! ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంతమంది పోయుండేవారు కాదుకదా..అని మరో వ్యాఖ్యానం. మనం గొప్ప నాగరికతతో తయారుచేసుకున్న రోడ్లపైన దేశం మొత్తం మీద పది రోజులకొకసారి ఐదువేల మంది పోతూ ఉండవచ్చు. దానికి ఏ విశ్వాసము కారణము కాదు. కేవలం మన నాగరికతలోని అనాగరికతే కారణం! మన సాంకేతిక విద్యకి పరాకాష్టగా నిర్మించిన ‘టైటానిక్’ అనే ప్రయాణికుల నౌకకి పట్టిన గతికి ఎవరు బాధ్యులు? మరొక్క రోజు ప్రయా ణం క్షేమంగా సాగితే ఆ పధ్నాలుగు వం దల మంది మహా వైభవంగా ఉత్సవం చేసుకుని ఉండేవారు. ఇలాంటివి ఎన్నో! మన భారతదేశంలో ఏ క్షణంలో లెక్క చూసినా సుమారు 15 కోట్ల మంది భక్తులు దేవాలయాలలో, క్షేత్రాలలో, మఠాలలో ఉంటూ ఉంటారు. వీరందరిలో 99 శాతం క్షేమంగా తిరిగి వస్తున్నారు. ప్రమాదాలెన్ని జరిగినా ప్రజల విశ్వాసం మాత్రం ఏమీ తగ్గదు. మానవ జీవితంలో వ్యక్తికి, సంఘానికి కూడా శుభాశుభాలు, అనుకోని ఆపదలు అక్కడక్కడ కలుగుతూనే ఉంటాయి. దానివల్ల జీవన స్రవంతి ఆగకుండా సాగుతూనే ఉంటుంది. కేదారయాత్ర విషయంలో ఆలోచిస్తే అక్కడ జరిగిన ప్రకృతి బీభత్సంలో ఎనభై రెండు వేల మంది క్షే మంగా తిరిగి రావడం చాలా గొప్ప విష యం. ప్రకృతియొక్క ఆగ్రహం కంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కు వే ఉంది. ఇటువంటి సంఘటనలకు ఏదో కారణం వెతకనే కూడదు. ఆవిధంగా ఎంత తిప్పలు పడ్డా సరియైన కారణం దొరకదు. కానీ ఓ దుర్మార్గుడు బాంబు పేల్చి ఒక వందమందిని చంపడంలో కారణం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ విధంగా కారణం తెలిసిన చోట ఒక కర్తవ్యం ఉంటుంది. మృ తులు పదిమందైనా, వందమందైనా కానీ చాలా విచారకరమే. కానీ ఆపదయొక్క పరిమాణాన్నిబట్టి నష్టాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యా త్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపో వడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళిమొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ఆవిధంగా మొక్కులు చెల్లించుకునే క్షేత్రాలు దేశం లోపలే అనేక సంఖ్యలో ఉన్నాయి. కేదారయాత్ర చరిత్రలో - పంచపాండవులు ద్రౌపదీదేవితో కలిసి పాదచారులై కేదారానికి మహాప్రస్థానం వెళ్ళారని మహాభారతం వర్ణిస్తోంది. ఆ ఆలయంలో పంచపాండవుల మూర్తులు కూడా ఉన్నాయి. ఆ యా త్రలో ఎటువంటి సౌకర్యాలు అమర్చుకోకుండా ఈశ్వరధ్యానంలో నడచి, నడచి శరీరాలు విసర్జించారు వాళ్ళు. ధర్మరాజు మాత్రమే చివరి పర్వతాగ్రందాకా వెళ్ళి దేవతల దర్శనం చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పడిపోయినా ఒక కుక్క మాత్రం ఆయనతో చివరివరకు నడిచి వచ్చింది. ధర్మదేవత ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించినా కుక్కను కూడా తనతో అనుమతించాలని పట్టుపట్టాడు. ఆయన న్యాయ దృష్టికి దేవతలు మెచ్చారు. ఆ కుక్క ఎవరో కాదు ఆయనని పరీక్షించిన ధర్మదేవతే అని ఋజువైంది. మహాప్రస్థానమంటే ఈ లో కాన్ని శాశ్వతంగా వదిలి తిరిగివచ్చే సం కల్పం లేక పైలోకాలకి ప్రస్థానం సంకల్పించి దేహత్యాగం చేయడమన్నమాట. ఈ యాత్ర చేయడంలో అటువంటి మనఃప్రవృత్తి కొందరికి ఉంటూనే ఉండింది. సంసారాన్ని వదలిపెట్టిన విరాగులు, అటువంటి భావన కలిగిన కొద్దిపాటి గృహస్థులు, ఇక బైరాగులు, సన్యాసులు, జీవనయాత్ర పూర్తికాబోతున్నదని నిశ్చయం చేసుకున్న వారు అనేకమంది ఏవిధమైన జాగ్రత్తలు, అన్న వస్త్రాల ఏర్పాట్లు కూడా చేసుకోక అటువెళ్ళి తిరిగి రాలేదు. ఒకవేళ అక్కడ చేరిన తరువాత కూడా స్వాధీనం కాని శరీరంలో వారుకాలం గడిపేవారుకాదు. ఈశ్వర ధ్యానంతో ప్రాణాయామం దీక్షగా చేసి ఊపిరి చాలా వరకు నిగ్రహించి, నెమ్మదిగా ఆ ప్రక్కన కొండ చివరికి చేరి, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసి మైలు లోతైన అలకనందలోయలో శరీరాన్ని విసర్జించేవారు. ఆ నిగ్రహం చేత కేవలం శరీరమే లోయలో పడి ఆ జీవాత్మ దారిలోనే శరీరాన్ని వదిలి ఊర్థ్వలోకాలని చేరుకునేది. ఇది ‘‘్భృగుపాత’’మనే పేరుగల దేహాన్ని విసర్జించే ఒకానొక ప్రక్రియ. అది దుఃఖంతో చేసుకునే ఆత్మహత్యకాదు. ఇదంతా సుదీర్ఘమైన సాధనతో పూర్తి విరాగంతో ఊర్థ్వ గతిపైన దీక్షతో మోక్షప్రదాత అయిన పరమశివుడు కేదారనాధుని దయపైన నమ్మకంతో చేసిన పని. అలాంటి వారు వేలమంది ఉండరుకదా? హిమవంతం తపోభూమి.గృహస్థులకు సంబంధించిన కర్మభూమి కాదు. వేదవ్యాస మునీంద్రుడు తన దివ్యశరీరంతో అక్కడ శాశ్వతంగా నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని అంశ తేజోరూపంతో హిమాలయాలలోనే ఉండిపోయింది. అంతేకాక బ్రాహ్మణుడై మహాపాపం చేసిన అశ్వత్థామ శాపగ్రస్థుడై, రోగగ్రస్థుడై అక్కడే తిరుగుతున్నాడు. అక్కడ పవిత్ర వాతావరణంలో తన పాపం కొంత క్షయిస్తుందని సంకల్పం కావచ్చు. ఇంకా వేలాది మంది అక్కడక్కడ నందాదేవి వంటి పర్వతగుహలలో తపస్సు చేసుకుంటున్నారు. బదరీ, కేదార క్షేత్రాలున్న అన్నపూర్ణ హిమాలయ పర్వత పంక్తికి వెనుకనే ఉన్న మహోన్నత కైలాస పర్వత ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని అయిన హనుమంతుడు చిరంజీవిగా సంచరిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గృహస్థుల యాత్రాస్థలాలు కావు. సౌకర్యాలతో యాత్ర, వినోదయాత్ర, వ్యాపార సరళితో కలిసి నేటి పరిస్థితి ఇలాగ మారింది. లౌకిక క్షేమాన్ని ప్రక్కన పెట్టి, కేవలం తాత్విక దృష్టితో చూడగలిగితే అక్కడే దేహాన్ని వదలిన యాత్రికులకి చివరి క్షణంలో దుఃఖమే కలిగిందో లేక శాంతి లభించిందో మనకి తెలియదు. వాళ్ళే ఒక వేళ ఇంటికి తిరిగి వచ్చినా ఏదో ఒకనాడు మృత్యువు తప్పదు. ఇక్కడి మృత్యువు పరిస్థితులు ఎవరి స్వాధీనంలోనూ ఉండవు. ఎట్టి మృత్యువు ఏ జీవునికి మంచిదో, ఉత్తమమో తెలియదు. శరీరం ప్రకృతి వశం, జీవుని గతి కర్మవశం అయి ఉండగా జీవుడు ఈశ్వరునితో ఎంత సంబంధం పెట్టుకున్నాడో అంతమాత్రమే వారిగతి ఈశ్వరేచ్ఛ అయి ఉంటుంది. మనమందరం ఈ దేహయాత్ర చాలించిన యాత్రికులందరి జీవులకు శివానుగ్రహం కలిగి పూర్ణశాతం లభించాలని ఈశ్వరుని వేడుకుందాం. వారికి, వారి కుటుంబాలకి మనఃస్ఫూర్తిగా సానుభూతి చెప్పుకుందాం. భవిష్యత్తులో యాత్రికులందరికి అక్కడి ప్రకృతి ప్రసన్నమై ఉండుగాక! ఈ సందర్భంలో ఒక కథని జ్ఞాపం చేసుకుందాం... ఒకనాడొక బ్రాహ్మణుడు మండుటెండలో నడచి, ఆకలితో నీరసించి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఉన్న గృహస్థుని చూచి ప్రాణం పోతున్నదని సౌంఙ్ఞతో ఆహారం వేడుకున్నాడు. ఆ గృహస్థు ఇంటి ముందరే ఉన్న చెరువును చూపించి వెంటనే స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధంగా ఉన్నదని అన్నాడు. అంతవరకూ కూడా ప్రాణం నిలువదని వెంటనే ఏదో ఇవ్వమని అడిగితే ఒక గినె్నలో పాయసం ఇచ్చాడు. తీరా పాయసం పాత్ర చేతికి రాగానే కొద్ది ధైర్యం వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఒక క్షణంలో స్నానం ముగిద్దామనుకుని ఆ పాయసపాత్రను గట్టుమీద పెట్టాడు. పాపమాతడు త్వరగానే స్నానం ముగించాడు. కాని సమీపంలో చెట్టుపైన ఉన్న ఒక గద్ద ఒక విషసర్పాన్ని గోళ్ళతో చీల్చింది. ఆ మరణవేదనలో ఆ సర్పం విషం కక్కింది. ఆ విషం తిన్నగా పాయసంలో పడింది. ఎంతో ఆత్రంతో ఆకలితో ఉన్న ఆ బ్రహ్మణుడు వేగంగా పాయసం త్రాగేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే అక్కడే మరణించాడు. గ్రామస్థులు ఆయన మరణానికి కారకులెవ్వరని చర్చించారు. అడిగిన వెంటనే చేతికి పాయసాన్ని అందించక స్నానం చేయమని సూచించిన గృహస్థునిది తప్పా? విషం కక్కిన సర్పానిది తప్పా? అదే క్షణంలో సర్పాన్ని చీల్చి చంపిన ఆ గద్ద కారణమా? పాయసం వెంటనే తాగకుండా స్నానం కోసం ఆలస్యం చేసిన బ్రాహ్మణునిది తప్పా? చర్చలో గ్రామస్థులు తేల్చలేకపోయారు. వెంటనే ఆ ప్రక్కనే నడచిపోతున్న సాధువు కనిపిస్తే అతనిని సందేహం తీర్చమని అడిగారు. ఆ సాధువు నవ్వి - ఆ బ్రాహ్మణుని మృత్యువుకి ఆ గృహస్థుకాని, ఆ సర్పంకాని, ఆ గద్ధకాని, చివరగా ఆ బ్రాహ్మణుడే కాని ఇందులో ఎవరైనా ఒక్కరు బాధ్యులని నిర్ణయిస్తే దానివల్ల అట్టివారికా పాపం సంక్రమిస్తుందని తెలిపాడు. ఎందుకంటే ఆ మృత్యువులో అసలు పాపమే లేదు. ఎవరి పాప మూ లేదు. ఇటువంటి సహజ సంఘటనలకు ఎవరినీ బాధ్యులని నిర్ణయించడం సరికాదు. ఒక కారు ప్రమాదం జరిగితే దానికి ఎవరినో బాధ్యులుగా నిర్ణయించి చర్య తీసుకోవడం సమాజ జీవనంలోని ఒక శాసన వ్యవస్థగా కొనసాగడం నాగరిక జీవనంలో ఒక భాగం మాత్రమే. అన్నింటికీ మనం చూపించే కారణాలు పూర్తిగా నిజం కావు. ఇది విశేష సత్యం. 
Read More

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

ఈశ్వరుడు అంటాడుట "నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు. ఇది వరకు తిరుమలలో "తొండమాన్ చక్రవర్తి" అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట - స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా "గోవింద" నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?

అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,

వీడేమో - అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో - నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.

ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

సారాంశం:

ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.

సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట.
Read More

భారత సైనికులకు భోజనం పెడుతున్న స్వయంసేవకులు(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) !

భారత సైనికులకు భోజనం పెడుతున్న స్వయంసేవకులు(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) !

నిజమైన దేశ భక్తులు భారత సైన్యం, స్వయం సేవకులు...వీరు ఉత్తరాఖండ్ లో నిస్వార్ధంగా ఎంతో సహాయం/సేవ చేశారు !Read More

Friday, 28 June 2013

గుడిలో భూమి ఆకర్షణ శక్తీ తక్కువగా ఉండును బయటి ప్రాంతాలకంటే

మంగళగిరి పానకాల స్వామీ గుడికి వెళ్ళి, అక్కడి భూఆకర్షణ శక్తీ పరీక్షించగా, గుడి బయట ఎక్కువ , గుడి లోపల తక్కువ భూఆకర్షణ శక్తీ  గమనించాము. ఈ రకమైన ప్రభావం వలన  గుడిలో బ్రతికేవారు ఎక్కువవ కాలం బ్రతుకుతారు.Read More

భారత దేశం లో కొంతమంది, క్రైస్తవ పాస్టర్లు చేసేది ఇదే . కాదంటారా ?????
భారత దేశం లో కొంతమంది, క్రైస్తవ పాస్టర్లు చేసేది ఇదే . కాదంటారా ?????


Read More

ఇప్పటి పారిస్ ని కూడా ఒకప్పటి హిందూ రాజులు పాలించారు. ప్రపంచం అంతా ఒకప్పుడు హిందూ ధర్మం ఉన్నాడని చెప్పుటకు ఇంతకన్నా ఆధారం కావాలాఇప్పటి పారిస్ ని కూదా ఒకప్పటి హిందూ రాజులు పాలించారు. ప్రపంచం అంట ఒకప్పుడు హిందూ ధర్మం ఉన్నాడని చెప్పుటకు ఇంతకన్నా ఆధారం కావాలా
Read More

భారతీయులది అంధ విశ్వాసం కాదురా మూర్ఖుడా ఆత్మవిశ్వాసం.

భారతీయులది అంధ విశ్వాసం కాదురా మూర్ఖుడా ఆత్మవిశ్వాసం. 
నా దేశ విజ్ఞాన ప్రపంచాన్ని చూసి గర్వం. మీ లాంటి సగం, సగం గాళ్ళకి అంతు పట్టడురా నా దేశే విజ్ఞానం .
Read More

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండోనేషియా వరకు ఒకప్పుడు అఖండ భారతంలో భాగమే!

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండోనేషియా వరకు ఒకప్పుడు అఖండ భారతంలో భాగమే!
Read More

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
 
Read More

శ్రీ కూర్మం-ఒక జ్యోతిష విచిత్రం

శ్రీ కూర్మం-ఒక జ్యోతిష విచిత్రం
మొన్న 19 తేదీన పనిమీద విశాఖ పట్నం వెళ్ళటం జరిగింది. ఆరోజున సాయంత్రం వరకు పోయిన పని ముగించుకొని, చీకటి పడే వేళకు సింహాచల నరసింహ స్వామి దర్శనం చేసుకొని వద్దామని అందరం బయలుదేరాం. మా బృందంలోనేను,మిత్రులు సీనియర్ ఆఫీసర్ కృష్ణ శాస్త్రిగారు, వారి సతీమణి, ఇంకా ఇద్దరు సహచరులు ఉన్నాము. ఆలయంఖాళీగా ఉంది. బహుశా అమావాస్య ప్రభావం ఏమో అనుకున్నాను. ఆలయ E.O ఎదురొచ్చి సరాసరి గర్భ గుడిలోకితీసుకెళ్ళాడు. ఆలయంలో మేము తప్ప ఇంకొక నలుగురు భక్తులు ఉన్నారు అంతే. చక్కని దర్శనం జరిగింది.

దర్శనం అయిన తర్వాత గుడి ఆవరణలో ఉన్న కప్పు స్థంభాన్ని కౌగలించుకొని మనసులో కోరిక కోరుకుంటే అదితీరుతుంది అని ఒకచోట వ్రాశి ఉంది. ఆ కోరిక తీరితే మళ్ళీ వచ్చి కప్పం చెల్లించాలి కాబట్టి అది కప్పు స్తంభం అయిందిట. ఆ స్థంభం కింద సంతాన గోపాల యంత్రం ప్రతిష్ట చేయబడి ఉంది అని వ్రాశారు. సాధారణంగా సంతానం లేని దంపతులుఅక్కడకు వచ్చి అలా కోరుకుంటే వారికి సంతానం కలుగుతుంది అని పూజారులు చెప్పారు. ఎవరికైనా జరిగిందా అనినేను అడిగితే బోలెడన్ని కేసుల్లో అడ్రసులతో సహా నిదర్శనాలు ఉన్నాయి అని చెప్పారు.

నేను దర్శనం ముగించుకొని అదే రాత్రి బయలుదేరి వెనక్కు వచ్చేసాను. మరుసటి రోజున కృష్ణ శాస్త్రి గారు ఉదయాన్నేలేచి కుటుంబంతో కలిసి అరసవిల్లి సూర్య దేవాలయం చూద్దామని అక్కడికి వెళ్ళారుట. అక్కడ దర్శనం ముగించుకొనిబయలుదేరబోతుంటే డ్రైవరు-అక్కడికి దగ్గరలోనే శ్రీ కూర్మం ఉంది. అదికూడా చూడండి సార్ అని చెప్పగా సరే అని శ్రీకూర్మ క్షేత్రానికి వెళ్లి వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే ఒక విశేషం జరిగింది.

శ్రీ కూర్మం లో పూజారి పూజ చేసిన తరువాత- అయ్యా మీ దంపతులలో ఒక్కరికైనా శని దశ గానీ ఏలినాటి శని గానీజరుగుతూ ఉంటుంది. లేకుంటే మీరు ఇక్కడికి రాలేరు. అరసవిల్లి వచ్చిన వారిలో ఎవరికైనా ఈ రెంటిలో ఏ ఒక్కటిజరుగుతున్నా శ్రీ కూర్మనాధునిచేత ఆకర్శింప బడి ఇక్కడికి వస్తారు. ఈ వింత నేను చాలా సార్లు గమనించాను. చూచుకోండి అని చెప్పాడుట. శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పగా నేను వెంటనే ఆయన జాతకం చూచాను. నిజంగానేశాస్త్రి గారి జాతకంలో శని దశ చివరికి వచ్చింది. కొన్నాళ్ళలో అయిపోబోతున్నది. వారి శ్రీమతి గారికి ఏలినాటి శనిజరుగుతున్నది. నేను ఈ విషయం చెబితే కృష్ణ శాస్త్రి గారు ఆశ్చర్య పడ్డారు. నాకూ ఆశ్చర్యం కలిగింది. నేనుఅక్కడివరకూ వెళ్లి కూడా వెనక్కు వచ్చాను. కాని వారికి శని దశ జరుగుతూ ఉండటంతో అనుకోకుండా వెళ్లి దర్శనంచేసుకొని వచ్చారు. ఇలాంటి విచిత్రాలు చాలా ఉంటాయి. వీటి వెనుక ఉన్న సంబంధాలు మనకు అర్థం కావు.

శ్రీ కూర్మం క్షేత్రం లో విశేషాలు:
>దశావతారాలలో అన్నింటిలో దుష్ట శిక్షణ జరిగింది. కాని ఒక్క కూర్మావతారంలో అది లేదు. ఒక మంచి పనికిసహాయం మాత్రం చెయ్యటానికి ఈ అవతారం వచ్చింది.
>శని బాధలు పోగొట్టటంలో శ్రీ కూర్మ నాథుడు చాలా మహత్యాలు చూపిస్తాడు. ఎందుకనగా ఆయన శని గ్రహానికిఅధిష్టాన దేవత అని పూజారులు చెప్పారు.
>భారత దేశం మొత్తం మీద కూర్మావతారానికి ఉన్నా ఏకైక ఆలయం శ్రీ కూర్మం. ఇది మన రాష్ట్రంలోని శ్రీకాకుళంజిల్లాలోని ప్రాచీన దేవాలయం.
>ఇక్కడ ఉన్న కొలనులో పిండ ప్రదానాలు చేస్తే ఆ పిండాలు వెంటనే గడ్డలు కట్టి రాళ్ళు గా మారి కొలను అడుగుకుచేరుకోవటం కళ్ళారా చూడవచ్చు. బహుశా ఈ నీటిలో Calcium లేదా Flourine లు ఎక్కువగా ఉండటం వల్లరసాయనిక చర్యల వల్ల ఇలా జరుగుతుందో ఏమిటో మరి. ఎవరైనా పరిశోధన చేసి చూస్తె గాని తెలియదు.
>ఇక్కడ దేవాలయానికి ముందు వెనుక కూడా ధ్వజ స్థంబాలు ఉన్నాయి. కారణం ఏమనగా, శ్రీ కూర్మ నాథుడు దేవాలయం వెనుక వైపు చూస్తూ ఉంటాడు కనుక అటు కూడా ఒక ధ్వజ స్తంభం ఉన్నది అని చెప్పారు.
>ఇక్కడి విగ్రహం మనిషి చేసినది కాదు. స్వతహాగా తాబేలు ఆకారంలో ఏర్పడిన ఫాస్సిల్. ఇది అతి మహిమాన్వితమైన సాలగ్రామం గా చెబుతారు. మధ్వ సాంప్రదాయ వైష్ణవులు ఇక్కడ పూజాదికాలు చేస్తుంటారు.
>ఇంకా నాగరికత సోకి పాడు చెయ్యని వాతావరణం మధ్యలో ప్రశాంతంగా ఉన్న దేవాలయం.

దగ్గరిలో ఉన్నవారు వీలైతే వెళ్లి దర్శించుకోవలసిన మంచి పురాతనమైన పుణ్య క్షేత్రం ఇది.
Read More

శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ???

శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ???

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడిమీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు.

శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు. అప్పుడు శిశుపాలుని తల్లి, కృష్ణుని మేనత్త అడ్డుపడి, "ఆగు కృష్ణా.. నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు..'' అంది.

కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ''అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను.. నీమీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు'' అన్నాడు. అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు.

ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పూవులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది. పూవులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలూ, గాయనీగాయకుల మధుర గానామృతంతో సందడిగా,కోలాహలంగా ఉంది.

యాగం ముగిసింది కనుక తృప్తిగా దానధర్మాలు చేయాలనుకున్నారు. అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరునికి చెప్పాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, అగ్రతాంబూలం సమర్పించాడు. అందుకు దేవతలు హర్షించారు. విరుల జల్లు కురిపించారు.

అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు. అసూయాద్వేషాలు మానసును దహింపచేయగా ''ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్దులు, త్యాగశీలురు, ధైర్యపరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్ర తాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా? ఇది తక్కినవారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్ధం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా?'' అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు.

ధర్మరాజు శిశుపాలునికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్ధం చేసుకునే స్థితిలో లేడు.

''భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు. ఆయనకు విచక్షణ నశించింది.. సరే, నీకు ఏమయింది? ఆయన ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే.. దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా? కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా? ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు.. తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను.. కానీ, నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది.. సరే, భీష్మాచార్యుడికి, నీకూ కూడా బుద్ధి మందగించింది.. ఏదో, తెలివితక్కువగా కృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.. కనీసం అనుడుకునేవాడికైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్ర తాంబూలం అందుకోవడం ఏమిటి? అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా?!'' అంటూ అందరి సమక్షంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు - ముగ్గుర్నీ నోటికొచ్చినట్లు తూలనాడాడు.

ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇది నూట ఒకటో తప్పు. ఇక కృష్ణుడు దయచూపలేదు. ముందే చెప్పినట్లుగాశిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు. సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు...
 
Read More

సకల దేవతామూర్తులకు పూజ విదానం.

సకల దేవతామూర్తులకు పూజ విదానం.

శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా ఉన్నారని తలచి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి.

పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకోవాలి.

తూర్పుముఖముగా కానీ, ఉత్తరముఖముగా గానీ కూర్చొని దైవారాధన చేయాలి. చేయవలెను. మనకు ఎదురుముఖముగా ఆరాధ్య దైవము ఉండాలి. అంటే దక్షిణముఖముగా గానీ, పశ్చిమ ముఖముగా గానీ ఆరాధ్య మూర్తులుండవచ్చును.

స్నానము చేసి విభూదియో, తిరునామమో, తిలకమో పెట్టుకొని ఆసనముపై కూర్చొనవలెను. ఘంటా నాదంతో దీపారధన, భూత శుద్దికొరకు మంత్రము చెప్పి, నీళ్ళు చల్లాలి. ఆచమన మంత్రాలతో నీటిని స్వీకరించాలి.

ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పి, కలశారాధన, ధ్యానము, ఆవాహన, సాన్నిధ్య ప్రార్ధన, ఆసనము పాధ్యము, ఆర్ఘ్యము, స్నానము, వస్త్రము, ఉత్తరీయము, తిలకం, యఙ్ఞోపవీతము, గంధము, పుష్పము, ఆభరణము, ధూపం, దీపం, మధుపర్కం, నైవేధ్యం(అవార), మహానైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఫల సమర్పణం, పుష్పాంజలీ, ఆత్మ ప్రదక్షిణ, క్షమాప్రార్ధనం, తీర్ధ ప్రాసనం (అకార మృత్యుహారం శ్లోకంతో) ఇవన్నీ పూజా ప్రకరణములు.

తీర్ధం స్వీకరించడంతో పూజా సమాప్తం జరుగుతుంది. ఇంకా విశేషోపచారాలతొ భగవంతుడు పరిపూర్ణ ఆనందం చెందుతాడు. చత్రం, చామరం, నృత్యం, గీతం, వాద్యంలతో బాటు సమస్త రాజోపచారాలు కూడా ఆయనకు చేయాలి. అప్పుడు దేవిగానీ దైవముగానీ (పురుషుడు) అనుగ్రహించి ఇష్టాఇష్టాలను తీర్చి సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యాలు 
 
Read More

ఆలస్య వివాహం ఎప్పుడు జరుగుతుందంటే...

ఆలస్య వివాహం ఎప్పుడు జరుగుతుందంటే...

ఆలస్య వివాహం అనగా 28 సంవత్సరాలు ఆపైన జరిగేవి.

1. లగ్నంలో సప్తమ స్థానంలో పాపగ్రహాలు అనగా శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు,

2. సప్తమస్థానంలో రెండుగాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు,

3. ద్వితీయ అష్టమ భావాలలో పాపగ్రహాలు గాని, వక్రగ్రహాలు గాని ఉన్నప్పుడు,

4. శుక్రుడు రాహువుతోగాని, శనితోగాని కలిసి ఉన్నప్పుడు,

5. శుక్రుడు రవిగ్రహానికి 430 201 ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు,

6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని, వక్రించి గాని ఉన్నప్పుడు
సప్తమ భావంపై సప్తమాది పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వివాహం ఆలస్యమవుతుంది.

ఈ విధంగా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా? అని నిర్ణయించిన తరువాత జరుగుతున్న దశ, అంతర్దశలను బట్టి గోచారంలో గురువు. శుక్రగ్రహాలను బట్టి వివాహకాలాన్ని నిర్ణయించాలి.

వివాహ కాలం నిర్ణయించడానికి జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చే దశ, అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యొక్క లేదా సప్తమభావమును చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశల్లో వివాహం జరుగుతుంది. అలాగా నవాంశ లగ్నాధిపతి యొక్క లేదా సప్తమాధిపతి నవాంశమందున్న రాశి నాదుని యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివాహం జరుగు కాలాన్ని నిర్ణయించిన తరువాత గురుగ్రహం యొక్క గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగుతుంది.

ఉత్తరాయణ కాలంలో జన్మించినవారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించినవారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు నెల నిర్ణయించాలి. తదుపరి చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి వివాహం జరిగే రోజు నిర్ణయించాలి.

జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసినచో దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని వివాహ సంబంధాలు చూసినా వివాహం జరగదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత వివాహం ముందురోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనకదుర్గమ్మ వారికి ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరిపించినచో దోషాలు తొలిగిపోతాయి. ముఖ్యంగా వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు ఎనిమిది మంగళవారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించినచో వివాహం కుదుదరుతుంది. శనిగ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనెపోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచిన దోషం తొలుగుతుంది.

"అయినా కూడా, కాల సర్ప యోగం వాళ్ళ గాని, తీవ్ర కుజ, రాహు దోషాల వల్ల, వివాహం కాకుండా పోతే దానికి పరిష్కార మార్గాలు రేపు చూద్దాం.'

శ్రీఘ్ర వివాహం ఎప్పుడు జరుగుతుందంటే...

1. లగ్నం, సప్తమభావంలో శుభగ్రహాలు ఉండి

సప్తమాదిపతి పాపగ్రహాలతో కలగకుండా శుభగ్రహాల

దృష్టిపొందినా,

2. ద్వితీయ అష్టమ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు,

3. శుక్రుడి బలంగా ఉన్నప్పుడు అనగా మీనరాశిలో

గాని, తుల, వృషభ రాశులలో గాని ఉండి రవికి 150

లకు పైగా దూరంగా ఉన్నప్పుడు,

4. శుక్రుడు, చంద్రుడి పైన శని దృష్టి పడకుండా

ఉన్నప్పుడు,

5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు,

6. జలతత్వ రాశులలో శుభగ్రహాలు ఉన్నప్పుడు

వివాహం తొందరగా జరుగుతుంది. 
 
 
Read More

గోత్రములు

గోత్రములు

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు,కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట,భరద్వాజ,వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువు కు సంబంధించిన వారమని,ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని,భూపతి,మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు.ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద,ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు.గోత్రాలు ఆటవిక కాలము/ ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద,ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి 
 
 
Read More

శివునికి అత్యంత ప్రేతికరమయినది శివ పంచాక్షరి. పంచాక్షరీ అంటే పంచ అక్షరములు – న మః శి వా య.

శివునికి అత్యంత ప్రేతికరమయినది శివ పంచాక్షరి. పంచాక్షరీ అంటే పంచ అక్షరములు – న మః శి వా య.
ఈ స్తోత్రములో ప్రతి అక్షరములో శివుని మహిమ వెల్లడి అవుతుంది.

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ బస్మంగా రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారయ నమఃశివాయ 1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై “మ ” కారయ నమఃశివాయ 2

శివాయ గౌరీ వదనారవిoద సూర్యాయ దాక్షాద్వర నాశకాయ
శ్రీ నీలకంటాయ వృషద్వజాయ తస్మై “శి”కారయ నమఃశివాయ 3

వశిష్ట కుంభోద్భవగౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై “వ” కారయ నమఃశివాయ 4

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై “య” కారయ నమఃశివాయ 5

పంచాక్ష మిదం పుణ్యం యః పట్ఎత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోద
 
Read More

గృహంలో పూజగది అమరిక ఎలా ఉండాలి ?

గృహంలో పూజగది అమరిక ఎలా ఉండాలి ?

గృహంలో భగవంతుని పూజించేందుకు ఎలాంటి చోటులో దేవుడి గది ఉండాలో వాస్తు శాస్త్రం చెబుతోంది. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం మూతపడకూడదు. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి.

పూజగది నిర్మాణం అనేది ఆ ఇంటి వైశాల్యంపైన ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి.

పూజ చేసే గదిలో పెద్ద సైజు రాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజచేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు వాటిని పూజ గది నుంచి తొలగించాలి.

పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారిపోయి ఆ ఇంటివారికి హాని చేస్తాయి. ఇక భగవంతునికి చేసే ప్రార్థన విషయానికి వస్తే... తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ తూర్పుకు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేసుకోవచ్చు
 
Read More

గురువు లేని విద్య

గురువు లేని విద్య
ధర్మరాజు, ఆయన తమ్ములు వనవాసం చేస్తున్నప్పుడు లోమశుడు అనే మహర్షి వాళ్లని చూడడానికి వచ్చాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత లోమశుడు, "ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది" అని సలహా ఇచ్చాడు.

తరువాత పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారు.

అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి గంగానది ఒడ్డున రైభ్యుడనే ఋషి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే వున్నది భరద్వాజుని ఆశ్రమం.

భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నదీతీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పరుచుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు - పరావసు, అర్వావసు.

వాళ్ళిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరుపొందారు.

భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. యవక్రీతుడికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు.

పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు. వాళ్ళకన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుడ్ని గూర్చి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్ళంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూలోకానికి వచ్చి, 'ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?' అని అడిగాడు. 'ఎవరూ చదవని వేదవిద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ణి కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువుగారి దగ్గరకు పోవడం, కొన్నాళ్ళు అయనకు సేవ చేయటం అవేవి నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాలమీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని యవక్రీతుడు వేడుకున్నాడు.

అది విని ఇంద్రుడు నవ్వాడు. "పిచ్చివాడా! నీ తెలివి అపమార్గాన పట్టింది. తక్షణమే వెళ్ళి గురువును ఆశ్రయించు. ఆయన వద్ద శుశ్రూష చేసి వేదవిద్యలన్నీ నేర్చుకో. గురువువద్ద విద్య నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు" అని చెప్పాడు.

కాని యవక్రీతుడికి ఆయన మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి, "నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్ళి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్ళు కాల్చుకోవటం మానుకో" అని చెప్పాడు.
యవక్రీతుడికి కోపం వచ్చి, "నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను" అన్నాడు.

అలా వుండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ ఓ ముసలి బ్రాహ్మణుడు నది ఒడ్డున కూర్చొని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు "ఏం చేస్తున్నావు తాతా?" అని అడిగాడు.

"గంగానది దాటడానికి వంతెన కడుతున్నా" అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు.

అది విని యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. "వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్ట వేయడం కుదరని పని. వేరే మార్గం చూడు" అని సలహా ఇచ్చాడు.

"గురువులేకుండానే, అసలు చదవకుండానే, కష్టపడకుండానే విద్య రవాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా" అని ముసలి బ్రాహ్మణుడు బదులు చెప్పాడు.

అప్పుడు అర్థమైంది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో యవక్రీతుడికి! వెంటనే కాళ్ళమీద పడ్డాడు.

ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుణ్ణి దగ్గరకు తీసుకొని, "నీ తండ్రి దగ్గర వేదవిద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు" అని ఆశీర్వదించాడు
 
Read More

మంచం మీద నుండి కాళ్ళు భూమి పై ఉంచినప్పుడు చదవవలసిన మంత్రం:

మంచం మీద నుండి కాళ్ళు భూమి పై ఉంచినప్పుడు చదవవలసిన మంత్రం:

సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే!
విష్ణు పత్ని నమస్థుబ్యమ్ పాద స్పర్శం క్షమస్వమే !!

భావం:సముద్రము వస్త్రం గా గలిగి పర్వతాలు పాలిండ్లు గా కలిగిన విష్ణు ని భార్య అయిన ఓ భూదేవి నీకు నమస్కరించుచున్నాను .నా కాళ్ళు మీకు తగులుతున్నందుకు నన్ను క్షమించవలెను.
 
Read More

పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తిమంతుడు!

పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తిమంతుడు!

తనకోసం తాను బతికేవాడు గాక, సమాజం కోసం, సమాజంలోని పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తివంతుడు. తనలో ఉన్న అద్భుత భావస్ఫూర్తి, ఉత్సాహపూరిత రక్తాన్ని అందరికోసం వెచ్చించేవాడే నిజమైన యుక్తిపరుడని స్వామి వివేకానంద తన సూక్తుల ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పారు.

ముఖ్యంగా శ్రమైకజీవన సౌందర్యాన్ని గుర్తించినవాడే ఈ ధరణిలో నిజమైన సుఖాన్ని పొందగలడని, ఆయాచితంగా వచ్చే ఫలాల కోసం ఆశించేవాడి తత్వం జగానికి శ్రేయోదాయకం కాదు. ఎప్పుడూ జడత్వంతో నిండివుండి, తాను శ్రమించక, పక్కవాడి కార్యాన్ని చెడగొట్టేవాళ్లు ఈ సమాజంలో గడ్డిపువ్వులా భావించబడతారని పేర్కొన్నారు.

జడత్వం అనే భావన మనిషిలో నాటుకుంటే ఆ వ్యక్తి శ్రేయోదాయకమైన ఆలోచనలకు తనలో చోటు కల్పించలేడు. అతని దృష్టిలో 'నేను' అన్నదే మహితమైన పదంగా నిలిచిపోతుందట. అతనికి శ్రేయస్సు అంటే తానూ, తన కుటుంబం మాత్రమే. మిగిలిన సంఘం అతనికి అనవసరమైన వస్తువు స్వామి వివేకానంద తెలియజెప్పారు.

నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటే అలాగే అవుతారు. కాకుండా, నేను ఏమీ చేయలేననే జడత్వంలో కుంగిపోతే నిజంగా వృద్ధుడవే అవుతావు. ఈ మహాసత్యం ఎల్లవేళలా జ్ఞప్తి పెట్టుకోవాలని స్వామి వివేకానంద సమాజానికి ప్రభోదించాడు. మనం పనికిమాలిన వాళ్లం కానే కాము. అమోఘ శక్తి సంపన్నత మన హృదిలో నిద్రాణమై ఉంది. దానికి జాగృతి కల్పించి సర్వాన్ని సాధించే సాధక ధీరరులం మనమేనని, ఇది జీవన సత్యమని ప్రభోదించారు.
Read More

చిలుకూరు బాలాజీ దేవాలయం :

చిలుకూరు బాలాజీ దేవాలయం :

చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.

ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని పిలుస్తారు.

ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.

1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు కలవు. అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. మెహిదీపట్నం నుండి 288డి బస్సు ఎక్క వలెను. ప్రయాణ సమయం గంట.

ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి మరియు ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉన్నది. దీనిని ప్రభుత్వం వారు ‘యాదగిరి గుట్ట’ దేవాలయానికి అనుసందానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రస్టీలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయంలో ‘హుండి’ లేదు. గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల మరియు ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతున్నది. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి అనేది ఇక్కడి పద్దతి.(గతంలో ఉండేదేమో తెలియదు కాని, ఇప్పుడు మాత్రము అలా లేదు. ముఖ్యమైన వారు వచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేక దర్శనము చేయిస్తున్నారు). కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకొన్నది.

ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.

దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.

క్రీ.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చ్ 2005న విడుదల చేశారు.

Read More

హస్పెటల్ లో వాస్తు ఎలా ఉండాలి ??

హస్పెటల్  లో వాస్తు ఎలా ఉండాలి ??
*ఈశాన్యం లో గుంత నిర్మాణం ఉండాలి
* హస్పెటల్  ప్రతి గదిలో ఈశాన్యం లో ద్వారం ఉండాలి
*దక్షిణ, పడమరన పెద్ద చెట్లు, రాతి అరుగులు ఉండాలి . నైరుతిలో ఉపగ్రుహం ఉండాలి
*ముఖ్య  డాక్టర్  గది న నైరుతిలో ఉండాలి, ఈ గదికి ఆగ్నేయం లో కాని, వాయువ్యం లోకాని, బాత్రూం ఉంచాలి. ఈశాన్యం లో  కాళీ   స్థలం ఉండాలి.
* హస్పెటల్ కి వీధి పోట్లు ఉండరాదు .
* ఆపరేషన్  రూం దక్షిణ, పడమరన ఉండాలి
*  ఉమ్మెత్త పువ్వుని, ఆదివారం, గురువారం, పుష్యమి కలిసిన రోజుల్లొకాని, అమృత సిద్ది, సర్వార్ధసిద్ది యోగాలు కలిసిన రోజుల్లొ, ఆ  ఉమ్మెత్త చెట్టు పూజించి, ఆచెట్టు వేరును  ,ఎర్రటి గుడ్డలో కట్టి, చంటి  పాపలకి   తాయత్తుగ కట్టిన పిల్ల ల ఆరోగ్యం బాగుండును. ఇది చాల ప్రాముక్యత కలది.
Read More

వాస్తు ప్రకారం చదువుకునే గది ఎలా ఉండాలి

వాస్తు ప్రకారం చదువుకునే గది ఎలా ఉండాలి
*చదువుకునే గది కిటికీ
  తూర్పు - ఈశాన్యం
దక్షిణ -ఆగ్నేయం
ఉత్తర -ఈశాన్యం
పడమర- వాయువ్యం
లో ఉండాలి
* సూర్యుని కిరణాలు ఉదయం గదిలో పడేలా ఉండాలి. మధ్యాన్నం, సాయంత్రం  తరువాత ఎండా పడరాదు గదిలో
* పడమర వైపు కుర్చుని తూర్పు దిక్కుగా ముఖం పెట్టి  చదువుకోవాలి.
*పడమరన గది లేకపోతే, ఈశాన్య గదిలో తూర్పు ముఖం పెట్టి  చదువుకోవాలి.
తూర్పు ముఖం పెట్టి చదివే వీలు లేకపోతే  ఈశాన్య కోణం , ఉత్తర దిసేగా కూర్చుని చదవాలి
* కంప్యుటర్ ఉపయోగించువారు  ఆగ్నేయం నుంచి దక్షిణం , పడమర దిసేలా మద్య ఉండాలి
ఈశాన్యం లో ఉండకూడదు
* విద్యార్ధులు
 దక్షిణ- ఆరోగ్యం
 పడమర- చదువుకోవాలని పెరిగే ఆకా0క్ష
  తూర్పుకు- ఉన్నత స్థితి పొందును
 ,వైపుకు తల పెట్టుకుని  నిద్రపోవాలి.
* చదివే గదిలో ఈశాన్యాన ఇంట దైవం ఫోటో ఉండాలి, తాగేందుకు మంచి నీరు ఉండాలి
* గోడలపై సఫలత సాధించిన వారి ఫోటో లు, గొప్పవారి ఫోటోలు  ఉండాలి.
* చదివే  గది  గోడలు, పరదాలు, లేత  పసుపు, లేత ఆకుపచ్చ, లేత నీలం, లేత బాదం రంగు ఉండాలి . తెల్లటి రంగు ఉంటె బద్ధకం విద్యార్ధికి కలుగును.
* పుస్తకాల అలమర దక్షిణ ,పడమర దిశల్లో ఉండాలి, ఆగ్నేయాన ఉండకూడదు
*చదివే గదిలో పాత బట్టలు, చెత్త పుస్తకాలు ఉండకూడదు .
* ఏ ఇంటిలో ఉత్తర దిసేలో దైవారాధన గది ఉండునో. ఆ ఇంటి ఆఖరి పిల్లవానికి , పిల్లకి చదువు బాగా వచ్చును.
* హాలులో దేవిదేవతల ఫోటోలు ఉండాలి
* పిల్లవానికి బుధవారం నాడు,  నిద్రపోయేటప్పుడు,వేడి పాలు, ఆ పడుకునే మంచం కింది ఉంచండి, ఆ మరుసటి రోజు తెల్లవారే గురువారం, దంత ధావనం చేసుకుని, ఆ చల్లారిన  పాలను రావి చెట్టు మొదటిలో   పోసిన మీ పిల్లల మేధస్సు పెరిగి మంచి మార్కులు వచ్చును, రేంకులు  వచ్చును.
Read More

దుర్మార్గులు, దుష్టులు ,దిక్కులేని చావు చస్తారు

దుర్మార్గులు, దుష్టులు ,దిక్కులేని చావు చస్తారు, నాశనమై పోతారు, కుళ్ళి కుళ్ళి చస్తారు, వెధవ వేషాలు వేసేరంటే, భగవంతుని తో.. . 800 సంవచ్చారాల అతి పురాతన గుడిని ఈ విధంగా చేసేరంటే మీరు, మిమ్మల్ని ఏమి చేసినా పాపం లేదు . దారి దేవి విగ్రహాన్ని అతి క్రూరంగా కట్టర్లతో కట్ చేసి తీసుకు వెళ్ళేరు .ఆ తల్లి శాంతించి, కొంత కోపం తో ఉన్నది కాబట్టి కొంత మందైన బ్రతికేరు, లేకపోతే మొత్తం బురద చావు చచ్చే వాళ్ళు . మొదట మామూలుకా చుట్టురా తవ్వి తీసుకువేల్లతానికి ప్రయత్నించారు కాని విగ్రహం రాలేదు, అందుకని, రోడ్డు వేయటానికి వాడే కట్టర్లతో కట్ చేసి తీసుకువెళ్ళెరు. దేవుని విగ్రహం కట్ చేసిన గంటన్నర సమయం లోనే వరద మొదలైనది, ఇంతలో తప్పు తెలుసుకుని, మళ్ళి వెనక్కి తెచ్చి పెట్టె ప్రయత్నం చేసేక వరదలు శాంతించాయి. కనీసం ఆగమ శాస్త్ర ప్రకారం కూడా, భగవంతుడిని మరో ప్రాంతానికి తరలించలేదు. ఏదో ఒక రాయిని తరలించినట్టు తరలించారు. ఒరేయ్ కొంతమంది కాంగ్రెస్ నాయకులారా, మీలా దేవునితో వెధవ వేషాలు వేసి కుక్క చావు చచ్చిన వాళ్ళు నా రాష్ట్రం లో ఉన్నారు, దిక్కులేని చావు చచ్చారు, కుళ్ళిపోయిన తరువాత సేవాలు దొరికినై వాళ్ళని " ఏ కరుణామయుడు" వాళ్ళని కాపాడలేక పోయాడు. మీకు అదేగతి పడుతుంది జాగర్త ...
 
 
Read More

మీ కుటుంబానికి మంచి జరుగుటకు .. మంచి చేకూర్చే పనులు

* ఒక బవుల్  తీసుకుని దానిలో నీరు పోసి, అందులో ఒక ఎర్రటి పువ్వు ఏదైనా పర్వాలేదు ఎర్రటిది.  ఇంటి గుమ్మంలో ఎడమ వైపు ఉంచాలి. ఇలా చేస్తే మీ పనులన్నీ సకాలంలో అయిపోతాయి. ఈ నీటిని పువ్వును రోజు మార్చుతూ ఉంచాలి.

*శివార్చన అభిషేక తీర్ధం మీ గడపలపై  కొంచెం చల్లండి .
*కాశీ గంగ  ప్రతి నెలా మీ గడపలపై చల్లండి.
*నరఘోష పోవుటకు " 3 నల్ల గీడి గింజలు, 3 గవ్వలు మీ ఇంటి ముందు కట్టి చుడండి." అప్పుడు నర దిష్టి  పోవును.
*మంగళ వారం ఆంజనేయ స్వామీ వారి గుడికి వెళ్లి ఆకుపూజ చేయండి , ఒక పొడుగాటి ఆకు దండను స్వామీ వారికి సమర్పించండి. పూజ తరువాత ఆ దండను మీ గుమ్మానికి కట్టండి.


Read More

Thursday, 27 June 2013

భారత దేశ సంస్కృతికి, క్రైస్తవ సంస్కృతి కి తేడా గమనించారా ????


భారత దేశ సంస్కృతికి,  క్రైస్తవ  సంస్కృతి కి తేడా గమనించారా   ????

Read More

మిత్రులారా, క్రైస్తవ మిషినరీలు మన దేశంలో విచ్చలవిడిగా ఎలా ప్రచారం చేస్తున్నాయో మ నందరికి తెలిసిందే ! అయినా ఇవ్వన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు

this is not my story. this story belongs to my frnd (name -Murali.g) i copyed this story from murali ::::మిత్రులారా, క్రైస్తవ మిషినరీలు మన దేశంలో విచ్చలవిడిగా ఎలా ప్రచారం చేస్తున్నాయో మ
నందరికి తెలిసిందే ! అయినా ఇవ్వన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికి నాకు జరిగిన ఒక అనుభవాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మధ్యనే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది క్రైస్తవ ఆసుపత్రి అని !నేను కూర్చో ఉండగా ఒక మహిళ మరియు ఆమె భర్త వచ్చారు. ఆ మహిళ తనతో పాటు ఒక సంచి కుడా తెచ్చుకుంది. కొద్ది సేపటి తరువాత ఆమె నా దగ్గరికి వచ్చి మీది ఏ భాష అని అడిగింది. నాది ఫలానా భాష అని చెప్పగానే తన సంచిలోంచి పుస్తకాలు ఇవ్వబోయినది. ఆ పుస్తకం పేరు "The gospel of John". నాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఆ మహిళ వెళ్ళిపోయి వేరొక చోట కుర్చున్నది. నేను ఒక గంటసేపు వరకు ఆమె కార్యకలాపాలు గమనిస్తునే ఉన్నాను. ఆమే ఆ ఆసుపత్రికి వచ్చిన వారందరికి ఆ పుస్తకాలు పంచుతోంది. ముఖ్యంగా అమాయకులైన హిందువులకి !నేను గమనించిన గమ్మత్తైన ఇంకొక విషయం ఎమిటంటే, ఆ ఆసుపత్రికి వచ్చిన ముస్లిం మహిళలకు మాత్రం ఆమె పుస్తకాలను ఇచ్చే ధైర్యం చేయలెదు. ఎందుకో తెలుసా? ముస్లింలను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తే వారు బడిత పూజ చేస్తారు అని ఆమెకు తెలుసు కాబట్టి! అక్కడికి వచ్చిన ఒక హిందు మహిళతో ఆమె పాపను క్రైస్తవ బడిలో చేర్పించమని, అక్కడ మంచి మార్కులు వస్తాయి అని ఏవెవో ప్రలోభాలకి గురిచేసింది.

ప్రియమైన హిందు మిత్రులారా, ఇప్పటికైన కనులు తెరవండి. ఇలా కొన్ని చొట్లలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటే! మన దేశంలో ఇలాంటివి విచ్చలవిడిగా జరుగుతున్నయి. ఇలాంతి ప్రలోభాలకు ఎన్నడూ గురి కావొద్దు. మనం జన్మించినది వేద భూమి, పున్య భూమి, కర్మ భూమి అయిన భారత దేశంలో అని మరువద్దు. మన ధర్మాన్ని మార్చుకుంటే మన తల్లిని మార్చుకున్నటే
Read More

విజ్ఞాన ప్రపంచం లో అజ్ఞాన వేడుకలా ???


విజ్ఞాన ప్రపంచం లో అజ్ఞాన  వేడుకలా  ???
Read More

భారతి నారి గొప్పతనం తెలుసుకోండి. భారత దేశములో పుట్టినందుకు ప్రతి మహిళా గర్వపడాలి.భారతి నారి గొప్పతనం తెలుసుకోండి. భారత దేశములో పుట్టినందుకు ప్రతి మహిళా గర్వపడాలి.
Read More

వాక్ స్వాతంత్రం కేవలం హిందూ మతం లో మాత్రమే ఉన్నది

క్రిస్టియానిటీ లో, క్రైస్తవాన్ని గురించి ఎవరైనా క్రైస్తవుడు ప్రశ్నిస్తే వాడిని విదేశాల్లో చంపేస్తారు, అటువంటి సందర్భాలు, ఆ మత దేశాలలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నవి
బౌధమతమ్ లో, బౌద్దాన్ని గురించి ఎవరైనా బౌద్దిస్ట్ ప్రశ్నిస్తే , ఆదుశంకరుని కాలం లో ఎంతో మందిని చంపినట్టు ఆధారాలు ఉన్నాయ్ . జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నవి
ఇస్లాంలో లో, ఇస్లాం ని గురించి ఎవరైనా ముస్లిం ప్రశ్నిస్తే వాడిని విదేశాల్లో చంపేస్తారు, అటువంటి సందర్భాలు, ఆ మత దేశాలలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నవి
కాని
కేవలం హిందూమతం లో మాత్రమే, ఒక హిందువు హిందూ మతాన్ని గురించి ప్రశ్నిస్తే వాడు సజీవంగా ఉండకలదు. అంత స్వాతంత్రాన్ని కల్పించినది హిందూమతం మాత్రమే.
వాక్ స్వాతంత్రం కేవలం హిందూ మతం లో మాత్రమే ఉన్నది . జై హిందు. జై హిందు.
Read More

విష్ణు సహస్ర నామాలు అర్ధములు

విష్ణు సహస్ర నామాలు అర్ధములు

www.telugubandu.com

విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు
2 విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).
3 వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు.
4 భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.
5 భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
6 భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
7 భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
8 భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
9 భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.
10 పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.
11 పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.
12 ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.
13 అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.
14 పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.
15 సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.
16 క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.
17 అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు
18 యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.
19 యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.
20 ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).
21 నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.
22 శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.
23 కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.
24 పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.
25 సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.
26 శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.
27 శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.
28 స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.
29 భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.
30 నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.
31 సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
32 భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.
33 భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
34 ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
35 ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.
36 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
37 స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.
38 శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.
39 ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.
40 పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.
41 మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.
42 అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.
43 ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.
44 విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.
45 ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.
46 అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.
47 హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.
48 పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.
49 అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు

www.telugubandu.com

50 విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.
51 మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.
52 త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.
53 స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.
54 స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు
55 ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు
56 అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.
57 శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.
58 కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..
59 లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.
60 ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.
61 ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.
62 త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.
63 పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.
64 మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.
65 ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
66 ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
67 ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.
68 జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
69 శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
70 ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
71 హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
72 భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
73 మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
74 మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
75 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
76 విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
77 ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
78 మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
79 విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
80 క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
81 అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
82 దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
83 కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
84 కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
85 ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
86 సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.
87 శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.
88 శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.
89 విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.
90 ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
91 అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
92 సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.
93 వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
94 ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.
95 సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.
96 అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
97 సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
98 సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99 సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100 సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.

www.telugubandu.com
Read More

Powered By Blogger | Template Created By Lord HTML