పూజ ఎందుకు చేస్తాము??
భగవంతుడిని.. కృతజ్ఞతతో పూజిస్తాము.. మనలను సృష్టించించి ఈ ఆనందము ను అనుభవించేలా చేసినందుకు కృతజ్ఞతతో పూజించాలి.
పూజా విధనం లో పంచక్రతులు ఉంటాయి.
భగవంతునికి స్నానము సమర్పయామి అంటాము.. గంధము/చందనము పూస్తాము.. చందనము
ఎందుకంటే మనకు శరీర స్పర్శ ఇచ్చినందుకు కృతజ్ఞతగా భగవంతునికి మనము చందనము
పూస్తాము.
మనకు రెండు కళ్ళు
ఇచ్చాడు దేవుడు. మనము కళ్ళతో సృష్టి లోని రమ్యతను.. సౌందర్యాన్ని చూసి
ఆనందిస్తున్నాము.. ఇదే విధముగా మన ఇల్లు కూడా ఈ లోకాన్ని చూడాలి అనే
ఉద్దేశ్యంతో దీపము వెలిగిస్తాము. అందుకే వెలిగించేటప్పుదు రెండు దీపాలు
వెలిగించాలి. ఇవి మన కంటి చూపుకు కృతజ్ఞత. దేవుడు మనకు కంటి చూపు
ఇచ్చినందుకు మనము దీపముతో కృతజ్ఞత చూపుతాము.
ఇంక మనకు ముక్కు
ఇచ్చాడు దేవుడు.. మనము ముక్కుతో కొన్నివేల రకాల వాసనలు ఆఘ్రాణిస్తాము..
అందుకు కృతజ్ఞతగా సాంబ్రాణి/ కడ్డీలు వెలిగిస్తాము.
ఇంక మనకు
చెవులు ఇచ్చాడు భగవంతుడు.. మనము చెవులతో రకరకాల శబ్ధాలను విని ఆనందిస్తాము.
మనకు ఇస్టమయిన శ్రావ్యమయిన సంగీతం అయితేనేమి.. మొట్టమొదట వినే అమ్మగొంతును
అయితేనేమి వినగలుగుతున్నాము. దీనికి కృతజ్ఞతగా మనము దేవుడికి పూలతో
అలంకరిస్తాము.. పూలకూ, మన చెవులకు సంబంధం ఏమిటా ?? అనా.. ఏమీలేదండీ.. మనము
దేవుడికి అలంకరించే పూలలో తుమ్మెదలు వచ్చి చేరి ఝుంకారనాదాలను చేస్తాయి..
అంటే.. మనము చెవులతో వినేదానికి కృతజ్ఞతగా భగవంతునికి మనము తిరిగి ఆ
తుమ్మెద యొక్క శ్రావ్యమయిన ఝుంకారాలను వినిపిస్తామనమాట!!
ఇంక
మనకు నోరు ఇచ్చాడు దేవుడు.. రకరకాల ఆహారపదార్ధాలను తింటూ రుచిని
ఆస్వాదిస్తున్నాము. అందుకు కృతజ్ఞతగా మనము నైవేద్యము పెడ్తాము దేవుడికి.
కనుక.. మన పూజా విధానములో
గంధము - మన శరీర శీతోష్ణ స్పర్శకు కృతజ్ఞత
కడ్డీలు - ముక్కు - సువాసనకు కృతజ్ఞత
దీపము - కళ్ళు - కంటి చూపుకు కృతజ్ఞత
పువ్వులు - చెవులు - వినికిడి కృతజ్ఞత
నైవేద్యము - నోరు - మన రుచి ఆస్వాదంకు కృతజ్ఞత.
కనుక, మనకు స్పర్శ, ముక్కు, కళ్ళు, చెవులు, నోరు లేకపోతే మన పరిస్థితి
ఒక్కసారి ఊహించుకోగలమా!!! ఊహించుకోలేము కదా!! అసలు మనము ఆనందము
అనుభవిస్తున్నమంటే ఈ ఐదే ప్రధానముగా పనిచేసేవి.. కనుక మనము కూడా మనకు తోచిన
విధానములో భగవంతునికి కృతజ్ఞతతో ఉంటామన్నమాట..
ఇది పూజ అంటే!!!
No comments:
Post a comment