గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 24 May 2013

మహా శివ రూపం అవిర్బ్బవం

బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో కూడి ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షం అవుతారు.
అయితే బ్రహ్మదేవుడికి తాను పుట్టినప్పటినుంచీ ఇంతవరకూ ఏ రూపమూ కనిపించకపోవడంతో తనముందు ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుల్ని గుర్తు పట్టడు. దాంతో ‘’ఎవ్వరు మీరం’టూ ఎదురు ప్రశ్నిస్తాడు.
దానికి మహావిష్ణువు ‘’ఈ సృష్టిని జని౦పచేసేందుకు సాయంగా నిన్ను నేను అవతరింపచేశాను. నువ్వు నా నాభినుండి పద్మంపై ఉద్భవించావు’ ‘అని చెబుతాడు.
తామసగుణం ఆవరించి ఉన్న బ్రహ్మ అందుకు అంగీకరింపక ‘’చాల్లే! నీ వల్ల నేను ఆవిర్భవించడం ఏమిటి? నాకు నేనే స్వయంగా జన్మించాను. నా జన్మకు కారకులంటూ ఎవ్వరూ లేరు’’ అన్నాడు అహంకారంతో, అందుకు విష్ణువు నవ్వుతూ ‘’నువ్వు పోరపడుతున్నావు, నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించేందుకు నీ వద్దకు వచ్చాను’’ అన్నాడు విష్ణుమూర్తి. అందుకు ససేమిరా అంగీకరించడు బ్రహ్మ. దాంతో ‘’సరే! నీతో నాకు వాదం ఎందుకు? మన జన్మకారడుకైన పరమేశ్వరున్నే ధ్యానించి ఆయన్ను ప్రసన్నం చేసుకుందాం. ఆయనే వచ్చి అసలు నిజం నీకు విశదపరుస్తాడు’’ అన్నాడు. బ్రహ్మకీ సలహా నచ్చడంతో ఇద్దరూ పరమేశ్వరుణ్ణి నమశ్శివాయ మంత్రంతో ధ్యానం చేస్తారు. దాంతో ....

పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరి ముందు సాక్షాత్కరిస్తాడు. అత్యంత ఉన్నత ప్రమాణంలోనూ, అత్యద్భుతమైన ప్రకాశావంతంగాను ఉన్న ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు ఆ లింగానికి మొదలు ఎక్కడో, తుది ఎక్కడ ఉందో కూడా వారికి అవగతం కాదు. దాంతో వీటిని కనుగొన్న వారే మన ఇద్దరిలో గోప్పవారన్న నిర్ణయానికి వస్తారు బ్రహ్మవిష్ణువులు. అంతే! ఆ అభిప్రాయానికి ఎప్పుడైతే వస్తారో ఇద్దరూ ఒకరు పాతాళానికి, ,మరొకరు ఊర్ద్వలోకానికి పయనం సాగిస్తారు. విష్ణుమూర్తి యజ్ఞవరాహరూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ మొదలుపెడితే, బ్రహ్మదేవుడు హంస ఆకారంలో గగన మార్గంవైపు బయలుదేరతాడు., ఇలా వీరిద్దరూ దాదాపు కొన్ని వేల ఏళ్ళు ఈ అన్వేషణ సాగిస్తారు. అయినప్పటికీ వీరిద్దరికీ ఆ మహాలింగంయొక్క తుది, మొదలు కనుపించవు. అప్పటికే ఇద్దరూ వెతికి వెతికి అలసిపోతారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకచోట కలుసుకుంటారు. ఒకరినొకరు చూపులతోనే ఓదార్చుకుంటారు.

మునిసత్తములారా! శివుని మాయ తెలుసుకోవడం, ఇంద్రాదిదేవతలు, అజుడు, విష్ణువు తదితర దేవతాప్రముఖులకే సాధ్యం కాదు. అటువంటిది సామాన్యులమైన వారికి ఎలా సాధ్యం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా అడుగైనా ముందుకు కదలదు. ఆయన కరుణిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానంలో ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులం కావాలి’’ అంటూ శివతత్త్వాన్ని మరింత వివరంగా తెలియచేస్తాడు సూతుడు. అనంతరం న౦దీశ్వరుడు మార్కండేయునికి చెప్పిన మరో ఆసక్తికరఘట్టాన్ని వినిపించేందుకు ఉపక్రమిస్తాడు. సృష్టికి పూర్వం అంతా జలమయమే. ఎక్కడ చుసినా (అసలు చూసేందుకు ఎవ్వరూ ఉండేవారే కాదు) నీరు తప్ప ఏదీ లేదు. అటువంటి మహాజలంనుంచే ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది. ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు. అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలని భావిస్తాడు. అతనికాతలుపు రావడం ఏమిటి ఆయన ఎడమభాగంనుంచి ప్రక్రుతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రభవిస్తుంది. ఆమే పరాశక్తి, పరాదేవత, జగన్మాత. ఈ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి సాధ్యం కాదు. మహాశివునికి మాదిరిగానే మహేశ్వరి కూడా మూడు కన్నులతోటి ప్రభవించింది. అంతేనా! రెండు వేల చేతులు, ప్రళయాకారంతో కనిపించినా, క్షణంలోనే ప్రణయస్వరూపిణిగా మారిపోగలదు. ఈ తల్లే సకలచరాచర సృష్టికి మూలంగా చెబుతారు. ఇలా ఆదిశక్తిని ప్రభవింపచేసి ఆమెతో విహారానికి బయలుదేరుతాడు పరమశివుడు. వారిద్దరూ సంతోషంగా ప్రణయసల్లాపాలతో మునిగి తేలుతుండగా, ఒక మహాపురుషుడు వీరిమధ్య నిలుస్తాడు. అతని రూపం తేజోమయమై ఉంది..

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML