గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 8 March 2013

జాతికి దిశానిర్దేశం లేని రాజకీయాల వల్లే ముప్పు...!!

జాతికి దిశానిర్దేశం లేని
రాజకీయాల వల్లే ముప్పు...!!

నేటి భారతీయ సమాజంలో మతతత్వానికి, జాతీయవాదానికి, సెక్యులరిజానికిం మధ్య ప్రస్తుతం ఘర్షణ జరుగుతుంది. ఇది తరువాత రోజుల్లో సామాజిక సంక్షోభానికి, రాజకీయ అనిచ్చితికి దారి తీస్తుంది. తద్వారా ఏర్పడే రాజకీయ అనిచ్చితి వల్ల భవ్యషత్తులో భిన్నసంస్కృతుల సహజీవనం, విభిన్న భవజలాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ చెదిరిపోతున్న స్వప్నాలుగా మిగిలిపోతాయి.
నేడు భారతీయ రాజకీయ వ్యవస్థలో, జాతీయవాదం, లౌకిక వాదం ముసుగులో కొన్ని వర్గాలు నిరంకుశ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.
దేశ లౌకికవాద పునాదులను పటిష్ఠ చేసేకన్నా, తమ ఓటు బ్యాంకులను సంఘటితం చేసుకోవడమే ముఖ్యమని ప్రభుత్వాలు, పార్టీలు పనిచేస్తున్నాయి. ఏదైన ఒక మతవర్గం దూర్మౌతున్నట్లు కనిపిస్తే, దాన్ని చేరదీయడమే ధ్యేయంగా మారింది. అధిక సంఖ్యాకవర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని భావించినప్పుడు, అల్ప సంఖ్యాక వర్గాలపై కొంత కాఠిన్యాన్ని ప్రదర్శించడం. అల్ప సంఖ్యాక వర్గాలను మచ్చిక చేసుకోవడనికి మెజరిటీ ప్రజల విశ్వాసాలపై కొంత చూలకనగా మాట్లాడటం' లాంటివి జరుగుతున్నాయి.
ప్రజల విశ్వాసాల విషయంలో ఒక నిర్ధిష్టమైన విధానం లేక పోవడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే. ఈ ఓటు బ్యాకు రాజకీయాల వల్ల దేశంలో సామాజిక, రాజకీయ పరిస్థితి అదుపుతప్పి ఆంధోళనకర వాతవరణం ఏర్పడుతుంది. దీని వల్ల నిజమైన లౌకిక వాదం, లౌకిక వ్యవస్థ నాశనమౌతుంది.
నేడు దేశ లౌకిక వ్యవస్థ ప్రమాదం వైపు పయనిస్తుంది అని చెప్పడానికి ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే కారణాలు. ఉదాహరణకు మరణ శిక్షలు..బియాంత్ సింగ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన బబ్బర్ ఖాల్సా ఉగ్రవాది బల్వంత్ సింగ్ రజోనా విషయంలో పంజాబ్ అకాలీదళ్ వ్యతిరేకించడం, రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణ శిక్ష పడిన తమిళ ఉగ్రవాదులను ఉరితీయరాదంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయడం, అఫ్జల్ గురు ఉరి శిక్ష విషయంలో కాశ్మీర్ రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం జరిగాయి.
దేశ ఉన్నత న్యాస్థానం ఖరారు చేసిన శిక్షలను అమలు చేకుండా తీర్మానాలు చేయడం, వ్యతిరేకించడం, అల్లర్లను రేపడం లాంటి అలౌకిక చర్యలను ఏరకంగా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనలన్నీ మన లౌకిక ప్రజాస్వామ్యానికి మచ్చలు కాదా? ఇవి లౌకిక వాద సంక్షోభానికి నిదర్శనాలు కాదా?
మత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించినప్పుడే ఈ దురవ్యవస్థ నుంచి బయటపడగలం. భరత జాతిని బలమైన జాతిగా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విభిన్న సంస్కృతుల నెలవుగా మన సమాజాన్ని తీర్చి దిద్దుకోగలం..@ బహుజన బంధు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML