గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 8 March 2013

చరిత్ర....
1947కు ముందు ...తరువాత...

....
బ్రిటిష్ పాలనలోని బొంబాయి, మద్రాసు, కలకత్తా ప్రెసిడెన్సీలతోపాటు 565 చిన్న, పెద్ద సంస్థానాల విలీనంతో 1947లో ఇండియన్ యూనియన్ @భారతదేశం ఏర్పాటయింది....అదే సమయంలో మతం ప్రాతిపదికన పాకిస్థాన్ ఏర్పడింది.
....
1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత ఇండియన్ యూనియన్ వెలుపల మూడు పెద్ద సంస్థానాలు.... జమ్ము-కాశ్మీర్, హైద్రాబాద్ నిజాం, జునాగడ్ సంస్థానం. ఒక పోర్చుగీసు రాష్ట్రం గోవా డయ్యు, డామన్, పుదుచ్చేరి లు ఉన్నాయి.
....
ఇండియన్ యూనియన్‌లో చేరడమా, చేరకపోవడమా లేక స్వతంత్రంగా ఉండటమా అనే విషయమై సొంత నిర్ణయం తీసుకొనేందుకు రాచరిక పాలనలో ఉన్న సంస్థానాలకు బ్రిటిష్ పాలకులు స్వేచ్ఛనిచ్చారు...ఈ మేరకు పెద్ద సంస్థానాలైన జమ్మూ -కాశ్మీర్ ...ముస్లింలు అత్యధికంగా ఉన్న రాజ్యం, అయితే రాజు హిందూ మతస్థుడు, హైదరాబాద్..హిందువులు అత్యధికంగా ఉన్న రాజ్యం, అయితే పాలకుడు ముస్లిం మతస్థుడు, జునాగఢ్...పాలకుడు ముస్లిం నవాబు, సిక్కిం సంస్థానాదూశులు, స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నాయి. గోవా, పోర్చుగీసు పాలనలో ఉంది. మిగతా సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి అంగీకరించాయి. కాశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ 1947 అక్టోబర్‌లో ఇండియన్ యూనియన్‌లో చేరడానికి అంగీకరించాడు. 1948 ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ ఫలితంగా జునాగఢ్ భారత్‌లో చేరడానికి అంగీకరించింది. 1961లో గోవాను, 1975లో సిక్కింను భారత్ తనలో కలుపుకొంది. దీంతో నేటి సంపూర్ణ భారతావని ఏర్పడింది..@ బహుజన బంధు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML