గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 8 March 2013

మోడీని ప్రధాని చేద్దాం

మోడీని ప్రధాని చేద్దాం
దాదాపుగా పేరు ఖరారు
అంతర్గత సమావేశాల్లో బీజేపీ నిర్ణయం
సంఘ్ మనోగతమూ అదే
మార్చి తొలి వారంలో కమలం కార్యవర్గం
రాజ్‌నాథ్ టీమ్‌లోకి సంజయ్‌జోషి...
....
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు పార్టీ నేతలు, సంఘ్ పరివార్ పెద్దలు కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మార్చి నెలాఖరులో దీనిపై బీజేపీ ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మోడీ అభ్యర్థిత్వంపై ఇప్పటికే ఒక నిర్ణయం జరిగినందువల్ల మార్చి 1 నుంచి 3 వరకు ఢిల్లీలోని తలకటోరా స్టేడియంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాత్రం చర్చ జరిగే అవకాశాలు లేవని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
జాతీయ కార్యవర్గ మండలి సమావేశాల్లో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తన ఆఫీసు బేరర్ల టీమ్‌ను ప్రకటించనున్నారు. నిజానికి మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రకటించి రంగంలోకి దించాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ పార్టీ, సంఘ్ అగ్రనేతలు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని, ప్రకటిస్తే ఆయనను ప్రధాని అభ్యర్థిగానే ప్రకటించాలని చెప్పారని తెలిసింది. కాగా, మాజీ ప్రధాన కార్యదర్శి సంజయ్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, రాజ్యసభలో మాజీ డిప్యూటీ నేత అహ్లూవాలియా, రాజస్థాన్ సీనియర్ నేత ఓంప్రకాశ్ మాథుర్, గుజరాత్ నేత, మోడీ సన్నిహితుడు అమిత్‌షా, ఒడిసా నేత జ్యుయల్ ఓరమ్, మాజీ కేంద్రమంత్రి అశోక్ ప్రధాన్ తదితరులు రాజ్‌నాథ్ సింగ్ టీమ్‌లో ఉండే అవకాశాలున్నాయి.
మేనకాగాంధీ కుమారుడు, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ, స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యవస్థాపకుడు పి. మురళీధర్‌రావులను ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తారని తెలిసింది. రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రామ్‌దాస్ అగర్వాల్‌ను కోశాధికారిగా నియమించవచ్చు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి, అహ్లూవాలియాలను ఉపాధ్యక్షులుగా నియమించే అవకాశాలున్నాయి. రాజ్‌నాథ్ టీమ్‌లో మాజీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి కీలక బాధ్యతలు అప్పజెప్పవచ్చు. అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా తన పాత్రను నిర్వహించిన రాష్ట్రానికి చెందిన నిర్మలా సీతారామన్‌కు కూడా ముఖ్య బాధ్యతలు అప్పచెబుతారని పార్టీవర్గాలు చెప్పాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML