గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 December 2012

శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతీ మహరాజ్ అష్టకం

శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతీ మహరాజ్ అష్టకం (గాణగాపురం)

ఇందుకోటి తేజకర్ణసింధు భక్తవత్సలం
నందనాత్రి సూనుదత్తమిందిరాక్ష శ్రీగురుం
గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

మోహపాశ అంధకార జాతదూర భాస్కరం
ఆయతాక్ష పాహి శ్రీయవల్లభేశ నాయకం
సేవ్యభక్త బృంద వరద భూయభూయ నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

చిత్తజారి వర్గషడ్క మత్త వారుణాంకుశం
సత్యసార శోభితాత్మ దత్తశీయా వల్లభం
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

వ్యోమవాయు తేజ ఆపభూమి కర్తృమీశ్వరం
కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం
కామితార్ధ దాతృభక్త కామధేను శ్రీగురుం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం
చండ దురిత ఖండనార్ధ దండదారి శ్రీగురుం
మండలీకమౌళి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

వేదశాస్త్ర స్తుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం
నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయం
సేవ్యభక్త బృందవరద భూయభూయనమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

అష్టయోగ తత్వ నిష్టతుష్ట ఙ్ఞానవారిధిం
కృష్ణవేణీ తీరవాస పంచనదీ సంగమం
కష్టదైన్యదూర భక్తతుష్ట కామ్యదాయకం
ప్రార్ధయామి దత్తదేవ సద్గురుం సదావిభుం ||

నారసింహ సరస్వతీశనామ మష్టమౌక్తికం
హార్కకృత్య నారదేన గంగాధరాఖ్య స్వాత్మజం
ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం ||

నారసింహ సరస్వతీశ అష్టకంచ యఃపఠేత్
ఘోర సంసారసింధు తారణాఖ్య సాధనం
సారఙ్ఞాన దీర్ఘ ఆయురారోగ్య సంపదాం
చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యఃపఠేత్ ||

భావం:
కోటి సూర్యుల తేజస్సు(ఙ్ఞానం),కోటి చంద్రుల చల్లదనం(ఆనందం)కలిగి
దేవతలందరిచేతా పూజించబడే విశ్వాశ్రయుడు,భక్తప్రియుడు,శ్రేష్టుడూ ఐన
అత్రిపుత్రుడువైన ఓ నరసింహ సరస్వతీ నీకు నమస్కారం నన్ను రక్షించు.

మోహపాశమనే అఙ్ఞానాంధకారాన్ని నశింపజేయగల
ఙ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడవు,
భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి ఐన
ఓ నృసింహ సరస్వతీ నీకు నమస్కారం నన్ను రక్షించు.

మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల
అంకుశము వంటివారు మీరు.భక్తవత్సలుడు,సర్వభూతకర్త ఐన
పరమాత్మ యొక్క అవతారలన్నింటిలో శ్రేష్టుడవైన శ్రీవల్లభా ఓ
నృసింహ సరస్వతీ నీకు నమస్కారము,నన్ను రక్షించు

ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అను పంచభూతాత్మకమైన
సృష్టికి కర్తవైవుండి సూర్య చంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు
జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా,నీవు భక్తుల పాలిట కామధేనువువు.
ఓ శ్రీగురు నరసింహ సరస్వతీ నీకు నమస్కారం నన్ను రక్షించు.

తామరరేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి
తేజస్సు గల శ్రీగురు ప్రచండమైన మా పాపాలను
పారద్రోలడానికి దండము ధరించి యతివేశదారులైన
నరసింహ సరస్వతీ నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు.

మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి
నాదుబిందు కళాస్వరూపా నీవు వాటికి కూడా అతీతుడవైయుండి
మూడు విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిట
కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు.

అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడవై వున్న ఙ్ఞానసాగరా
కృష్ణావేణీ పంచనదీ సంగమతీర నివాసా !కష్టాలను దైన్యాన్ని
దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు
నృసింహ సరస్వతీ నీకు నమస్కరిస్తున్నను , నన్ను రక్షించు

నిత్యమూ ఈ నృసింహ సరస్వతీ అష్టకం ఎవడు చదువుతాడో
వాడికి ఙ్ఞానానుసారం దీర్ఘాయువు ఆరోగ్యం సర్వసంపదలు
నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి.ఈ అష్టకం ఘోరమైన సంసారమనే
సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము.

నరహరిశర్మ పారవశ్యంతో శ్రీ గురుని ఈ అష్టకంతో స్తుతించాడు.
కుష్టురోగంతో భాద పడుతున్న నరహరిశర్మ దేవతలెందరినో ఆశ్రయించి
చివరికి జీవితంపై విరక్తి చెంది శ్రీగురుని గురించి విని ఆయనని ఆశ్రయిస్తాడు.
ఆతని నమ్మకాన్ని పరీక్షించడానికి శ్రీగురుడు ఆతనికి ఎండిన మేడిచెట్టు
పుల్లనిచ్చి,నాయనా మా మాట మీద విశ్వాసముంచి దాన్ని నాటి
నీరు పోస్తుండు ఆ కట్టె ఎపుడయితే చిగురిస్తుందో అప్పుడు నీ వ్యాధి
నయమవుతుంది అంటారు.శ్రీ గురుడు చెప్పినట్టే చేస్తున్న అతన్ని చూసి
సంగమంలో ఉన్న తోటివారు అతని ఎగతాళి చేస్తారు.అయినప్పటికీ నరహరిశర్మ శ్రీ గురుని మాటపై అచంచల విశ్వాసం ఉంచి అయన చెప్పినట్లే చేస్తూంటాడు.

ఆసక్తి చంపుకోలేని సంగమంలోని కొందరు శ్రీ గురుని వద్దకు వెళ్లి..
గురుదేవా ఆ వెర్రివాడు వారం నుండీ నీరైనా ముట్టుకోకుండా మీరు చెప్పినట్టే
ఆ ఎండుకట్టెను సేవిస్తున్నాడు...పైగా అతని బాగుకోరి హితం చెప్తున్న మాకు
శ్రీ గురుడు చెప్పినట్లు చేయటం నా పని, ఆయన అన్న మాట నిలబెట్టుకోవడం ఆయన పని అంటూ ఉపవాసాలు చేస్తున్నాడు అంటారు..అప్పుడు శ్రీ గురుడునాయనలారా భూలోకంలో గురుదేవుని వాక్య మొక్కటే మానవులను తరింపజేయగలదు.గురుదేవుల మాటలను విశ్వశించిన వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. భావాన్ని బట్టి ఫలితం ఉంటుంది. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్ధము, గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో,వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది...అని శివలింగాన్ని అత్యంత శ్రద్ధవిశ్వాసంతోపూజించి తరించిన బోయవాని కథ చెప్పి,నరహరి శర్మ వద్దకు వెళ్తారు. అక్కడ భక్తి,శ్రద్ధలతో ఎండిన మేడి కట్టెను పూజిస్తున్న అతని చూచి సంతుష్టి చెందిన ఆయన ఎండిన ఆ మేడి కట్టె పై తమ కమండలంలోని నీటిని జల్లుతారు. ఆయన సంకల్పంతో మహిమాన్వితమైన ఆ మంత్ర జలం ఎండుకట్టెను తాకిన క్షణమే అది చిగర్చడం ప్రారంభిస్తుంది.....సంగమంలోని భక్తులు సంభ్రమాశ్చర్యాలతో ఆ వింతను చూస్తుండగానే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది.నివ్వెరబోయి చూస్తున్న నరహరిశర్మకి
కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారుఛాయతో మెరుస్తుంది.తనని తాను చూచుకున్న నరహరిశర్మ ఆశ్చర్యచకితుడై, శరీరమంతా రోమాంచితమవుతుండగా పారవశ్యంతో శ్రీ గురుని
పైవిధంగా స్తుతించాడు.

ఇది శ్రీ గురుని శిష్యుడైన శ్రీ గంగాధర సరస్వతి స్వామి మరాఠీలో రాయగా దానిని శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి (టేంబే స్వామి) సంస్కృతంలో అనువదించారు.దీనిని ఆయన శిష్యులు శ్రీ గుళవణీ మహరాజ్ గారు శ్రీ శిరిడి సాయి బాబా వారి సంకల్పంతో పరమపూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టరు గారికి బహుకరించగా అయన ఆ గ్రంధాన్ని తెలుగులో అనువదించారు...శ్రీ గురు చరిత్ర చదవటం వల్ల తమ భక్తులకు తమ అనుగ్రహం త్వరితగతిన లభించగలదని శ్రీ శిరిడి సాయి బాబా హరివినాయక్ సాఠే,అన్నా సాహెబ్
ధబోల్కర్(హేమడ్ పంత్),శ్రీ భరద్వాజ మహరాజ్ వంటి తమ భక్తుల విషయంలో నిరూపించారు.అంతేగాక కుశభావు అనే భక్తుని చేత శ్రీ గురుచరిత్రని 108 సార్లు పారాయణ చేయించి, ఆ తర్వాతే తమ అనుగ్రహాన్ని ప్రసాదించారు.

శ్రీ సాయి బాబా తాము స్వయంగా పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అయినప్పటికీ,సామాన్యులలో అతి సామాన్యుడిగా జీవించారు..బావిలోని నీరు ఆయన త్రాగితే అపవిత్రమవుతుందని అన్నప్పుడు పశువులు తాగే నీటిని త్రాగి దాహం తీర్చుకున్నారు,నీటినీ నిప్పుని శాశించగల దేవుడు కటిక నేలపై గోనె సంచి పరచి దానిపై పడుకున్నారు...తాను గురువునని,తనకి శిష్యులు ఉన్నారని ఏనాడు చాటుకోలేదు.నీటితో దీపాలు వెలిగించి,సట్కాతో ధునిలో ఎగసిపడుతున్న అగ్నిని ఆగమని ఆదేశించి,ఉరుములాంటి అరుపుతో తుఫానుని నిలుపమని ప్రకృతిని శాశించిన దేవదేవుడూ,పూర్ణ పరబ్రహ్మ స్వరూపి,సత్ చిత్ ఆనంద స్వరూపుడైన మన శ్రీగురుడు సాయిని ఎలా సేవించాలో శ్రీ గురు చరిత్ర చదివి తెలుసుకోవచ్చు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML