గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 July 2019

ఆదిపర్వం.: వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.

ఆదిపర్వం.
----------------
వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా  ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.  గణేశుడు కూడా అంతే నేర్పుతో చకచకా వ్రాయసాగాడు.  అయితే, యెక్కడైనా విరామం వస్తే వ్రాయడం ఆపేస్తానన్నాడుకదా మన గణేశుడు !  వ్యాసుడేమో నీవు అర్ధం చేసుకుని వ్రాయాలని చెప్పాడుకదా !  అందుకే వ్యాసుడు వుపాయంగా తాను ఆలోచించుకొని వీలు చిక్కడానికి మధ్య మధ్యలో ' గ్రంథ గ్రంధి ' ని  వాడుకుంటూ,  అది గణేశుడు అర్ధం చేసుకొనే లోపు  తాను కావాలసిన శ్లోకాలను మనస్సులో సమకూర్చుకునేవాడు.  ఆహా ! ఒకప్రక్క వ్యాసుని చమత్కారం తో కూడిన పాండిత్యము.  వేరొక ప్రక్క గణేశుని శ్లోకాలు అర్ధంచేసుకోవాలనే జిజ్ఞాస.  ఇరువురికిరువురూ సమఉజ్జీలుగా గ్రంథ రచన సాగింది. ఇట్టి కఠినమైన శ్లోకాలు 8,800  వివిధ దశలలో వాడినట్లు  వ్యాసులవారే చెప్పారు.

ఇక భారత కథావిశేషాలు శౌనకాది మహామునులకు సూతుడు చెప్పిన ప్రకారం :

శ్రీకృష్ణ అవతార సమాప్తి అనంతరం కలియుగం ప్రారంభం కాగానే, పరీక్షిత్తు రాజ్యాధికారం స్వీకరించాడు. వ్యాసుడు ఆ సమయానికే బదరికాశ్రమంలో భారత రచన ప్రారంభించి మూడు సంవత్సరాలలో విఘ్నేశుని సహకారంతో పూర్తిచేశాడు. ఆ తరువాత ఈ కథను వ్యాసుడు తన కుమారుడైన శుకునికి, వైశంపాయనుని సమక్షంలో వినిపించాడు.  

పరీక్షిన్మహారాజు, ధర్మనిష్ఠతో ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తుండడంతో,  కలి పురుషుడు తన ప్రతాపం చూపించడానికి సమయం కోసం వేచి వున్నాడు. ధర్మదేవత కలి
యొక్క దుష్ట చింతనను పరీక్షిత్తుకు తెలియజేసి, తనను కలిపురుషుని నుండి కాపాడమని మొరబెట్టుకున్నది.  కలిని,  పరీక్షిత్తు తన రాజ్యంలో కలిమాయను ప్రవేశపెట్టడానికి వీలులేదని హెచ్చరించాడు.  అయినా యుగధర్మం నెరవేర్చాలని తన ప్రయత్నంలో తాను వున్నాడు కలి అవకాశం కోసం ఓపికగా యెదురుచూస్తూ.  

ఆ రోజుల్లోనే, పరీక్షిత్తు అరణ్యానికి వేటకై వెళ్లి,దప్పికతో బాధపడుతూ దగ్గరలో వున్న ' శమీక ముని '  ఆశ్రమానికి వెళ్ళాడు.   ఆయన ధ్యాన నిష్ట లో వుండి పరీక్షిత్తు పిలిచినా సమాధానం చెప్పలేదు.  దానికి రాజు ఆగ్రహించి తనను లక్ష్యపెట్టలేదనే క్షణికమైన అహంకారంతో, ఊగిపోయాడు.  అవకాశం కోసం యెదురుచూస్తున్న కలి వెంటనే పరీక్షిత్తు ని ఆవహించాడు.  అంతే, ఆ కోపాగ్ని శగలలో తప్పొప్పులు మర్చిపోయి, పరీక్షిత్తు ప్రక్కనే చచ్చిపడివున్న ఒక సర్పకళేబరాన్ని, తన ధనుస్సుతో తీసి, శమీకముని మెడలో దండగా వేసి అక్కడనుంచి నిష్క్రమించాడు.  

ఒక్కసారి ఆ సన్నివేశం నుంచి ప్రక్కకు తొలగగానే, కలి పరీక్షిత్తు నుండి వైతొలగడం,  జరిగిన సంగతి గుర్తుకు తెచ్చుకుని, పరీక్షిత్తు కుమిలిపోవడం జరిగింది.  చూద్దాం !  ఈ క్షణికావేశం యే విధమైన పరిణామాలకు దారి తీస్తుందో! 

పరీక్షిత్తు శమీకునినుండి వెళ్లిన క్రొద్దిసేపటికి, శమీకుని కుమారుడు ' శృంగి ' తపస్సంపన్నుడు రావడం,  తండ్రి గారి మెడలో ఆ మృతసర్పం వ్రేలాడుతుండడం చూడడం,  దివ్యదృష్టితో జరిగినది తెలుసుకోవడం వెంటవెంటనే   జరిగిపోయింది.   యువకుడైన శృంగి కూడా ఆవేశం చంపుకొనలేక, తన తండ్రిని యీ విధంగా అవమానించిన పరీక్షిత్తు వారం రోజులలో పాముకాటుతోనే మరణించునట్లు శాపం పెట్టాడు.   శమీకుడు ధ్యానం నుండి మేలుకుని తనకుమారుని ఆవేశానికి మందలించి రాజుకు శాపమివ్వడం తగదని హితవు పలికాడు.  అయినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది.

ఇంతకీ ఈ పరీక్షిత్తు అంటే యెవరో కాదు.పాండవుల మనుమడు. సుభద్రకు అర్జునునకు పుట్టిన అభిమన్యుని కుమారుడు.  ఎంతటివాడైనా తన శాప విముక్తికోసం ఒంటి స్తంభపు మేడలో వారం రోజులు భాగవత కథా సప్తాహం శుకమహర్షి ద్వారా జరిపించుకొని చివరకు,  ఆ వొంటి స్తంభపు మేడలో తాను వున్న గదిలోకి అరటిపండు ద్వారా ప్రవేశించిన ' తక్షకుడు ' అనే సర్పం విషపు కాటుకు బలికాక తప్పలేదు.  ఆహా విధి వైపరీత్యం.  అది తప్పించుకొనే విషయము కాదని తెలుసుకునే, భాగవత కథామృతం లో తేలియాడి పరమపదం పొందాడు పరీక్షిత్తు.  

మహాభారత మొదటి దశలోనే యీ గాథ యందలి సూక్ష్మ విషయము,  ' విధి కి యెంత వారైనా బద్ధులే ' అని జనావళికి చెప్పారు వ్యాస మహర్షి.  శ్రీ వ్యాసాయ నమోనమ: 

 పరీక్షిత్తునకు నలుగురు కుమారులు.  వారు జనమేజయుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతశ్రేణుడు.  నలుగురూ అశ్వమేధయాగములు చేసిన ఘనులే.  అందులో పెద్దవాడైన జనమేజయుడు పరీక్షిత్తు తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు.  కలి ప్రభావం వలన తన తండ్రిని చంపిన తక్షకునిపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు.

Read More

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందుబాటులో నేర్పించండి, చదివించండి!

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందుబాటులో నేర్పించండి, చదివించండి!

1. లింగాలు : 3
        పుం, స్త్రీ, నపుంసక.

2. వాచకాలు : 3.
      మహద్వా, మహతీ, అమహత్తు.

3. పురుషలు : 3.
    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.

4. దిక్కులు : 4.
      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.

 5. మూలలు : 4.
         ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం,          
         ఈశాన్యం.

6. వేదాలు : 4.
          ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
          అధర్వణ వేదం.

7. ఉపవేదాలు : 4.
         ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.

8. పురుషార్ధాలు : 4.
          ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.

9. చతురాశ్రమాలు : 4.
      బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్థం, 
      సన్యాసం.

10. పంచభూతాలు : 5.
        గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.

 11. పంచేంద్రియాలు : 5.
        కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.

 12. భాషా భాగాలు : 5.
         నామవాచకం, సర్వనామం, విశేషణం,         
         క్రియ, అవ్యయం.

13. కళలు : 5.
         కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, 
         సంగీతం, శిల్పం.

14. పంచకావ్యాలు : 5.
     ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర,   
     పారిజాతాపహరణం, శృంగార నైషధం.

15. పంచగంగలు : 5.
      గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.

16. దేవతావృక్షాలు : 5.
       మందారం, పారిజాతం, కల్పవృక్షం,     
       సంతానం, హరిచందనం.

17. పంచోపచారాలు : 5.
        స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం,       
        నమస్కారం.

18. పంచాగ్నులు : 5.
        బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని,        
        సూర్యాగ్ని.

19. పంచామృతాలు : 5.
        ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర,      
        తేనె.

20. పంచలోహాలు : 5.
       బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.

21. పంచారామాలు : 5.
        అమరావతి, భీమవరం, పాలకొల్లు, 
        సామర్లకోట, ద్రాక్షారామం.

22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు : 5.
         ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, 
         వాసంతి, వారణావతం.

23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.
         శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం,   
         జ్యోతిష్యం, కల్పం.

24. షడ్రుచులు : 6.
        తీపి, పులుపు, చేదు, వగరు, కారం,  
        ఉప్పు.

25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.
         కామం, క్రోధం, లోభం, మోహం, 
         మదం, మత్సరం.

26. ఋతువులు : 6.
         వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, 
          హేమంత, శిశిర.

27. షట్చక్రాలు : 6.
        మూలధార, స్వాధిష్టాన, మణిపూరక, 
        అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.

28. షట్చక్రవర్తులు : 6.
         హరిశ్చంద్రుడు, నలుడు,సగరుడు,         
         పురుకుత్సుడు, పురూరవుడు,  
         కార్తవీర్యార్జునుడు.

29. సప్త ఋషులు : 7.
         కాశ్యపుడు, గౌతముడు, అత్రి, 
         విశ్వామిత్రుడు, భరద్వాజ, జమదగ్ని, 
         వశిష్ఠుడు.

30. తిరుపతి సప్తగిరులు : 7.
       శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,       
       వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.

31. కులపర్వతాలు : 7.
       మహేంద్ర, మలయ, సహ్యం,    
       శుక్తిమంతం, గంధమాధనం, వింధ్య, 
       పారియాత్ర.

32. సప్త సముద్రాలు : 7.
          ఇక్షు, జల, క్షీర, లవణ, దది, సూర, 
          సర్పి.

33. సప్త వ్యసనాలు : 7.
          జూదం, మద్యం, దొంగతనం, వేట, 
         వ్యబిచారం, దుబారఖర్చు, కఠినంగా 
         మాట్లాడటం.

34. సప్త నదులు : 7.
          గంగ, యమునా, సరస్వతి, గోదావరి,            
           సింధు, నర్మద, కావేరి.

35. ఊర్ధ్వలోకాలు : 7.
          భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో,        
          మహా, సత్య.

36. అధోః లోకాలు : 7.
           అతల, వితల, సుతల, తలాతల, 
           రసాతల, మహాతల, పాతాళ.

37. జన్మలు : 8.
          దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, 
          పక్షి, జలజీవ, కీటక.

38. కర్మలు : 8.
            స్నానం, సంధ్య, జపం, హోమం,            
            స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, 
            వైశ్యదేవం.

39. అష్టదిగ్గజాలు : 8.
        ఐరావతం, పుండరీకం, కుముదం,     
        సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, 
        వామనం, పుష్పదంతం.

40. అష్టదిగ్గజకవులు : 8.
          నందితిమ్మన, పెద్దన, ధూర్జటి,       
          పింగళి సూరన, తెనాలిరామకృష్ణ,    
          రామరాజభూషణుడు, 
          అయ్యలరాజురామభద్రుడు, 
          మాదయగారిమల్లన.

41. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు : 8.
         రుక్మిణి, సత్యభామ, జాంబవతి, 
         మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, 
         లక్షణ.

42. అష్ట భాషలు : 8.
        సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, 
        సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.

43. నవధాన్యాలు : 9.
            గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, 
            కందులు, నువ్వులు, మినుములు, 
            ఉలవలు, అలసందలు.

44. నవరత్నాలు : 9.
        ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం, 
        కెంపు, నీలం, కనకపుష్యరాగం, పచ్చ 
        (మరకతం), ఎరుపు (వైడూర్యం).

45. నవధాతువులు : 9.
         బంగారం, వెండి, ఇత్తడి, రాగి,  
         ఇనుము, కంచు, సీసం, తగరం, 
         కాంతలోహం.

46. నవరసాలు : 9.
            హాస్యం, శృంగార, కరుణ, శాంత,        
            రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, 
            వీర.

47. నవబ్రహ్మలు : 9.
           మరీచ, భరద్వాజ, అంగీరసుడు,  
           పులస్య్తుడు, పులహుడు, క్రతువు,  
           దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.

48. నవ చక్రాలు : 9.
            మూలాధార, స్వాధిష్టాన, నాభి,        
            హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు,      
            గగన, బ్రహ్మ రంధ్రం.

49. నవదుర్గలు : 9.
         శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట,  
         కూష్మాండ, స్కందమాత, కాత్యాయని,  
          కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.

50. దశ బలములు : 10.
           విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార,  
          సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.

51. దశ సంస్కారాలు : 10.
           వివాహం, గర్భాదానం, పుంసవనం,  
           సీమంతం, జాతకకర్మ, నామకరణం,  
           అన్నప్రాశనం, చూడకర్మ, 
           ఉపనయనం, సమవర్తనం.

52. దశ మహాదానాలు : 10.
             గో, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర,         
             నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, 
             బెల్లం.

53. అర్జునుడికి గల పేర్లు: 10.
             అర్జునుడు, పార్ధుడు, కిరీటి,  
             శ్వేతవాహనుడు, బీభత్సుడు,        
             జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి,  
             ధనుంజయుడు, పాల్గుణుడు.

54. దశావతారాలు : 10.
           మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, 
           వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ,  
           బుద్ధ, కల్కి.

55. జ్యోతిర్లింగాలు : 12.     
             హిమలయపర్వతం:
                   1. కేదారేశ్వరలింగం,

                   కాశీ: 2.కాశీవిశ్వేశ్వరుడు,

        మధ్యప్రదేశ్: 3.మహాకాలేశ్వరలింగం,                   
                           4.ఓంకారేశ్వరలింగం.

          గుజరాత్: 5.సోమనాధలింగం,   
                          6.నాగేశ్వరలింగం.

          మహారాష్ట్ర :7.భీమశంకరం, 
                             8.త్ర్యంబకేశ్వరం,             
                             9.ఘృష్ణేశ్వరం, 
                            10.వైద్యనాదేశ్వరం.

           ఆంధ్రప్రదేశ్:
                  11.మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

            తమిళనాడు:  12.రామలింగేశ్వరం.

56. షోడశ మహాదానాలు : 16.
             గో, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య,                    
             దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, 
             రధ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి  
             (దున్నపోతు).

57. అష్టాదశవర్ణనలు : 18.
            నగరం, సముద్రం, ఋతువు, 
            చంద్రోదయం, అర్కోదయం,  
           ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం,  
            రతోత్సవం, విప్రలంభం, వివాహం, 
            పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, 
            ప్రయాణం, నాయకాభ్యుదయం, 
            శైలము, యుద్ధం.

58. అష్టాదశ పురాణాలు : 18.
              మార్కండేయ, మత్స్య, భవిష్య,         
              భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, 
              బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, 
              వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, 
              గరుడ, కూర్మ, స్కాంద.

59. భారతంలో పర్వాలు : 18.
             ఆది,సభా,అరణ్య,విరాట,ఉద్యోగ,  
             భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తి,        
             శాంతి, అనుశాసన, అశ్వమేధ, 
             ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, 
             స్వర్గారోహణ.

60. సంస్కృత రామాయణంలో 
                               కాండలు: 6.

           బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింద,  
           సుందర,యుద్ధ.
              (తెలుగులో7వకాండ    
                     ఉత్తర. (లవకుశ కథ).


61. శంఖాలు వాటి పేర్లు:
          భీముడు      - పౌండ్రము
          విష్ణువు       -పాంచజన్యం
          అర్జునుడు -  - దేవదత్తం.

62. విష్ణుమూర్తి ఆయుధాల పేర్లు:              
           ధనస్సు - శారంగం,
           శంఖం-పాంచజన్యం,
           ఖడ్గం- నందకం,
           చక్రం - సుదర్శనం.

63. విల్లులు పేర్లు:
               అర్జునుడు   - - గాంఢీవం
               శివుడు        - - పినాకం
               విష్ణువు        - శారంగం

64. వీణలు--పేర్లు:
               కచ్చపి---సరస్వతి,
                మహతి---నారధుడు,
                కళావతి---తుంబురుడు.

65. అష్టదిక్కులు-పాలకులు-ఆయుధాలు:

తూర్పు           ఇంద్రుడు       వజ్రాయుధం 
పడమర         వరుణుడు          పాశం
ఉత్తర             కుబేరుడు          ఖడ్గం
దక్షిణం           యముడు          దండం
ఆగ్నేయం            అగ్ని                 శక్తి 
నైరుతి               నిరృతి            కుంతం 
వాయువ్యం     వాయువు         ధ్వజం 
ఈశాన్యం        ఈశానుడు        త్రిశూలం. 

66. మనువులు                   మన్వంతరాలు 
------------------         - - - - - - - - - - 
స్వయంభువు    -             స్వారోచిష 
ఉత్తమ             -            తామసి 
రైతవ                  -              చాక్షువ 
వైవస్వత             -            సవర్ణ 
దక్ష సువర్ణ        -              బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ   - ----------     రుద్రసవర్ణ 
రౌచ్య       ----------------    బౌచ్య .

67. సప్త స్వరాలు :
స -   షడ్జమం    - (నెమలిక్రేంకారం) 
రి    - -   రిషభం    - -    (ఎద్దురంకె) 
గ   - -    గాంధర్వం - -   (మేక అరుపు) 
మ  - -   మధ్యమ - - ( క్రౌంచపక్షికూత) 
ప - -     పంచమం  - - (కోయిలకూత) 
ద   - -   దైవతం     -  (గుర్రం సకిలింత) 
ని - -     నిషాదం   - (ఏనుగుఘీంకారం)

68. సప్త ద్వీపాలు:
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు 
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -     ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు69. తెలుగు నెలలు: 12
              చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, 
              శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, 
              కార్తీకం, మార్గశిరం, పుష్యం, 
              మాఘం, ఫాల్గుణం.

 70. రాశులు :12.
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,
సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.

71. తిథులు 15.
పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.

72. నక్షత్రాలు 27.
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాబాద్ర, రేవతి
Read More

త్రివిధ త్యాగాలు:

త్రివిధ త్యాగాలు:

ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. 

ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం.     మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.

యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్

తా" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? 

ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 

మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.

రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.

మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే 
నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి. 

సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? 
ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు. 

ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి. అది...
 సర్వేజనా స్సుఖినోభవంతు
Read More

శ్రీకాకుళం గొప్ప చరిత్రకు ప్రసిద్ది.

శ్రీకాకుళం గొప్ప చరిత్రకు ప్రసిద్ది. 

ఈ అద్భుతమైన జిల్లా ఒకసారి కళింగలో భాగంగా ఉంది, 3 వ శతాబ్దపు బి.సి. యొక్క భూస్వామ్య గణతంత్రం, ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుండి ఒడిషాలోని ఆధునిక కటక్ వరకు విస్తరించి ఉంది. 

చక్రవర్తి అశోకా బి.సి.లో దానిని స్వాధీనం చేసుకునే వరకు, మౌర్యులకు వ్యతిరేకంగా దీర్ఘకాలం ఉన్నది ఈ ప్రాంతం మాత్రమే. 

బి.సి 262-261. అశోకుని ప్రభావంతో, బౌద్ధమతం శ్రీకాకుళం జిల్లాలోని దంతపురి, శాలిహుండం, జగతీమెట్ట మరియు కళింగపట్నం వంటి అనేక ప్రాంతాలకు వ్యాపించింది. శ్రీకాకుళం పట్టణం శివార్లలో బౌద్ధ స్థలాలను కనుగొన్నారు. ఖరీవాలా సమయంలో జైనమతం కళింగ ప్రాంతానికి కూడా ప్రభావితమైంది. చరిత్రకారులు, సంగమయ్యకొండ, శ్రీ ముఖలింగం, విష్ణుకొండ మరియు ఇతర ప్రాంతాల్లో జైనమతం అనుసరించినట్టు ఆధారాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేసారు.

మొదటి మరియు మూడో శతాబ్దాల మధ్య 
ఈ ప్రాంతం శక్తివంతమైన శాతవాహన రాజుల అధికార పరిధిలోకి వచ్చింది. 

ఏ.డి. 350 నాటికి, ఈ ప్రాంతం పిఠాపురం యొక్క వశిష్టపుట శక్తీర్మా రాజ్యంలో భాగంగా ఉంది. ఇది గంగ రాజవంశంలో ఏ.డి. 440 నాటిది. గంగ మరియు మాతారా రాజవంశాలు అనేక శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని నియంత్రించాయి, మరియు వారి పాలనలో శ్రీకూర్మం మరియు శ్రీ ముఖలింగం వంటి ప్రధాన ఆలయాలు నిర్మించబడ్డాయి. 

విజయనగర వంశం యొక్క కృష్ణదేవరాయలు ఈ ప్రాంతంపై ప్రయాణిస్తూ మూడుసార్లు దాడి చేశారు, ప్రతాపరుద్ర గజపతి పాలనలో ఇది జరిగింది,     ప్రతాప రుద్ర మంత్రి గోవింద్రరాజా ఈ ప్రాంతాన్ని పాలించారు, 1572 నుండి గోల్కొండ నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

1687 లో శ్రీకాకుళం గుల్షానాబాద్ పాలనలో ఒక గ్రామం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిషాలోని కొన్ని ప్రాంతాలకు తమ డబ్బు లావాదేవీలకు ఫౌజ్దారి కేంద్రంగా ఏర్పడింది. గుల్షానాబాద్ అనే పదం పెర్షియన్ పదాలు, గులాబీ తోట మరియు బెందీ (బెండింగ్) నుండి వచ్చింది. 

1707 నుండి హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో ఆదాయ సేకరణ కోసం శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాల సమయంలో 1756 లో బ్రిటీష్ ఇంపీరియలిస్టులు ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు ఈ జిల్లా నుండి బయటపడ్డారు. 1759 లో ఫాజ్దారీ పరిపాలన ముగిసింది మరియు బ్రిటిష్ పాలన మొదలైంది, మరియు శ్రీకాకుళం పట్టణం గంజాం జిల్లాలో భాగంగా ఉంది మరియు విశాఖ జిల్లాలో పాలకొండ మరియు రాజాంగం ప్రాంతాలు చేర్చబడ్డాయి.

బ్రిటిష్ పాలన తరువాత, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా నుండి విభజన ద్వారా 1950 లో ఏర్పడింది, కొంతకాలంగా దాని ప్రాదేశిక అధికార పరిధి చెక్కుచెదరలేదు. అయితే 1969 నవంబర్లో, విశాఖపట్నం జిల్లాలోని కొత్తగా ఏర్పడిన గజపతినగరం తాలూకా బొబ్బిలి తాలూకా నుండి 44 గ్రామాలు సాలూరు తాలూకా నుండి 63 గ్రామాలు కోల్పోయాయి. 1979 మేలో విజయనగరంలోని ప్రధాన జిల్లాతో కొత్త జిల్లా ఏర్పడటం వలన ఈ జిల్లా ప్రధాన భూభాగ మార్పులకు దారితీసింది. ఇది సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలు కొత్త జిల్లాకు మార్చబడ్డాయి.

*అరసవల్లి:
అరసవల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణస్వామి దేవస్థానం సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంత జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి తూర్పున ఉంది. ఇది మన దేశంలో రెండు సూర్య దేవాలయాలలో పురాతనమైనది. పద్మ పురాణం ప్రకారం, మానవజాతి యొక్క సంక్షేమం కొరకు కశ్యపారాజు అరసవల్లిలో సూర్య విగ్రహంను స్థాపించారు. సూర్యడు కశ్యపాస గోత్రం అందువలన, అతను గ్రహ రాజుగా కూడా పిలువబడ్డాడు. దేవాలయం యొక్క 'స్ధలపురాణం ' ప్రకారం కశ్యపారాజు ఈ దేవాలయాన్ని స్థాపించి, సూర్యుని యొక్క ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు.

*శ్రీకూర్మము:
విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీకూర్మము ఒకటి. శ్రీకూర్మము విష్ణువు యొక్క రెండవ రూపం, అతను ఒక తాబేలు యొక్క అవతారరంలో ఇక్కడ "శ్రీ కుర్మానాథ" రూపంలో శ్రీకూర్మం అనే గ్రామంలో వెలిసాడు. విష్ణువు "కుర్మావతారా" లో చూడబడిన ఆలయం మొత్తం దేశంలో ఇది ఒక్కటి మాత్రమే. కొన్ని శిలాశాసనాలు ప్రకారం ఈ ఆలయం శివునికి ప్రధాన ఆలయం మరియు శైవులచే (శివ భక్తులు) పూజింపబడినవి. ఇది తరువాత శ్రీ రామనుజాచార్యులు చే వైష్ణవకు మార్చబడింది. ఆలయం ఏకముఖి శిల నుండి నిర్మించబడి ఉంటుంది. దేవాలయ స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి, వాటిలో ఎక్కువ భాగం దేవనాగరి (స్క్రిప్టింగ్ లాంగ్వేజ్) లిపిలో 11 వ నుండి 19 వ శతాబ్దం AD వరకు ఉండేవి. ఈ ఆలయ నిర్మాణ శైలి అందమైన శిల్పాలతో అద్భుతంగా నిర్మించబడింది.

*శాలిహుండం:
శాలిహుండం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం లో ఒక గ్రామం మరియు పంచాయితీ. ఇది కళింగపట్నానికి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన, వంశధార నదికి దక్షిణాన ఉంది, శ్రీకాకుళం పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది దీనిని సాలివాటికా, సలియపటికా అని పిలిచేవారు. సుందరమైన పరిసరాల మధ్య అనేక కొండల స్తూపాలు మరియు కొండపై ఉన్న భారీ సన్యాస సంక్లిష్టాలు ఉన్నాయి. 1919 లో ఈ స్థలాన్ని గుడిగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. త్రవ్వకాలలో స్మారక కట్టడాలు, నాలుగు స్తూపాలు, చైత్యగ్రిహా, నిర్మాణ ప్రాంతాలు మరియు బౌద్ధమతం యొక్క మూడు దశలను ప్రతిబింబించే అనేక శిల్పాలు, తెరవాడ, మహాయాన మరియు వజ్రయానలు సుమారు 2 వ దశాబ్దంలో కనుగొన్నారు. 'తారా' మరియు మారిచిల విగ్రహాలు ఈ ప్రదేశంలో కనుగొనబడ్డాయి, మరియు ఇక్కడ నుండి బౌద్ధమతం సుమిత్ర మరియు ఇతర దూర ప్రాచ్య దేశాలకు విస్తరించింది.

*శ్రీముఖలింగం:
శ్రీముఖలింగం దేవాలయం వంశధార నది ఎడమ ఒడ్డున ఉన్న శివునికి అంకితం చేయబడింది. అందంగా చెక్కబడిన ఈ దేవాలయం శివుని మూడు రూపాలకి చెందిన ముకులింగేశ్వర, భీమేశ్వర మరియు సోమేశ్వర మూడు దేవాలయాల సమూహం. ఈ ఆలయం ఇండో-ఆర్యన్ శైలిలో నిర్మించబడింది. అద్భుతమైన శిల్పాలు, క్లిష్టమైన శిల్ప శైలి చూడడానికి ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఈ దేవాలయ నిర్మాణ శైలి చాలా సొగసైనది. పెద్ద ఆలయ ప్రవేశ ద్వారం, మెట్ల మార్గం మరియు రెండువైపుల రెండు సింహాలు నిర్మించారు. మొదటి గేటు బయటి ప్రకారానికి మిమ్మల్ని తీసుకెళుతుంది.

*కళింగపట్నం:
కళింగపట్నం గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇది భారతదేశంలో పశ్చిమ ఆక్రమణదారుల ఆగమనం వరకు ఉంది. ఐరోపా వర్తకులు వారి నౌకల సరుకు రవాణా కోసం ఓడరేవును తయారు చేశారు. 1958 వరకు, మలేషియా మరియు సింగపూర్ నుండి భారీ నౌకలు ఈ నౌకాశ్రయానికి వచ్చాయి, ఇందులో సుగంధాలు, వస్త్రాలు మరియు అనేక ఇతర వస్తువులు ఎగుమతి చేయబడ్డాయి. స్థానిక బీచ్ లలో విస్తృతమైన భారీ కోకో తోటలు ఉన్నాయి. బ్రిటీష్ పాలనలో, దేశంలో ప్రవేశించడానికి ఇతర ఆక్రమణదారులను నివారించడానికి ఈ ఓడరేవు మూసివేయబడింది. అయితే బ్రిటిష్ కాలంలో నిర్మించిన లైట్ హౌస్ ఇప్పటికీ పోర్ట్ సమీపంలో ఉంది.

*కవిటి:
కవిటి గ్రామం జిల్లా కేంద్రం నుండి 130 కిలోమీటర్ల దూరంలో రెండు ప్రాంతాల నుండి సోంపేట మరియు ఇచ్చాపురం మధ్య తూర్పు వైపు ఉంది. ఉద్దానం (ఉద్యానవనం) అని పిలవబడే కవిటి మండల ప్రాంతం. ఈ ప్రదేశం తీరప్రాంతంలో, కొబ్బరి, కాషెవత్ట్, జాక్ మరియు ఇతర పండ్ల చెట్లతో విస్తరించి ఉన్న ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఉద్దానం ప్రాంతం సందర్శకులకు ఒక సుందరమైన ప్రదేశం. రెండు ప్రసిద్ధ ఆలయాలు చింతామణి అమ్మవారి మరియు శ్రీ సీతారామ స్వామి ఆలయం ఈ గ్రామంలో ఉన్నాయి.

*బారువ:
సోంపేట మండలంలో బారువా శ్రీ కాకుళం పట్టణం నుండి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధి చెందిన శ్రీ కోటిలింగేశ్వర స్వామి, జనార్ధన స్వామి ఆలయం ఈ ప్రదేశంలో ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఒక కొబ్బరి నర్సరీ మరియు ఇక్కడ ఉన్న ఒక కాయిర్ పరిశ్రమ ఉంది. మహేంద్ర తనయ నది ఈ ప్రదేశంలో సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ‘బరువా’ ఒక ముఖ్యమైన ఓడరేవు. సముద్ర మట్టం పైన పదిహేను అడుగుల ఎత్తు, ఓడరేవుని గుర్తించబడింది. కొబ్బరితోటలు మరియు వరి పొలాలు విస్త్రుతంగా ఉన్నాయి.

*తేనెనీలాపురం:
శ్రీకాకుళం నుండి 65 కిలోమీటర్లు మరియు టెక్కలి మండలంలో టెక్కలి నుండి 7 కిలోమీటర్ల దూరంలో తేనెనీలాపురం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరులో సైబీరియా నుండి సెప్టెంబరులో 3,000 మందికి పైగా పెలికాన్లు మరియు పెయింటెడ్ కొంగలు సందర్శిస్తాయి మరియు మార్చ్ వరకు ఉంటాయి. ఇది పక్షి పరిశీలకులకు స్వర్గం. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు 15 ఏళ్ళుగా ఈ పక్షులు వైమానిక మార్గాలను అనుసరిస్తున్నాయి అని పరిశోధనలో తెలిపారు. మొదట 15 సంవత్సరాల క్రితం వలస లు గుర్తించబడినవి. ఆ సమయంలో పక్షులు సంఖ్య 10,000 కు చేరుకుంది. నేడు, ఈ సంఖ్య 3,000 కు తగ్గించబడింది. జిల్లాలో తెలీనిపురం, ఇజ్జువ్రం నౌపద, టెక్కలి మరియు పరిసర ప్రాంతాలలోని గ్రామాలుకు రష్యా, మలేషియా, హంగేరీ, సింగపూర్ మరియు జర్మనీ, సైబీరియాకు చెందిన 113 వివిధ జాతుల పక్షులు సందర్శిస్తాయి.

*మందస:
సోంపేట టౌన్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం మెహేంద్రగిరి పాదంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నతస్థాయిలో ఉన్న ఒక కోట ఈ పర్యాటక ఆకర్షణ. ఈ గ్రామంలో వరాహస్వామి దేవాలయం పర్యాటకుల దృష్టి ఆకర్షిస్తుంది.

*రాజాం:
రాజాం లేదా రజాం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక జనాభా గణన పట్టణం, మునిసిపాలిటీ మరియు మండల ప్రధాన కార్యాలయం. రాజాం మండల్ సరిహద్దులు గోంగువరి సిగదం, శానకవాటి మరియు శ్రీకాకుళం జిల్లా మరియు విజయనగరం జిల్లాలోని రెడ్డి ఆమదాలవలస మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజాం శ్రీకాకుళం పట్టణం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం బొబ్బిలి యొక్క వాలియంట్ సర్దార్ అయిన సర్దార్ పాపారాయుడు సంబంధం కలిగి ఉంది.
Read More

ప్ర: సంస్కృతికి, సంస్కారానికీ తేడా ఏమిటి? శాస్త్రపరంగా వాటి అర్థాలేమిటి? వాటి అవసరమేమిటి?

ప్ర: సంస్కృతికి, సంస్కారానికీ తేడా ఏమిటి? శాస్త్రపరంగా వాటి అర్థాలేమిటి? వాటి అవసరమేమిటి?

జ: సంస్కారం, సంస్కృతి- రెండూ సమానార్థకాలే.  ముడిగా దొరికే బంగారాన్ని అగ్ని ద్వారా శుద్ధి చేసినట్లుగా,  పశుప్రాయంగా పుట్టిన మానవుని సంస్కరించడమే సంస్కారం. "సంస్క్రియతే జ్ఞానయోగ్యతామాపాద్యతే పురుషస్య చిత్తమనే నేతి సంస్కారః"- అని ఉత్పత్తి.  చిత్తాన్ని శుద్ధి చేసి, దానిని ఆత్మజ్ఞాన యోగ్యంగా చేయడమే సంస్కారం.  సంస్కారాలు రెండు రకాలు: 1. దోషాన్ని పోగొట్టేవి, 2. యోగ్యతను, గొప్పతనాన్ని కల్పించేవి.జననానికి పూర్వరంగంగా తల్లిదండ్రులకు చెందిన మైథున సంకల్పాది పైతృక బీజ దోషాలను పరిహరించేవి- గరదాన,  జాతకర్మ, చౌలాది సంస్కారాలు. మిగిలనవి యోగ్యతను కలిగించేవి.

తాత్పర్యంగా- అంతఃకరణం శుధ్ధికోసమే సంస్కారాలు. తగిన సంస్కారానిచ్చి దీక్షలను,  ఉపదేశాలను అందించడం సంప్రదాయం. ఆ దీక్షాదుల వల్ల జీవుడు మరింత శుద్ధుడౌతాడు. "ఒక విగ్రహాన్ని శిల్పించదలచిన శిల్పి, రాతిపై అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంకేతాలను పెట్టుకొని, దాని ననుసరించి రేఖలను నిర్మించి,  అటుపై చెక్కి తాననుకున్న రూపాన్ని ఎర్పర్చుతాడు. ఇన్ని సంస్కారాల వలన ఆ చిత్రం,  శిల్పం ఒక సృష్టిస్వరూపం ధరించి చూపరులకానందం కలిగిస్తుంది. ఈ విధంగానే మంత్రద్రష్టలైన మహర్షులు ఏర్పరచిన సంస్కారాలతో పశుప్రాయమైన జన్మ,  పరిపూర్ణతకు దారితీస్తుంది"-  అని పరాశర మహర్షి వివరించారు.
Read More

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనా తీతం. పూరీ ఆలయంలోనిh నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపా లిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే 'ఆనంద బజార్' లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండు తారు. భోగ మంటపానికి చేరువలోని 'గంగ', 'యమున' అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభై వేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లో | నైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని | భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను 'మహాప్రసాదం'గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆర గిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం , నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాహ్ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం , పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళి (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)

9. ఒరియా పొఖాళి (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 18. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గోధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. జొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. యిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రోసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాభాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖోజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగోడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాం (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగో (తోటకూర వంటకం) 51. పొటోలో రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గోటి బైగొణా (గుత్తివంకాయ కూర) 53. ఖోటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)
Read More

కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతం, ప్రపంచ సంగీత రీతులన్నింటిలోకీ విశిష్టతను పొందటానికి,ఆసంగీతంలోని రచనలు ఒక ప్రధాన కారణము.వాటిని రూపొందించిన వాగ్గేయకారులు మనకు సదా స్మరణీయులు.
సంగీత రచనలను రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు.1.అభ్యాస రచనలు, 2.సభా గాన రచనలు.
అభ్యాస రచనలు అంటే,విద్యార్థులు తమ ఇళ్ళలో సాధనచేసుకోవలసినవి.సభా గాన రచనలు అంటే,ఒక స్థాయికి చేరుకొన్న కళాకారులు,సభలలో గానం చేయదగినవి..
1. అభ్యాస రచనలు : సరళీవరుసలు,జంట వరుసలు,దాటు వరుసలు,స్థాయి వరుసలు,గీతములు,శూళాదులు,చిట్ట తానములు,స్వర పల్లవులు,స్వర జతులు,వర్ణములు...మొదలైనవి.

--సరళీ వరుసలు--
ఆరోహణ,అవరోహణ తో ప్రారంభించి,సప్తస్వరాలను వివిధరకాలుగా అమర్చి,పాడే అభ్యాసం
--జంట స్వరాలు--
ప్రతి స్వరాన్ని రెండు సార్లు పలుకుతూ స్ఫురిత గమకంతో చేసే స్వర అభ్యాసం
--దాటు స్వరాలు--
స్వరాల క్రమంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా వదలి,దాటుతూ చేసే అభ్యాసం
--స్థాయి వరుసలు--
స్వరాలను మంద్ర,మధ్యమ,తార స్థాయిలలో పాడే అభ్యాసం
( పైన తెలిపిన అభ్యాస రచనలను 'కర్ణాటక సంగీత పితామహులు' పురందరదసులవారు మాయామాళవగౌళ రాగంలో రూపొందించారు).
--గీతములు--
గీతములు సులభతరమైన సంగీత రచనలు.సరళీవరుసల నుండి స్థాయి వరుసల వరకూ ధాతు(స్వర) సాధన చేసిన సంగీత విద్యార్థికి,మాతు(సాహిత్యం) పరిచయం,గీతాల నుండే ప్రారంభమౌతుంది.వీటిలో పల్లవి,అనుపల్లవి,చరణం వంటి విభాగాలు ఉండవు.సంగతులుండవు.క్రియకు ఒక అక్షరం చొప్పున గమనముంటుంది.
గీతాలలో విఘ్నేశ్వర స్థుతితో కూడుకొన్న వాటికి 'పిళ్ళారి గీతాలు' అని పేరు.పురందరదాసులవారు ఇవి రచించారు.
రాగలక్షణాలను వివరించే గీతాలను లక్షణ గీతాలని, నాట,గౌళ,ఆరభి,వరాళి,శ్రీరాగము-ఈ అయిదు రాగాలలో రచింపబడిన గీతాలను 'ఘనరాగ గీతాలని', వివిధ రాగాలు ఒకే గీతములో ప్రయోగించబడితే, వాటిని 'రాగమాలికా గీతాలని' పిలవటం కద్దు.
వెయ్యికి పైగా గీతాలను రచించిన కారణంగా, పైడాల గురుమూర్తి శాస్త్రిగారిని,' వేయి గీతాల శాస్త్రి' అని పిలిచేవారు.
--సూళాదులు--
గీతాలను పోలిన రచనలు ఇవి.పురందరదాసు,అన్నమయ్య వీటిని రచించారు.వీటిలో తాళమాలికలు కూడా ఉన్నవి.
--చిట్ట తానములు--
మనోధర్మ అంశమైన తాన సాధనకు ఉపకరించే రచనలు.వీణవాదకులు,ఈరచనలను వివిధ రాగాలలో సాధన చేస్తే,తానములోని మీటు చక్కగా పలుకుతుంది.వీటికే 'కటకములు' అనికూడా పేరు ఉంది.ఘనరాగ కటకాలు కూడా వాగ్గేయకారులచే రచింపబడ్డాయి.
--స్వరపల్లవులు--
వీటికే 'జతి స్వరములు' అని పేరు కూడా ఉంది.వీటిలో స్వరము మాత్రమే ఉంటుంది.పల్లవి,చరణాలను కలిగిన రచనలివి.సాధారణంగా ఇవి,క్రియకు ఒక అక్షర కాలము కాక,నాలుగు అక్షరకాలము నడుస్తాయి.కాల,పైకాలాలు పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.
--స్వరజతులు--
వీటిలో పల్లవి,చరణాలు ఉంటాయి.మంచి రాగ,సాహిత్య భావములతో కూడి,కచేరీలలో సైతం పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రిగారు స్వరజతులు వ్రాసినవారిలో ప్రసిద్ధులు.
--వర్ణములు--
సంగీత విద్యార్థికి,రాగాలను గురించిన సంపూర్ణ అవగాహన కల్పించేది వర్ణము.పల్లవి,అనుపల్లవి,చరణము,చిట్టస్వరాలతో కూడుకొని ఉంటుంది.తాన సాధనకు ఎంతో దోహదకారి కనుక,దీనిని 'తాన వర్ణం' అని పిలుస్తారు.ఆది,అట,ఝంపె తాళాలలో వర్ణరచన ఎక్కువగా జరిగింది.సంగతులతో కూడి,స్వర సాహిత్య సహితంగా ఉండే వర్ణాలను 'పద వర్ణాలు' అంటారు.మనోధర్మ సంగీత అంశాలైన రాగాలాపన,స్వర ప్రస్థారం,నెరవు,తానం,పల్లవి-వీటిని సాధించాలంటే,సంగీత విద్యార్థికి వర్ణ సాధన తప్పనిసరి. అభ్యాస రచనలైనప్పటికీ,కచేరీలో మొదటి అంశంగా వర్ణం తీసుకుంటే, గాయకుని గాత్రం సానుకూలమౌతుంది.వాదకునికి చేయి స్వాధీనమౌతుంది.స్వరజతులు,వర్ణాలు నృత్య ప్రదర్శనకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

2. ఇక, సభాగాన రచనల విషయానికొస్తే..అవి అసంఖ్యాకాలు.వాటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...
--కృతులు--
రాగప్రధానమైన రచనలు.అనేక సంగతులతో కూడుకొని,పల్లవి,అనుపల్లవి,చరణము/లు,అనుబంధము,వంటి విభాగాలతో ఉంటాయి.కొన్ని కృతులలో చిట్టస్వరాలు,సోల్కట్టు స్వరాలు(మృదంగ జతులతో కూడుకొన్నవి) కూడా కనిపిస్తాయి.సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు,శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు కృతులు వ్రాసిన తొలి వాగ్గేయకారులు.వారు మువ్వురూ తమ కృతుల ద్వారా భగవదాకృతిని,తాము దర్శించి,మనకు దర్శింపచేశారు.వారి స్ఫూర్తితో ఎందరో మహానుభావులు కృతులు రచించారు.
--కీర్తనలు--
భక్తి ప్రధానమై,సంగీత జ్ఞానం పరిమితంగా ఉన్నవారు సైతం పాడుకోగలిగిన రచనలివి.సాధారణంగా కీర్తనలు పల్లవి,చరణాలను కలిగి ఉంటాయి.చరణలన్నీ ఒకే విధంగా పాడుకొనదగినవిగా ఉంటాయి.అన్నమయ్య తొలి సంకీర్తనాచార్యుడు.
--పదాలు--
శృంగార రస ప్రధాన రచనలు.రాగ నిధులైన పదాలు,విలంబ గతిలో పాడుకోవటానికి,నృత్యాభినయానికి కూడా అనుకూలంగా ఉంటాయి.క్షేత్రయ్య రచించిన పదాలు బహుళ ప్రసిద్ధాలు.
--జావళీలు--
పదాల వలెనే ఉండే, మరింత సులభ తరమైన శృంగార రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణాలను కలిగియుంటాయి.
పదాలు,జావళీలు తెలుగువారి సొత్తు.
--తిల్లానాలు--
మృదంగ తాళ జతులతో నడిచే అద్భుత రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణం,చరణానుపల్లవులతో కూడి,చరణములో సాహిత్యాన్ని కలిగి ఉంటాయి.నృత్యానికెంతో అనుకూలమైనవి.
--శబ్దములు--
నాట్య ప్రదర్శనకు మాత్రమే అనువైన రచనలు.సాహిత్యం,మృదంగ శబ్దం కలసి ఉండే రచనలు.
--దరువులు--
పదమును పోలియుండే నాట్య రచనలు.గేయ నాటకాలలో పాత్రధారి ప్రవేశిస్తున్నప్పుడు పాడేది ప్రవేశ దరువు,ఇద్దరు పాత్రధారుల సంభాషణను తెలిపేది సంవాద దరువు,పాత్ర స్వగతాన్ని తెలిపేది స్వగత దరువు,జతులతో ఉండేది జక్కిణ దరువు..ఈ విధంగా అనేక రకాల దరువులున్నాయి.
--సంచారి--
రాగలక్షణాన్ని తెలిపే గీతము వంటి రచన.
--రాగమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగాలతో కూడుకొన్న రచన.
--తాళమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,తాళాలతో కూడుకొన్న రచన.
--రాగతాళ మాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగ,తాళాల మాలికా రచన
--గుఛ్ఛ కృతులు--
ఒకే రచనావస్తువుపై చేయబడిన సామూహిక కృతులు.ఉదాహరణ:దీక్షితుల నవావరణ కృతులు,త్యాగరాజ పంచరత్న కృతులు.
--అష్టపదులు--
జయదేవకవి రచించిన 'గీతగోవింద' కావ్యములోని ఎనిమిది చరణములను కలిగిన సంస్కృత రచనలు.
--తరంగాలు--
శివనారాయణతీర్థు
Read More

Sunday, 14 January 2018

విశ్లేషణాత్మక కధనం ఏసూ దేవుడు కాదు అనడానికి ముఖ్యమైన కారణాలు----నిజమేనా ???? కాదా ????

ఏసూ దేవుడు కాదు అనడానికి  ముఖ్యమైన కారణాలు----నిజమేనా ????   కాదా ???? 
1)దేవుడు మార్పులేనివాడు (మలాకీ 3:6)
2)దేవుడు ఏసూ కన్నా గొప్పవాడు
(యోహాన్ 14:28)
3)సత్పురుషులు ఎవరూ లేరు ఏసూతో సహా ఒక్క దేవుడు తప్ప (లూకా 18:19)
4)ఆ గడియ గురించి ఏసూకు కూడా తెలీదంట.దేవుడికి మాత్రమే తెలుసని చెబుతున్నాడు (మార్కు 13:32)
5)ఏసూ ఇలా అన్నాడు "మన దేవుడు ఒక్కడే" (మార్కు 12:29)
6)ఏసూ ఇలా కూడా అన్నాడు ."నా దేవుడు మీ దేవుడు" (యోహాను 20:17)
7)ఏసూ సాకిలపడి దేవుడ్ని ప్రార్దించాడు.(మత్తయి 26:39)
8)ఏసూ 40 రోజులు సాతాను చేత శోదింపబడ్డాడు.(మత్తయి 4:1)..
కానీ దేవుడు శోదింపబడడు (యాకోబు 1:13)
9)దేవుడు అబద్దమాడుటకు మానవుడు కాడు.పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు (సంఖ్యాకాండం 23:19)
10)దేవుడిని ఎవరూ చూడలేదు
(1 యోహాను 4:20) కానీ ఏసును చూసారు.
11)దేవుడు ఎల్లప్పుడూ ఉండువాడు.(హుబుక్కు 1:12)
12)ఏసూను ప్రజలందరూ ఈయన దేవుడినుండి పంపబడ్డ ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చారు..(మత్తయి 21:10-11)
13)నేనే మీ దేవుడ్ని అని యెహోవా ప్రకటించాడు (యె హెజ్కేల్ 20:20)
కానీ ఏసూ ఎప్పుడూ అలా నేను దేవుడ్ని అని చెప్పలేదు
14)ఏసూ రాకడకు అసలు కారణం దేవుని సువార్త ప్రకటించటం.బలియాగం కాదు.
(మార్కు 1:38)
15)ఏసూ ఒక దాసుడు (మత్తయి 10:24,24:45,12:18), (యోహాను 13:16)
16)ఏసూ ఒక ప్రవక్త (మత్తయి 8:20,13:16,21:11) (మార్కు 6:15,6:4,9:37) (లూకా 7:16,9:8,9:19) (యోహాను 13:17,7:16,1:14,7:40)
17)ఏసూ మనుష్యకుమారుడు (మత్తయి 5:9,17:22,8:20,18:11,26:2) (లూకా 9:22)(యోహాను 5:27)
18)ఏసూ తనంతట తాను ఏమీ చేయలేడు (యోహాను 5:30)
19)తనని ఆరాధించమని చెప్పలేదు.దేవున్ని ఆరాధించమని చెప్పాడు (మార్కు 12:29)
20) ఏసే దేవుడైతే ఆ పంపిన వాడు ఎవడు??
( యోహాను 7: 16)
అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.
Read More

Friday, 16 June 2017

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...మీకు తెలుసా??

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...

1.Kedarnath (కేదారినాద్)


2. Kalahashti( కాళహస్తి)

3. Ekambaranatha- Kanchi(ఏకాంబరనాద్)

4. Thiruvanamalai(తిరువనమలై)

5. Thiruvanaikaval(తిరువనయ్ కావల్)

6. Chidambaram Nataraja(చిదంబర నటరాజన్)

7. Rameshwaram(రామేశ్వరం)

8. Kaleshwaram N-India(కాళేశ్వరం)

ఇవన్నీ శివుని దేవాలయాలు

కానీ దేవాలయాల్లో కామన్ గా వున్న ఒక గొప్ప విషయం.. ఈ దేవాలయాలన్నీ "79 డిగ్రీల రేఖాంశం" మీద వున్నాయి..

1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°

ఎటువంటి GPS పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ పూర్వపు రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాలు అన్ని ఒకే రేఖాంశం పైన నిర్మించిన మన పూర్వీకుల గురించి ఏంత పొగిడిన తక్కువే కదా....
Read More

త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.


స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు.ఆకాశం నుండి చూస్తే శ్రీ చక్ర ఆకారం స్పష్టంగా కనబడుతుంది.ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…
ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారు

ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి

శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు.
Read More

Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.

కానీ నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో అత్యంత నీచ రాజకీయాలు సంఘం లో చోటు చేసుకుంటున్నాయి. ఎదవలకి భాద్యతలు అప్పగించడం , మిగిలిన సంస్థలతో కలుపుకొని పోకుండా పిచ్చ రాజకీయాలు చేయడం సంఘంలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరికి అలవడింది....

వీటిని సరిచేసుకొని పోతే సంఘం మర్యాద ఉంటుంది లేకుంటే గాలిలో దీపమే!!

సంఘ కార్యం విచిత్రంగా ఉంటుంది. రోజు ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రదేశం లో స్వయంసేవకులు కలుస్తారు. గంట సేపు కార్యక్రమం. 45 నిమిషాలు శారీరక శిక్షణ, 10 నిమిషాలు ఒక దేశ భక్తిగీతం, సంస్కృత సుభాషితం,చిన్న కథ కాని, చర్చ కాని తరువాత 5 నిమిషాలు ప్రార్థన.

ఇంత విశాల సంస్థకు ఏ మనిషి గురువు కాదు. త్యాగానికి ప్రతీక అయిన భగవా పతాకమే గురువు. రోజూ పిల్లలని నిద్రలేపి, సమయానికి చేరుకునేట్టుగా చేయడానికి ఒక బృందం ఉంటుంది. శాఖా కార్యక్రమం తరువాత స్వయం సేవకుల ఇళ్లకు పోతారు. వ్యక్తుల కుటుంబాలతో సంబంధం. శాఖకు తీసుకు రావడం ఎంత ముఖ్యమో, వాళ్లకు శారీరక, మానసిక శిక్షణ తో పాటు, వారి మధ్య గరిష్ట స్నేహం కూడా అంతే ముఖ్యం.
అనేక ఇతర కార్యక్రమాల ద్వారా వారిలో దేశానికి కావలిసిన గుణాలు నేర్పిస్తారు. అటువంటి వారి మధ్య స్నేహం లో అనేక అవగుణాలు కడిగేయ బడతాయి. వారి కుటుంబాలకు కూడా సంఘం వారి సంస్థే.

ఒక సారి ఒక శిక్షా వర్గాల్లో వ్రాత పరీక్ష పేపర్ కి మార్కులు వేస్తున్నాను. ఈ పని రోజూ ఎందుకు చేయాలని ప్రశ్న. దానికి ఇంటర్ చదివే ఓ పిల్లాడు వ్రాసిన జవాబు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేశం లో 125 కోట్ల జాతీయులు మారడా నికి చేసే ప్రయత్నం రోజూ చేయక పోతే ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇది సంఘ కార్యం పట్ల స్వయంసేవకుల నిష్ఠ. పనిపై ఈ శ్రద్ధ వ్యక్తుల్లో మార్పు వారే సాధించు కుంటారు.

గుంటూరు లో పని చేస్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు నన్ను పరిచయం చేశారు మా కార్యకర్త. వీరు సంఘ పూర్తి సమయ కార్యకర్త అని చెప్పారు. RSS అంటే ఉదయం / సాయంత్రం వ్యాయామం చూస్తారే, అదేనా అన్నారు. నేను అవును అన్నాను. దానికి పూర్తి సమయ కార్యకర్త ఎందుకు? ప్రశ్న. సంఘంలో కనపడే కార్యక్రమం గంట సేపే కాని దృఢమైన సంస్థను నిర్మాణం చేయాలంటే ఇలాస్టి వారు కావాలి. పరిచయం అయిన ప్రతీ వాడు సంఘానికి నిరంతరం, జీవితాంతం పని చేయడానికి అలా కొంత మంది అయినా పని చేయాలండి, మా కార్యకర్త జవాబు. వారు కన్విన్స్ కాలేదు. ఫర్వాలేదు. వీరు లా చదువుకున్నారు అన్నాడు మా కార్య కర్త. మీరు సమయం వృధా చేస్తున్నారు, అన్నారాయన. నేను చిన్నగా నవ్వి సెలవు తీసుకున్నాను. మా జిల్లా ప్రచారక్ M Sc. Chemistry. వారు చేసే పని పిల్లలను శాఖా పనిలో నియుక్తులను చేయడం. వాళ్లకు వాళ్ళ డబ్బులతో యూనిఫామ్ కుట్టించుకునేట్లు చేయడం, పాట, ప్రార్థన కంఠస్థం చేయించడం, రోజూ శాఖకు తీసుకు రావడం. దీనికి ఇంత చదువు కున్నవాడు కావాలా? అనిపిస్తుంది. దేశం పై శ్రద్ధ నిర్మాణం చేయడం కి అటువంటి వాళ్ళు, బ్రహ్మ చారులుగా తమ జీవితం ఇస్తేనే వారి నుండి ప్రేరణ పొందే పిల్లలు శ్రద్ధా వంతులు అవుతారు. 70 సంవత్సరాల చరిత్ర అంతా అటువంటి శ్రద్ధా పూర్వక కార్య కర్తలు వల్లే.

ఒక దీపం నుండి మరొక దీపం వెలుగుతుంది. అదే చైతన్య దీప్తిని రగిలిస్తుంది. ఇది సంఘ ప్రాక్టికల్ అప్రోచ్.

నాగపూర్ లో మొదలైన ఒక శాఖ ఈ రోజు 55000 శాఖలకు చేరింది. అన్ని రాష్ట్రాలలో, వాటిల్లో అన్ని జిల్లాలలో, అన్ని తాలూకాలో, దాదాపు అన్ని మండలాల్లో స్వచ్చందంగా, వారి ఖర్చులు వారే భరించే విధంగా, మళ్లీ సంఘ పెరుగుదలకు కష్టపడి వారే గురుదక్షిణగా సమర్పించే లక్షలాది సభ్యులు ను నిరంతరమ్ తయారు చేస్తూఎదుగుతున్న సంస్థ, సంఘం. నమ్మాలనిపిస్తుందా? సంఘం లో కొచ్చిన వారికి ఈ నిజం తెలుసు. మీరూ చేరి ఈ సమార్పిత దేశ భక్తులవ్వండి.

ఇన్నేళ్ల సంఘం లో దేశం నాకేం ఇచ్చింది అని అడగడం నేర్పించదు. దేశానికి నేనేమి ఇవ్వాలో ఆలోచింప జేస్తుంది. నేనదే నేర్చు కున్నాను. అదే నేర్పుతున్నాను.
Read More

Thursday, 15 June 2017

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..
.
శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లలో స్వామి హనుమ అన్నిటా తానై మునిగి తేలుతున్నాడు. ప్రపంచము నలుమూలలనుండి రాజులు అయోధ్యకు తరలి వస్తున్నారు. వారికి రాజప్రాసాదాలలో వసతులు, ఆహారపానీయాదులు సరైన సమయానికి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ స్వామి హనుమ క్షణం తీరికలేకుండా శ్రమిస్తూన్నాడు. పైగా కోట్లాది వానర వీరులను వివి
ధ పనులలో నియంత్రించడము సామాన్యమైన విషయం కాదు గదా! ఇదంతా తల్లి సీతమ్మ గమనిస్తూ
స్వామి హనుమను పిలిచి " నాయనా శ్రీరామ పట్టాభిషేకము నీవు అనుకున్నట్లుగా సవ్యంగానే జరుగుతుంది. ముందు నీవు భోజనము చెయ్యి. నాలుగు ముద్దలు నీకు వడ్డిస్తాను. ఇలారా నాయనా! ఇలా కూర్చుని నేను వడ్డించే పదార్ధములు తృప్తిగా ఆరగించు!" అని ఆప్యాయంగా పిలిచించింది. సీతామాత అలా అప్యాయంగా పిలిచేసరికి స్వామి హనుమ కాదనలేక మాత వడ్డించిన ఆహారపదార్ధములు ఆరగించటము ప్రారంభించాడు. మాత వడ్డన, స్వామి ఆరగింపు సాగుతునే ఉన్నాయి. కోట్లాది అతిధులకై చేయించిన ఆహారపదార్ధములు " వడ్డించమ్మా! వడ్డించు" అని మెచ్చుకుంటూ స్వామి హనుమ ఇట్టే స్వాహా చేసేస్తున్నాడు. మాత సీత కంగారు పడుతూ చెలికత్తెలను పరుగులు తీయిస్తోంది. వారు ఇతర ప్రసాదాల వంటకాలు తరలిస్తూనే ఉన్నారు. అన్ని వంటకాల పాత్రలు ఖాళీ అవుతున్నాయి. శ్రీరామచంద్రుడు అక్కడ జరుగుతున్న సమాచారం తెలుసుకుని వచ్చి గోడవారగా నిలబడ్డాడు. సీతామాత ఆయన దగ్గరకు వెళ్ళి " అనంతమైన ఆహారపదార్ధములు హనుమ క్షుద్బాధ తీర్చలేక పోతున్నాయి. స్వామీ! ఏమి స్వామి! తరుణోపాయం చెప్పండి! " అని చేతులు జోడిస్తే, అప్పడు శ్రీరాముడు " సీతా! హనుమ అనుకుంటే ఎవరు అనుకున్నావు? రుద్రాంశ సంభూతుడు. నిన్ను, నన్ను కాపాడటానికి ఈ భువికి దిగిన పరమేశ్వరుడు. ఆయనకు పంచాక్షరీ మంత్రము మనస్సున తలచుకొని ఒక ముద్ద వడ్డించు. ఆయన తృప్తి పడతాడు" అని ఉపదేశిస్తాడు. సీతామాత ఒక ముద్ద చేతిలో తీసుకుని " నిన్ను సామాన్యునిగా తలచి, మాయలో పడ్డాను. నీ తల్లిని క్షమించు తండ్రీ! ఓం నమ:శివాయ" అంటూ స్వామి హనుమ విస్తరిలో వడ్డిస్తుంది. స్వామి హనుమ ఆ ముద్ద తృప్తిగా ఆరగించి " శ్రీరామా తృప్తాత్మా! " అంటూ త్రేన్చి ఉత్తారోపసనం చేసి " అన్నదాతా! సుఖీభవ! ! " అని భోజనం ముగిస్తాడు. ఆయన అలా అనగానే ఖాళీ అయిన ఆహారపదార్థాలు యధాతధంగా ఆయా పాత్రలలో వచ్చి చేరాయి.
Read More

Thursday, 23 February 2017

పంచాంగము అంటే ?? మానములు ఎన్ని రకములు వివరించండి ??

మానములు ఎన్ని రకములు వివరించండి ??

చాంద్ర మానం 
సౌర మానం 
సావన మానం 
నక్షత్ర మానం 
బార్హస్పత్య మానం 

చాంద్ర మానం = శుక్ల పాడ్యమి మొదలు చైత్రాది 12   మాసములు ఉండును. ఇందు ప్రభావాది ౬౦ నామములు కలది . 354  దినములు ఉండును 

సౌర మానం  = మేషాది ద్వాదశ రాశులందు  సూర్య సంక్రమణ చే ఏర్పడి 365  దినములు కలదు.

నక్షత్ర మానం = అశ్విని  మొదలు రేవతి వరకు ౨౭ నక్షత్రములలో చాంద్ర చారము చేత ఏర్పడి 12  నెలలు లేక 324  దినములు ఉండును. 

బార్హస్పత్య మానం = మేషాది రాశులందు గురు చారము చేత 361  దినములు ఉండును . 

పంచాంగము అంటే = 5 - అంగములు కలది . 1 . తిధి 2 .వారము 3 .నక్షత్రము 4. యోగము 5. కరణము
Read More

Sunday, 5 February 2017

వేదాలు పురాణాలువేదాలు పురాణాలు
వేదాల తరువాత అంత ప్రాముఖ్యత కలవి పురాణాలు . వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కధల రూపం లో, ఆఖ్యానాల రూపం లో సామాన్యులకు సైతం తెలియ చెప్పేవే పురాణాలు. అందుకే పురాణాలను పంచమ వేదం గా కీర్తించారు.

అసలు పురాణం అంటే : పురా అపినవం = పురాతనం అయినప్పటికీ నూతనం గా ఉండేది

అలాగే పురా ఆనతి అంటే పురాతన కాలం లో జరిగినది అని అర్ధం

వాయుపురాణం ప్రకారం = పురా ఏతత్ అభూత్ ( పూర్వం ఇలా జరిగింది అని అర్ధం )Read More

Saturday, 4 February 2017

మన రాజ్యాంగం, చట్టాలుమన రాజ్యాంగం, చట్టాలు
****************************

1) కొడుకు గాని కోడలు కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని,మరి ఎ ఇతర హిందూ బందువుల నుండిగాని,వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.


2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు ,పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు.
(సెక్షన్ 6,హిందూ మైనార్టీ &గార్డియన్ షిప్ చట్టం)
అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని,చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు ,దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు. (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం)

4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు,కూటములకు వెల్తున్నారా??
ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.
(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)

5) మతం మారిన వారు B.C -A,B,D గ్రూపుల
వారు O.C గా పరిగణించబడతారు.
అదే విధంగా క్రైస్తవ మతం పుచ్చుకున్న S.C లు B.C-C గాను ,ముస్లిం మతం పుచ్చుకున్న S.C లు O.C లుగా పరిగణింపబడుతారు.

6) మతం మార్చుకొని కూడా రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వారిపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.

7) S.C కోటాలో ఉద్యోగం సంపాదించి తరువాత చర్చికి వెల్లడం లేదా క్రైస్తవం నమ్ముకోవడం చేస్తే వారి ప్రమొషన్ వారి పిల్లల సౌకర్యాల నిమిత్తం B.C-C. మాత్రమే అవుతారు. అలాంటి వారి పైన తాసిల్దార్కు కంప్లైంట్ చేయవచ్చు.

8) మతం మార్చుకున్న వారు S.అట్రాసిటి కేసు పెట్టే హక్కు ఉండదు. పాస్టర్లు B.C- C అవుతారు వారిపై S.C.,అట్రాసిటి చెల్లుతుంది.S.C కోటాలొ వొచ్చే ఉద్యోగాలు,పెన్శల్లు ,ఆస్తి హక్కులు ,లోన్ లు ,గవర్నమెంట్ రాయితీలు మొదలగునవి పోతాయి.

9) వేరు వేరు మతాల వారు చేసుకునే పెళ్ళి చెల్లదు - మద్రాస్ హైకోర్టు

మన దేశంలో రాజ్యాంగం లోని ఆర్టికల్ 25(1) ప్రకారం మత ప్రచారం హక్కు అంటే ఇతరులను‌ మతం మార్చే హక్కు కాదు అని (AIR 1977 SC ) 908 కేసులు సుప్రీంకోర్టు తీర్చుచెప్పింది.అనేక సంధర్భాలలొ ఆశ చూపి,అబద్దం చెప్పి,భయపెట్టి ప్రలొభాలకు,వొత్తిడికి గురిచేసి మతం మార్చడం నేరమని అనేక న్యాయస్తానాలు తీర్పుచెప్పాయి...

మీరు తెలుసుకోండి అందరికి తెలియజేయండి జాగొ హిందు జాగో,
Read More

పతనానికి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ???

పతనానికి దగ్గరలో ఉన్న   తిరుమల తిరుపతి దేవస్థానం :  అన్య మతస్తుల కబంద హస్తాలలో దేవస్థానం
Read More

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో ఇంక ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. ఆ కొడుకుకి ఉన్న అధికారం ఏమిటంటే ‘ఆత్మావై పుత్రనామాసి’ – తండ్రియొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది. తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు. పుత్రగాత్ర పరిష్వంగము అని సుఖం. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో! అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతుంది భార్య. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు. కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే. అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. అటువంటి తండ్రి విడిచి పెట్టేస్తే నీకోసం ఆయన సమయం వెచ్చించాడు చిన్నప్పటి నుంచి. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినది? తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి పరమ శాంతి. అందుకే ఒక చూరు క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహద్భాగ్యవంతుడు. రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు.
వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడికి అంత కన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి లేదు. అంతేకానీ మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను. నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు. ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి. అవకాశం ఉంటే గోదానం చేయాలి.
అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి/తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు.
ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అధవా షోడశోపచారములు కూడా చేయవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి లేదు. చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.
చేయకూడనివి: నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, నిత్యపూజలో ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండుగ అని నా సంతోషం కోసం చేసుకోను. అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నాం అండీ ఎందుకది? ఎందుకా ఏటి సూతకం? అలా ఉండకూడదు. నువ్వు నేర్పాలి పిల్లలకి. నీ తాత/నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ/తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. అంటే మీరు మానేయండి మేం వెళ్తాం అంటాడా పిల్లవాడు? అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిక ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి/తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.
Read More

Saturday, 7 January 2017

అనారోగ్యం పారదోలే నీరు ఉదయ గిరి కొండల్లో ...అనారోగ్యం పారదోలే నీరు ఉదయ గిరి కొండల్లో.
అవును ఆ సెలయేరు నీరు శరీర రుగ్మతలను తొలగించును . ఉదయగిరి కొండల లో ఉన్న నీరు ఊరి ఉబికి పైకి వస్తున్నా నీరు, అనేక ఔషధ మొక్కలను తాకి వస్తున్నా సెలయేరు . ఆ నీటిని కొంత కాలం తాగిన అనారోగ్యం తొలగును .  


Read More

చర్చిలో మార్మోగిన ‘ఓం నమశ్శివాయ’...........


Read More

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములుధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. *ఆగ్నేయ (అగ్ని) పురాణము* ప్రకారము ఈ మాసము శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతిపాత్ర మైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది.

శ్రీమహావిష్ణువు పుష్ప, శ్రీగంధమాల్య, మణి మౌక్తిక, పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింప వలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో ఏ దేవాలయములో చూసినా బ్రాహ్మీముహూర్తములోనే పూజలుమొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.

ధనుర్మాస వ్రత కథ

పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని, ఆ హంసపైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ, సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని, *నీ తేజో బలము క్షీణించు గాక* యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై, తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు.
దానితో మూడులోకాలూ అల్లకల్లోలమైనవి. సూర్యుడి తేజము చాలినంత లేక, జపములు, తపములు, హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు, ఋషులకే గాక, సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులుమొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో,దేవతలు అనేక సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే, సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు.

సూర్యుడు తాను ధనూరాశిని ప్రవేశించగనే ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే అతడి శాప విమోచనము అవుతుంది.అని బ్రహ్మ తెలిపినాడు. బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు పదహారు సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడి నుండీ మొదలైన ఈ పూజ తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది, తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయ వంతంగా జరుగుటకు వారుకూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలు పెట్టినారు.

అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు,గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు, ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమునుఆచరించినారని వివిధ పురాణములలో ఉంది.

ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యము లైన వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. ఏమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును.

ముద్గాన్న నైవేద్యము
ఈ ధనుర్మాసములో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [పెసర పప్పుతో చేసిన పులగము] దీని గురించి *ఆగ్నేయ పురాణము* లో ఇలాగుంది,

ధనూరాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము,

బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే, బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము, బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను.

అంతే కాదు పెసర పప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణము తెలుపుతుంది.
అందుకే, ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [పొంగల్] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహా విష్ణువును పూజించి కృతార్థులై, ఆయన కృపకు పాత్రులు కాగలరు.

తిరుప్పావై అంటే ఏమిటి …..?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగి తేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.

తిరుప్పావై మొదటిరోజు పాశురం

తిరుప్పావై

1. పాశురము :

*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

తిరుప్పావైగీతమాలిక

అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

1వ మాలిక

(రేగుప్తి రాగము -ఆదితాళము)

ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని
నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరం
Read More

Powered By Blogger | Template Created By Lord HTML